గుర్గావ్: ఈ నెల 26వ తేదీన దేశ రాజధానిలో జరుగనున్న గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సిబ్బంది విడిది చేయనున్న రెండు హోటళ్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు బుధవారం పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్ తెలిపారు. ప్రతి హోటల్ వద్ద 200 మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. వీరు యూనిఫాంలో ఉన్నవారే కాక మఫ్టీలోనూ విధులు నిర్వహించనున్నారని, వారికి అధునాతన ఏకే-47, ఏకే-56 రైఫిళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. రెండు హోటళ్లలో సుమారు 150 రూములను ఒబామా సిబ్బంది కోసం బుక్ చేసినట్లు తెలిపారు.
మౌర్యా హోటల్ చెఫ్‌లకు సెలవులు రద్దు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడు రోజుల పాటు బసచేయనున్న మౌర్యా హోటల్ చెఫ్‌లకు సెలవులు రద్దు చేశారు. ఆ మూడు రోజులూ చెఫ్‌లందరూ హోటల్‌లోనే అందుబాటులో ఉండాలని యాజమాన్యం పేర్కొంది. ఈ హోటల్‌లో సుమారు 50 మంది చెఫ్‌లు వివిధ వంటకాల్లో నిష్ణాతులు. ఒబామా 25వ తేదీనుంచి 27వ తేదీవరకు ఈ హోటల్‌లో సతీసమేతంగా బసచేయనున్న సంగతి తెలిసిందే. అలాగే హోటల్‌లో ఒబామా కుటుంబానికి అందజేసే మంచినీరు, ఆహారాన్ని మూడంచెల తనిఖీ చేస్తారు. ఢిల్లీ పోలీసులతోపాటు యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఇందులో పాలుపంచుకుంటారు. ఈ ప్రక్రియను అమెరికా అధ్యక్షుడికి అందజే సేందుకు 15 నిమిషాల ముందు చేపడతారు.
గుర్గావ్‌లోని రెండు హోటళ్లకు భద్రత పెంపు
Published Wed, Jan 21 2015 11:32 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement