Ice candy
-
పొగలు కక్కే క్యాండీ తింటున్నారా? పేగులు చిల్లులు పడతాయి జాగ్రత్త
పొగలు కక్కే మిఠాయి కొద్దికాలంగా ఇండోనేషియాలో వేలంవెర్రిగా మారింది. రంగురంగుల్లో నోరూరించే ఈ మిఠాయిపేరు ‘చికి ఎంగెబుయి’. ఇది సాదాసీదా క్యాండీలాంటి మిఠాయే! అయితే, పొగలు కక్కుతూ కనిపించేందుకు దీనిపై లిక్విడ్ నైట్రోజన్ చల్లి తినడానికి అందిస్తారు. దట్టమైన ఆవిరిలాంటి పొగలు కక్కుతూ ఉండటంతో దీనికి ‘డ్రాగన్ బ్రీత్’ అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఇండోనేసియాలో ఈ క్యాండీ పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. దీనిని తినడం వల్ల పశ్చిమ జావా ప్రాంతంలో దాదాపు ముప్పయిమంది పిల్లలు గతంలో ఆస్పత్రిపాలయిన సంగతి తెలిసిందే. పొగలు కక్కే ఈ చిరుతిండి కడుపులోకి వెళ్లాక, పేగులు చిల్లులు పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గగ్గోలు చెలరేగడంతో పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కామిల్ జనవరి 10న ఈ చిరుతిండిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. View this post on Instagram A post shared by Cool. Yogurt. Roll. (@coyoro) View this post on Instagram A post shared by Cool. Yogurt. Roll. (@coyoro) ఇండోనేసియాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ పొగలు కక్కే మిఠాయి వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, దేశవ్యాప్తంగా దీనిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ అక్కడక్కడా కొన్నిరకాల చిరుతిళ్లపై లిక్విడ్ నైట్రోజన్ చల్లుతున్నారు. మన ప్రభుత్వాలు దీనిపై ఎప్పుడు దృష్టిసారిస్తాయో చూడాలి మరి! -
పుల్ల ఐస్‌లో ఇనుప మేకు !
ఎండ ధాటినుంచి ఉపశమనానికి పుల్ల ఐస్ కొంటే అందులో ఇనుప మేకు దర్శనమిచ్చింది. ఈ సంఘటన విజయనగరంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో కళాసీగా పని చేస్తున్న గెడ్డ వీధికి చెందిన కిలిమి రాజేష్ శనివారం భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక మార్కెట్ ప్రాంతంలో విక్రయిస్తున్న పుల్ల ఐస్‌ను కొనుగోలు చేశాడు. ఐస్ తింటుంటుగా చేతిలో పట్టుకున్న పుల్లతో పాటు రంగుతో పూసిన ఐస్‌లో ఉన్న ఇనుప మేకు దర్శనమిచ్చింది. అవాక్కయిన ఆయన దానిని చుట్టుపక్కల ఉన్నవారికి చూపించారు. ఐస్ తయారీలో ఎంతటి అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనడానికి ఈసంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. – విజయనగరం మున్సిపాలిటీ -
ఈ వేసవి చల్లచల్లగా...
ఉన్నట్టుండి చుట్టాలు వచ్చారు. చల్లగా ఏ మజ్జిగో, జ్యూసో ఇద్దామనుకుంటాం. ఐస్ క్యూబ్స్ వేస్తే ఎంతకీ కరగవు. డ్రింక్ ఓ పట్టాన చల్లబడదు. సమయం వృథా. * రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. పిల్లలు ఉన్నట్టుండి గొడవ మొదలుపెడతారు. రోడ్డుపక్కన అమ్మే రంగురంగుల ఐస్ గోలా కావాలని ఏడుస్తారు. కొనిద్దామంటే వాళ్ల ఆరోగ్యాలు పాడవుతాయేమోనని భయం. * ఈ రెండు ఇబ్బందులనూ ఒకేసారి తీరుస్తుంది ఇక్కడ కనిపిస్తోన్న బుజ్జి మెషీన్. దీన్ని ఐస్ క్రషర్ అంటారు. చూడ్డానికి చిన్న బాక్సులా కనిపిస్తోన్న దీనిలో ఐస్‌క్యూబ్స్ వేసి, ప్లగ్గు కనెక్ట్ చేసి ఆన్ చేస్తే చాలు. క్షణంలో ఐస్ అంతా పొడిలా అయిపోతుంది. అంటే క్రష్ అవుతుంది. దీన్ని డ్రింక్స్‌లో కలిపితే క్షణాల్లో చల్లబడిపోతాయి. ఇందులో కాస్త రంగులు, చక్కెర నీళ్లు కలిపి చుట్టి ఇస్తే పిల్లలకు ఐస్ క్యాండీ రెడీ అయిపోతుంది. ఖరీదు కూడా పెద్ద ఎక్కువేం కాదు. మోడల్, సైజును బట్టి రెండు వందల రూపాయల నుంచి మొదలవుతోంది.