ICET exam
-
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు తేదీని పొడిగించింది. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్ ఐసెట్‌కు 67,361 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే 1,700 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్‌టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్–2022 నిర్వహించనున్నట్లు తెలిపారు. -
తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, వరంగల్: ఐసెట్-2018 షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. తొలిసారి ఆన్లైన్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కన్వీనర్ సుబ్రహ్మణశర్మ తెలిపారు. మార్చి 6 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30 అని వెల్లడించారు. మే 23, 24 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. జూన్ 6 న ఫైనల్ కీ, అదే నెలలో ఫలితాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
ఐసెట్‌కు నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తి
విశాఖపట్టణం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 న జరిగే ఐసెట్-2015కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు. గురువారం నిర్వహించిన ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశం అనంతరం వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 78,739 మంది విద్యార్థులు దరఖాస్తులు చేయగా, 16 రీజినల్ కేంద్రాల పరిధిలో 136 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, హాల్‌టికెట్లు అందని వారు.. ప్రాంతీయ సమన్వయకర్తలను సంప్రదించాలన్నారు. విద్యార్థులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్నులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఐసెట్ కన్వీనర్ రామచంద్రమూర్తి అన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. (ఏయూక్యాంపస్)