Hyderabad Central Crime Station
-
‘తెలుగు అకాడమీ’ కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కాజేసిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు మరో నిందితుడు జీవీ కృష్ణారెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూరుకు చెందిన కృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేటలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం సాయికుమార్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము కాజేయడానికి సాయి ఏడాది క్రితం పథకం వేయగా దీనికి సహకరించడానికి కృష్ణారెడ్డి ముందుకు వచ్చాడు. క్రమేణా కృష్ణారెడ్డితో ఎక్కువ అవసరం లేకపోవడాన్ని గమనించిన సాయికుమార్ అతడిని దూరంగా ఉంచాడు. అయితే ప్రతి అక్రమ లావాదేవీ నుంచి అతడికి వాటా ఇస్తూనే వచ్చాడు. సాయి అరెస్టు తర్వాత కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విచారణలో సాయి ఈ విషయాలను వెల్లడించడంతో ఏసీపీ కె.మనోజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం కృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు మంగళవారం అతడిని అరెస్టు చేసింది. కుంభకోణం సొమ్ము నుంచి అతడి వాటాగా రూ.6 కోట్ల వరకు ఇచ్చానంటూ సాయి పోలీసులకు చెప్పగా, తనకు రూ.2.65 కోట్లు మాత్రమే అందాయని కృష్ణారెడ్డి అంటున్నాడు. ఈ విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఏపీలోనూ నేరాలు దాదాపు పుష్కరకాలంగా కుంభకోణాలకు పాల్పడుతున్న సాయికుమార్ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లనూ కొల్లగొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన రూ.10 కోట్లు, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ.5 కోట్లను ఇదే పంథాలో స్వాహా చేసింది. తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన సాయి ఈ విషయాలను విచారణలో బయటపెట్టాడు. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం అందించగా విజయవాడ సీసీఎస్‌లో రెండు కేసులు నమోదు చేశారు. వీటిలోనూ కృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కేసుల్లో అరెస్టులు, కస్టడీలు పూర్తయిన తర్వాత సాయి, కృష్ణారెడ్డిసహా ఇతర నిందితులను విజయవాడ పోలీసులు పీటీ వారంట్‌పై అక్కడకు తరలించి విచారించే అవకాశముంది. -
డొంక కదులుతోంది
►హైదరాబాద్ కేంద్రంగానే ‘ఫీజు స్కామ్’ ►ఫైల్ అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ ఇక్కడిదే ►లోతుగా దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: నల్లగొండ జిల్లా పీడీ ఖాతాలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము రూ.11 కోట్లకు ‘టెండర్’ వేసి, ఆన్లైన్ ద్వారా రూ.73.13 లక్షలు కాజేయజూసిన కేసుపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి అనధికారికంగా ఆన్లైన్లో క్లైమ్ ఫైల్ అప్లోడ్ అయ్యింది హైదరాబాద్ నుంచేని గుర్తించారు. ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ఆధారంగా దీనిని నిర్థారించిన అధికారులు ట్రెజరీ డైరెక్టరేట్ నుంచే ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా ఈ కేసులో నలుగురిని అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ట్రెజరీ డైరెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగితో పాటు స్కాలర్ షిప్స్ సెక్షన్లో పని చేస్తున్న మరో ఉద్యోగి, నల్లగొండ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని అనుమానితుల జాబితాలో చేర్చారు. వీరిని అరెస్టు చేసేందుకు తగిన ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. మరోపక్క సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టుకు సంబంధించి మదర్సాల్లోని వాలంటీర్లకు చెల్లించాల్సిన రూ.70 లక్షల సొమ్ము కాజేసిన కేసు దర్యాప్తునూ సీసీఎస్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగి సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఈ స్కామ్ వెనుక పూర్వాపరాలు తెలుసుకునేందుకు అప్పట్లో డీఈఓగా ఉన్న సోమిరెడ్డి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అతడిని పిలిపించగా... పూర్తి వివరాలు చెప్పడానికి ఆయన కొంత సమయం కోరినట్లు తెలిసింది. భోలక్‌పూర్ కేసులో ప్రాసిక్యూషన్ కోసం... మరోపక్క సీసీఎస్ అధికారులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న, తాజాగా నమోదైన కీలక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంపై దృష్టి పెట్టారు. 2009 మేలో జరిగిన భోలక్‌పూర్ విషాదం కేసులో ప్యాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశారు. 2009 మే 5న భోలక్‌పూర్ డివిజన్లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్ నగర్, బంగ్లాదేశ్ బస్తీల్లో కలుషిత జలాల బారినపడి 15 మృతి చెందగా, మరో 255 మంది ఆసుపత్రి పాలయ్యారు. తొలుత ముషీరాబాద్ పోలీసుస్టేషన్లో అనుమానాస్పద మృతిగా ఈ కేసులు నమోదయ్యాయి. ఆపై సీసీఎస్‌కు బదిలీ కావడంతో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారుల అజాగ్రత్త కారణంగానే ఉదంతం చోటు చేసుకున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇందులో జలమండలి, జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తదితర సంస్థల బాధ్యత ఉందని తేల్చారు. అసలు ఈ దారుణమైన పరిస్థితులు తలెత్తడానికి కారణాలు, వాటి మూలాలను అన్వేషించేందుకు వివిధ లాబొరేటరీలకు నమూనాలు పంపి విశ్లేషణలు చేయించారు. జలమండలి అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతో 2010 జూలైలో ఐదుగురు జలమండలి అధికారులు అరెస్టు చేసి సొంత పూచీకత్తపై విడిచిపెట్టారు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో అనుమతి కోరుతూ లేఖ రాశారు.ట -
ముప్పుతిప్పలు పెట్టి... మూడంతస్తులు దూకి!
‘ఆర్సీఐ సుదీప్’ అరెస్టులో సీసీఎస్ చాకచక్యం ఈ సంస్థ మోసాలపై నాలుగు రాష్ట్రాల్లో కేసులు సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఎస్బీఐ) చెందిన రూ.9.98 కోట్ల గోల్మాల్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆర్సీఐ సంస్థ డెరైక్టర్ సుదీప్కుమార్ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు ముంబైలో చాకచక్యంగా పట్టుకున్నారు. డీసీపీ అవినాష్ మహంతి శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. ఈ స్కామ్‌కు సంబంధించి పోలీసులు గత నెల్లోనే ఆర్సీఐ సంస్థ కస్టోడియన్లు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఆర్సీఐ సంస్థకు హైదరాబాద్‌కు చెందిన సుదీప్‌కుమార్, పవన్ కుమార్ గుప్తా డెరైక్టర్లుగా ఉన్నారు. నగరంలోని 116 ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2013 నవంబర్ 15న ఎఫ్ఎస్ఎస్ సంస్థ నుంచి సబ్-కాంట్రాక్ట్ తీసుకుంది. ఆర్సీఐలో జి.నాగరాజును ఆపరేషన్స్ విభాగం మేనేజర్‌గా, కె.లోకేశ్వర్‌రెడ్డి, కర్రె అజయ్‌కుమార్, జి.ప్రవీణ్‌కుమార్, ఆర్.పండు, నర్సింగ్రావుల్ని కస్టోడియన్లుగా పని చేస్తున్నారు. దీని కార్యాలయం మహేంద్రాహిల్స్ త్రిమూర్తి కాలనీలో ఉంది. ఆర్సీఐ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఉద్యోగుల జీతాల చెల్లింపు, వాహనాల నిర్వహణకూ నగదు లేకుండా పోయింది. దీంతో దాదాపు ఏడాది క్రితం సుదీప్తో పాటు సంస్థకు చెందిన గిరిరాజు తమ ఉద్యోగుల్ని దారి తప్పించారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదులో రూ. 2.15 కోట్లను తెప్పించుకుని వాడుకున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న ఆపరేషన్స్ మేనేజర్, కస్టోడియన్లు రూ.7.83 కోట్లను స్వాహా చేశారు. చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ పోలీస్... గతనెల్లో ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సుదీప్, గిరిరాజ్ కోసం గాలించారు. ముంబైలో వీరు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీపీ జోగయ్య ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందాన్ని దాదాపు వారం క్రితం అక్కడకు పంపారు. ఐదు రోజుల పాటు క్షుణ్ణంగా గాలించిన ఈ స్పెషల్ టీమ్ తన మాజీ ఉద్యోగినికి చెందిన ఫ్లాట్‌లో సుదీప్‌కుమార్ తలదాచుకున్నట్లు గుర్తించారు. గురువారం సీసీఎస్ బృందం ఓ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్‌పై దాడి చేశారు. ముందే వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అధ్యయనం చేశారు. పారిపోవడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి కొందరు సిబ్బందితో అక్కడ కాపుకాయించారు. తాను ఉన్న ఫ్లాట్ వద్దకు పోలీసులు రావడం గుర్తించిన సుదీప్‌కుమార్ ఎంతకీ తలుపు తీయలేదు. పోలీసులు ఆ ప్రయత్నాల్లో ఉండగా... ఫ్లాట్ వెనుక ఉన్న కిటికీ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ నుంచి రెండో అంతస్తులోకి, అట్నుంచి మొదటి అంతస్తులోకి దిగిన సుదీప్... వెనుక వైపు గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కాపుకాసి ఉన్న సీసీఎస్ పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు గిరిరాజ్‌ను పట్టుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు గిరిరాజ్ ఇద్దరు నిందితుల్నీ ముంబై కోర్టులో హాజరుపరిచిన సీసీఎస్ పోలీసులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై శుక్రవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం గిరిరాజ్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సుదీప్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు సోమవారం వరకు గడువు ఉండటంతో లోతుగా విచారిస్తున్నారు. ఆర్సీఐ యాజమాన్యంపై మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ కేసులు ఉన్నాయి. అయితే అక్కడ సిబ్బందిని బలి పశువుల్ని చేసిన యాజమాన్యం తప్పించుకుంది. ముంబైలో నమోదైన కేసులో సుదీప్ నిందితుడిగా ఉన్నా... అక్కడి పోలీసులకు చిక్కలేదు. సీసీఎస్ విచారణలో ఈ నిందితుడు నగదు స్వాహాలో పవన్గుప్తాదే కీలక పాత్ర అని, సొమ్ము అతడి దగ్గరే ఉందని చెప్పాడని తెలిసింది. ‘ఆర్సీఐ సంస్థపై అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. సుదీప్, గిరిరాజ్‌ల అరెస్టు, కేసుల్లో వారి ప్రమేయంపై ఆయా అధికారులకు సమాచారం ఇస్తాం’ అని డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. -
టుండా రైలుపై మావోయిస్టుల దాడి
సాక్షి, సిటీబ్యూరో: ‘1987 ఏప్రిల్‌లో ఆజం ఘోరీని కలవడానికి హైదరాబాద్ వచ్చా... అది సాధ్యం కాకపోవడంతో రైలులో తిరిగి వెళ్తుండగా ఆదిలాబాద్జిల్లా కాగజ్‌నగర్ వద్ద నేను ప్రయాణిస్తున్న రైలుపై మావోయిస్టులు దాడి చేశారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా’ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా బయటపెట్టిన విషయమిది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆగస్టులో అరెస్టు చేసిన టుండాను సిట్ అధికారులు ఈ నెల 10న పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాకిస్తాన్ జాతీయుడు సలీం జునైద్ కేసులో టుండా నిందితుడు. సిట్ విచారణలో టుండా వెల్లడించిన అంశాలివి... ఆ తరవాత కొన్నాళ్లకు ఢిల్లీలో ఆజం ఘోరీని కలి సినప్పుడు ఈ అనుభవా న్ని అతడితో పంచుకున్నా డు. ఆ తర్వాతే 1994లో దేశం దాటడం, బంగ్లాదేశ్‌లో సలీం జునైద్‌కు శిక్షణ ఇవ్వడం వంటివి చేశాడు. సిట్ పోలీసుల కస్టడీ గడువు పూర్తికావడంతో పోలీసులు టుండాను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఉగ్ర బాటపట్టిన తరవాత టుండా తొలిసారిగా 1986లో నగరానికి వచ్చాడు. అప్పుడే వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీతో పరిచయం ఏర్పడింది. ఇతడి ద్వారానే టుండాకు తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) సహా మరికొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన అబ్దుల్ బారి, ఫసీయుద్దీన్, నజీర్ పరిచయమయ్యారు. టుండా రెండోసారి 1987 ఏప్రిల్‌లో సిటీకి వచ్చేప్పటికీ ఆజం ఘోరీ వ్యవహారాలు పోలీసులకు తెలియడంతో అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో పరారీలో ఉండిపోవడంతో అతడిని కలుసుకోవడం టుండాకు సాధ్యం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో టుండా నగరంలో ఉండటం క్షేమం కాదని భావించిన నజీర్, ఫసీయుద్దీన్లు హైదరాబాద్ రైల్వేస్టేషన్ (నాంపల్లి)కు తీసుకువెళ్లి రైలు ఎక్కించారు. టుండా ప్రయాణిస్తున్న ఈ రైలుపై కాగ జ్నగర్ ప్రాంతంలో నక్సలైట్లు దాడి చేశారు. రైలు పట్టాలను పేల్చేయడంతో పాటు తుపాకులతోనూ విరుచుకుపడ్డారు. అనేక బోగీల్లో ఉన్న ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే, టుండా ప్రయాణిస్తున్న బోగీకి ఎలాంటి నష్టం జరగకపోవడంతో క్షేమంగా బయటపడ్డాడు.