husband arrest
-
ఆశాజ్యోతి దారుణ హత్య.. అనుమానమే ప్రాణం తీసిందా?
తాళ్లపూడి: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను కర్కశంగా కత్తితో నరికి చంపి ముగ్గురు పిల్లలను అనాథలను చేశాడు. అంగన్వాడీ హెల్పర్ హత్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరులో సంచలనమైంది. భార్యపై అనుమానంతో మెడపై కత్తితో నరికిన నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తాళ్లపూడి ఎస్సై కె.వెంకటరమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడి పరిధిలోని కుకునూరు అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఆటపాకల ఆశాజ్యోతి(30) తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త ఆటపాకల వీర వెంకట సత్యనారాయణతో విభేదాలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఇటీవల మళ్లీ పిల్లల కోసమని వచ్చి భార్యా పిల్లలతో కలసి ఉంటున్నాడు. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో భార్య ఆశాజ్యోతితో గొడవ పడి కత్తితో ఆమె మెడపై, గొంతుపై నరికి హత్యచేశాడు. తీవ్ర రక్త స్రావం అయి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తన కుమార్తెపై అనుమానంతో అల్లుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని మృతురాలి తండ్రి పెద్దాడ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వెంకటరమణ కేసు నమోదు చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ కేవీ రమణ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణవర్మ ఆధ్వర్యంలో ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లలు కన్నీరుమున్నీరు ఆశాజ్యోతి దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో సురేంద్ర 8వ తరగతి, తేజ 5వ తరగతి, గోపి దుర్గ నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి మృతితో వీరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూసే తల్లి తమ కళ్ల ముందే మృత్యు వాత పడడంతో వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. వీరి పరిస్థితి చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అంగన్వాడీ వర్కర్లు ఆశాజ్యోతి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. -
అతడే హతమార్చాడు
సూర్యాపేట క్రైం : అనుమానస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని ఈద్గారోడ్డులో నివాసముంటున్న కుడకుడ రెండో ఏఎన్ఎం ధనమ్మ (33) సోమవారం తెల్లవారుజామున తను నివాసముండే ఇంట్లోనే విగతజీవిగా మారింది. చివ్వెంల మండలం జయరాంగుడితండాకు చెందిన గుగులోతు సుందర్– రుక్కమ్మ దంపతుల కుమార్తె గుగులోతు ధనమ్మ. ఈమె పదేళ్ల క్రితం సూర్యాపేట పట్టణానికి చెందిన జావిద్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహ సమయంలో జావిద్‌కు జయరాంగుడితండాలో వ్యవసాయ భూమితో పాటు రూ.17 లక్షల నగదు, సొత్తు రూపంలో ముట్టజెప్పారు. వీరు పట్టణంలోని ఈద్గారోడ్డులో నివాసముంటున్నారు. అయితే జావిద్ తుంగతుర్తి ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా.. ధనమ్మ చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని పీహెచ్సీలో రెండో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. పది రోజులుగా ఇద్దరూ ఉద్యోగాలకు సెలవు పెట్టారు. ఇంటి వద్దనే ఉండడంతో జావిద్‌కు వరుస అయిన చిన్నమ్మ శనివారం రాత్రి వీరు నివాసముంటున్న ఇంటికి వచ్చింది. ఆమె జావిద్‌ను డబ్బులు ఇవ్వాలి కదా.. ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించింది. దీంతో ధనమ్మ ఆమెకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి.. ఎప్పుడు ఇచ్చిందంటూ.. గొడవకు దిగింది. అయినా కొన్నేళ్లుగా వారితో మనకు దూరం ఉండగా ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య ఘర్షణ కాస్త.. ధనమ్మ ప్రాణాలు వదిలేలా చేసింది. వీరికి ఎనిమిదేళ్ల వయసు కలిగిన బాబు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ధనమ్మ తల్లి రుక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ధనమ్మ మృతదేహాన్ని సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం అనంతరం ధనమ్మ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసేలా ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. జావిద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అతడే హతమార్చాడు ధనమ్మను తన అల్లుడు జావిద్ కొట్టి చంపాడని తల్లిదండ్రులు , బంధువులు ఆరోపిస్తున్నారు.జావిద్ చిన్నమ్మ, అక్కలు వలన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుందన్నారు. వివాహ సమయంలో కూడా జావిద్ కట్నం రూపేన రూ.20 లక్షల వరకు ముట్టజెప్పామన్నారు. జావిద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
భార్యను చంపిన భర్త అరెస్ట్
కోల్‌సిటీ(రామగుండం): ఈ నెల 24న గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యకేసులో నిందితుడిని ఏసీపీ అపూర్వరావు సోమవారం అరెస్టు చూపారు. బిడ్డ తనకు పుట్టలేదనే అనుమానంతోనే గౌతమి(29)ని భర్త చైతన్యదీప్ గొడ్డలితో నరికి హతమార్చాడని వివరించారు. పెళ్లయినప్పటి నుంచి వేధింపులే.. గోదావరిఖని జవహార్‌నగర్‌కు చెందిన అటికేటి రాజేశ్వరి చిన్న కూతురు గౌతమి(29)కి జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన టుంగుటూరి చైతన్యదీప్తో 2015 మే 10న వివాహం జరిపించారు. రూ.6 లక్షల నగదు, తులం బంగారం కట్నంగాఇచ్చారు. చైతన్యదీప్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. కొంత కాలంగా గౌతమిని మరో రూ. 10 లక్షలు తీసుకురావాలని చైతన్యదీప్, అత్తమామ రాజకుమారి, రాయమల్లు, మరిది హర్షదీప్ వేధించేవారు. గర్భవతి అని చూడకుండా హింసించేవారు. బాధలు భరించలేక గౌతమి పుట్టింటికొచ్చింది. డీఎన్ఏ టెస్ట్ చేయించాలని.. కొడుకు పుట్టిన ఐదు నెలలకు గౌతమిని కాపురానికి తీసుకెళ్లాడు. బాబుకు నివాస్దీప్ అని పేరు పెట్టారు. బాబు తనకు పుట్టలేదంటూ డీఎన్ఏ పరీక్షలు చేయించాలని వేధించాడు. భయంతో మళ్లీ పుట్టింటికి చేరింది. భార్యపై గొడ్డలితో దాడి.. ఎలాగైనా గౌతమిని చంపాలని చైతన్యదీప్ గోదావరిఖని వచ్చాడు. శనివారం రాత్రి ఇంట్లో తన కొడుకుకు పాలిస్తున్న తరుణంలో ఇంట్లోకి గొడ్డలి తో చొరబడ్డాడు. పడుకున్న గౌతమి తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది. గొడ్డలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతురాలి తల్లి ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం చైతన్యదీప్ను స్థానిక బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలిని, రక్తం అంటిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యదీప్ తల్లి రాజకుమారి, తండ్రి రాయమల్లు, సోదరుడు హర్షదీప్ పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో సీఐ మహేందర్, సిబ్బంది ఉన్నారు. -
భార్య ప్రియుడిపై దాడి
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధ వ్యవహారంలో భార్య ప్రియుడిపై దాడి చేసిన భర్తతో పాటు మరో ముగ్గురిని ఆదివారం చెన్నై ట్రిప్లికేన్ పోలీసులు అరెస్టు చేశారు. నడుకుప్పంకు చెందిన విజయకాంత్ (45) వ్యాపారి. ఇతని భార్య గత 15 సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో ఇతను ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇతనికి అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు రంగన్ భార్య చిత్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రంగన్ తన బంధువు శరవణన్, ఆయన కుమారుడు అరవింద్‌తో కలిసి విజయకాంత్‌పై ఆదివారం ఉదయం దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయకాంత్ ప్రాణాపాయ స్థితిలో చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ట్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. -
వివాహిత హత్య కేసులో భర్త అరెస్ట్
ముదిగుబ్బ: కదిరి యర్రదొడ్డి గంగమ్మ సమీపంలో మోరి వద్ద జరిగిన వివాహిత హత్య కేసులో ఆమె భర్త పి.గంగిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మంగళవారం పట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కదిరి మండలం వై. కొత్తపల్లికి చెందిన గంగిరెడ్డి తన భార్య పి.సరస్వతి మరొక వ్యక్తితో సంబంధం వుందని అనుమానించాడు. ఎలాగైనా భార్యను చంపాలని అనుకున్నాడు. ఈ క్రమంలో భార్యకు మాయ మాటలు చెప్పి యర్రదొడ్డి గంగమ్మ సమీపంలో వున్న మోరి వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ రాళ్లతో తలపై గుద్ది చీర కొంగుతో గొంతు బిగించి హత్య చేశాడు. అతడిని పట్టుకోవడంలో కదిరిలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజిలు సహకరించాయన్నారు. కేసును చేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ రాఘవయ్య, సిబ్బంది నారాయణస్వామి, నాగరాజును ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భర్త సహా మరో ముగ్గురి అరెస్టు
రాయదుర్గం అర్బన్ : పెళ్లి చేసుకున్నాడు. చక్కగా కాపురం చేయాల్సిందిపోయి.. నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకుంటే మరో పెళ్లి చేసుకోవచ్చన్న కుట్రతో ఇలా చేశాడు. అతనికి తల్లి, సోదరుడు కూడా వంతపాడారు. ఇక అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అయినా ఆమె సర్దుకుపోవడం వారికి నచ్చలేదు. చివరకు రెండో పెళ్లి చేసుకొచ్చాడు. ఇంకేముంది మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. తనను ఎలా చిత్రహింసలకు గురి చేసిందీ పూసగుచ్చినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రంగంలోకి దిగారు. మోసం చేసింది బెంగళూరుకు చెందిన మంజునాథ కాగా, మోసపోయిన బాధితురాలు అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కె.శ్రీదేవి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నయవంచనకు గురి చేసిన మంజునాథను బుధవారం అరెస్టు చేశారు. అతని తల్లి శ్యామలమ్మ, తమ్ముడు రాము, రెండో పెళ్లాం మంజులను కటకటాల్లోకి నెట్టామని ఎస్ఐ మహానంది తెలిపారు. మనస్పర్థల నేపథ్యంలో శ్రీదేవి గత ఏడాది డిసెంబర్ 25న రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నిందితులను కోర్టులో గురువారం హాజరు పరుస్తామని ఎస్ఐ వెల్లడించారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్టు
బుక్కపట్నం (పుట్టపర్తి) : భార్య హత్య కేసులో నిందితుడైన భర్తను బుక్కపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన మేరకు.. బుక్కపట్నం ఈడిగ వీధికి చెందిన పెనిమేటి నారాయణస్వామి 20 ఏళ్ల కిందట అనుమానంతో భార్య సుగుణమ్మను హత్య చేశాడు. నిందితుడు అప్పటి నుంచి పరారీలో ఉండటంతో వారెంట్ జారీ అయ్యింది. అందిన సమాచారం మేరకు నారాయణస్వామిని పోలీసులు అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని పట్టుకోవటంలో ఏఎస్ఐ గోవిందు చూపిన కృషిని ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, కొత్తచెరువు సీఐ శ్రీధర్ అభినందించారని ఎస్ఐ తెలిపారు. -
భార్య హత్యకేసులో అరెస్టు
తాడిపత్రి : పట్టణంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్న చాందిని అనే వివాహిత హత్య కేసులో ఆమె భర్త షాషావలిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. 2015 మార్చి 18వ తేదీన భార్యకు నిప్పటించిన కేసులో షాషావలి పరారీలో ఉన్నాడు. అప్పట్లో› కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఇల్లాలినే వెలయాలిగా చూపాడు
భార్య ఫొటోలు, ఫోన్ నంబర్‌ను అశ్లీల వెబ్సైట్లో పెట్టిన శాడిస్టు భర్త సాక్షి, హైదరాబాద్: ప్రేమించానన్నాడు. పెళ్లికి ముందే సహజీవనం చేశాడు. గర్భం దాల్చిన తర్వాత వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో కొన్నా ళ్లు బాగానే ఉన్నాడు. ఇంతలో అతడిలో కట్నపిశాచి మేలుకుంది. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలన్న తలంపుతో దుర్మార్గపు ఆలోచనలు చేశాడు. కట్టుకున్న ఆలినే వెలయాలిగా చిత్రించాలని చూశాడు. భార్య ఫొటోలు, ఫోన్ నంబర్‌ను అశ్లీల వెబ్సైట్లలో పెట్టాడు! వ్యక్తిత్వంపై బురదజల్లి కోర్టు ద్వారా విడాకులు పొందాలన్న ఆ ఉన్మాదిని.. భార్య ఫిర్యాదుతో పోలీసులు పట్టుకున్నారు. ఆ శాడిస్టు పేరు మురళీకృష్ణ. సొంతూరు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని మల్కాపురం. ఇతడి కుటుంబం గత కొద్దికాలంగా హైదరాబాద్‌లోని తిరుమలహిల్స్‌లో నివసిస్తోంది. ఎంసీఏ మధ్యలో ఆపేసిన మురళి ఓ మల్టీనేషనల్ కంపెనీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా చేరా డు. ఇతడికి మరదలి వరసయ్యే మలక్‌పేటకు చెందిన బాధితురాలు ఎంసీఏ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్రథమ స్థానం సంపాదించి 2007లో అదే మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరింది. 2008లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పుణే తీసుకెళ్లి మోసగించి... మురళీకృష్ణ కుటుంబీకులు డబ్బుకే విలువిస్తారనే ఉద్దేశంతో వివాహానికి యువతి కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో పథకం ప్రకారం తనతోపాటు యువతికి మహారాష్ట్రలోని పుణేకు బదిలీ చేయించుకున్న మురళీకృష్ణ.. అక్కడ ఆమెతో సహజీవనం చేశాడు. ఐదు నెలల గర్భవతిగా ఉండగా నాంపల్లి వరకు తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై పుణేలో వీరు పని చేస్తున్న సంస్థ యాజమాన్యమే మురళీకృష్ణపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తర్వాత యువతి కుటుంబీకులు, పెద్దలు, పోలీసుల సమక్షంలో రాజీ కుదిర్చి రూ.3 లక్షల ఖర్చుతో ఓ గుడిలో ఇద్దరికీ వివాహం చేశారు. ఈ వివాహం ఇష్టం లేని మురళీకృష్ణ కుటుంబీకులు దంపతుల్ని ఇంట్లోకి రానీయలేదు. దీంతో యువతి కుటుం బీకులే మరో రూ.50 వేలు ఇచ్చి ఇద్దరినీ ఉద్యోగాలు చేసుకోమని పుణే పంపారు. ఓ కుమారుడు పుట్టిన తర్వాత మురళీకృష్ణ మళ్లీ భార్యను అక్కడే ఓ హోటల్లో వదిలేసి వచ్చేశాడు. ఇంటర్నెట్లో ఫొటోలు పెట్టి.. భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న మురళి.. పెళ్లి సమయంలో తీసిన ఫొటోలను సేకరించాడు. వాటితోపాటు భార్య ఫోన్ నంబర్‌ను ఆరు నెలల క్రితం అశ్లీల, ‘ఎస్కార్ట్స్’ వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. కొందరి నుంచి ఫోన్లు రావడంతో బాధితురాలు సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విషయం తెలియడంతో దాదాపు ఐదు నెలలుగా మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. పోలీసులు ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు మంగళవారం మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించి కంప్యూటర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 లక్షలతో వివాహం.. తమ కుమారుడికి ఘనంగా పెళ్లి చేస్తేనే కాపురాన్ని అంగీకరిస్తామని మురళీకృష్ణ కుటుంబీకులు చెప్పడంతో... ఇంటిని అమ్మేసి అమ్మాయి కుటుంబీకులు... 2010లో రూ.20 లక్షలతో పెళ్లి చేశారు. తర్వాత కొన్ని రోజులకు మురళీకృష్ణ మళ్లీ వే ధింపులకు పాల్పడ్డాడు. పుట్టింటికి వచ్చిన భార్య మరో కుమారుడికి జన్మనిచ్చింది. అదనపు కట్నం డిమాండ్ చేయడంతో అమ్మాయి తరఫు వారు మలక్‌పేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భార్యపై కక్షకట్టిన మురళీకృష్ణ.. ఆమె ప్రవర్తన మంచిది కాదని నిరూపించి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలని పథకం వేశాడు. -
భార్య ఫోన్ నంబర్‌ను వెబ్సైట్లో పెట్టాడు
-
భార్యను హత్యచేయించిన భర్త అరెస్ట్
అబిడ్స్ (హైదరాబాద్) : కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యను చంపించిన భర్తతో పాటు ఇద్దరు నిందితులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రాంభూపాల్‌రావు.. ఇన్స్పెక్టర్ బి.రవీందర్‌తో కలసి శుక్రవారం టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుడిమల్కాపూర్ విశ్వేశ్వర్‌నగర్‌లో నివసించే బి.మంజుల(24), రాజేంద్రనగర్ బండ్లగూడకు చెందిన యశ్వంత్‌కుమార్(30) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాలు తలెత్తటంతో ఏడాది నుంచి మంజుల కుమారుడు అభిషేక్‌తో కలిసి విశ్వేశ్వర్‌నగర్‌లోని తల్లి కళావతి వద్ద ఉంటోంది. కాగా కుమారుడిని తనకు అప్పగించాలని యశ్వంత్‌కుమార్ ఆమెను డిమాండ్ చేస్తున్నాడు. గత డిసెంబర్లో ఇదే విషయమై కోర్టులో కేసు కూడా వేశాడు. కాగా ఈ నెల 6వ తేదీన కోర్టులో కేసు విచారణకు రానుంది. అయితే 20 రోజుల క్రితం అభిషేక్‌ను తనకు అప్పగించాలని, తనతోపాటు ఉండాలని మంజులను యశ్వంత్‌కుమార్ డిమాండ్ చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకుని, అంతం చేయాలనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితుడు అరవింద్‌యాదవ్(36)ను ఆశ్రయించాడు. రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అరవింద్ యాదవ్ అతడి మరో స్నేహితుడు హరీష్‌కుమార్(28)తో కలసి మంజుల హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 1వ తేదీన సాయంత్రం విశ్వేశ్వరనగర్‌లోని మంజుల ఇంటికి అరవింద్‌యాదవ్, హరీష్‌కుమార్ వెళ్లారు. ఇద్దరూ కలసి మంజులను, అడ్డువచ్చిన ఆమె తల్లిని కత్తితో గొంతు కోసి చంపారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు యశ్వంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో కుట్ర వెలుగులోకి వచ్చింది. అరవింద్ యాదవ్, అతడి స్నేహితుడు హరీష్‌కుమార్‌లతో కలసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో శుక్రవారం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వారితో పాటు..కుక్కపిల్లకూ ఉరేశారు..
ప్రకాశం: భర్త అరెస్ట్ తో భార్య, కూతుళ్ల ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో శుక్రవారం జరిగింది. ఓ కేసు విచారణలో భాగంగా ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో మనస్తాపానికి గురైన అతడి భార్య కనకరత్నం, కూతురు శ్రుతి ఇంట్లో ఉన్న కుక్కపిల్లకు కూడా ఉరేసి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే కుక్క ఒంటరిది అయిపోతుందని భావించి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కపిల్లకు కూడా ఉరి వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. -
సెల్‌ఫోన్ సంభాషణలే ప్రాణం తీశాయి..
* భార్యను చంపిన భర్త అరెస్టు * తల్లి హత్య.. తండ్రి జైలుపాలవడంతో అనాథలైన పిల్లలు పరిగి: భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. భార్య సెల్ఫోన్లో మరో వ్యక్తితో మాట్లాడుతుండడంతో అనుమానించి హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. కుల్కచర్ల మండలం చాకల్‌పల్లి అనుబంధ మొగుల్లపల్లికి చెందిన ఫకీరయ్య కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మాణెమ్మ(30)తో వివాహం జరిగింది. దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫకీరయ్య కొంతకాలంగా భార్యను అనుమానిస్తున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో ఓసారి గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టడంతో వారు సర్దిచెప్పారు. ఇటీవల మాణెమ్మ ఇంట్లో ఫోన్లో మాట్లాడుతూ భర్తకు కనిపించింది. ఫోన్ ఎక్కడిది..? ఎవరు కొనిచ్చారు.. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావ్..? అంటూ ఫకీరయ్య భార్యతో గొడవపడ్డాడు. అప్పుడు ఏదోటి చెప్పిన మాణెమ్మ విషయం దాటవేసింది. అప్పటి నుంచి ఫకీరయ్య భార్యను మరింత అనుమానించసాగాడు. ఈక్రమంలో ఈనెల 1న ఉదయం మాణెమ్మ బహిర్భూమికి వెళ్లగా ఫకీరయ్య ఆమెను అనుసరించాడు. మాణెమ్మ చెట్ల పొదల్లోకి వెళ్లి ఫోన్లో మాట్లాడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని ఫకీరయ్య భార్యను గద్దించాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు సెల్‌ఫోన్ కొనిచ్చాడని, అతడితోనే మాట్లాడుతున్నానని మాణెమ్మ చెప్పింది. మాణెమ్మకు అతడితో వివాహేతర సంబంధం ఉందని ఫకీరయ్య అనుమానించాడు. ఈ విషయం తిరిగి పంచాయతీ పెట్టగా భార్యాభర్తలకు పెద్దలు నచ్చజెప్పారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన దంపతులు మళ్లీ గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో ఆగ్రహానికి గురైన ఫకీరయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో మాణెమ్మను తలపై నరికాడు. తీవ్రంగా గాయపడిన మాణెమ్మ అక్కడికక్కడే మృతిచెందగా ఫకీరయ్య పరారయ్యాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఫకీరయ్యను గురువారం అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా హత్యకు దారితీసిన పైవిషయాలు తెలిపాడు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుపాలు కావడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సమావేశంలో కుల్కచర్ల, పరిగి ఎస్ఐలు ఉన్నారు.