Import Taxes
-
పన్నుకు పన్ను ట్రంప్ ప్రతిపాదనలపై మెక్సికో!
మెక్సికో: మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికకు ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే మెక్సికో కూడా సుంకాలతో బదులిస్తుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాలు, వలసదారుల ప్రవాహాన్ని ఆపకపోతే మెక్సికో వస్తువులపై 25% దిగుమతి సుంకాలు తప్పవని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను క్లాడియా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా నుంచి అక్రమంగా ప్రవాహంలా వచ్చిపడుతున్న ఆయుధాలతో మెక్సికో బాధపడుతోందన్నారు. ఇక మాదకద్రవ్యాలు అమెరికా సొంత సమస్యేనన్నారు. వలస సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. సమస్యలపై చర్చలకు సిద్ధమన్నారు. వలసదారుల కారవాన్లు ఇకపై సరిహద్దుకు చేరవని స్పష్టం చేశారు. ఆయుధాలపై పెట్టే ఖర్చును వలస సమస్యను పరిష్కారానికి వెచ్చిస్తే మంచిదని అమెరికాకు హితవు పలికారు. యుద్ధానికి ఖర్చు చేసే మొత్తంలో కొంత శాంతి, అభివృద్ధిపై కేటాయిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అమెరికా, మెక్సికో పలు అంశాల్లో పరస్పరం ఆధారపడతాయి. భారీ పన్నులు ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కారణమవుతాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, శాంతి సాధనకు చర్చలే మార్గం’’అన్నారు. అవి త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వంట నూనెల ధరలు తగ్గుముఖం... హోల్‌సేల్ మార్కెట్లో రేట్లు ఇలా..
గత ఏడాది కాలంగా సలసల మండిపోతున్న వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సుంకాలు తగ్గించడంతో హోల్‌సేల్ మార్కెట్లో వివిధ రకాల వంటనూనెల ధరలు కొద్ది మేరకు తగ్గాయి. ఈ మేరకు వివిధ నూనెలకు సంబంధించి ధరల తగ్గింపు వివరాలను కేంద్రం వెల్లడించింది. హోల్‌సేల్ మార్కెట్లో వివిధ వంట నూనెల ధరల తగ్గింపు వివరాలు ఇలా ఉన్నాయి.. - హోల్‌సేల్ మార్కెట్లో పామ్ ఆయిల్ ధరలు 2.5 శాతం తగ్గాయి. గత వారం టన్ను పామాయిల్ ధర రూ. 12,666 ఉండగా ప్రస్తుతం రూ. 12,349కి చేరుకుంది. - సీసమ్ ఆయిల్ 2.08 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 23,500లకు చేరుకుంది - కొబ్బరి నూనె ధరలు 1.72 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 17,100లుగా ఉంది - సన్‌ఫ్లవర్ నూనె ధరలు 1.30 శాతం తగ్గి టన్ను ధర రూ. 15,965లకు చేరుకుంది. అంతకు ముందు ఈ ధర రూ.16,176 - పల్లి నూనె ధరలు 1.28 శాతం తగ్గి హోల్ సేల్ మార్కెట్లో టన్ను నూనె ధర 16,839గా ట్రేడ్ అవుతోంది - వనస్పతి నూనె ధరలు 1 శాతం తగ్గి రూ. 12,508కి చేరుకుంది. - ఆవాల నూనె ధరలు సైతం 1 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 16,573 వద్ద ట్రేడవుతోంది. గతేడాది కంటే.. వంట నూనె ధరల్లో తగ్గుదల నమోదైనా గతేడాది ఇదే సమయానికి నమోదైన ధరలతో పోల్చితే ఇంకా అధికంగానే ఉన్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో నూనె ధరల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలంటూ వ్యాపారులను కేంద్రం ఆదేశించింది. చదవండి : వంట నూనె : పదకొండేళ్ల తర్వాత.. -
టెస్లా ఈవీ బండ్లకు భారత్ రైట్.. రైట్!
Tesla EV In India: భారత్‌లో తమ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేయాలన్న టెస్లా ప్రయత్నాలకు లైన్ క్లియర్ అవుతోందా?. దిగుమతి సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదన్న కేంద్ర ప్రభుత్వం.. నెమ్మదిగా దిగొస్తోందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. తమ ఈవీలను భారత్‌లోకి తక్కువ దిగుమతి సుంకాలతో అనుమతిస్తే.. ఆపై తయారీ యూనిట్లపై దృష్టిపెడతామని అమెరికన్ వెహికిల్స్ కంపెనీ టెస్లా భారత ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబోమని భారత్ కరాకండిగా చెప్పేసింది. అయినప్పటికీ ఆగష్టు మొదటి వారంలో టెస్లా.. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కొంచెం తగ్గినట్లు సమాచారం. టెస్లాకు సంబంధించి స్థానిక యూనిట్ల సేకరణ, తయారీ యూనిట్ల ప్రణాళికను పూర్తిస్థాయి వివరాలను తమకు అందిస్తే దిగుమతి సుంకం తగ్గింపుపై ఆలోచన చేస్తామని టెస్లాకు కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టెస్లాతో జరిపిన సంప్రదింపులు.. కీలక ప్రతిపాదన గురించి ఓ ప్రముఖ బిజినెస్ బ్లాగ్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే భారత్‌లో ఈవీ అమ్మకాల ప్రయత్నంలో భాగంగా.. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో రీజినల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కానీ, అధిక దిగుమతి సుంకాలు తమ ప్రవేశానికి ఆటంకంగా పరిణమించాయని ఎలన్ మస్క్ ఆమధ్య ఓ ట్వీట్ చేశాడు. ఆపై జులై చివర్లో కేంద్రానికి ఒక విజ్ఞప్తి లేఖ కూడా రాశాడు. కానీ, కేంద్రం తగ్గలేదు. చదవండి: ఎలన్ మస్క్.. ఈసారి ఆకాశమే హద్దు! కానీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భారత్‌లో టెస్లా భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి పూర్థి స్థాయి వివరాలు అందిస్తేనే.. కంప్లీట్ బిల్డ్ యూనిట్ కార్ మోడల్స్‌పై దిగుమతి సుంకంపై పునరాలోచన చేస్తామని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుమారు 30 లక్షల విలువ కంటే వాహనాలపై 60 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే వంద శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది భారత ప్రభుత్వం. దీంతో రీజనబుల్ ధరలతో టెస్లా భారత్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టెస్లా మెయిన్ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర 40000 డాలర్ల కంటే తక్కువగా ఉంది. -
టెస్లా పాటే పాడుతున్న ఫోక్స్‌వ్యాగన్
దిగుమతి సుంకం తగ్గించాలంటూ విదేశీ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి విషయంలో ప్రస్తుతం ఉన్న పన్నులను పరిశీలించాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలపై ఇప్పటికే టెస్లా, హ్యుందాయ్‌లు తమ అభిప్రాయం చెప్పగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్‌లు వాటికి వంత పాడాయి. పన్ను తగ్గించండి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్ను తగ్గించాలంటూ ఫోక్స్‌వ్యాగన్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై వంద శాతం పన్నును ప్రభుత్వం విధిస్తోంది. దీంతో విదేశీ కార్లు ఇండియా మార్కెట్లోకి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఫోక్స్ వ్యాగన్ కోరింది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా హెడ్ గుర్ప్రతాప్ బొపారియా మాట్లాడుతూ ‘ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్థానిక ఆటో ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఇప్పుడున్న పన్నులను 100 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా.. ఇండియన్ ఆటోమోబైల్ ఇండస్ట్రీకిపై పెద్దగా ప్రభావం ఉందని ఆయన రాయిటర్స్ వార్త సంస్థతో అన్నారు. మినహాయింపు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం ఫోక్స్ వ్యాగన్ పోటీ పడుతోంది. దీంతో ఆ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఆడీ ఈ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ కారుని ఇండియాలో లాంఛ్ చేసింది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు ఆశించినంతగా లేవు. దిగుమతి సుంకం తగ్గిస్తే ఫోక్స్‌వ్యాగన్, స్కోడా బ్రాండ్ల కింద పలు ఈవీ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. క్లారిటీ లేదు ఫారిన్ బ్రాండ్ల కార్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్‌వ్యాగన్‌ల విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. దీంతో మిగిలిన కార్లకు మినహాయింపు ఇవ్వకున్నా ఈవీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 100 శాతం పన్నుని 40 శాతానికి తగ్గించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇండియాలో కార్ల తయారీ యూనిట్ పెట్టాలని విదేశీ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే విదేశీ కంపెనీల విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు. స్వదేశీపై ప్రభావం ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి రూ. 40 లక్షలకు పైబడి ధర ఉన్న అన్ని లగ్జరీ కార్లపై వంద శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ ఈవీ కార్ల ధరలన్నీ కూడా రూ. 40 లక్షలకు పైగానే ఉన్నాయి. దీంతో వీటిపై వందశాతం పన్ను వసూలు అవుతోంది. దీంతో పన్ను తగ్గించాలంటూ విదేశీ కార్ల కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దిగుమతి పన్ను శాతాన్ని తగ్గిస్తే దేశీ ఈవీ కార్ల తయారీ కంపెనీలకు నష్టం జరుగుతందని టాటా మోటార్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేవనే సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పన్ను తగ్గింపు అంశంపై మారుతి, మహీంద్రాలు ఇంకా స్పందించలేదు. -
టెస్లాకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్
ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గిస్తే టెస్లా ఎస్ ప్లెయిడ్ కార్లను భారత్‌కు తీసుకువస్తామంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. భారత ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వంలో ఉన్నతాధికారి చేసిన చేసిన ప్రకటన ఎలన్‌మస్క్‌ని ఇరుకున పడేలా చేసింది. దీనికి ఓకేనా తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పుతామని ప్రకటిస్తే అది సాధ్యం’ అంటూ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. అంతేకాదు ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని ఆ అధికారి చెప్పినట్టు ఈటీ వివరించింది. టెస్లా బేరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి 40 వేల డాలర్లు లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది. ప్రస్తుతం టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర మన కరెన్సీలో కోటి రూపాయలలకు పైగానేగా ఉంది. దిగుమతి సుంకం కలిపితే ఈ కారు ధర రెండు కోట్లు దాటుతుంది. దీంతో పన్ను మినహాయింపు కోరుతోంది టెస్లా కంపెనీ. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ, చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. ఇండియాలో కార్ల తయారీ పరిశ్రమ పెడతామంటే పన్ను మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇండియా ఇచ్చింది. దీంతో బాల్ ఎలన్ మస్క్ కోర్టులో పడినట్టయ్యింది. భారత ప్రభుత్వం వదిలిన ఫీలర్కి ఎలన్‌మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.