ఇరోం షర్మిల నామినేషన్
ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధబలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలంటూ 16ఏళ్లు నిరాహార దీక్ష చేసిన మణిపూర్ ‘ఉక్కుమహిళ’ ఇరోం షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు.
గతేడాది దీక్షవిరమించిన షర్మిల.. పీపుల్స్ రిసర్జెన్స్ జస్టిస్ అలయన్సప్ (పీఆర్‌జేఏ) తరఫున థౌబల్ స్థానం నుంచి గురువారం నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ వేసేందుకు ఇంఫాల్ నుంచి బయల్దేరిన షర్మిల 20 కి.మీ. సైకిల్ తొక్కి థౌబల్ చేరుకున్నారు. నాలుగోసారి సీఎం పీఠంపై కన్నేసిన సీఎం ఇబోబి సింగ్‌పైనే షర్మిల పోటీకి దిగారు.