Increased security
-
గుడ్‌ఫ్రైడేకి చర్చిల వద్ద భద్రత పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : కొంత కాలంగా నగరంలోని చర్చిలపై జరుగుతోన్న దాడులను దృష్టిలో ఉంచుకుని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలకు చర్చిల వద్ద ఢిల్లీ పోలీసులు విస్త్రతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రోజున చర్చిల వద్ద 10 వేల మందికి పైగా సిబ్బందితో నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి చర్చి బయట సాయుధ గార్డులను మొహరించనున్నట్లు చెప్పారు. సవివరంగా మ్యాపింగ్ జరిపి సిబ్బందిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తమ పరిధిలో ఉన్న చర్చిల జాబితాతో పాటు వాటికి సంబంధించిన వివరాలను అందించాలని స్టేషన్ హౌజ్ ఆఫీసర్స్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. చర్చిల బయట మొహరించిన సిబ్బందిని జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించవలసిందిగా అధికారులు ఆదేశించారు. ఆకతాయిచేష్టలకు పాల్పడే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవలని చెప్పారు. గుడ్‌ఫ్రైడే రోజున పెట్రోలింగ్ వీలైనంత ఎక్కువగా నిర్వహించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు. గుడ్‌ఫ్రైడే రోజున ట్రాఫిక్ సజావుగా సాగడం కోసం అన్ని ముఖ్యమైన కూడళ్ల వద్ద తగాన ఏర్పాట్లు చేయవలసిందిగా ట్రాఫిక్ పోలీసులను కోరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సీసీటీవీలు లేని చర్చిలకు అదనపు భద్రత కల్పిస్తారు. అన్ని చర్చిలకు ఒక కి.మీ దూరంలో చుట్టూరా బారికేడ్లను అమరుస్తారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయడం కోసం ఈ బారికేడ్ల వద్ద ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుల్స్‌ని మొహరిస్తారు. -
సీఎంకు భద్రత పెంపు
సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం నివాసానికి భద్రతను పెంచారు. గ్రీన్ వేస్ రోడ్డును భద్రతా వలయంలోకి తెచ్చారు. సీఎం భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో సీఎంగా ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. భారంగానే ఆ బాధ్యతల్ని చేపట్టిన ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రి చాంబర్లోకి అడుగు పెట్టలేదు. తమ అమ్మ జయలలిత మళ్లీ సీఎం అవుతారన్న కాంక్షతో పూజాధికార్యక్రమాల్ని ఓ వైపు నిర్వర్తిస్తూనే, మరో వైపు ఆమె అడుగు జాడల్లో, సూచనలు, సలహాలతో ప్రభుత్వాన్ని ముందుకు సాగించే పనిలో పడ్డారు. అదే సమయంలో సీఎంగా తనకు దక్కే అన్ని రకాల సౌకర్యాలను పన్నీరు నిరాకరించారు. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తికి జడ్ కేటగిరి భద్రత ఉంటుంది. అయితే, తనకు ఎలాంటి భద్రత వద్దని తిరస్కరించారు. సీఎంకు కల్పించే కాన్వాయ్ సంఖ్యను, హడావుడిని తగ్గించేశారు. మంత్రిగా ఉన్న సమయంలో తనకు కేటాయించిన సౌకర్యాలు, భద్రతనే ఆయన కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా సీఎం ఇంటిని టార్గెట్ చేసి ముట్టడి కార్యక్రమాలు సాగించే పనిలో కొన్ని సంఘాలు పడ్డాయి. అయితే, శనివారం చోటు చేసుకున్న హఠాత్పరిణామంతో తప్పని సరిగా సీఎంకు భద్రతను పెంచాల్సిందేనన్న నిర్ణయానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం వచ్చింది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నివాసం గ్రీన్ వేస్ రోడ్డులో ఉంది. ఈ రోడ్డులో పన్నీరు సూచన మేరకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్ట లేదు. ఆయన నివాసం వద్ద మాత్రం మంత్రికి కల్పించే భద్రతా సిబ్బంది మాత్రం ఉంటూ వచ్చారు. తాజాగా ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించడం, పిట్ట గోడను దూకి లోనికి వెళ్లేందుకు యత్నించడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసు యంత్రాం గం తీవ్రంగా పరిగణించింది. సీఎం పన్నీరు సెల్వం తిరస్కరించినా సరే, ఆయనకు భద్రతను పెంచాల్సిందేనన్న నిర్ణయానికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. ఆమ్ ఆద్మీ ముట్టడికి భద్రతా ైవె ఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిం చడంతో విచారణకు ప్రత్యేక బృందం సైతం రంగంలోకి దిగింది. ఈ బృందం పరిశీలనతో సీఎం ఇంటి పరిసరాల్లోని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటయ్యాయి. ఆయా మార్గల్లో భద్రతా సిబ్బంది నియమించారు. అనుమానిత వాహనాలను తనిఖీ నిమిత్తం వారికి ఆదేశాలు సైతం ఇచ్చారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఆయన ఇంటి వద్ద పదుల సంఖ్యలో భద్రతా సిబ్బందిని విధులకు నియమించారు. సీఎం పన్నీరు సెల్వంకు భద్రతను పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఆమ్ ఆద్మీ ముట్టడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించడంతో, ఆ ఘటన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపై బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు గుసగుసలాడటం కొసమెరుపు. -
గుర్గావ్లోని రెండు హోటళ్లకు భద్రత పెంపు
గుర్గావ్: ఈ నెల 26వ తేదీన దేశ రాజధానిలో జరుగనున్న గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సిబ్బంది విడిది చేయనున్న రెండు హోటళ్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు బుధవారం పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్ తెలిపారు. ప్రతి హోటల్ వద్ద 200 మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. వీరు యూనిఫాంలో ఉన్నవారే కాక మఫ్టీలోనూ విధులు నిర్వహించనున్నారని, వారికి అధునాతన ఏకే-47, ఏకే-56 రైఫిళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. రెండు హోటళ్లలో సుమారు 150 రూములను ఒబామా సిబ్బంది కోసం బుక్ చేసినట్లు తెలిపారు. మౌర్యా హోటల్ చెఫ్‌లకు సెలవులు రద్దు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడు రోజుల పాటు బసచేయనున్న మౌర్యా హోటల్ చెఫ్‌లకు సెలవులు రద్దు చేశారు. ఆ మూడు రోజులూ చెఫ్‌లందరూ హోటల్లోనే అందుబాటులో ఉండాలని యాజమాన్యం పేర్కొంది. ఈ హోటల్లో సుమారు 50 మంది చెఫ్‌లు వివిధ వంటకాల్లో నిష్ణాతులు. ఒబామా 25వ తేదీనుంచి 27వ తేదీవరకు ఈ హోటల్లో సతీసమేతంగా బసచేయనున్న సంగతి తెలిసిందే. అలాగే హోటల్లో ఒబామా కుటుంబానికి అందజేసే మంచినీరు, ఆహారాన్ని మూడంచెల తనిఖీ చేస్తారు. ఢిల్లీ పోలీసులతోపాటు యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఇందులో పాలుపంచుకుంటారు. ఈ ప్రక్రియను అమెరికా అధ్యక్షుడికి అందజే సేందుకు 15 నిమిషాల ముందు చేపడతారు. -
బ్లాక్‌డే అలర్ట్
* నిఘా కట్టుదిట్టం * రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు * అటు బాబ్రీ కోసం.. ఇటు రామాలయం కోసం.. * పోటాపోటీనిరసనలకు పిలుపు సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేత దినం బ్లాక్ డేని పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుది ట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘాను మూడింతలు పెంచారు. కాగా బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం కోసం హిందూ సంఘాలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు డిసెంబర్ ఆరవ తేదీని బ్లాక్ డేగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఈ రోజు వస్తున్నదంటే చాలు టెన్షన్ తప్పదు. భద్రతను కట్టుదిట్టం చేస్తారు. తనిఖీలు ముమ్మరం చేస్తారు. ఆ రోజు గడిస్తే చాలు పోలీసులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అయితే, ఈ ఏడాది మునుపెన్నడూలేని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు కారణంగా రాష్ట్రంలో ఇటీవల కాలంగా వెలుగు చూస్తున్న సంఘ విద్రోహ శక్తుల కదలికలే. కేంద్రం నుంచి వస్తున్న హెచ్చరికలు, తాజా పరిణామాలు వెరసి రాష్ట్రంలో ఏవైనా విధ్వంసాలకు వ్యూహ రచన జరిగిందా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. తనిఖీలు ముమ్మరం శనివారం బాబ్రీ డే కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను పెంచారు. ప్రతి ప్రయాణికుడ్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ పోలీసు, సాయుధ రిజర్వు పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో, అన్ని నగరాల్లోని రోడ్లలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, వినోద కేంద్రాల్లో, మాల్స్‌లలో, సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో, కోయంబేడు బస్టాండులో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నారు. రైళ్లల్లో, బస్సులలో పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నిరసనలు : ప్రతి ఏటా బ్లాక్ డే రోజున మైనారిటీ సంఘాలు నిరసనలు చేపట్టడం పరిపాటే. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం నినాదంతో, శాంతి స్థాపన పిలుపుతో ఆయా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. అయితే, ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయాలంటూ కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఇందుకు కోర్టు నిరాకరించింది. దీంతో తమ దైన శైలిలో నిరసనలకు మైనారిటీ సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక, తాము సైతం అంటూ రామాలయం నిర్మాణం పిలుపుతో నిరసనలకు హిందూ సంఘాలు పిలుపు నిచ్చాయి. తాంబరం, పల్లావరం తదితర ప్రాంతాల్లో పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
మహాలక్ష్మి మందిరానికి భద్రత పెంపు
సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ మహాలక్ష్మీ ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ మందిరానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు.వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ఆలయ నిర్వాహకులు పూర్తిచేశారు. ఇప్పటికే ఈ మందిరం ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉండడంవల్ల నగర పోలీసు శాఖ బందోబస్తు మరింత పటిష్టం చేసింది. సాధారణ రోజుల్లో ఈ మందిరం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంఖ్య పది రెట్లకుపైనే ఉంటుంది. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా మందిరం, ఆలయ పరిసరాల్లో దృష్టి సారించేందుకు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచారు. బందోబస్తులో భాగంగా 1,200 మంది పోలీసులు, హోం గార్డులు, భద్రతాదళాలు, వివిధ స్వయంసేవా సంస్థలకు చెందిన కార్యకర్తలను నియమించనున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మందిరానికి రంగులు వేయడంతోపాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రత్యేక పూజలు, అర్చన, హోం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. అయితే మందిరానికి వచ్చే భక్తులు తమ వెంట పూజా సామగ్రి మినహా బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తీసుకురావద్దని ఆలయ యాజమాన్యం వి/ప్తి చేసింది. భక్తులు క్యూలో నిలబడేందుకు క్యాడ్బరి జంక్షన్ వరకు మండపం ఏర్పాటు చేశారు. అందులో తాగునీరు, పాదరక్షలు ఉచితంగా భద్రపర్చుకునేందుకు రెండు స్టాండ్లు అందుబాటులో ఉంచారు. మందిరం ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, వ్యక్తులు కనిపించినా వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, హోం గార్డుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. భక్తులకు మార్గదర్శనం చేసేందుకు మందిరం బయట భులాభాయి దేశాయి రోడ్డుపై ప్రత్యేకంగా ఒక మండపం ఏర్పాటు చేశారు. అందులో విధులు నిర్వహించే సిబ్బంది మహాలక్ష్మి రైల్వే స్టేషన్‌కు ఎలా వెళ్లాలి...? బెస్ట్ బస్టాపులు ఎక్కడున్నాయి...? దర్శనానికి ఎక్కడి నుంచి క్యూ కట్టాలి...? తదితర అంశాలపై భక్తులకు మార్గదర్శనం చేస్తారు. -
భద్రత పెంపు
న్యూఢిల్లీ: నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం చెన్నైలో వరుస రెండు బాంబు పేలుళ్లు జరగడంతో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, రద్దీ మార్కెట్లు, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మొహరించారు. వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని సోదా చేశారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని విచారించారు. ఒకవైపు మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా భద్రతపైనే పోలీసులు ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో మైక్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే పోలీసులకు తెలపాలని జాగృతం చేసే ప్రయత్నం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను రెండింతలు చేశామని ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి రాజన్ భగత్ గురువారం విలేకరులకు తెలిపారు. ఇది రెడ్ అలర్ట్ పరిస్థితి కాదన్నారు. నిఘావర్గాల నుంచి ఏదైనా ప్రత్యేక హెచ్చరికలు వస్తే రెడ్ అలర్ట్ ప్రకటిస్తామని, ఇప్పడు అలాంటిదేమీ లేదన్నారు. చెన్నై రైల్వే స్టేషన్లో బెంగళూరు-గౌహతి రైలు రెండు కోచ్‌ల్లో వెంటవెంటనే పేలుళ్లు జరగడంతో ఒక మహిళ మృతి చెందగా, 14 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మెట్రోకు బాంబు బెదిరింపు మెట్రో రైలులో బాంబు ఉందని గురువారం వచ్చిన బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ‘అప్పటికే చెన్నైలో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. మెట్రో రైలులో బాంబు ఉందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఢిల్లీ మెట్రో కంట్రోల్ రూమ్‌కు ఉదయం 10.15 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేశామ’ని కేంద్ర పారాశ్రామిక భద్రత దళం(సీఐఎస్ఎఫ్) అధికార ప్రతినిధి హేమేంద్ర సింగ్ గురువారం విలేకరులకు తెలిపారు. వివిధ మెట్రో స్టేషన్లు, రైళ్లలో సోదాలు చేశామని, అయితే చివరికది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తెలిసిందన్నారు. చెన్నైలో బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే అన్ని మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఇందర్‌లోక్-రితాలా మార్గంలో ఉదయం 11 గంటలకు రైళ్ల సేవలకు స్వల్ప అంతరాయం కలిగిందని, అయితే అది సిగ్నల్ సమస్య వల్లే జరిగిందని చెప్పారు. బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను ఢిల్లీ పోలీసులకు ఇచ్చామని తెలిపారు. ఆ నంబర్ ఎవరిదా అని తెలసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ భాటియా వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేస్తామన్నారు.