Illinois Institute of Technology
-
భూగర్భ జలాల్లో ‘ప్లాస్టిక్’
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది తాగునీటి అవసరాలను తీరుస్తున్న భూగర్భ జలాల్లోనూ ప్లాస్టిక్ భూతం ప్రవేశించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘గ్రౌండ్‌వాటర్’ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికాలోని రెండు జలాశయాల్లో సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఔషధాలు, గృహోపకరణ వ్యర్థాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ప్లాస్టిక్ పర్యావరణంలోకి సూక్ష్మకణాలుగా విచ్ఛిన్నమవుతుంది. ఇది జలచర జీవుల నాశనానికి కారణమవుతుంది’ అని ఇలినాయిస్ టెక్నాలజీ సెంటర్ పరిశోధకుడు జాన్ స్కాట్ చెప్పారు. ఫలితంగా మన ఆహార సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సున్నపురాయి పగుళ్ల ద్వారా, కొన్నిసార్లు మురుగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా కూడా భూగర్భంలోకి నీరు చేరుతుంది. అయితే, పరిశోధకులు సెయింట్ లూయిస్ మెట్రోపాలి టన్, ఇల్లినాయిస్ ప్రాంతాల్లో పలు భూగర్భ జల నమూనాలను సేకరించి పరీక్షించగా 15.2 శాతం ప్లాస్టిక్ సూక్ష్మకణాలు కనిపించాయి. 1940 నుంచి 600 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారైనట్లు ఒక అంచనా. అందులో కనీసం 79 శాతం పర్యావరణంలో కలిసిపోయి ఉంటుందని అనుకుంటున్నామని స్కాట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇదీ.. భారతీయత అంటే!
షికాగో పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది వివేకానందుడు. భారతీయ సంస్కృతి గొప్ప తనాన్ని షికాగో వేదికగా చాటిచెప్పిన మహనీ యుడు ఆయన. మళ్లీ ఆ తర్వాత అదే వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన వ్యక్తిగా ఓ భారతీయ విద్యార్థి పేరు గడించాడు. ఆ విద్యార్థి తాను చేసిన ఒక పని వల్ల ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన గౌరవ్ జవేరి అనే భారతీయ విద్యార్థి స్నాతకోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదిక మీదకు వెళ్లిన గౌరవ్ పట్టా అందుకున్న వెంటనే యూనివర్సటీ డీన్ కాళ్లకు నమస్కారం చేసి కిందికి వెళ్లిపోయాడు. భారతీయ సంప్రదాయం తెలియని డీన్ ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు. కాసేపటి తర్వాత తేరుకున్న డీన్ విద్యార్థి తన కాళ్లకు నమస్కరించినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ షేర్ అవు తోంది. ట్వీటర్లో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వీడియోల్లో ఒకటిగా నిలచింది. భారతీయులు ఎక్కడున్నా భారతీయులేనని, గురువుకు నిజమైన గౌరవం దక్కిందంటూ కొందరు, ఇదీ భారతీయత అంటే.. అంటూ మరికొందరు ట్వీటర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.