Increment salary
-
‘తెలంగాణ ఇంక్రిమెంట్’ రికవరీ
సాక్షి, హైదరాబాద్: జలమండలిలో ‘తెలంగాణ ఇంక్రిమెంట్’రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదేళ్ల తర్వాత ఆ శాఖ పరిధిలో రెగ్యులరైజ్ అయిన 658 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని, ఉద్యోగుల సర్విస్ బుక్ లు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంక్రిమెంట్ ఇలా.. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యోగులందరికీ ‘తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‘మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2014 సెప్టెంబర్ 1న చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తూ వస్తోంది. ప్రతి నెలా వేతనంలో భాగంగా ఈ ఇంక్రిమెంట్ సర్విస్ ముగిసే వరకు వర్తింస్తుందని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జలమండలిలో వర్తింపు ఇలా జలమండలి పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా సేవలిందిస్తున్న సుమారు 658 మంది హెచ్ఆర్, ఎన్‌ఎంఆర్‌లను ప్రభుత్వం 2014 జూన్ 23న రెగ్యులరైజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు 13న జీఓ నెంబర్ 23 ఆర్డర్‌తో ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జలమండలిలోని పారిశుధ్య విభాగంలో రెగ్యులర్ అయి సర్వీస్‌లో ఉన్నవారికి కూడా ఈ ఇంక్రిమెంట్‌ను వర్తింపజేశారు. జీఓ తేదీని పరిగణనలోకి తీసుకోవాలి తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిన 2014 ఆగస్టు 13 తేదీని కటాఫ్ పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్ అయిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన నాటికే ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ తమకు కూడా వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులైన తమ వేతనాలు ఉండడమే తక్కువని, అందులో నుంచి ఇంక్రిమెంట్ సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ ఎందుకంటే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ రోజైన జూన్ 2ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్ అమలుచేస్తోంది. అయితే జలమండలిలో ఉద్యోగుల రెగ్యులరైజ్ జూన్ 23న జరిగింది. దీంతో వారి వేతనాల నుంచి ఈ ఇంక్రిమెంట్ రికవరీకి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగులు మాత్రం ఇంక్రిమెంట్ జీఓ వచ్చిన ఆగస్టు 13వ తేదీన పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. -
హామీల అమలుకు వడివడిగా అడుగులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే హామీలను నెరవేర్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు. తన పాలన జనరంజకంగా ఉండాలనే ఆలోచనతో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులను ఆకట్టుకునేలా తొలి కేబినెట్ సమావేశంలో సీఎం పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి : తాము అధికారంలోకి వస్తే దశల వారీగా రూ. 3 వేలు పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలో 4,38,500 మంది పింఛన్లు అందుకుంటున్నారు. నెలకు సుమారు రూ. 98.66 కోట్ల వరకు పింఛనుదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం పింఛనుదారుడికి నెలకు రూ. 2 వేలు అందచేసింది. జగన్ ఇచ్చిన హామీ మేరకు జూన్ 1 నుంచి ప్రతి పింఛనుదారుడికి రూ. 250 అదనంగా అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వల్ల జిల్లాలో రూ. 3.63 కోట్ల అదనపు భారం పడుతోంది. జూన్‌లో పెంచిన ఈ మొత్తం జులై 1 నుంచి పంపిణీ చేసే పింఛన్లతో చేరుస్తారు. ఆశ వర్కర్లకు రూ.10 వేలు పాదయాత్ర సందర్భంగా ఆశ వర్కర్లు సీఎం జగన్‌ను కలసినప్పుడు నెలకు రూ.10 వేలు వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆశ వర్కర్లు నెలకు రూ. 3 వేల చొప్పున వేతనం అందుకొని పనిచేస్తూ వస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఆశ కార్యకర్తల వేతనాల పెంపుపై పెట్టారు. దీనివల్ల జిల్లాలో 3,347 మంది ఆశ వర్కర్లకు నెలకు రూ. 10 వేలు అందనుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 3 వేలు కాకుండా ఇక అదనంగా రూ. 7 వేలు అందించే విధంగా కేబినెట్లో ఆమోదించారు. ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం.. నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎన్నో రాయితీలను ఇస్తోంది. కానీ నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో 14 ఆర్టీసీ డీపోలుండగా కేవలం మూడు డిపోల నుంచి మాత్రమే ఆర్టీసీకి ఆదాయం వస్తోంది. మిగిలిన 11 డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ డిపోల ద్వారా 6,500 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ఈ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గుర్తింపు పొందుతారు. నష్టాలు ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వమే ఆదుకుంటుంది. ఆర్టీసీ కార్మికులకు ఓ భరోసా లభిస్తుంది. దీనిపై కేబినెట్లో చర్చించి సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. మున్సిపల్ కార్మికులు వేతనాల పెంపు.. మున్సిపల్ కార్మికులు ప్రస్తుతం రూ.12 వేలు వేతనం అందుకుంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్ ఈ కార్మిక సంఘాల నుంచి వ్యక్తమవుతూ వస్తోంది. అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంపు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులు 7 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ఇక నెలకు రూ. 18 వేల చొప్పున వేతనం అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్మికులే కాకుండా పంచాయతీరాజ్, హాస్పిటల్స్ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా రూ. 18 వేలు చొప్పున వేతనం పెంచారు. జనవరి నుంచి ‘అమ్మఒడి’ పథకం.. ‘పేదింటి పిల్లలు చదువుకు ఏ తల్లి భయపడొద్దు.. పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాం’ అని నవరత్నాల పథకంలో భాగంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని జనవరి 26 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే పిల్లలుకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలు కావడం ద్వారా జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే 3.43 లక్షలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 2.61 లక్షల మంది విద్యార్థుల తల్లులకు మేలు జరుగుతుంది. ఏటా ఇచ్చే రూ.15 వేలు నేరుగా విద్యార్థుల తల్లికే అందచేస్తారు. ఇవే కాకుండా ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని జులై 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 38 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతోంది. అంగ్వాడీ టీచర్లకు రూ. 10,500 నుంచి రూ. 11,500లకు పెంచారు. అలాగే అంగన్వాడీ ఆయాలకు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలు వేతనం పెంచారు. మెప్మా, సెర్ఫ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న యానిమేట్లు, బుక్ కీపర్లకు గౌరవ వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి మండలంలోనూ 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. ఆగస్టు 15లోగా గ్రామ వలెంటీర్లు, అక్టోబరు 2లోగా గ్రామ సచివాలయల్లో పనిచేసే ఉద్యోగుల నియామకాలను పూర్తి చేస్తారు. దీంతో జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 23,461 మంది వలంటీర్లకు ఉపాధి లభించనుంది. అలాగే 9,800 సచివాలయ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ గ్రామ వలెంటీర్ల ద్వారా రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేర్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ గత ప్రభుత్వం బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీ చెల్లించనుంది. అలాగే రైతులందరికీ వడ్డీలేని రుణాలను అందచేయాలని నిర్ణయం తీసుకుంది. -
థాంక్యూ సీఎం సార్..
సాక్షి, సీతమ్మధార (విశాఖపట్నం) : మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆశ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలకు రూ.3 వేలు నుంచి రూ.10 వేలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఊహించలేదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 60 మంది ఆశ కార్యకర్తలు సోమవారం సీతమ్మధారలోని మళ్ల విజయప్రసాద్ క్యాంపు కార్యాలయంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఏ మేరకు హామీలు ఇచ్చారో హామీలు నేరవేరుస్తారనన్నారు. రానున్న వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్, విష జ్వరాలు సోకే అవకాశాలున్న దృష్ట్యా ఆశ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలన్నారు. -
అదనపు ఆదాయం .. ఇలా ఉపయోగిద్దాం..!
కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే బోనస్‌లో, జీతాల పెంపు రూపంలోనో లేదా మరో రూపంలో వచ్చే అదనపు ఆదాయాన్ని సద్వినియోగపర్చుకోవచ్చు. పొదుపు మొత్తాన్ని పెంచండి: జీతంలో ఇంత మొత్తం అని కాకుండా ఇంత శాతాన్ని పొదుపు చేయాలని నిర్దేశించుకుంటే దానికి తగ్గట్లుగా ఖర్చులను నియంత్రించుకోవచ్చు. భవిష్యత్ కోసం జాగ్రత్తపడొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్: అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు డబ్బుల కోసం తడుముకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇప్పటిదాకా ఇలాంటి ఏర్పాటు చేసుకోకపోతే.. కొత్తగా చేతికొచ్చే అదనపు ఆదాయాన్ని ఇందుకోసం ఉపయోగించండి. మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య, మీ వయస్సు, ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇందులో ఉంచడం మంచిది. అప్పులుంటే తీర్చేయండి: అప్పుల భారం మోయగలిగే స్థాయిని మించి ఉంటే.. ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది. పెపైచ్చు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంటే భారం మరింత పెరిగిపోతుంది. కాబట్టి.. ముందుగా అప్పులను క్లియర్ చేసేందుకు ప్రయత్నించాలి. తద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. మిగిలిన దానిని ప్రయోజనకరమైన పెట్టుబడులకు మళ్లించవచ్చు. ఇన్వెస్ట్మెంట్: స్టాక్‌మార్కెట్లు, వాటి అనుబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు పరిజ్ఞానం లేనివారికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. నెలకు రూ. 500 కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయచ్చు.