నూతన గరిష్టస్థాయికి సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం ట్రేడింగ్ లో నూతన జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 288 పాయింట్ల లాభపడి 26390 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల వృద్దితో 7874 వద్ద ముగిసాయి.
గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగంలోని ఇన్ ఫ్రా, మానుఫ్యాక్చరింగ్ రంగాల అభివృద్ధి అంశాలు మార్కెట్ కు ఊపునిచ్చాయి. దాంతో అన్ని రంగాల కంపెనీ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరిగాయి.
బీపీసీఎల్, ఓఎన్ జీసీ, సిప్లాలు 5 శాతానికి పైగా, యాక్సీస్ బ్యాంక్, భెల్ 4 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీలు స్వల్పంగా నష్టపోయాయి.