ibobi Singh
-
బీజేపీ సర్కార్ పడిపోతుందా లేదా!?
సాక్షి, న్యూఢిల్లీ : మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించలేక పోయినప్పటికీ మిత్రపక్షాలను కూడగట్టుకోవడంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడేళ్లపాటు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చింది. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో జూన్ 17వ తేదీ నుంచి చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు బీజేపీ ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేసింది. బీజేపీ సంకీర్ణ భాగస్వామిక పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎల్. జయంత్‌కుమార్ సింగ్ సహా ఆ పార్టీకి చెందిన నలుగురు మంత్రులు జూన్ 17వ తేదీన తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత వెంటనే ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించింది. అదే రోజు బీజేపీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీ ప్రభుత్వం పరిస్థితిని మరింత దిగజార్చింది. మరో స్వతంత్య్ర సభ్యుడు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని చెప్పడం ప్రభుత్వ పరిస్థితిని దిగజార్చింది. (పతనం అంచున బీజేపీ సర్కార్) ఇదే అదనుగా జూన్ 18వ తేదీన ఎన్ బీరెన్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు జారీ చేసింది. సభ్యుల మద్దతు లేదా రాజీనామాలనే పరిగణలోకి తీసుకుంటే మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం పడి పోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అతి సులువుగా రావాలి. కానీ ఈ పరిణామాల్లో పార్టీ ఫిరాయింపులు, ససెన్షన్లు ఉండడంతో పరిస్థితి కాస్త జఠిలం అయింది. 60 సీట్లుగల మణిపూర్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు రాగా, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ తమకు మద్దతు ఇస్తోందంటూ వివాదాస్పద లేఖలు చూపించి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ నలుగురు సభ్యులతోపాటు నాగా పీపుల్స్ ఫ్రంట్ నలుగురు సభ్యుల మద్దతును, లోక్‌జన శక్తి పార్టీ ఏకైక సభ్యుడి మద్దతో బీజీపీ తన బలాన్ని 30 సీట్లకు పెంచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఒక్క సీటును టీ. శ్యామ్ కుమార్ సింగ్ అనే కాంగ్రెస్ సభ్యుడి ఫిరాయింపుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కోర్టులను ఆశ్రయించడంతో బీజేపీకి మద్దతు పలికిన శ్యామ్ కుమార్ సింగ్ అసెంబ్లీ సభ్యత్వం చెల్లదంటూ సుప్రీం కోర్టు గత మార్చి నెలలో తీర్పు చెప్పింది. దాంతో మణిపూర్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 59కి చేరుకుంది. ఇదిలావుండగా, 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఆ పార్టీలోకి ఫిరాయించిన ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలంటూ మణిపూర్ హైకోర్టు ఈనెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే వారి సస్పెన్షన్‌పై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం పెండింగ్‌లో ఉండడంతో జూన్ 19వ తేదీ వరకు వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదంటూ కోర్టు ఆంక్షలు విధించింది. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై వాదాపవాదాలు వింటోన్న స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వివాద అంశాన్ని జూన్ 22కు వాయిదా వేశారు. వారని తక్షణం సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సాధ్యాసాధ్యాలు ఇన్ని మలుపులు కలిగిన ఈ వ్యవహరంలో ఏం జరిగే అవకాశం ఉందో ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఏడుగురు కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యుల్లో నలుగరు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరగా ముగ్గురు బీజేపీతోనే ఉండిపోయారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అసెంబ్లీ స్పీకర్ బీజేపీతో ఉన్న ముగ్గురిని మాత్రమే సస్పెండ్ చేస్తే అప్పుడు అసెంబ్లీ సభ్యుల సంఖ్య 59 నుంచి 56కు పడిపోతుంది. కాంగ్రెస్ సభ్యుల మద్దతు సంఖ్య 30కు చేరుకుంటుంది. అలాకాకుండా స్పీకర్ మొత్తం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తే అసెంబ్లీ సభ్యుల సంఖ్య49కి పడిపోతుంది. అప్పటికీ 26 మంది సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. తీర్పు ఇంత ఏకపక్షంగా కనిపిస్తున్నప్పటì కీ కాంగ్రెస్ పక్షాల్లో ఇంకా భయం పోలేదు. 2017లో 28 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌ను కాదని 21 సీట్లు సాధించిన బీజేపీ అధికారం చేజిక్కించుకోగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిప్పుడు అలాంటిది సాధ్యం కాదా! అన్నది వారి అనుమానం, భయం. -
వాచ్ డాగ్ లా పని చేస్తాం: ఇబోబి
ఇంఫాల్ : కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహిస్తుందని మాజీ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి వాచ్ డాగ్ పాత్రను పోషిస్తున్నామని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత బిరేన్ సింగ్‌తో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఇబోబి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. సంకీర్ణంగా ఏర్పడ్డ ప్రభుత్వం విధానాలపై తాము నిరంతరం వాచ్ డాగ్‌లా ఉంటామన్నారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ, బీజేపీకే అవకాశాలు దక్కాయన్నారు. కాగా వాస్తవానికి 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో చాలాకాలంగా బలమైన ప్రతిపక్షం లేదనే చెప్పాలి. కాగా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. 28 స్థానాలు గెలుచుకుని తాము అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ముందు తమనే పిలవాల్సిందని కాంగ్రెస్ వాదిస్తోంది. అధికారం చేపట్టాలంటే కనీసం 31 మంది మద్దతు అవసరం. అయితే బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ దాదాపు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంతో తొలిసారి మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. -
మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. తదుపరి సీఎంగాబీజేపీ శాసనసభాపక్ష నేత బీరేన్ సింగ్ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాణం చేయనున్నారు. నలుగురు ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిసి బీజేపీకి మద్దతు తెలియజేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సింగ్‌ను గవర్నర్ ఆహ్వానించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సింగ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 60 సీట్లున్న అసెంబ్లీలో 32 మంది సభ్యుల మద్దతు తమకు ఉందనీ, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ ఆదివారం గవర్నర్‌ను కలిసింది. ఆ సమయంలో బీజేపీకి చెందిన 21 మంది, ఎన్పీపీకి చెందిన నలుగురు, ఎల్జేపీ, టీఎంసీ, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కో ఎమ్మెల్యే (మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు) మాత్రమే బీజేపీ వెంట ఉన్నారు. ఎన్పీఎఫ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకు ఉందని చెబుతూ బీజేపీ ఒక లేఖను గవర్నర్‌కు అందజేసింది. అలా కుదరదనీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా తన వద్దకు వచ్చి బీజేపీకి మద్దతిస్తున్నట్లు చెప్పాలని గవర్నర్ అన్నారు. ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్‌ను కలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మార్గం సుగమమైంది. ఈ నెలలోనే జరిగిన మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. 28 స్థానాలు గెలుచుకుని తాము అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ముందు తమనే పిలవాల్సిందని కాంగ్రెస్ అంటోంది. దీనిపై నజ్మా హెప్తుల్లా స్పందిస్తూ బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉంది కాబట్టే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ‘నాకు నియమ నిబంధనలు తెలుసు. వాటినే నేను అనుసరించాను. వాళ్లు (కాంగ్రెస్) ఏం ఆరోపణలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బీజేపీకి 30 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ఇది మణిపూర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. మణిపూర్‌కు ఇంకా చాలా అబివృద్ధి, ఉద్యోగాలు అవసరం. వాటికోసం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని నేను అనుకుంటున్నాను’అని ఆమె చెప్పారు. -
మణిపూర్ సీఎంగా బీరేన్
⇒ బీజేపీ శాసనసభాపక్ష నేతగాఎన్నిక ⇒ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి కాషాయదళంలో చేరిన బీరేన్ ⇒ హైడ్రామా నడుమ ఇబోబీ రాజీనామా ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర మాజీ మంత్రి నాంగ్తోంబం బీరేన్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ విషయాన్ని పార్టీ నేతలైన కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్‌లు మీడియాకు తెలిపారు. తర్వాత బీరేన్ రాజ్‌భవన్‌కు వెళ్లి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కోరారు. కాంగ్రెస్ కేబినెట్లో పదేళ్లు పనిచేసిన 56 ఏళ్ల బీరేన్ గత ఏడాది అక్టోబర్‌లో ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మణిపూర్‌కు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ దుష్పరిపాలనకు నిరసనగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చాను. మోదీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నా’ అని విలేకర్లతో చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 సీట్లు దక్కడం తెలిసిందే. తమకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ నేతలు ఆదివారం గవర్నర్‌కు చెప్పారు. చెరో నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)తోపాటు ఒక లోక్‌జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తున్నారు. తొలి అవకాశం నాకివ్వాలి: ఇబోబీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుత సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ కూడా తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన హైడ్రామా నడుమ సోమవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. అంతకుముందు.. ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం తనకే ఇవ్వాలని, తనకు మెజారిటీ ఉందని, బలపరీక్షకు సిద్ధమని అన్నారు. అయితే, ఆయన రాజీనామా చేయాలని, ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తానని గవర్నర్ స్పష్టం చేయడంతో ఇబోబీ దిగొచ్చి మంగళవారం రాజీనామా చేస్తానన్నారు. మారిన పరిణామాలతో సోమవారమే రాజీనామా చేశారు. ఇబోబీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిశారని రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. ‘ఇబోబీ 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితా అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు ఎన్పీపీ మద్దతిస్తోందంటూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లున్న కాగితం ఇచ్చారు. అయితే దాన్ని మద్దతు లేఖగా పరిగణించలేనని, ఆ నలుగురితోపాటు ఎన్పీపీ అధ్యక్షుణ్ని తీసుకురావాలని గవర్నర్ చెప్పారు’ అని వెల్లడించాయి. ఎడిటర్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు మణిపూర్ అధికార పగ్గాలు చేపట్టనున్న బీరేన్ మాజీ పత్రికా సంపాదకుడు, జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కూడా. నహరోల్గి థౌండాగ్(యువత పాత్ర) అనే స్థానిక దినపత్రికకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. 2002లో డెమోక్రటిక్ రివల్యూషనరీ పార్టీ తరఫున హీన్గాగ్ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఇబోబీ మంత్రివర్గంలో పదేళ్లు(2003–2012) పనిచేశారు. బీరేన్ కొడుకు అజయ్ ఒక విద్యార్థిని కాల్చిచంపడంతో 2012లో ఏర్పడిన కాంగ్రెస్ కేబినెట్లో ఆయనకు చోటు దక్కలేదు. ఇబోబీని పలు అంశాల్లో తీవ్రంగా వ్యతిరేకించిన బీరేన్ గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. -
బీజేపీ ఎత్తుకు సీఎం చిత్తు!
ఇంపాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అతి పెద్దగా అవతరించిన తామే అధికారంలో కొనసాగుతామని దీమాగా ఉన్న ఇబోబి సింగ్ కు బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఆదివారం రాత్రి 32 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ముందు పరేడ్ నిర్వహించడం ఇబోబి సింగ్ ఖంగుతిన్నారు. బీజేపీకి మద్దతు ప్రకటించిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆండ్రో శ్యామ్ కుమార్ కూడా ఉండడంతో సింగ్ షాకయ్యారు. వెంటనే తేరుకుని అర్ధరాత్రి రాజ్ భవన్ కు పరుగులు తీశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తననే ముందుగా ఆహ్వానించాలని గవర్నర్ ను కోరినట్టు తర్వాత విలేకరుల సమావేశంలో చెప్పారు. గవర్నర్ తమకే అవకాశం ఇస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ఉన్న 27 మంది ఎమ్మెల్యేలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమ ఎమ్మెల్యేల్లో ఎటువంటి అసంతృప్తి లేదని, తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. నాలుగోసారి సీఎం పదవిని చేపట్టాలని భావిస్తున్న ఇబోబి సింగ్ కు బీజేపీ అడ్డుకట్టే వేసేలా కనబడుతోంది. మొదట ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని, తర్వాతే కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి (బీజేపీ మణిపూర్ వ్యవహారాల బాధ్యుడు) రామ్ మాధవ్ డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు 31. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 28, బీజేపీ 21, ఇతరులు 10, టీఎంసీ ఒక స్థానాన్ని గెల్చుకున్నాయి. ఇతరులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. -
15 నెలల్లో అభివృద్ధి చేస్తాం
మణిపూర్ ఎన్నికల సభలో మోదీ ఇంఫాల్: పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో మణిపూర్ తీవ్రంగా వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 15 నెలల్లో అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శనివారమిక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పాలనలో మణిపూర్‌లో అభివృద్ధి కుంటుపడింది. ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు తాగునీరు అందించడంతో ప్రభుత్వం విఫలమైంది. 15 ఏళ్లలో ఆ పార్టీ చేయలేని పనిని(రాష్ట్ర అభివృద్ధి)ని మా ప్రభుత్వం 15 నెలల్లోనే చేస్తుంది’ అని చెప్పారు. ‘15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం 10 పర్సెంట్ సీఎం అని నేను విన్నాను. వంద శాతం నిజాయతీగల సీఎం కావాలా, లేకపోతే 10 శాతం కమీషన్ తీసుకునే వ్యక్తి కావాలా అన్నది ప్రజలే తేల్చుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం భారీగా పంపుతున్న నిధుల్లో అధిక భాగాన్ని నేతలు, అధికార పార్టీ మంత్రులు దారి మళ్లిస్తున్నారన్నారు. నాగా ఒప్పందంపై తప్పుడు ప్రచారం నాగా మిలిటెంట్లతో కేంద్రం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై ఇబోబీ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని మోదీ మండిపడ్డారు. మణిపూర్, మణిపురీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశమేదీ ఒప్పందలో లేదని స్పష్టం చేశారు. ‘ఏడాదిన్నర కిందట ఆ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ’ అని మండిపడ్డారు. యునైటెడ్ నాగా కౌన్సిల్(యూఎన్ త ఏడాది నవంబర్ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరవధిక ఆర్థిక దిగ్బంధాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే తొలగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. నిత్యావసరాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు ఔషధాలు, ఇతర సరుకులు అందక అల్లాడతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇరోం షర్మిల నామినేషన్
-
ఇరోం షర్మిల నామినేషన్
ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధబలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలంటూ 16ఏళ్లు నిరాహార దీక్ష చేసిన మణిపూర్ ‘ఉక్కుమహిళ’ ఇరోం షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. గతేడాది దీక్షవిరమించిన షర్మిల.. పీపుల్స్ రిసర్జెన్స్ జస్టిస్ అలయన్సప్ (పీఆర్‌జేఏ) తరఫున థౌబల్ స్థానం నుంచి గురువారం నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ వేసేందుకు ఇంఫాల్ నుంచి బయల్దేరిన షర్మిల 20 కి.మీ. సైకిల్ తొక్కి థౌబల్ చేరుకున్నారు. నాలుగోసారి సీఎం పీఠంపై కన్నేసిన సీఎం ఇబోబి సింగ్‌పైనే షర్మిల పోటీకి దిగారు.