imagination
-
చుక్కలకు చెయ్యి చూద్దాం
ఒక ఊళ్లో ఒక ‘కాలజ్ఞాని’ ఉండేవాడు. పగలంతా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. రాత్రంతా ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఉండేవాడు. ఏవో లెక్కల్ని వేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. ఈ లోకానికి ఏదో జరగబోతోందని నిరంతరం ఆందోళన చెందుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఊళ్లోని వాళ్లు వచ్చి, భవిష్యత్తులో తమకేం జరగబోతోందో చెప్పమని ఆయనను అడిగేవారు. చెప్పేవాడు! ఆయన చెప్పిన విషయాన్ని బట్టి ఆ వచ్చినవాళ్లు సంతోషంతోనో, విచారంతోనో వెళ్లిపోయేవారు. ఆ కాలజ్ఞాని నిజంగా కాలజ్ఞానో కాదో ఎవ్వరికీ తెలియదు. ఆయన మాత్రం తనని తాను కాలజ్ఞానిని అనుకునేవాడు. ఎప్పటిలాగే ఓ రోజు రాత్రి మసక చీకట్లో ఆ కాలజ్ఞాని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ, లెక్కల్ని వేసుకుంటూ ఊరి శివార్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. పైన చూస్తూ, కింద చూసుకోకపోవడంతో ఒక గొయ్యిలో పడిపోయాడు. పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు కానీ పట్టు దొరకలేదు. ‘ఎవరైనా ఉన్నారా? నన్ను పైకి లాగండి’ అని కేకలు వేస్తూ గొయ్యిలోనే ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత, అటుగా వస్తున్న గ్రామస్థులు కేకలు విని, కాలజ్ఞానిని బయటికి లాగి, తమ దారిన తాము వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ అనుకున్నారు.. ‘చుక్కల్లో భవిష్యత్తుని చూడగలిగాడు కానీ, కాళ్ల కింద ఉన్న వర్తమానాన్ని కనుక్కోలేకపోయాడు’.. అని! రేపటి గురించిన ఆలోచన, రేపేం జరగబోతోందీ అన్న ఆలోచన రెండూ ఒకటి కాదు. రేపటి గురించిన ఆలోచనలో ‘ముందు జాగ్రత్త’ ఉంటుంది. రేపేం జరగబోతోంది అన్న ఆలోచనలో కేవలం ‘ఊహ’ మాత్రమే ఉంటుంది. అది మంచిది కాదు. రేపటిని ఊహిస్తూ, నేడు చేయవలసిన పనుల్ని అలక్ష్యం చేస్తాం మనం. ఈలోపు ఆ రేపు.. నేడై వచ్చేస్తోంది.. తెల్లారే వాకిట్లోకి! అప్పుడు మళ్లీ నేటి గురించి పట్టించుకోకుండా రేపటిలోకి వెళ్లిపోతాం. అంటే ఎప్పుడూ మనం రేపటిలోనే ఉండిపోతున్నాం. నేటిని చేజార్చుకుంటున్నాం. ‘రేపు’ ఎలాగూ వస్తుంది. ‘నేడు’ చేజారి ‘నిన్న’ అయిపోయాక మళ్లీ వస్తుందా?! నిన్న అయినా, నేడు అయినా, రేపు అయినా ఎప్పటికప్పుడు జీవితం మెరుగవుతూ ఉండాలి. అంతవరకే ఆలోచన చెయ్యాలి. నిన్నటిని ఒక అనుభవంగా తీసుకుని, ఆ అనుభవంతో రేపటిని మరింత మెరుగ్గా మలుచుకోడానికి ఇవాళ మనం మన పనిలో శ్రద్ధపెట్టాలి. సవ్యంగా పూర్తి చెయ్యాలి. అప్పుడు చుక్కలే కిందికి చెయ్యి చాపుతాయేమో.. ‘గురూ.. కొంచెం మా ఫ్యూచర్ చూసి చెప్పు. ఎలా ఉండబోతోందో?’ అని! మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతుంటే ‘రేపు’ అనే గొయ్యిలో పడే ప్రమాదం ఉండదు. -
మీలో ఊహాశక్తి ఉందా?
సెల్ఫ్ చెక్ సృజనాత్మకతకు తొలి మెట్టు ఊహ. దీనిద్వారానే అభివృద్ధి సాధ్యం. కథ చదివేటప్పుడు కొందరు ఆయా సీన్లను ఊహించుకుంటూ చదవగలరు. మరికొందరికి అలాంటి శక్తి తక్కువ. మీలో ఇమాజినేషన్ పవర్ ఉందోలేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1. విషమిస్తున్న పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు. ఎ. కాదు బి. అవును 2. మీ ఆలోచనలనలతో ఒక పుస్తకం రాయవచ్చు. ఎ. కాదు బి. అవును 3. మీరు చదివిన కథను మార్చి కొత్తగా చెప్పగలరు. ఎ. కాదు బి. అవును 4. అసమాన పరిస్థితులు మీ ఊహల్లో ఉంటాయి. ఎ. కాదు బి. అవును 5. కావలసిన వాళ్లు సమయానికి రాకపోతే వారు ఎక్కడికి వెళ్లివుంటారో గెస్ చేయగలరు. ఎ. కాదు బి. అవును 6. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ను ఇష్టపతారు. ఎ. కాదు బి. అవును 7. ఫిక్షన్, అతీంద్రియ కథల పుస్తకాలను ఇష్టపడతారు. ఎ. కాదు బి. అవును 8. ఏ పని చేయాలన్నా దాని పర్యవసానాలను అంచనా వేయగలుగుతారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఆరు దాటితే మీలో ఊహాశక్తి ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు పొందుతారు. ‘ఎ’ లు ఎక్కువగా వస్తే మీలో ఇమాజినేషన్ పవర్ తక్కువనే చెప్పాలి. కథలు చదవడం, రాయటం, విషయాల పట్ల క్యూరియాసిటీ పెంచుకోవటం ద్వారా ఊçహాశక్తిని పెంచుకోవచ్చు. -
నేనా.. బ్రూస్లీ సినిమానా!
ప్రేక్షకుల అంచనాలు, వాళ్ల ఊహలు వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటున్నారు. అయితే.. అలా జరిగితే మాత్రం తాను చాలా సంతోషిస్తాననే చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వర్మ త్వరలోనే బ్రూస్లీ సినిమా తీస్తారంటూ ఓ అభిమాని తన ఫేస్బుక్ పేజీలో వర్మ, బ్రూస్లీల ఫొటోలతో ఓ స్టేటస్ అప్డేట్ పెట్టారు. అది చూసిన వర్మ.. అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. స్వతహాగా బ్రూస్లీ అభిమాని అయిన రాంగోపాల్ వర్మ.. నిజంగా తాను బ్రూస్లీ సినిమా తీస్తే చాలా బాగుండేదని కూడా అన్నారు. Rgv movie on Bruce Lee ..I can't believe people's imagination..but I love it pic.twitter.com/zyJSrAWXLg — Ram Gopal Varma (@RGVzoomin) May 28, 2015 -
ఊహల్లో..ఊగిసలాట
- ప్రేమ పేరుతో మోసపోతున్న టీనేజర్లు - క్షణికావేశంలో ఆత్మహత్యలు సాక్షి,సిటీబ్యూరో: ఆధునిక ప్రపంచంలో యువత జీవితం ఊహల్లో ఊగిసలాటగా మారుతోంది. ఉన్నత విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా ఎదగాల్సిన టీనేజర్లు ఊహా ప్రపంచంలో విహరిస్తూ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఆకర్షణకు, ప్రేమకు మధ్య తేడాను తెలుసుకోలేక ప్రేమ పేరుతో దారుణంగా మోసపోతున్నారు. అనంతరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నగరంలో చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం నాగార్జునసాగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన అనూష ఉదంతం కూడా ఇంచుమించు ఇలాంటిదే. తన కంటే వయస్సులో చాలా పెద్దవాడు, అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని, తనను అత్యంత దారుణంగా మోసం చేశాడనే విషయం తెలియగానే తీవ్ర నిరాశ నిస్పృహలకు గురైంది. నాగార్జునసాగర్‌లో దూకి ఆత్మహత్యకు ఒడిగట్టింది. నగరంలో ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏడాది క్రితం నగరానికే చెందిన గౌతమీప్రియ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, అతడి కుటుంబ సభ్యుల్లాంటివారిని అంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా చూడలేదని సూసైడ్ నోట్ రాసింది. చిన్న వయస్సులోనే జీవితంపై విరక్తి చెందినట్లు పేర్కొంది. అలాగే కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన భవానీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇలాంటి సంఘటనల వెనుక శారీరకమైన ఆకర్షణలు తప్ప మానసికమైన ప్రేమలు, అనుబంధాలు ఏ మాత్రం కనిపించడం లేదని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వయా సోషల్ మీడియా.. ఆకర్షణననే ప్రేమగా భావించి ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ’ అనే భ్రమలో పడి మోసపోతున్న యువత సోషల్ మీడియానే వేదికగా చేసుకొని మరింత మోసానికి గురవుతోంది. నాలుగు రోజుల క్రితం నగరానికి చెందిన ఓ అమ్మాయి ఫేస్బుక్లో పరిచయమైన ఒక వ్యక్తి చేతిలో ఇలాగే మోసానికి గురైంది. అనకాపల్లిలో మెకానిక్‌గా పని చేసే యువకుడు అమెరికాలో ఉంటున్నట్లుగా ఫేస్బుక్లో పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు హైదరాబాద్‌లో కలిసే నాటికి అతడి వంచన తెలిసింది. కానీ అప్పటికే అతనితో ప్రేమలో (ఆకర్షణ)లో పడిన ఆ అమ్మాయి అతనితోనే రాజీ పడేందుకు సిద్ధపడడం గమనార్హం. సినిమాలు, సాహిత్యం, మీడియా ఇలాంటి చర్యలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో స్నేహసంబంధాలను, మానవ సబంధాలను బలోపేతం చేయవలసిన సోషల్ మీడియా టీనేజ్ యూత్ పాలిట శాపంగా, ఆత్మహత్యాసదృశ్యంగా పరిణమిస్తోంది. వాస్తవాలను అర్థం చేసుకోవాలి యుక్త వయస్సులో వచ్చే మానసిక ఆలోచనలను అర్థం చేసుకోవడంలో టీనేజర్లు విఫలమవుతున్నారు. ఊహాలోకంలో తేలిపోతూ బయటకు రాలేకపోతున్నారు. తమది ప్రేమ కాదని తెలిసినా, అది కేవలం ఆకర్షణ మాత్రమే ననే విషయం అర్థమవుతున్నప్పటికీ బయటపడేందుకు సాహసం చేయలేకపోతున్నారు. వాస్తవ ప్రపంచంలోకి రాలేక మోసపోతున్నారు. వాస్తవ లోకంలోకి వచ్చి కెరీర్‌పై దృష్టి సారించాలి. కుటుంబం, సమాజం కూడా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. - డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి,మానసిక వైద్య నిపుణులు -
అచ్చు బొమ్మలు
అమ్మాయిలను ‘అచ్చు బొమ్మ’లా ఉన్నావంటూ... రకరకాల పోలికలు చెబుతుంటారు.చీరలపై ‘అచ్చు’తో అందమైన బొమ్మలు వేస్తే... చూపరులు సైతం బొమ్మల్లా ఉండిపోవాల్సిందే! ఆ చీరలను కట్టుకున్న అతివలు... కుందనపుబొమ్మల్లా మెరిసిపోవాల్సిందే!హ్యాండ్లూమ్, సిల్క్, పట్టు... మెటీరియల్ ఏదైనా...వేసే డిజైన్‌లో సృజన ఉంటే బామ్మనైనా భామనైనా ‘అచ్చు’ చీరలే ఆకట్టుకుంటాయి. కుచ్చిళ్ల భాగంలో మల్టీకలర్ ఇక్కత్, ఓణీ భాగంలో పసుపురంగు కోటా, అంచుగా బ్లాక్ సీక్వెన్స్ మెటీరియల్‌ను జత చేశారు. దీంతో అటు సంప్రదాయం, ఇటు ఆధునికతల సమ్మేళనంతో చీర ఆకర్షణీయంగా మారింది. ఓణీ భాగంలో జత చేసిన వస్త్రానికి పసుపు రంగును అద్ది,పువ్వులను ‘అచ్చు’గా వేశారు. ఆకుపచ్చ, వంగపండు రంగుల కలయికతో రూపుదిద్దుకున్న హ్యాండ్లూమ్ శారీ ఇది. టెంపుల్ డిజైన్ వచ్చిన బార్డర్ పైన అద్దిన ఆకుపచ్చని ‘అచ్చు’తో ఈ చీర మరింత గ్రాండ్‌గా మారింది. సాదా క్రీమ్ కలర్ టస్సర్ సిల్క్ చీరపై కేరళ మురుగ ఆర్ట్ కనువిందు చేస్తోంది. పెన్ కలంకారి డిజైన్ అనిపించేలా ‘అచ్చు’ వేసి, ఈ డిజైన్‌ను శోభాయమానంగా రూపుకట్టారు. నలుపు, ఎరుపు మేళవింపుతో ఉన్న కోటా చీరపై తెల్లని నెమళ్ల ప్రింట్ ఆకట్టుకుంటుంది. కథాకళి నాట్య భంగిమలను ‘అచ్చు’గా రూపుకట్టి ఈ చీరను అందంగా తీర్చిదిద్దారు. లేత ఆకు పచ్చరంగు చీరకు కనకాంబరపు అంచును జత చేసి, ఆకుపచ్చని లతలు, పువ్వుల శోభ వచ్చేలా ‘అచ్చు’ వేశారు. వేసవిని కూల్ చేసే ఇలాంటి చీరలు ఆధునిక యువతులకు అందమైన అలంకరణ. డ్రెస్ కర్టెసీ: అనుపమ స్నేహాస్ కలర్స్ అండ్ ప్రింట్స్, సిద్ధార్థనగర్, హైదరాబాద్ మోడల్స్: క ల్పన, శాంతిప్రియ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్