Ida
-
ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొండపల్లి ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ ఏరియా (ఐడీఏ)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక సెంటారస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటు అనుమతులకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం రూ.2.10 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెంటారస్ ఫార్మా కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటుకు కంపెనీ యజమాని బాలిరెడ్డి అర్జీ పెట్టుకోగా అనుమతులు ఇచ్చేందుకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ.5.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.3.50 లక్షలు ఇచ్చేందుకు బాలిరెడ్డి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నగదు రూ.2.10 లక్షలను సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ బాయిలర్ ఫిటింగ్ చార్జీలు రూ.లక్ష, అదనంగా మరో 1.10 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నాగభూషణం చెప్పిన వివరాల మేరకు సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఏసీబీ డీఎస్పీ శరత్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాల శిక్షణ.. ప్రముఖ సంస్థల ఎంఓయూ
గౌహతి: నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ ఇండియా డ్రోన్ అకాడమీ (IDA), నిర్మాణ పరిశ్రమ నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (CSDCI) అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. శుక్రవారం (ఆగస్ట్ 11) గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ఐడీఏ సీఈవో దేవిరెడ్డి వేణు, సీఎస్‌డీసీఐ సీఈవో నరేంద్ర దేశ్‌పాండే ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ (NOS), నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) స్థాయిల ప్రకారం నిర్మాణ కార్మికులు, నిపుణులకు నాణ్యమైన డ్రోన్ శిక్షణ అందించడం ఈ ఎంఓయూ లక్ష్యం. కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), నేషనల్ హైవేస్ బిల్డర్స్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌బీఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ద్వారా ప్రమోట్ చేసిన సీఎస్డీసీఐతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని దేవిరెడ్డి అన్నారు. సీఎస్‌డీసీఐ, ఐడీఏ ద్వారా దేశవ్యాప్తంగా 3500 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వబోతోందని, డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమాల కోసం పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి గుర్తింపు పొందినట్లు ఆయన చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పనలో ఒకటైన నిర్మాణ పరిశ్రమలో నైపుణ్యాల అభివృద్ధికి సీఎస్‌డీసీఐ కట్టుబడి ఉందని సీఈవో నరేంద్ర దేశ్‌పాండే తెలిపారు. నిర్మాణ ప్రాజెక్టుల సామర్థ్యం, భద్రత, నాణ్యతను మెరుగుపరచడానికి డ్రోన్లకు అపారమైన సామర్థ్యం ఉందని, నిర్మాణ కార్మికులకు డ్రోన్ నైపుణ్యాలను అందించడానికి సీఎస్‌డీసీఐ ఐడీఏతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ శిక్షణా కోర్సులను అందించడానికి, అసెస్మెంట్లు, సర్టిఫికేషన్లను నిర్వహించడానికి, ట్రైనీలకు ప్లేస్మెంట్ సహాయం అందించడానికి రెండు సంస్థలు పరస్పరం కలిసి పని చేసేందుకు ఈ ఎంఓయూ అనుమతిస్తుంది. రెండు సంస్థల మధ్య అవగాహన, వనరుల మార్పిడిని కూడా సులభతరం చేస్తుంది. ఏరియల్ సర్వే, ఇన్స్పెక్షన్, మ్యాపింగ్, మానిటరింగ్, డాక్యుమెంటేషన్ వంటి వివిధ పనులను చేయగల నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల సమూహాన్ని సృష్టించడం ద్వారా ఈ ఎంఓయూ నిర్మాణ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. -
Hurricane Ida: అమెరికా వరదల్లో.. మనోళ్లు ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇడా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నట్లు తెలిసింది. వీరిని మాలతి కంచె(46) అనే సాఫ్ట్వేర్ డిజైనర్, ధనుష్ రెడ్డి(31)గా అధికారులు గుర్తించారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రేరిటాన్‌కు చెందిన మాలతి కంచె(46) తన కుమారుడిని రట్జెర్స్ యూనివర్సిటీ కాలేజీలో దించి, కుమార్తె(15)తో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. బ్రిడ్జివాటర్ ప్రాంతంలో రూట్ –22 రోడ్డుపైకి అకస్మాత్తుగా చేరుకున్న నడుముల్లోతు వరద నీటిలో వారు చిక్కుకు పోయారు. కారులో నుంచి బయటపడిన తల్లి, కూతురు ఒక చెట్టును పట్టుకున్నారు. ఆ చెట్టు కూడా కూలిపోగా మాలతి వరద ఉధృతికి కొట్టుకు పోయారు. ఈదడం తెలిసిన ఆమె కూతురు సురక్షితంగా బయటపడింది. మాలతి గల్లంతైనట్లు సమాచారం అందుకున్న అధికారులు అన్వేషణ ప్రారంభిం చారు. ఆమె మృత దేహాన్ని అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని బౌండ్‌బ్రూక్ వద్ద శుక్రవారం కనుగొన్నారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, ఆమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. మరో ఘటన న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన చోటు చేసుకుంది. ధనుష్ రెడ్డి అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద తీవ్రతకు కొట్టుకు పోయారు. ధనుష్ రెడ్డి మృతదేహాన్ని మరుసటి రోజు అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని పిస్కాట్‌ఎవే అనే ప్రాంతంలో కనుగొన్నారు. -
ఇడా తుపాను దెబ్బకు 46 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మేరీలాండ్ నుంచి కనెక్టికట్ ప్రాంతం వరకు ఇడా సృష్టించిన విలయంలో దాదాపు 46 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. పలువురు ప్రజల ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇడా దెబ్బకు పలు ప్రాంతాల్లో నదులు పొంగి ఉత్పాతాలు సృష్టించాయి. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. పరిస్థితులను అధ్యక్షుడు జోబైడెన్ సమీక్షిస్తున్నారు. జోరున కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బాధితులతో పాటు అత్యవసర చికిత్సలు అవసరమైనవారి కోసం చాలా చోట్ల జనరేటర్లతో ఆసుపత్రులను నిర్వహించాల్సి వచి్చంది. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన 911 సేవలకూ ఆటంకాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ష్కైల్‌కిల్ నదికి 100ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచి్చంది. వాన, గాలి కారణంగా అధికారిక సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. -
న్యూయార్క్‌లో తుపాను బీభత్సం
న్యూయార్క్: అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని గవర్నర్ క్యాథీ హోచల్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. న్యూ ఇంగ్లండ్ (కనెక్టికట్, మెయిన్, మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్ రాష్ట్రాలున్న ప్రాంతం)లోనూ తుపాను ప్రభావం పెరుగుతోంది. మరిన్ని భీకర సుడిగాలులు దూసుకొచ్చే ప్రమాదముందని వార్తలొచ్చాయి. ఒక్క న్యూయార్క్‌లోనే రెండేళ్ల బాలుడు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. సబ్వే స్టేషన్లలోకి వర్షపు నీరు చేరడంతో అన్ని సర్వీస్‌లను రద్దుచేశారు. సబ్వేలో సీట్లపై నిలబడే నగరవాసులు ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. ఇళ్లలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. సెంట్రల్ పార్క్‌లో రికార్డుస్థాయి వర్షపాతం ‘న్యూయార్క్ సిటీలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించాం’ అని న్యూయార్క్‌లోని అమెరికా జాతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్‌లో బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డుస్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూజెర్సీలోనూ తుపాను కారణంగా భారీస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాలుల ధాటికి దక్షిణ న్యూజెర్సీ కౌంటీలో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మొత్తం 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. పెన్సిల్వేనియాలో వరదల పట్టణంగా పేరున్న జాన్స్టౌన్ దగ్గరున్న ఆనకట్ట పొంగి పొర్లే ప్రమాదం పొంచి ఉంది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాది ఇళ్లలో అంధకారం అలముకుంది. సబ్వే స్టేషన్లోకి దూసుకొస్తున్న వరద నీరు; అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి వృద్ధుడిని రక్షిస్తున్న దృశ్యం -
వందేళ్ళ వయసులో '100 మీటర్ల' రికార్డు
వందేళ్ళ వయసులో వంద మీటర్ల పరుగు... ఊహించడానికే కష్టంగా కనిపిస్తుంది కదూ... కానీ ఆ పోటీల్లో పాల్గొని ఏకంగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఇడా కీలింగ్. వందేళ్ళు జీవించడమే ఓ రికార్డుగా మారుతున్న ఈ కాలంలో వందేళ్ళ వయసులో వందమీటర్ల రేసులో పాల్గొని ఆమె ప్రపంచ రికార్డును సాధించింది. 80 ఏళ్ళ ఇతర పోటీదారుతో రేసులో కేవలం అత్యంత తక్కువ సమయంలో పరుగును పూర్తి చేసి ఇంతకు ముందున్న రికార్డును బ్రేక్ చేసింది. ఇడా కీలింగ్... వందేళ్ళ వయసులోనూ వంద మీటర్ల రేసులో పాల్గొనేందుకు వెనుకాడలేదు. పాల్గోవడమే కాదు ఏకంగా ఇంతకు ముందున్నజమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 9.56 సెకన్లలో 100 మీటర్ల ప్రపంచ రికార్డును తిరగరాసింది. కేవలం 1 నిమిషం17.33 సెకన్లలో వంద మీటర్ల రేస్ ను అవలీలగా పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పెన్ రిలే కార్నివాల్ గా పిలిచే పెన్ రిలే పోటీలు అమెరికాలో నిర్వహించే అత్యంత పురాతన, అతి పెద్ద ట్రాక్, ఫీల్డ్ పోటీలు. ఇవి ప్రతి యేటా ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తుంటారు. ఫిలడెల్ఫియా ఫ్రాంక్లిన్ ఫీల్డ్ లోని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 1895 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి పోటీల్లో పాల్గొని రికార్డును సాధించిన ఇడా కీలింగ్... రుచికోసం తినొద్దని, పోషక పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, రోజుకోసారైనా వ్యాయామం చేయాలని క్రీడాకారులతోపాటు, సాధారణ ప్రజలకూ సలహా ఇచ్చింది. అంతేకాదు మనల్ని మనమే ప్రేమించుకోవాలని, మనమేం చేయాలనుకుంటున్నామో అది చేయాలని, మనకోసం ఎవ్వరూ ఏమీ చేయరంటూ సూచించింది. పౌర హక్కుల ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న కీలింగ్ కు నలుగురు కొడుకులుండేవారు. దశాబ్దాల క్రితమే భర్త మరణించగా.. ఇద్దరు కొడుకులు తీవ్ర మాదక ద్రవ్యాల అలవాటుతో మృతి చెందినట్లు ఓ పత్రిక అందించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. వయసు మీరుతుంటే ఒంటిపై పడే రోగాలకు పరుగే తన ప్రధాన చికిత్సగా మార్చుకున్న కీలింగ్... మొదటిసారి 67 ఏళ్ళ వయసులో రేసింగ్ లో పాల్గొంది. ఆ తర్వాత తన పరుగును ఎప్పుడూ ఆపలేదని ఓహియో బీకన్ జర్నల్ లో నివేదించిన వివరాలను బట్టి తెలుస్తోంది.