IMF reports
-
2022–23లో భారత్ వృద్ధి 6.5 శాతమే!
వాషింగ్టన్: భారత్ ఎకానమీ 2022–23 వృద్ధి అంచనాలకు ప్రపంచబ్యాంక్ ఒక శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. జూన్‌లో వేసిన తొలి అంచనా 7.5 శాతాన్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలను దీనికి కారణంగా చూపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సు నేపథ్యంలో దక్షిణ ఆసియా ఆర్థిక అంశాలపై విడుదలైన నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. అయితే ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. మహమ్మారి సవాళ్ల నుంచి, తీవ్ర క్షీణత నుంచి ఎకానమీ బయటపడిందని ప్రశంసించారు. దక్షిణాసియాకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. వాటిలో కొన్ని... ►భారీ అంతర్జాతీయ రుణ భారాలు లేవు. అటువైపు నుంచి సవాళ్లు ఏమీ లేవు. పటిష్ట ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తోంది. ►సేవలు, సేవలు రంగాల ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు మంచి మద్దతును ఇస్తున్నాయి. ►అంతర్జాతీయ ప్రతికూల అంశాలే వృద్ధి రేటు తాజా తగ్గింపునకు కారణం. ►ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ►డిజిటల్ ఆలోచనలన ఉపయోగించుకుని సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించడంలో మిగిలిన ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. ►గోధుమల ఎగుమతిపై నిషేధం, బియ్యం ఎగుమతులపై అధిక టారిఫ్‌ల విధింపు వంటి ప్రభుత్వ చర్యలను సమర్థింలేం. స్వల్పకాలంలో అవి దేశీయంగా ఆహార భద్రతకు దారితీసినా, దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విధానాలు ప్రతికూలతకు దారితీయవచ్చు. ►కార్మిక మార్కెట్, ఎకానమీలో మరింతమంది ప్రజలను భాగస్వాములుగా చేయడం భారత్ తక్షణ అవసరం. -
భళా: భారత్‌లో పేదరికం తగ్గుతోంది, 'పీఎంజీకేఏవై' పై ప్రశంసల వర్షం!
న్యూఢిల్లీ: పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్ పేపర్లో పేర్కొంది. ‘మహమ్మారి, పేదరికం, అసమానత: భారతదేశం నుంచి పాఠాలు’ అనే అంశంపై ఈ వర్కింగ్ పేపర్ రూపొందింది. 2004–05 నుంచి మహమ్మారి సవాళ్లు విసిరిన 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలపై ఈ పత్రం అధ్యయనం చేసింది. సుర్జిత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్, అరవింద్ విర్మానీలు రూపొందించిన ఈ వర్కింగ్ పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►2019లో కరోనా ముందు సంవత్సరంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద ఉంది. 2020 మహమ్మారి సంవత్సరంలోనూ అది తక్కువ స్థాయిలోనే కొనసాగాలా చూడ్డంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కీలకపాత్ర పోషించింది. ►మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యా లను ఉచితంగా అందిస్తోంది. సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ ఈ పథకాన్ని పొడిగించడం సానుకూల పరిణామం. ► 2019–20 మహమ్మారికి ముందు సంవత్సరంలో భారతదేశంలో పేదరికం 14.8 శాతంగా ఉంటే, తీవ్ర పేదరికం శాతం 0.8 శాతంగా ఉంది. ►ఏదు దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా 2020 మహమ్మారి సమయంలో పేదరికం (రోజుకు 1.9 డాలర్లకన్నా తక్కువ ఆర్జన) తీవ్రంగా పెరిగింది. ► మహమ్మారి సమయంలో భారత్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల వల్ల పేదరికం తీవ్రత కట్టడిలో ఉంది. 2013లో ఆహార భద్రతా చట్టం (ఎఫ్ఎస్ఏ) అమలులోకి వచ్చినప్పటి నుండి ఆహార సబ్సిడీలు పేదరికాన్ని స్థిరంగా తగ్గించాయి. ప్రయోజనాలు అసలైన లబ్దిదారులకు చేరడం ఆధార్ ద్వారా సాధ్యపడుతోంది. లబ్దిదారునికి సబ్బిడీ పథకాలు చేరేలా తీసుకువచ్చిన చర్యలు, చొరవలు పేదరికం తగ్గడంలో మంచి ప్రభావాన్ని పోషించాయి. ►గిని కోఎఫీషియంట్ విధానం ద్వారా మదింపుచేసే గణాంకాల ప్రకారం, గత నలభై సంవత్సరాలలో ‘‘వాస్తవిక అసమానత’’ కనిష్ట స్థాయికి చేరుకుంది. 1993–94లో అసమానతల నివారణా సూచీ 0.284 వద్ద ఉంటే, 2020–21లో 0.292కి చేరుకుంది. ఆహార సబ్సిడీల వల్ల మూడు సంవత్సరాలుగా తీవ్ర పేదరికం 1 శాతం కంటే తక్కువగా (లేదా సమానంగా) ఉంది. ►ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత 2020లో మొదటిసారి జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆహార రేషన్‌ను ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోంది. ►తీవ్ర పేదరిక సమస్య వాస్తవంగా భారత్‌లో పోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రాతిపదికైన ఆర్జన ఇకపై 1.9 డాలర్ల నుంచి 3.2 డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా భారత్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ అధికారికంగా దేశంలో దారిద్య్రరేఖ ప్రాతిపదికలను మార్చాలి. ►దేశంలో మహమ్మారి వల్ల తలెత్తిన తీవ్ర పేదరిక సమస్య ఆహార సబ్సిడీ విస్తరణ కార్యక్రమం వల్ల దాదాపు 50 శాతం మేర సమసిపోయింది. -
అంచనా కంటే భారత వృద్ధి మరింత బలహీనం
వాషింగ్టన్: అంచనా వేసిన దానికంటే భారత జీడీపీ వృద్ధి రేటు మరింత బలహీనంగానే ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ సంబంధిత అనిశ్చితులు, కొన్ని ఎన్బీఎఫ్సీల్లో దీర్ఘకాలం పాటు బలహీనతలే తన తాజా అంచనాలకు కారణాలుగా ఐఎంఎఫ్ పేర్కొంది. దేశ జీడీపీ వృద్ధి జూన్ త్రైమాసికంలో 5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. 2013 మార్చి తర్వాత ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. 2019, 2020లో భారత వృద్ధి రేటు నిదానంగా ఉంటుందని, రెండు సంవత్సరాల్లోనూ 0.3 శాతం మేర తగ్గొచ్చని ఐఎంఎఫ్ జూలైలో అంచనా వేసింది. దేశీయ డిమాండ్ బలహీనంగా ఉన్నందున 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతంగా ఉంటుందని తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆరి్థక వ్యవస్థేనని, చైనా కంటే ఎంతో ముందుందని ఐఎంఎఫ్ తెలిపింది. భారత్ తాజా ఆరి్థక వృద్ధి రేటు అంచనా వేసిన దాని కంటే మరింత బలహీనంగా ఉందని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి జెర్రీరైస్ శుక్రవారం వాషింగ్టన్లో మీడియాతో పేర్కొన్నారు. భారత్‌లో జూన్ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటుపై మీడియా నుంచి ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ భారత్‌లో ఆరి్థక పరిస్థితిని తాము గమనిస్తున్నట్టు చెప్పారు. తయారీ రంగంలో ఉత్పాదకత పడిపోవడం, వ్యవసాయ రంగం పనితీరు క్షీణతే ఇటీవలి జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలని జాతీయ గణాంక కార్యాలయం ఇటీవలే పేర్కొన్న విషయం గమనార్హం. -
దూసుకుపోతున్న భారత్ వృద్ధి రేటు
-
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో వృద్ధికి దెబ్బ!
వాషింగ్టన్: పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో సంక్లిష్టత అంశాలు భారత్ వృద్ధి తీరును ప్రతికూలంలోకి నెడుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ– ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2017 వృద్ధి రేటు అంచనాను ఇంతక్రితం (ఏప్రిల్, జూలై) అంచనాలకన్నా అర శాతం తగ్గిస్తూ 6.7 శాతానికి కుదించింది. 2017 వృద్ధి రేటును సైతం 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తూ, 7.4 శాతానికి చేర్చింది. ఈ వారం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో విడుదలైన ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికను చూస్తే... కోల్పోనున్న ‘వృద్ధి వేగం’ హోదా 2017లో చైనాకన్నా భారత్ వృద్ధి రేటు అంచనా తక్కువగా ఉండడం గమనార్హం. చైనా 2017లో 6.8 శాతం వృద్ధి నమోదుచేసుకోనుంది. ఏప్రిల్ అంచనా కన్నా ఇది (6.6 శాతం) అధికం. ఇదే జరిగితే ఈ ఏడాది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ కోల్పోతుంది. అయితే జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో వృద్ధి రేటు మళ్లీ 8 శాతం పైకి చేరే అవకాశం ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి అంచనా పెంపు ప్రపంచ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. 2017లో 3.6% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ఇంతక్రితం (ఏప్రిల్) 3.5% అంచనాలకన్నా ఇది 10 బేసిస్ పాయింట్లు అధికం. చైనా, జపాన్, రష్యా అలాగే యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల పురోగతి దీనికి ప్రధాన కారణం. 2018 ప్రపంచ వృద్ధి సైతం 3.7 శాతంగా నమోదవుతుంది. గత అంచనాలకన్నా ఇది 10 బేసిస్ పాయింట్లు అధికం. -
జోరుగానే భారత్ వృద్ధి
ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నివేదికలు కనిష్ట చమురు ధరలు, సానుకూల డిమాండ్ పెట్టుబడుల్లో పెరుగుదల 2015-16లో వృద్ధి 7.5 శాతంగా అంచనా... వాషింగ్టన్: భారత్ ఆర్థికాభివృద్ధి పటిష్టంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థలు తమ వేర్వేరు నివేదికల్లో పేర్కొన్నాయి. తక్కువ స్థాయిలో కొనసాగుతున్న చమురు ధరలు, దేశంలో నెలకొన్న మంచి డిమాండ్ పరిస్థితులు, పెట్టుబడుల పెరుగుదల ధోరణి వంటి అంశాలు భారత్ పటిష్ట వృద్ధికి సహకరిస్తున్న అంశాలని ప్రపంచబ్యాంక్ విశ్లేషించింది. దక్షిణ ఆసియా ఆర్థిక వ్యవస్థపై ఆరు నెలలకు ఒకసారి విడుదల చేసే నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ అంశాలను తెలిపింది. ఇక వృద్ధి స్పీడ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే చైనాను భారత్ అధిగమిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అటు ప్రపంచబ్యాంక్, ఇటు ఐఎంఎఫ్ రెండూ ఈ ఏడాది (2015-16) వృద్ధి రేటు 7.5 శాతమని అంచనావేశాయి. ప్రపంచబ్యాంక్ నివేదికలో ముఖ్యాంశాలు... 2017-18 నాటికి దేశం 8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సాధిస్తుంది. 2015-2016 : 2017-2018 ఆర్థిక సంవత్సరాల మధ్య పెట్టుబడుల్లో వృద్ధి రేటు భారీగా 12 శాతంగా ఉండొచ్చు. పటిష్ట ఆర్థిక వృద్ధికి దోహదపడే అంశం ఇది. దేశాభివృద్ధి ఇప్పటి వరకూ వినియోగ ఆధారితంగా ఉంది. ఇకపై దీనిని పెట్టుబడుల ఆధారితంగా రూపొందించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో చైనా తన వృద్ధిని పెట్టుబడుల ప్రాతిపదిక నుంచి వినియోగ ఆధారితం వైపునకు తీసుకెళ్తోంది. దక్షిణాసియా వృద్ధి రేటు 2015లో 7 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2017 నాటికి ఇది 7.6 శాతానికి వృద్ధి చెందే అవకాశం. భారత్ వృద్ధి పరుగు మొత్తం ఈ ప్రాంతానికి లాభిస్తున్న అంశం. సంస్కరణలు, మెరుగుపడిన ఇన్వెస్టర్ సెంటిమెంట్ భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశాల్లో కొన్ని. భారత్ వృద్ధి పరుగు: ఐఎంఎఫ్ 7.5 శాతం రేటుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే చైనా వృద్ధి రేటును భారత్ అధిగమించే అవకాశం ఉంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ పొందనుంది. ఇంతక్రితం జనవరిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును ఐఎంఎఫ్ 6.3గా పేర్కొంది. ఈ రేటును 7.5 శాతానికి పెంచడానికి ఇటీవల కేంద్రం తీసుకున్న విధాన సంస్కరణలు, పెట్టుబడుల్లో వృద్ధి ధోరణి, తక్కువ స్థాయిలో చమురు ధరలు కారణం. 2014లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. 2015లో ఇది 7.5 శాతానికి చేరుతుంది. 2014లో చైనా వృద్ధి రేటు 7.4 శాతంకాగా, 2015లో ఈ రేటు 6.8 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2016లో ఇది మరింతగా తగ్గి 6.3 శాతానికి చేరుతుంది. రెమిటెన్సుల్లో మనమే టాప్ విదేశాల్లో నివసిస్తున్న వారు స్వదేశంలోని తన వారికి పంపే నిధులకు సంబంధించిన ‘రెమిటెన్సెస్’ విషయంలో భారత్ తన ఆధిక్యతను కొనసాగిస్తోందని ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌసిక్ బసు తెలిపారు. భారత్ నుంచి వెళ్లి... వివిధ దేశాల్లో పనిచేస్తున్న వారు స్వదేశానికి 2014లో 70 బిలియన్ డాలర్లను పంపినట్లు ఆయన తెలిపారు. చైనా విషయంలో ఈ మొత్తం 64 బిలియన్ డాలర్లు. 2015లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్లే రెమిటెన్సుల విలువ దాదాపు 440 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలి పారు. 2014తో పోల్చితే ఇది 0.9% అధికం. ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్సుల విలువ 2015లో 0.4% వృద్ధితో 586 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెమిటెన్సులు పంపుతున్న దేశాల తొలి 5 స్థానాల్లో అమెరికా, సౌదీ , జర్మనీ, రష్యా, యూఏఈలు ఉన్నాయి. పుచ్చుకుంటున్న దేశాల్లో తొలి ఐదు స్థానాల్లో భారత్, చైనా, ఫిలిప్పైన్స్, మెక్సికో, నైజీరియాలు ఉన్నాయి. ఇంతటి భారీ స్థాయిలో నిధుల ప్రవాహం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే అంశమని కౌశిక్ బసు అన్నారు.