illegal power usage
-
వైరల్: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్ కదా!
కొంతమంది పవర్ బిల్ కట్టకుండా ఎగ్గొట్టేందుకు నానా వేషాలు వేస్తుంటారు. అధికారులకు తెలియకుండా పోల్ నుంచి దొంగతనంగా వైర్లను ఏర్పరుచుకొని కరెంట్ వినియోస్తుంటారు. చదువుకోని వారు, అవగాహన లేని వాళ్లే ఇలాంటి దొంగ పనులు చేస్తారనుకుంటే పొరపాటే. చదువుకున్నవారు సైతం తెలివిగా కరెంట్ దొంగతనాలు చేయడానికి అలవాటుపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ఇలాగే విద్యుత్ చౌర్యానికి అలవాటుపడి మూడో కంటికి తెలియకుండా కరెంట్ వాడుకునేవాడు. రోజంతా అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ అధికారులు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే కరెంట్ వైర్లను కట్ చేసి తమకు ఏం తెలియదన్నట్లు నటించేవాడు. అయితే విద్యుత్ దొంగతనం జరుగుతుందని ఫిర్యాదు అందడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయంపై విచారించడానికి అక్కడికి వెళ్లారు. అధికారుల రాకను గమనించిన వ్యక్తి వెంటనే బాల్కనీపైకి మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడున్న లింక్వైర్ను కట్ చేయబోయాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. టెర్రస్ మీద ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న క్రమంలో అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకు వెళ్లి ఇదంతా వీడియో తీస్తున్నాడు. వ్యక్తిని గమనిస్తూ వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ అధికారి ‘బ్రదర్.. నేనిక్కడే నిల్చొన్నా’ అంటూ బదులిచ్చాడు. ఆ మాట విని అయ్యో దొరికిపోయానా అనే రేంజ్లో కరెంట్ దొంగ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటి కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ग़ाज़ियाबाद में जब एक कटियाबाज़ के यहां बिजली विभाग का छापा पड़ा तो वो रेंगते हुए अपना अवैध कनेक्शन काटने गया,जिससे उसे कोई देख न पाए,लेकिन बिजली विभाग एक कर्मचारी उससे 2 कदम आगे निकला,वो पहले ही बगल वाले कि छत से वीडियो बना रहा था,फिर क्या हुआ देखिये pic.twitter.com/3Gs5rDIneD — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 13, 2021 -
విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ దాడులు
195 మందిపై చర్యలు, కేసుల నమోదు రూ.27.7 లక్షల జరిమానా నెల్లూరు (అర్బన్) : 8 జిల్లాల ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ ఎస్ఈ రవి ఆధ్వర్యంలో జిల్లాలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై గుంటూరు, ప్రకాశం నుంచి వచ్చిన అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కావలి, వింజమూరు, నెల్లూరు, గూడూరు డివిజన్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఆక్వా రంగం, పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నెల్లూరు బీవీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల కనెక్షన్లను తనిఖీ చేశారు. విద్యుత్ భవన్ అతిథి గృహంలో ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ ఎస్ఈ వి.రవి విలేకరులకు వివరాలు వెల్లడించారు. కావలి, కోట తదితర ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యం చేస్తున్న ఆక్వా రంగానికి చెందిన ఐదుగురిపై , వ్యాపార రంగానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. గృహ విద్యుత్ కనెక్షన్ తీసుకుని వ్యాపార రంగానికి వినియోగిస్తున్న 30 మందిపై, అదనపు లోడ్‌తో విద్యుత్‌ను చౌర్యం చేస్తున్న 142 మందిని పట్టుకున్నామన్నారు. మొత్తం 195 మంది నుంచి రూ.27.7 లక్షలను జరిమానా విధించామన్నారు. తొలిసారిగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై భారీగా జరిమానా విధిస్తున్నామన్నారు. రెండో సారి దొరికిన ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు కేసును అప్పగించామన్నారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా విజిలెన్సు అధికారులు వచ్చి దాడులు చేసి ఇన్ని కేసులు నమోదు చేస్తుంటే స్థానిక అధికారులు ఒక్క దొంగ కేసును కూడా ఎందుకు పట్టుకోలేక పోయారని విలేకరులు ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (అడిషనల్ఎస్పీ) ఎ.మనోహర్, డీఈ రమేష్, సిఐ ఎం.నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ చౌర్యంపై దాడులు
182 మందిపై కేసులు నమోదు రూ.16 లక్షల జరిమానా విధింపు నెల్లూరు (టౌన్): జిల్లాలో విద్యుత్ చౌర్యంపై తనిఖీలు నిర్వహించి అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న 182 మందిపై బుధవారం ట్రాన్స్‌కో విజిలెన్స్, యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ ఎస్ఈ రవి, ఏపీటీఎస్ ఎస్పీ మనోహర్‌రావు తెలిపారు. విద్యుత్‌భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కావలి, కావలి రూరల్, జలదంకి, వింజమూరు, ఇందుకూరుపేట, తదితర డివిజన్లల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 62 మంది అధికారులు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. మీటర్ ఉండి కనెక్షన్‌ను బైపాస్ చేసిన 31 మంది, మీటరు లేకుండా నేరుగా తీగలకు తగిలించి చౌర్యానికి పాల్పడుతున్న 60 మంది, గృహానికి కనెక్షన్‌ను తీసుకొని వ్యాపారానికి వినియోగిస్తున్న 19 మంది, బిల్లింగ్‌లో అవకతవకలకు పాల్పడుతున్న ఇద్దరు, అదనపు లోడ్‌ను వినియోగిస్తున్న 67 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.16 లక్షల జరిమానాను వసూలు చేశామని వివరించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిలో ఆక్వాకు సంబంధించి రూ.ఏడు లక్షలు, కనెక్షన్ లేకుండా ఏసీని వినియోగిస్తున్న వినియోగదారుడి నుంచి రూ.లక్ష అపరాధ రుసుముగా వసూలు చేశామని వివరించారు. విద్యుత్ కనెక్షన్ లేని వారు దీనదయాళ్ యోజన పథకం నుంచి రూ.125కే సర్వీసును పొందవచ్చని వివరించారు. ఏపీటీఎస్ సీఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.