husaband suicide
-
వారిది లవ్ మ్యారేజ్.. బెదిరించి భార్య చేసిన పనికి భర్త..
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. కానీ, భార్య, బావమరిది చేసిన పనికి మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వారే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషాద ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సూరత్‌కు చెందిన రోహిత్ ప్రతాప్ సింగ్, ముస్లిం మహిళ సోనమ్ కలిసి ఒకేచోట పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. రోహిత్ హిందూ, సోనమ్ ముస్లిం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కానీ.. రోహిత్ మాత్రం ప్రేమించిన సోనమ్‌ను వదులుకోలేక వివాహం చేసుకున్నాడు. రోహిత్ వీరి వివాహ బంధం కొద్దిరోజులు సాఫీగానే సాగింది. ఇంతలో, అనుకోకుండా.. ఈ ఏడాది జూన్‌లో రోహిత్‌ను బీఫ్ తినాలని భార్య సోనమ్, ఆమె సోదరుడు అఖ్తర్ అలీ ఫోర్స్ చేశారు. దీంతో, ఇష్టం లేకపోయినా రోహిత్.. బీఫ్ తిన్నాడు. అనంతరం, దీనిని తట్టుకోలేని రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రోహిత్ తన సూసైడ్‌కు ముందు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఇటీవల బయటపడింది. తన సూసైడ్ నోట్లో రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను.. నా భార్య, ఆమె సోదరుడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను చంపేస్తానని బెదిరించి నాతో వాళ్లు బీఫ్ తినిపించారు. ఈ లోకంలో జీవించే అర్హత నాకు లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు న్యాయం చేయండి అని సూసైడ్ నోట్ రాసుకొచ్చాడు. అయితే, రోహిత్ ఫేస్బుక్ నోట్ అతడి ఫ్రెండ్స్ కంటపడటంతో ఈ విషయాన్ని అతడి తల్లి వీణా దేవికి చెప్పారు. ఈ క్రమంలో తన కొడుకు చావుకు భార్య సోనమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. Hindu man dies by suicide after Muslim wife, brother-in-law forcefully feed him beef in Surat https://t.co/L5OShL8w1V via @indiatoday — sekhar (@sekhar31000123) August 29, 2022 -
సంసార విషయంలో గొడవ .. భర్త ఆత్మహత్య
సాక్షి, పటాన్చెరు(మెదక్): సంసార విషయంలో జరిగిన గొడవ భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూక అంబాజీ పేటకు చెందిన శ్రీనివాస్(46) భార్య వరలక్ష్మి పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 18 ఏళ్ల క్రితం పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో సరుకులు లేవని భార్య వరలక్ష్మి భర్తతో గొడవపడి ఇద్దరు కూతుర్లు సాయిప్రసన్న, శ్రీదేవిలను తీసుకొని మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. వెంటనే కిందకు దించి ఆటోలో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య అలా ప్రవర్తించడం చూడలేక...
ఇబ్రహీంపట్నం రూరల్: భార్య ప్రవర్తన బాగలేదని మనోవేదనకు గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మధన్‌లాల్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్లకు చెందిన ఆరెండ్ల కృష్ణారెడ్డి(35), స్రవంతి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు సరూర్‌నగర్ మండలం మీర్పేట్లోని ప్రశాంత్‌హిల్స్‌లో ఉంటున్నారు. కృష్ణారెడ్డి ఓ బీమా కంపెనీలో ఏజెంట్. స్రవంతి సోమాజిగూడలో ఉన్న ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెళ్లి అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కట్నం కూడా కొంత రావాల్సి ఉందని కృష్ణారెడ్డి భార్యతో తగువులాడుతుండేవాడు. రెండు నెలల క్రితం స్రవంతి చెల్లెలు భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె వీరి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, స్రవంతి తన కంపెనీలోని తోటి ఉద్యోగులతో తరచూ ఫోన్లో మాట్లాడటం కృష్ణారెడ్డికి నచ్చకపోయేది. ఈ నేపథ్యంలో అతడు గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణారెడ్డి గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట ఉన్న ఓ చెట్టు ఎక్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కిందికి దించి పరిశీలించగా అతడి ప్యాంట్ జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది. దాని ద్వారా పైవివరాలు తెలిశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణారెడ్డి, భార్య, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.