to increase
-
ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి : డీవీఈఓ
ధర్మవరం టౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు డీవీఈఓ చంద్రశేఖర్‌రావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. బోధన, సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాతల సహకారంతో అందిస్తున్న ‘మధ్యాహ్న భోజనం’ అమలు తీరును పరిశీలించారు. విద్యార్థినులకు ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తీర్ణత శాతం పెంపునకు అన్ని చర్యలూ చేపట్టామన్నారు. జిల్లాలో మొత్తం 11 కళాశాలల్లో అదనపు తరగతి గదుల అవసరం ఉందన్నారు. ఇందుకు గానూ రూ.17 కోట్లు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. -
ఉద్యోగులను పెంచాలని వినతి
ఖమ్మం సహకారనగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా భూ కొలతలు, ల్యాండ్ రికార్డుల శాఖలో సిబ్బందిని పెంచాలని కోరుతూ జేసీ దివ్యకు టీఎన్జీఓస్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉద్యోగుల సంఘం నేతలు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు అఫ్జల్‌హసన్, జగదీష్ మాట్లాడారు. జిల్లాల పునర్విభజన సమయంలో తామంతా పూర్తి మద్దతు నిస్తున్నామని, ప్రస్తుతం తమ శాఖలో ఉన్న సిబ్బందితో ప్రభుత్వ కార్యక్రమాల అమలుతోపాటు భూ హద్దులు, తగాదాలను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలు పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరని, త్వరలో తమ శాఖకు సిబ్బందిని పెంచాలని కోరారు. కార్యక్రమంలో శాంతకుమారి, ఉపేందర్, సుధాకర్, సత్యేంద్రకుమార్ పాల్గొన్నారు -
పోరాటాల ఫలితంగానే కూలి పెంపు
ఖిలావరంగల్ : చేనేత సమస్యలపై అఖి ల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం శివనగర్ తమ్మెర భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. చేనేత కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా చేనేత కార్మిక సహకార సొసైటీ(టెస్కో) 20 నుంచి 27 శాతానికి కూలి రేట్లు పెంచిందన్నారు. మీటరు నేత కు రూ.3 50 పైసలు, టెరికాటన్ షూటింగ్ క్లాత్, షర్టింగ్, లంగా, పాలిస్టర్ బ్లౌజ్, ఓణీ క్లాత్ నేతకు రూ.4. 50 పైసలు పెరిగాయ ని తెలిపారు. జౌళిశాఖ నుంచి చేనేతను విడదీసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే కార్మికులు పో రాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో గోరంట్ల శరత్‌బాబు, చె రుకు వెంకట్రాం నర్సయ్య, గుల్లపెల్లి సాం బమూర్తి, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.