Incredible moment
-
ఉమ్మనీటి సంచితో కవలల జననం
బ్రెజీలియా: కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది. అలా కాకుండా శిశువు ఉమ్మ సంచితో పాటు పుట్టడం చాలా అరుదు. అందులోనూ ఈ కవలలిద్దరూ ఉమ్మ సంచితో పుట్టారు! వీటిని ‘ఎన్ కౌల్’ లేదా వెయిల్డ్ బర్త్స్ (ముసుగు జననాలు) అంటారట. ప్రతి 80,000 జననాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే చాన్సుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆడ శిశువుల ఉమ్మ సంచిని వైద్యులు సి–సెక్షన్ ద్వారా విచ్ఛిన్నం చేసి వారిని క్షేమంగా బయటికి తీశారు. దీన్నంతా వీడియో తీశారు. అదిప్పుడు ప్రపంచమంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవలలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట. వీరికి మారియా సెసీలియా, మారియా అలైస్ అని పేర్లు పెట్టారు. తల్లి గర్భంలో పిండ దశలోనే చుట్టూ ఉమ్మ నీరు ఏర్పడుతుంది. జన్మించేదాకా అది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. గర్భస్థ పిండం ఉమ్మనీటి సంచిలోనే స్వేచ్ఛగా ఈదులాడుతుంది. శిశువు జన్మించే సమయం కంటే ముందే ఈ సంచి విచ్ఛన్న మవుతుంది. -
ఆకాశంలో వింత: ప్రజల్లో భయభ్రాంతులు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రెజిల్ దేశంలోని మినాస్ గెరేయిస్ పట్టణంలోని ప్రజలు ఇటీవల ఓ వింతను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. కాస్త మబ్బు పట్టిన ఆకాశంలో పదులు, వందలు, వేలల్లో సాలె పురుగులు తేలియాడుతున్న దశ్యాన్ని చూసి ముందుగా అబ్బురపడ్డారు. ఆ తర్వాత అవి వర్షంలా ఆకాశం నుంచి కురుస్తున్నట్లు భ్రమపడి భయభ్రాంతులకు గురయ్యారు. ‘సావో పావులోకు ఈశాన్యంలో ఉన్న మా తాతగారి పొలానికి వెళుతుండగా, ఆకాశంలో నల్లటి మచ్చలు కనిపించాయి. ఇదేమిటంటూ కొంత ఎగువ ప్రాంతానికి Ðð ళ్లి చూడగా, అవన్నీ గాలిలో వేలాడుతున్న సాలె పురుగులని తెల్సింది. సాలె పురుగులు గాలిలో వేలాడడం ఏమిటనుకొని భయపడ్డాను’ అని ఆ దశ్యాన్ని చిన్న వీడియోగా తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసిన గెరేయిస్ పట్టణ వాసి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వింత గురించి ఫెడరల్ యూనివర్శిటీలోని అరక్నాలోజి ప్రొఫెసర్ అడల్బెర్టో డాస్ సాంటోస్ను ప్రశ్నించగా, ఆ సాలె పురుగులను ‘పరవిక్సియా బిస్ట్రియాట’ అనే చాలా అరుదైన జాతికి చెందినవని, అవి భూమిలోని వేడి, గాలిలోని తేమను తట్టుకోలేనప్పుడు కొన్ని గుంపులుగా రెండు చెట్ల మధ్య లేదా కొన్ని ఎల్తైన చెట్ల మధ్య గూళ్లను అల్లుతుందని, ఆ గూళ్లు మనిషి కంటికి కనిపించనంత సన్నగా ఉంటాయని, ఆ గూళ్లను అల్లుతూనో, వాటికి వేలాడుతూనో సాలె పురుగులు కనిపిస్తాయని చెప్పారు. కొన్ని సమయాల్లో గాలీ గట్టిగా వీచినప్పుడు చెట్ల అంచుల నుంచి గూడు తెగిపోయి గాల్లో కొంత దూరం ప్రయాణిస్తాయని చెప్పారు. ఆ తర్వాత ఏ చెట్టు మీదనో, నెల మీదనో బారీ సాలె గూడు, సాలె పురుగులతోపాటు పడిపోతుంది. ఈ సాలె గూడుతోగానీ, సాలె పురుగులతోగాని మానవులకు ఎలాంటి ముప్పు ఉండదని అవన్ని భారీ గూడు వల్ల దోమలు, ఇతర క్రిమీకీటకాలు రాకుండా సాలె గూడు అడ్డుపడుతుందని ప్రొఫెసర్ వివరించారు. -
పోతున్న ప్రాణాలు ఒడిసిపట్టింది
బ్రిస్టల్: 'ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే బతికుండే వాడు' సాధారణంగా ఇది అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వైద్యుల నోట వినిపించే డైలాగ్. ఈ మాట వినగానే అతడి తలరాత అంతేలే అందుకే చనిపోయాడని అనుకుంటాం. కానీ, వాస్తవానికి ఆ నిమిషానికి సరిగ్గా కాపలా కాస్తే పోయే ప్రాణాన్ని అరచేతపట్టుకొని తిరిగి ఆ వ్యక్తిని బతికించవొచ్చని బ్రిస్టల్ నగరంలో నిరూపితం అయింది. పట్టపగలే కత్తిపోట్లతో పడి ఉన్న ఓ 40ఏళ్ల బిల్డర్ను చూసి అందరూ తమకెందుకులే అని వెళ్లిపోతుండగా నర్సుగా పనిచేస్తున్న ఆమె మాత్రం ఆగిపోయింది. తన స్నేహితుడితో కలిసి అతడి వద్దకు గబాగబా వెళ్లి మొకాలిపై కూర్చొని అతడి ప్రాణం కోసం ఎంతో ఆరాటపడింది. అతడు ఎవరూ ఏమిటీ అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. డిగ్నిటీ అనే అహంకారానికి వెళ్లకుండా నేరుగా అతడి చేయి చేతుల్లోకి తీసుకొని పల్స్ చెక్ చేసింది. శ్వాస కూడా ఆగిపోయిన ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) పద్ధతి ద్వారా తిరిగి ఊపరిపోసింది. అంతకుముందు అతడి ఛాతీపై తన శాయశక్తులా బలంగా నొక్కుతూ క్షణాల్లో దూరమవుతున్న ఆయుషును తిరిగి తనకు అందించింది. అలా దాదాపు ఐదు నిమిషాలపాటు రోడ్డుపక్కనే ఓ ప్లాట్ ఫాం పై పడుకోబెట్టి ఆమె చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆ వెంటనే బాధితుడిని బ్రిస్టల్ లోని సౌత్ మెడ్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టింది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగానే ఉంది.