Imitation
-
‘మా అమ్మ పాలు ఇలానే ఊదేది’.. ఆరేళ్ల బాలుడు మృతి!
ఇండోర్: తెలిసీతెలియని వయసది. పొంగుతున్న వేడిపాలను తల్లి ఏవిధంగా ఊదుతుందో చూసి.. తను కూడా అలాగే అనుసరించాలనే ప్రయత్నంలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లసూడియా పోలీసుల కథనం ప్రకారం... ఫీనిక్స్ టౌన్షిప్లో నవంబర్ 23 సాయంత్రం సమయంలో బాలుడి తండ్రి రామ్‌జీ ప్రసాద్ పనిమీద బయటికి వెళ్లాడు. అతని భార్య రంజూదేవి, కుమారుడు సంజీవ్ కుమార్ (6), రెండున్నరేళ్ల కుమార్తె స్వీటి ఇంటి వద్ద ఉన్నారు. ఆ రోజు సాయంత్రం తల్లి రంజూదేవి గ్యాస్‌పై పాలు పెట్టి వేరేపని నిమిత్రం వంటగది నుంచి బయటికి వెళ్లడం చూసిన సంజీవ్, బల్లపైకెక్కి ప్లాస్టిక్ పైప్‌తో పాలను ఊదడం ప్రారంభించాడు. ఆ టైంలో వేడి పాలు పైపులోనుంచి నోట్లోకి వెళ్లడంతో వేగంగా శ్వాసపీల్చుకున్నాడు. దీంతో నోటిలోపలి భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స జరుగుతుండగా మూడురోజుల తర్వాత ఆదివారం మృతి చెందాడని వివరించారు. ప్రతిరోజూ తల్లి మరుగుతున్న పాలపై ఊదడం చూసేవాడని, అదేవిధంగా పొంగుతున్నపాలను పైపుతో ఆర్పడానికి ప్రయత్నించి తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి రామ్‌జీ ప్రసాద్ తెలుపుడూ కన్నీరుమున్నీరయ్యాడు. చదవండి: Bhopal Mass Suicide: నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు..వాళ్లని వదిలిపెట్టొద్దు! -
ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను: బుమ్రా
టీమిండియా స్టార్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో అతడి బౌలింగ్ యాక్షన్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా అతడి బౌలింగ్ యాక్షన్‌ను చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేకమంది అనుకరించే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన బౌలింగ్‌ను అనుకరించిన 15 నెలల పాపకు పెద్ద ఫ్యాన్ అయ్యానని పేర్కొంటూ బుమ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన కూతురు సమైరాతో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రోహిత్ సతీమణి రితికా బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడని సమైరాను అడిగింది. దీంతో వెంటనే బుమ్రా యాక్షన్‌ను అనకరించడంతో రోహిత్, రితికాలు గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియోను బుమ్రా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘నా కంటే సమైరానే బాగా చేసిందనుకుంటున్నా. ఆమె నన్ను అభిమానించే కంటే నేనే ఎక్కువగా ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను’అని పేర్కొన్నాడు. ఇక కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీమిండియా ఆటగాళ్లు లైవ్‌చాట్‌లో కలుసుకుంటున్నారు. రోహిత్-బుమ్రా, కోహ్లి-పీటర్సన్లు లైవ్‌చాట్‌లో అనేక విషయాలు ముచ్చటించుకున్న విషయం తెలిసిందే. I think she does it better than me @ImRo45 @ritssajdeh!I can safely say I am a bigger fan of hers than she is of me. 😇 pic.twitter.com/rHP5g52e20 — Jasprit Bumrah (@Jaspritbumrah93) April 3, 2020 చదవండి: ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా? యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్ -
దీపాభరణాలు...
న్యూలుక్ ⇒ ఇమిటేషన్ జువెల్రీ, ఫ్యాషన్ జువెల్రీ ఇక ధరించడానికి వీలు లేకుండా ఉన్నా, వాడి వాడి బోర్ కొట్టేసినా వాటిని ఏం చేస్తున్నారు? పండగ వేళకు ఇదిగో ఇలా మార్చేయండి. ఇంటికి, కంటికి కళ పెరుగుతుంది. ⇒ ఎన్నో దీపాలతో అలంకరించే వెలుగుల దీపావళి ఇంకా అందంగా మెరవాలంటే.. దీపాలు పెట్టే అడుగు భాగం మీ పాత ఇమిటేషన్(గిల్టు) ఆభరణాలతో తీర్చిదిద్దండి. కొత్త కాంతితో మెరిసిపోతూ కనులకు విందు చేస్తాయి. ⇒ రకరకాల రంగు పూసలు ఎన్నో ఉంటాయి. వాటిని కలిపి దండలా గుచ్చి గుమ్మానికి వేలాడదీస్తే! ఇలా అందంగా ఉంటుంది. లేదంటే ప్లెయిన్‌గా ఉండే గోడకు హ్యాంగ్ చేస్తే చాలు. ⇒ ప్లెయిన్ చార్ట్ తీసుకొని పెద్ద చమ్కీలు, పూసలు, ముత్యాలు, కుందన్స్‌ను అతికించి వేలాడదీస్తే.. వాల్ హ్యాంగింగ్ ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా! ⇒ పాతవైన ఎంబ్రాయిడరీ డ్రెస్సులు, చీరలు, లెహంగాలకు అందమైన డిజైన్స్ ఉంటాయి. వాటిని అలాగే పడేయకుండా జాగ్రత్తగా కట్ చేసి, పూలతో కలిపి రంగవల్లులను దిద్దితే.. పండగ కళ రెట్టింపు అవకుండా ఉండదు. ⇒ ఇలాంటి ఎన్నో ఐడియాలను మీరూ చేయగలరు. ప్రయత్నించండి. పండగ ఆనందాన్ని వెయ్యింతలు చేయండి. -
ట్రంప్‌ను అనుకరించిన దలైలామా
టిబెట్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డ్రొనాల్డ్ ట్రంప్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అనుకరించి ఆకట్టుకున్నారు. 'బ్రిటన్ గుడ్ మార్నింగ్' పత్రిక జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ శుక్రవారం దలైలామాను ఇంటర్వూ చేసిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు మీరు ఎవరిరైనా వివాదాస్పద వ్యక్తిని కలుసుకున్నారా? అయితే ఆ వ్యక్తి ఎవరని మోర్గాన్ ప్రశ్నించారు. దీనికి దలైలామా నవ్వుతూ... నేను ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని కలుసుకోలేదని చెబుతూనే.. ట్రంప్ తన జుట్టు దువ్వుకోవడాన్ని, మాట్లాడే విధానాన్ని ఆయన అనుకరించారు. ట్రంప్ మిమ్మల్ని అధ్యక్ష భవనానికి ఆహ్వానిస్తే అతన్నికోరేదేమిటి అన్న మరో ప్రశ్నకు దలైలామా స్పందిస్తూ... 'దయ చూపించు' అని సమాధానం చెప్పారు. దీనిని మోర్గాన్ ట్వీటర్లో పోస్ట్ చేయగానే 320 రీట్వీట్లు, 400 లైక్‌లు వచ్చాయి. -
అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!
ముస్తాబు అచ్చమైన బంగారానికైనా మెరుగు అవసరం... మరి అచ్చతెలుగు అమ్మాయికి...?! వజ్రాలు, వైఢూర్యాలకైనా వన్నెలు అద్దాలి... మరి నిలువెత్తు సౌందర్యానికి..?! బంగారంతో పనిలేదు... వజ్రాల వెలుగులూ అక్కర్లేదు... ఎంపిక సులువుగా, అలంకరణ త్వరగా పూర్తవ్వాలి. అంతేనా... అందరిలోనూ కొత్తగా.. ఇంకాస్త బ్రైట్‌గా కనిపించాలి. ప్రత్యేకం అనిపించే డిజైన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకోవాలి. అదీ తక్కువ ధరలో... బంగారు నగలకు పోటీగా... ఇమిటేషన్, ఫంకీ, కాస్ట్యూమ్, ప్లేటెడ్.. ఆభరణాలెన్నో అతివల మనసులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే ఇప్పటి ట్రెండ్‌గా మారాయి. కళగానూ, మెరుపులుగానూ ఉండే ఈ డిజైనరీ ఆభరణాలను ఇష్టపడేవారు కొన్నేళ్లపాటు ధరించాలంటే మన్నిక కోసం జాగ్రత్తలూ ఎంతో అవసరం. బంగారు ఆభరణాలకు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటామో వీటికీ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. క్రిస్టల్స్, రంగురాళ్లు మెరుపు పోకుండా ఉండాలంటే ధరించిన ఆభరణాలను తీసి, భద్రపరిచేటప్పుడు మెత్తటి తడి, పొడి వస్త్రంతో(కళ్లజోడుతో పాటు వచ్చే మెత్తటి క్లాత్ లాంటిది అయి ఉండాలి) మృదువుగా తుడిచి, భద్రపరచాలి. రాళ్లు, క్రిస్టల్స్, లోహం, ముత్యాలు నీరు తగిలినప్పుడు రంగుమారవచ్చు. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఈత కొట్టడం వంటి సందర్భాలలో ధరించిన ఆభరణాలను తీయడం మంచిది. పెర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నూనె, మద్యం... లాంటివి ఆభరణాల పై పూతను దెబ్బతీస్తాయి. అలాగే మెరుపు కోల్పోవచ్చు. మెరుపు కోల్పోయిన రాళ్లు, పూసలు, ముత్యాలు ధరించడానికి అనువుగా ఉండవు. బాడీ లోషన్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో వాటిని జాగ్రత్తపరచాలి. ఆభరణాలను ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకూడదు. పెర్ఫ్యూమ్ ఆభరణాలకు తగిలేలా స్ప్రే చేయకూడదు. అన్ని ఆభరణాలనూ ప్లాస్టిక్/పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఒకే చోట ఉంచరాదు. ఆభరణాలు విరిగిపోవఛిం, రాళ్లు పోవడం వంటివి జరగవచ్చు. ఆభరణాల పెట్టెలో పట్టు/వెల్వెట్ పౌచ్‌లలో భద్రపరచాలి. ఆభరణాలు ధరించి నిద్రపోతే అసౌకర్యంగా ఉండటమే కాదు, అవి విరిగిపోవడం, రంగురాళ్లు ఊడిపోవడం.. వంటివి జరగవచ్చు. అలాగే ఎక్కువ ఎండపడే చోట కూడా భద్రపరచకూడదు. ఆభరణాలు పెట్టే బాక్స్‌లలో భద్రపరచాలి. ఆ బాక్స్ కూడా పెద్ద పెద్ద విభాగాలతో కూడి ఉండాలి. ఆభరణాలు ధరించేవారు... ఆభరణాలను తగిలించే హోల్డర్స్, కంఠాభరణాల స్టాండ్లు, ఆభరణాలు తీసుకోవడానికి అనువైన బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణాల సమయంలో ఆభరణాలను తీసుకువెళ్లేటప్పుడు అన్నీ ఒక చోట చుట్టేయకూడదు. దేనికది విడి విడిగా పెట్టాలి. సబ్బు, ఫేస్‌క్రీములు, మాయిశ్చరైజర్లు ఆభరణాలకు అంటకూడదు. దూది ఉండతోనూ, మెత్తని టూత్‌బ్రష్‌తో కొద్దిగా నీళ్లను అద్దుతూ శుభ్రపరచాలి. ఉన్న ఆభరణాలు కొద్దిగా పాడైపోయినా.. మరికొన్ని ఆభరణాలను జత చేసి కొత్తగా తయారుచేయించుకోవచ్చు. ఇందుకు ఇమిటేషన్ జ్యుయలరీ నిపుణులను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండాలేగాని పూసలు, రాళ్లు, చైన్లను ఉపయోగించి కొత్త తరహా ఆభరణాలను రూపొందించుకోవచ్చు. కొన్ని చైన్లను చెవి రింగులు గానూ, నెక్లెస్ ఎక్స్టెండర్స్గానూ వాడవచ్చు. లేదా పెంపుడు జంతువులకు ట్యాగ్గానూ వాడచ్చు. ఆభరణాల ఎంపిక, ధరించడం అనేది వ్యక్తిగత విషయం. కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు మీ గుర్తుగా ఆభరణాలను కానుకగా ఇచ్చేటప్పుడు వారి ఇష్టాయిష్టాలను గమనించాలి. మీరు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా తీసుకున్నవారికి అది ఆనందాన్ని కలిగించాలి. ఉపయోగపడాలి. బంగారు ఆభరణాలంటే అతివలకు అమితమైన ప్రీతి. ఆభరణాల అలంకరణలో పుత్తడిబొమ్మలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కానీ, బంగారం అందరికీ అందుబాటులో లేదు. అలాగని చుక్కల లోకం చేరిన బంగారం ధరలు చూసి ఇప్పుడెవరూ డీలా పడటం లేదు. బంగారు ఆభరణాల డిజైన్లను పోలినవి, వాటిని మించినవి, రకరకాల లోహాలతో తయారైనవి, దుస్తులకు తగినవి... ఎన్నింటినో సృజనాత్మకత గల నిపుణులు కళ్లు చెదిరేలా సృష్టిస్తున్నారు. మార్కెట్లో కళ్ల ముందు పెడుతున్నారు. ఇమిటేషన్ ఆభరణాలు: బంగారు ఆభరణాలను పోలిన డిజైన్లు ఇప్పుడు అన్నిచోట్లా లభిస్తున్నాయి. వీటిని వన్‌గ్రామ్ గోల్డ్ జ్యుయలరీ అని కూడా అంటుంటారు. వీటిలో విలువైన రాళ్లు, రత్నాలను కూడా పొదిగి అందంగా తీర్చిదిద్దుతుంటారు. బంగారం మాత్రం ఉపయోగించని ఈ డిజైన్లు తక్కువ ధరకే లభిస్తూ అతివలను ఆకట్టుకుంటున్నాయి. వెండితో తయారుచేసిన ఆభరణాలపై పై పూతగా గోల్డ్ కోటింగ్ వేసే జ్యుయలరీ కూడా ఈ జాబితాలో చేరుతుంది. కాస్ట్యూమ్/ఫ్యాషన్ ఆభరణాలు: ఖరీదు చాలా తక్కువగా ఉండే లోహాలు, రంగురాళ్లు, పూసలతో తయారుచేసిన ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఇవి ఫ్యాషన్ దుస్తుల అందాన్ని మరింత బహిర్గతం చేసే విధంగా డిజైనర్లు సృష్టిస్తారు. చాలా వరకు దుస్తులకు మ్యాచింగ్ అయ్యే ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఈ ఆభరణాలు ఎప్పుడూ చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. 1930ల కాలంలో ఈ తరహా ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. జంక్/ఫంకీ ఆభరణాలు: కలప, పూసలు, ఎముకలు, బ్రాస్, టైటా, జంతువుల దంతాలు, కొమ్ములు, పట్టు దారాలు... ఇలాంటివాటితో తయారుచేసిన ఆభరణాలను జంక్ జ్యూయలరీ అంటారు. ప్రపంచంలోని స్త్రీలంతా బంగారు, వజ్రాలు, వెండి, ప్లాటినమ్ ఆభరణాలనే కోరుకుంటారు అనుకోవడం పొరపాటు. జంక్ జ్యుయలరీని ధరించడం ఇప్ప టి ట్రెండ్. ఫంకీ జ్యుయలరీగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది.