Implementation of guarantees
-
12న అసెంబ్లీలో బడ్జెట్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ఈనెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సచివాలయానికి చేరింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాల అమలును ప్రతిబింబించేలా బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నాలుగు నెలలకు అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. కాగా, ఈనెల 11న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. -
కాపులను మోసగిస్తున్న బాబు
♦ మాజీ మంత్రి ముద్రగడ ♦ హామీల అమలుకు ఈ నెల 10 సాయంత్రం వరకూ గడువు ♦ లేదంటే 11 నుంచి నిరాహార దీక్ష ♦ ఉద్యమం వెనుక జగన్ లేరు ♦ ఉన్నారని నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా ♦ లేదంటే బాబు తప్పుకుంటారా? సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు కాపుజాతిని మోసగిస్తున్నారని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తన నిరాహార దీక్ష విరమణ సందర్భంగా టీడీపీ నాయకులు ఇచ్చిన హామీల అమలుకు ఈ నెల 10 సాయంత్రం వరకూ గడువు ఇచ్చారు. అప్పటికీ స్పందించకుంటే ఈ నెల 11 నుంచి కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతానని స్పష్టం చేశారు. తన ఉద్యమం వెనుక వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారనే టీడీపీ నాయకుల ఆరోపణలను ఖండించారు. అది నిరూపిస్తే ఉద్యమం నుంచే కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు జాతులను బీసీల్లో చేర్చేందుకు ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వడంతో తాను జాతి కోసం పోరాటం సాగిస్తున్నానని పునరుద్ఘాటించారు. కాపు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబుకు ఆ వాగ్దానాలు, ఆ హామీలు గుర్తు చేస్తూ ఉత్తరం రాశానన్నారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని, సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చే హామీలను నెరవే రుస్తామని ఆగస్టు 15న విశాఖలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. హామీల అమలుపై చంద్రబాబు ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన చేయకపోగా రకరకాల అసత్య ప్రచారాలను సాగించారని, కాపు రుణమేళా పేరుతో ఏలూరులో జరిగిన కార్యక్రమానికి ముందు ఒక వ్యక్తితో అనరాని మాటలు అనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను విస్మరించడంపై తాను ప్రశ్నిస్తుంటే.. కాపు కులస్తులతో తనపై చంద్రబాబు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన భార్యాభర్తలను కూడా విడ దీసే ఘనుడని ముద్రగడ వ్యాఖ్యానించారు. తన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు, తన ఇంటికి వచ్చే వారి సమాచారం అంతా చంద్రబాబు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమం వెనుక జగన్ లేరు.. ఉద్యమం వెనుక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేరని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌తో తాను ఎన్నిసార్లు మాట్లాడానో చంద్రబాబు నిరూపించాలని ముద్రగడ సవాలు విసిరారు. నిరూపిస్తే ఉద్యమం నుంచే కాకుండా తన కుటుంబం సహా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. రాజధానికోసం చంద్రబాబే భయపెట్టి రైతుల భూములు లాక్కొన్నారని ఆరోపించారు. -
తమ్ముళ్లకే జీర్ణం కాని బాబు’ మారుమాట
(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న...ఓడ ఎక్కేశాక బోడి మల్లన్న’ అనే సామెత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో వాస్తవమని మరోసారి తేలిపోయింది. గద్దెనెక్కేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అసాధ్యమని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జన్మభూమి-మా ఊరు గ్రామసభ సాక్షిగా బాబు తేల్చి చెప్పడం ఈ వారం జిల్లాలో చర్చనీయాంశమైంది. అధికారం కోసం ఎడాపెడా హామీలు ఇచ్చేయడం, అమలుకు వచ్చేసరికి చేతులెత్తేయడం ‘బాబు’కు కొత్తేమీ కాదంటూ జిల్లావాసులు అంటున్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చిన బాబు ఏడాది పాలన ముగిసేసరికి వాటన్నింటి అమలు కష్టమనడం, అవన్నీ సమైక్యరాష్ట్రంలో ఇచ్చానని అడ్డంగా బొంకేయడం చివరికి ఆయన పార్టీ వారికే ఒకపట్టాన జీర్ణం కావడం లేదు. ఒకపక్క ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి కటకటాలపాలై పార్టీ ప్రతిష్ట మసకబారగా, ఇచ్చిన హామీలపై బాబు జిల్లాలో మారు మాట్లాడటం ఈ వారం ప్రత్యేకతగా నిలిచింది. ఇచ్చిన హామీలు అమలుచేయని చంద్రబాబు సర్కార్‌పై ైవె ఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమరదీక్షకు పెద్దఎత్తున తరలివెళ్లడం ఆ పార్టీపైన, ప్రభుత్వంపైన పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న రైతన్న ‘ఈ వేసవి హాట్ గురూ’ అంటూ జనానికి నరకం చూపించిన ఎండలు వారం చివర్లో తోకముడిచారుు. గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన జిల్లాలో వడదెబ్బకు ప్రతి రోజు పదుల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. నైరుతి ఆగమనసూచకంగా శుక్రవారం ఒక మోస్తరు వర్షాలు కురిశా. శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షం ఒక్కసారిగా జిల్లావాసులను సేదతీర్చింది. గత ఏడాది అధికవర్షాలతో ఖరీఫ్ సీజన్‌ను జిల్లారైతులు నష్టపోయారు, ఈ ఏడాదైనా కలిసిరావాలని గంపెడాశతో సాగు సన్నాహకాల్లో నిమగ్నమయ్యారు. మోగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నగారా జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా ఈ వారం మోగింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంను బరిలోకి దింపింది. చంద్రబాబు ఇచ్చిన హామీలో భాగంగా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశాన్ని సుబ్రహ్మణ్యంకు దక్కకుండా చేసి కోట్ల ఖర్చుతో కూడుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి అభ్యర్థిగా ప్రకటించిందనే విమర్శ పార్టీలో బీసీల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్ల తుది జాబితాను శనివారం విడుదల చేశారు. టీడీపీ అభ్యర్థిని ప్రకటించగా మిగిలిన పార్టీల పోటీపై స్పష్టత రావాల్సి ఉంది. రంపచోడవరం వద్ద గురువారం సంభవించిన ప్రమాదం సూరంపాలెం గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. పెళ్లి వ్యాన్ బోల్తాపడ్డ సంఘటనలో గంగవరం మండలం సూరంపాలెంకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యూరు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడమే గిరిజనులకు శాపమైంది. ఒక వ్యాన్‌లో 90 మందికి పైబడి ఎలా ఎక్కించుకు వెళుతున్నారనే ప్రశ్నకు రవాణా శాఖాధికారులే సమాధానం చెప్పాలి. నిబంధనల అమలులో అలసత్వం గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడటం తప్ప మరొకటి కాదని చెప్పొచ్చు. రోడ్ కం రైలు వంతెనపై రెండు నెలలు నిలిచినన రాకపోకలను శుక్రవారం పునరుద్ధరించడంతో గోదావరి జిల్లాల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రి-కొవ్వూరుల మధ్య ప్రయూణికులు ఇన్నాళ్లూ లాంచీలపై లేదా ధవళేశ్వరం బ్యారేజి మీదుగా, అధికారికంగా రాకపోకలు ప్రారంభం కాని కొత్త వంతెన మీదుగా ప్రయూణించి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇచ్చిన హామీలపై చంద్రబాబు మాట మార్చిన వైనంపై జిల్లా నుంచి వారం చివర్లో శనివారం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై రణభేరిని మోగించింది. రాజమండ్రి సుబ్రహ్మణ్యమైదానం కేంద్రంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సమరశంఖం పూరించారు. దీంతో.. విభజన పాపాన్ని మూటగట్టుకుని అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పునర్జీవనానికి రాజకీయాల్లో సెంటిమెంట్ జిల్లాగా పరిగణించే ‘తూర్పు’ నుంచి శ్రీకారం చుట్టినట్టయ్యింది. రణభేరి ఆ పార్టీకి ఎంత వరకు కలిసివస్తుందో వేచి చూడాల్సిందే. -
హామీలను అమలు చేయండి
♦ 27 హామీలకు మూడే అమలు ♦ 19 కోర్టు పెండింగ్‌లో ఉన్నాయి ♦ చిత్తశుద్ధితో కృషి చేయండి ♦ శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ చిత్తూరు (సెంట్రల్) : ప్రజావసరాల నిమిత్తం శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ పి.వెంకటేష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాకు సంబంధించి శాసనసభలో ఇచ్చిన హామీల అమలుపై వివిధ శాఖల అధికారులతో కమిటీ సమీక్షించింది. ఈ సమీక్షలో చైర్మన్‌తో పాటు సభ్యులు పి.రమేష్‌బాబు, జోగేశ్వరరావు, పి.గోవిందసత్యనారాయణ, చింతలరామచంద్రారెడ్డి పాల్గొనగా, కమిటీ సహాయక కార్యదర్శి రాజ్‌కుమార్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, తుడా వీసీ వినయ్‌చంద్, డీఆర్వో విజయచందర్ హాజరయ్యారు. సమావేశనంతరం చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి 26 హామీల అంశాలు రాగా, మూడు మాత్రమే పూర్తి చేశారన్నారు. మరో నాలుగు అంశాలను టీటీడీలో సమీక్షించనున్నామని, మిగిలిన 19 అంశాలు ఎక్కువగా భాగం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమీక్షలో వచ్చిన వాటిలో ప్రధానంగా సాగు, తాగునీరు, రోడ్ల నిర్మాణాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సదుపాయాల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యాలు, వాగులు, వంకల మరమ్మతులు వంటి వాటిని సమగ్రంగా సమీక్షించినట్లు చెప్పారు. ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రతివారం ముఖ్య కార్యదర్శులతో చర్చించి, అవసరమైన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న హామీలను అవసరం మేరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే కార్యచరణను అధికారులు రూపొందించారని కమిటీకి వివరించారు. కోర్టుకు సంబంధంలేని అంశాలు సంబంధిత శాఖల కార్యదర్శులు తీసుకెళ్ళి పరిష్కరిస్తామని కమిటీకి తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.