Iesel Governor ESL Narasimhan
-
వర్సిటీలకు కొత్త చట్టం
15 రోజుల్లో రూపకల్పన.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త చట్టం తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో చర్చించారు. వర్సిటీలకు చాన్సలర్ల నియామకానికి తోడు రాష్ట్రానికి అనుగుణమైన మార్పులు, చేర్పులతో ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నామని ఆయనకు తెలిపారు. దీంతోపాటు ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత, పదో షెడ్యూల్లోని సంస్థల అంశంలో ఏపీ ఫిర్యాదులపైనా వివరణ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటికీ గవర్నర్ గౌరవ హోదాలో చాన్సలర్‌గా కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక వర్సిటీలకు వైస్ చాన్సలర్ల (వీసీల) నియామకాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఈ క్రమంలో ఒక్కో యూనివర్సిటీకి ఒక నిపుణుడిని చాన్సలర్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న యూనివర్సిటీల చట్టాన్ని మార్చాల్సి ఉంది. దీంతోపాటు పాలన, అకడమిక్ వ్యవహారాల్లో ఒక్కో వర్సిటీ ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడం, ప్రభుత్వానికి వర్సిటీలపై ఆజమాయిషీ లేకుండా పోయిన పరిస్థితులను చక్కదిద్దాలన్న భావనకు వచ్చారు. వీటన్నింటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కొత ్త చట్టానికి రూపకల్పన చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, న్యాయశాఖ అధికారులు చర్చించారు. 15 రోజుల్లో చట్టాన్ని రూపొందించాలని... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ భేటీ సందర్భంగా గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించారు. దీంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో అడ్మిషన్లు, తదితర వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పదంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నమే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... వీటిపై గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ సంస్థలన్నీ విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్లో ఉన్నాయని, వాటి సేవలు కావాలంటే ఏపీ ప్రభుత్వం రాత పూర్వకంగా కోరాల్సి ఉందని, అందుకు అవసరమైన చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత అంశంపైనా గవర్నర్, సీఎం మధ్య చర్చ జరిగింది. చారిత్రక కట్టడమైనప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి భవనం కూలిపోయే స్థితిలో ఉందని, అందుకే కూల్చివేయాలనే నిర్ణయించామని.. అదే స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మిస్తామని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కూడా ఆయనకు తెలియబరిచారు. 7న ఢిల్లీకి గవర్నర్.. ఈనెల 7న గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విభజనకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్న పలు అంశాలను సైతం గవర్నర్‌కు కేసీఆర్ నివేదించారు. ప్రధానంగా హైకోర్టు విభజనను వేగంగా పూర్తి చేయాలని కోరారు. -
నేడే ‘స్వచ్ఛ హైదరాబాద్’
సాయంత్రం 3 గంటలకు హెచ్ఐసీసీలో ప్రారంభం పాల్గొననున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ ఆరంభ సంరంభానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్ర మాన్ని హెచ్ఐసీసీలో శనివారం సాయంత్రం 3 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై రూపొందించిన ప్రత్యేక గీతం, లోగోలను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎంలతో సహా ప్రజాప్రతినిధులు ప్యాట్రన్లుగా, ఏఐఎస్‌లు, వివిధ శాఖాధిపతులు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరు సాయంత్రం 4.35 గంటలకు ఈ కార్యక్రమం ముగియగానే తమ యూనిట్లకు వె ళ్లి స్థానిక కాలనీ ప్రజలకు కార్యక్రమ అంశాలను వివరిస్తారు. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమ ముఖ్యాంశాలు ►రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని ఆనందనగర్ కాలనీకి యూనిట్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తారు. ►సీఎం కేసీఆర్ బౌద్ధనగర్ డివిజన్లోని పార్సీగుట్ట ప్రాంత ప్యాట్రన్‌గా ఉన్నారు. ► ఈ మహా కార్యక్రమంలో పాల్గొనే మొత్తం సభ్యులు: 36 వేలు ► వీరిలో 456 మంది వీవీఐపీలు/ఏఐఎస్ అధికారులు/వివిధ శాఖాధిపతులు ► ఇంకా 1,800 మంది నోడల్ అధికారులు, బిల్ కలెక్టర్లు, పోలీసులు, వాటర్‌బోర్డు, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు ► ఆరువేల మంది స్థానిక ప్రముఖులు ► 1,200 మంది తక్షణ మరమ్మతు బృంద సభ్యులు, 400 మంది మేస్త్రీలు, 800 మంది కార్మికులు ► 1,061 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 23 వేల మంది శానిటరీ వర్కర్లు ► 2,010 మంది ఐలా, కంటోన్మెంట్ అధికారులు నిర్వహణ ఏర్పాట్లివీ... ► మొబైల్ అప్లికేషన్ ద్వారా రోజువారీ కార్యాచరణ నివేదికలు ► {పత్యేక యాప్ ద్వారా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల నివేదిక ►500 మంది కళాకారులతో ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు ► సినీ, క్రీడారంగానికి చెందిన ప్రముఖుల భాగస్వామ్యం -
ప్రజల కష్టాలు తీర్చకుంటే ఉద్యమ బాట
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరిక రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం హైదరాబాద్: తెలంగాణ ప్రజల కష్టాలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమ బాట పడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు వినతి పత్రం అందజేశారు. రైతుల ఆత్మహత్యలు, ఇతర ప్రజా సమస్యలపై స్పందించాలని, సంక్షేమాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం రాజ్‌భవన్ ఎదుట ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వారి సమస్యలను పాలకపక్షం పట్టించుకోనప్పుడు బాధ్యత కల్గిన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుందన్నారు. అందులో భాగంగానే గవర్నర్‌ను కలిశామన్నారు. విద్యుత్తు కోతల ఫలితంగా వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాలు కుదేలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగామని, సమయం ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ తెలంగాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె. శివకుమార్, డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, హెచ్ఏ. రహమాన్, బి.జనక్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.