Ibrahim Khan
-
ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డెరైక్టర్‌గా హనుమంతరావు
చాన్సలర్‌కు సలహాదారుగా ఇబ్రహీంఖాన్ నూజివీడు : ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా ఆచార్య కోసూరి హనుమంతరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి ట్రిపుల్ ఐటీలను ఏర్పాటుచేసిన ఆరేళ్ల తరువాత పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా, పరీక్షల విభాగం సమన్వయకర్తగా పనిచేస్తున్న హనుమంతరావును ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతలను ప్రస్తుత డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ నుంచి స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించేందుకు కృషిచేస్తానన్నారు. ఛాన్సలర్ సలహాదారుగా ఇబ్రహీంఖాన్ ఆరేళ్లపాటు నూజివీడు ట్రిపుల్ ఐటీ వ్యవస్థాపక డెరైక్టర్‌గా పనిచేసిన ఇబ్రహీంఖాన్‌ను ఛాన్సలర్‌కు సలహాదారుగా నియమిస్తూ ఆర్జీయూకేటీ కులపతి ప్రొఫెసర్ డీ రాజ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాకుండా బాసర ట్రిపుల్ ఐటీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ (ఈసీ) సభ్యులుగానూ నియమితులయ్యారు. సలహాదారుగా ఇబ్రహీంఖాన్ ప్రతి నెలా మూడు ట్రిపుల్ ఐటీలను సందర్శించనున్నారు. -
ప్చ్.. ట్రిపుల్ ఐటీ
ఫలితాలు అంతంతే 69శాతమేఉత్తీర్ణత కొంపముంచిన గణితం పల్లెలోని పేద విద్యార్థులకు సైతం ప్రతిభావంతమైన విద్యనందించాలనే మహోన్నతాశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్‌ఐటీల ప్రతిష్ట మసకబారిపోతోంది. ఫలితాలు రానురాను నిరాశాజనకంగా మరింత దిగజారిపోతున్నాయి. నూజివీడు : ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర ఫలితాల శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం ట్రిపుల్ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం కేవలం 69.2శాతంగా మాత్రమే ఉంది. అయితే మొదటి సెమిస్టర్ ఫలితాలతో చూస్తే ఉత్తీర్ణతాశాతం కొద్దిగా మెరుగైనట్టున్నా అనుకున్నంతస్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదని ప్రొఫెసర్లు చెబుతున్నారు. పదోతరగతిలో మండలస్థాయిలో ప్రథమస్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపికచేసి, వారిని 24గంటలు తమ దగ్గరే ఉంచుకుని, ఐఐటీల్లో అత్యంత ప్రతిభ కనబరరిచిన వారిని ప్రొఫెసర్లుగా నియమించి విద్యాబోధన చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం సాధారణ ఇంజినీరింగ్గు కళాశాలల కంటే ఘోరంగా వస్తున్నాయి. 958మంది ఇంజినీరింగ్ ప్రథమసంవత్సర విద్యార్థులు ఏప్రిల్ నెలలో సెమిస్టర్ పరీక్షలు రాయగా వీరిలో 663మంది మాత్రమే ఉత్తీర్ణులవ్వగా, 295మంది తప్పారు. వీరిలో అత్యధికంగా 162మంది విద్యార్థులు గణితం-2లో తప్పారు. తరువాత స్థానాల్లో ఎలక్ట్రికల్ టెక్నాలజీలో 132మంది, భౌతికశాస్త్రంలో 80 మంది తప్పారు. తప్పిన 295 మందిలో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులు 165మంది, రెండు సబ్జెక్టులు తప్పినవారు 75మంది, మూడు సబ్జెక్టులు తప్పిన వారు 41 మంది, 4సబ్జెక్టులు తప్పిన వారు 13మంది, 6సబ్జెక్టులు తప్పిన వారు ఒకరు ఉన్నారు. సబ్జెక్టులు తప్పిన వారందరికీ ఈ నెలాఖరులో రెమీడియల్ పరీక్షలు నిర్వహించనున్నారు. లోపం ఎక్కడ... గత నాలుగేళ్లుగా ఇంజినీరింగు ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ మెకానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్టులలోనే ఎక్కువ మంది తప్పుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై యూనివర్సిటీ అధికారులు దృష్టిసారించి లోపాలు సరిచేసుకోకపోవడం వల్లనే ప్రతి సెమిస్టర్‌లోనూ విద్యార్థులకు గండంగా మారింది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన లెక్చరర్ల బోధన విద్యార్థులకు అర్థంకాక తప్పుతున్నామని విద్యార్థుల అభిప్రాయం. మరికొంతమంది ఫ్యాకల్టీలు, లెక్చరర్లు రెగ్యులర్‌గా క్లాసులకు రారని తెలుస్తుంది. ఇకనుంచైనా ఉన్న లోపాలను సవరించుకుంటే మంచిఫలితాలు వచ్చి ట్రిపుల్‌ఐటీల ప్రతిష్ట మసకభారకుండా ఉంటుందని మేధావులు పేర్కొంటున్నారు. -
ట్రిపుల్ ఐటీ ‘గ్రేట్’
నూజివీడు, న్యూస్‌లైన్ : ఇంజినీరింగు విద్యార్థుల భవిష్యత్ కేరీర్‌ను నిర్దేశించే కీలకపరీక్ష గేట్ పరీక్ష. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్ఐటీలోని ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగు కోర్సు పూర్తిచేసుకోబోతున్న మొదటి బ్యాచ్‌కు చెందిన ఇంజినీరింగు విద్యార్థులు గేట్ పరీక్షరాసి జాతీయ స్థాయిలో పలు ర్యాంకులు తెచ్చుకుని ప్రతిభచాటారు. దాదాపు 120మంది విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకుని ఐఐటీలకు క్వాలిఫై కాగా, వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు 20లోపు ఉన్నారు. ఎలాంటి అదనపు కోచింగ్ లేకుండా ఫ్యాకల్టీలు చెప్పే విషయాలను క్షుణ్ణంగా విని సాధన చేసి జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. వీరిని ట్రిపుల్ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ అభినందించారు. వందలోపు ర్యాంకులు సాధించిన వారి మనోగతమిలా... లక్ష్యాన్ని సాధించా... ఫ్యాకల్టీలు చెప్పే వివరాలను శ్రద్ధగా వింటూ ప్రిపేర్ అయ్యా . గేట్ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో... ఓ వైపు క్యాంపస్ సెలక్షన్లు జరుగుతున్నా పట్టించుకోలేదు. పదో తరగతిలో 561మార్కులొచ్చాయి. రోజుకు 8గంటల పాటు చదివేవాడిని. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా . గేట్ సిలబస్‌కు అనుగుణంగా ట్రిపుల్ఐటీ విద్యావిధానం ఉండటం కొంతమేరకు లాభించింది. 25వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది.గొరిజాల మహేష్, 25వ ర్యాంకు, ఈసీఈ, తుళ్లూరు, గుంటూరు జిల్లా. నూతన ఆవిష్కరణలు చేస్తా... ట్రిపుల్ ఐటీలోని ఫ్యాకల్టీలు చెప్పే వాటిని శ్రద్ధగా వినేవాడిని. రోజుకు 12గంటలు చదివా. గేట్ పరీక్ష రాసిన రోజు వంద లోపు ర్యాంకు వస్తుందని అనుకున్నా. 30వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాన్న సూర్యనారాయణ వ్యవసాయ కూలి. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అమ్మ ఏమీ చదవుకోలేదు. పదో తరగతిలో 502మార్కులొచ్చాయి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ సెన్సైస్‌లో చేరి రోబోటిక్స్‌లో పరిశోధనలు చేయాలని లక్ష్యం. -గొర్లె శ్రీరాములునాయుడు, 30వ ర్యాంకు, ఈసీఈ, విజయనగరం జిల్లా రక్షణ రంగంలో సైంటిస్ట్నవుతా.. రోజుకు పదిగంటలు పాటు ప్రిపేర్ అయ్యా. ఫ్యాకల్టీ వీర శ్రీను గెడైన్స్ గేట్లో ర్యాంకు రావడానికి బాగా ఉపయోగపడింది. నాన్న హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉంటూ టీవీ సీరియల్స్‌కు స్క్రిప్టు రాస్తారు. బాబా అటామిక్అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఎంటెక్ చేసి రక్షణరంగంలో సైంటిస్ట్ అవ్వాలన్నదే లక్ష్యం. పదోతరగతిలో 502మార్కులొచ్చాయి. లింగిశెట్టి కార్తీక్, 75వ ర్యాంకు, ఎంఎంఈ, కృష్ణానగర్, హైదరాబాద్