జగన్‌కు బాసటగా జనం దీక్ష
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం చంచల్‌గూడ జైల్లో చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలోని పలుచోట్ల రిలేదీక్షలు చేపట్టారు. సూళ్లూరుపేటలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఉదయగిరిలో దీక్షలు చేపట్టిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు.
నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో తాటి వెంకటేశ్వర్లు, కేవీ రాఘవరెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనేక చోట్ల సంఘీభావ దీక్షలు జరిగాయి. జగన్‌కు మద్దతుగా పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. సోమవారం నుంచి నిరాహారదీక్షలతో పాటు నిరసన కార్యక్రమాలున ఉధృతం చేయనున్న ట్టు పార్టీ నాయకులు కాకా ణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు.