విశాఖపట్టణం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 న జరిగే ఐసెట్-2015కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు. గురువారం నిర్వహించిన ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశం అనంతరం వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 78,739 మంది విద్యార్థులు దరఖాస్తులు చేయగా, 16 రీజినల్ కేంద్రాల పరిధిలో 136 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, హాల్‌టికెట్లు అందని వారు.. ప్రాంతీయ సమన్వయకర్తలను సంప్రదించాలన్నారు. విద్యార్థులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్నులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఐసెట్ కన్వీనర్ రామచంద్రమూర్తి అన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
(ఏయూక్యాంపస్)
ఐసెట్‌కు నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తి
Published Thu, May 7 2015 9:33 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement