నిజాం రుబాత్కు హజ్ యాత్రికుల ఎంపిక
హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ చొరవతో హైదరాబాద్ హజ్ హౌస్ ద్వారా మక్కా‘నిజాం రుబాత్’ భవనంలో ఉచిత బసకు హజ్ యాత్రికుల ఎంపిక పూర్తయింది. శనివారం హజ్ హౌస్లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఏ షుకూర్, రుబాత్ కార్య నిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అలీ షరీఫ్ సమక్షంలో కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ ఆన్లైన్ డ్రా ద్వారా హజ్ యాత్రికుల ఎంపిక నిర్వహించింది.
పాత హైదరాబాద్ స్టేట్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 585 మంది యాత్రికులు ఎంపికయ్యారు. మరో 12 రాయల్ ఫ్యామిలీలకు కూడా రుబాత్లో ఉచిత బస కల్పించనున్నారు. కాగా మక్కాలో హజ్ యాత్రికులందరికీ డ్రాతో సంబంధం లేకుండా ఉచిత వసతి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని మహమూద్ అలీ పేర్కొన్నారు.