IBSF
-
బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్ అద్వానీ
న్యూఢిల్లీ: భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) దిగ్గజం పంకజ్ అద్వానీ తన విజయవంతమైన కెరీర్లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని పంకజ్ చెప్పాడు. ‘అరుదైన గౌరవానికి అర్హుడినైనందుకు ఆనందంగా ఉంది. సుదీర్ఘమైన కెరీర్లో అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు వల్లే అత్యున్నత శిఖరాలను అధిరోహించాను’ అని అద్వానీ అన్నాడు. గత నవంబర్‌లో 38 ఏళ్ల వయసులోనూ భారత విఖ్యాత ఆటగాడు అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఓవరాల్‌గా 26వ టైటిల్‌ను గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్, ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో టైటిళ్లున్నాయి. -
అద్వానీ కాంస్యంతో సరి
దోహా: ఐబీఎస్ఎఫ్ వరల్డ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు.మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో పంకజ్ అద్వానీ 2-7తేడాతో అండ్రూ పాగెట్(వేల్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో పంకజ్ కాంస్య పతకంతో సంతృప్తి చెందాడు. సెమీ ఫైనల్లో పోరులో ఒత్తిడికి లోనైన పంకజ్ 14-74, 8-71-0-87, 78-64, 0-81, 70-37, 7-80, 37-68 ఫ్రేమ్‌ల తేడాతో పరాజయం చెందాడు.