Immanuel Mecron
-
G20 Summit: బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ► ‘మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. ► జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్‌కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన ఓలాఫ్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ► శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ► వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ► జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ► వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ► డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ► వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్‌తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్‌తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ షాక్
పారిస్: పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి గతంలో విక్రయించిన మిరేజ్ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థ, అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునీకరించకూడదని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తీరును తప్పుపడుతూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. తమ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తామని మేక్రాన్ ప్రకటించడమే ఇందుకు కారణం. పాక్ తీరుతో ఆగ్రహంతో ఉన్న ఫ్రాన్స్ మిరేజ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయరాదని నిర్ణయానికి వచ్చింది. ఖతార్‌కు ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్లను విక్రయించింది. ఈ జెట్ల సర్వీసింగ్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న నిపుణులకు నియమించరాదని ఖతార్‌ను ఆదేశించింది. ఆశ్రయం కోరుతూ పాకిస్తాన్ పౌరుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను ఫ్రాన్స్ పక్కనపెడుతోంది. -
భవిష్యత్ తరాల కోసం..
► పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత ► పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాలి ► ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ అనంతరం మోదీ ► ముగిసిన ప్రధాని నాలుగుదేశాల పర్యటన పారిస్: భూతాపాన్ని తగ్గించేందుకు కుదుర్చుకున్న పారిస్ ఒప్పందాన్ని మించి పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందాన్ని ప్రపంచమంతా బాధ్యతగా తీసుకోవాలన్నారు. నాలుగుదేశాల పర్యటన సందర్భంగా ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌తో సమావేశమైన ప్రధాని ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తర్వాత మేక్రాన్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘భూమిని, సహజ వనరులను కాపాడుకోవటం మన బాధ్యత. ప్రపంచానికి పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. భవిష్యత్ తరాలకు ఇది క్షేమకరం. మన పూర్వీకులు సహజ వనరులను కాపాడినందుకే మనకు ఈ వనరులు అందుబాటులో ఉన్నాయి. మన భవిష్యత్ తరాలకోసం కూడా ఇదే వారసత్వాన్ని మనం కొనసాగించాలి. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా, అంతకన్నా ఎక్కువగానే పర్యావరణంపై భారత్ పనిచేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కలసిమెలసి ప్రపంచానికి పెనుసవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరులో భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేయనున్నాయని ప్రధాని వెల్లడించారు. ఫ్రాన్స్‌కు ఉగ్ర సమస్య ఎక్కువగా ఉందని.. అందుకే వారికి కూడా ఉగ్రవాదం వల్ల కలిగే బాధేంటో బాగా తెలుసన్నారు. ప్రపంచమంతా ఉగ్ర పోరాటంలో ఒకేతాటిపైకి రావాల్సిన అవసరముందని మోదీ తెలిపారు. భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య బలమైన మిత్రత్వం కారణంగా ఇరుదేశాలు చాలాకాలంగా కలిసిపనిచేస్తున్నాయని.. ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలపైనా సంయుక్తంగా ముందుకెళ్తున్నాయని ప్రధాని వెల్లడించారు. ‘అది వాణిజ్యమైనా, సాంకేతిక, సృజనాత్మకత, పెట్టుబడులు, శక్తి, విద్య ఇలా అన్ని రంగాల్లో భారత్–ఫ్రాన్స్ బంధాలు మరింత బలోపేతం కావాలని.. మేం భావిస్తున్నాం’ అని మోదీ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేయటంపైనా ఇరువురు అధినేతలు ఆసక్తి కనబరిచారు. భారత పర్యటనకు రావాలని మేక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. ఏడాది చివర్లో ఈ పర్యటన జరగనున్నట్లు తెలిసింది. అదే సమయంలో ప్రపంచ సోలార్ కూటమి సమావేశాలను ఇరుదేశాలు నిర్వహించనున్నాయి. కాగా, ప్రపంచయుద్ధాల సందర్భంగా ఫ్రాన్స్ స్వాతంత్య్ర పోరాటంలో సహకరించి ప్రాణత్యాగం చేసిన భారత సైనికులకు మేక్రాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మోదీ, మేక్రాన్ కలిసి ఆర్క్ డి ట్రయంఫే స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు. అంతకుముందు ప్రధాని మోదీని మేక్రాన్ ఆలింగనం చేసుకుని రాజప్రాసాదంలోకి స్వాగతం పలికారు. అంతకుముందు ఇరువురు నేతలు ప్రత్యేక భేటీలో పలు అంశాలపై చర్చించారు. నాలుగుదేశాల పర్యటన ముగించుకుని మోదీ భారత్‌కు తిరుగుప్రయాణమయ్యారు.