incresing
-
పోటెత్తుతున్న కృష్ణా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో కృష్ణా నది మళ్లీ పోటెత్తుతోంది. గత పది రోజులుగా ప్రవాహాలు తగ్గిపోగా సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు 1.60 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండటంతో వచి్చన నీటిని వచి్చనట్లుగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 1.82 లక్షల క్యూసెక్కులను నదిలో వదులుతుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. 76,468 క్యూసెక్కుల వరద వస్తుండగా 86,166 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇది మంగళవారానికి జూరాల, శ్రీశైలానికి చేరే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి జూరాలలోకి 44 వేలు, శ్రీశైలంలోకి 57,012, సాగర్‌లోకి 48,236 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డు లు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయినీ నదులు ఉప్పొంగడంతో బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్, జూరాల ప్రాజెక్టులు ఉప్పొంగాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో 2009–10లో 1,218 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం ఏకంగా 1,420 టీఎంసీల మేర వరద వచి్చంది. ప్రాజెక్టు కింద రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం సైతం 130 టీఎంసీలను దాటింది. ఇక జూరాలకు 2010–11లో గరిష్టంగా 787 టీఎంసీల వరద రాగా ఆ మార్కును ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ ఏకంగా 1,190 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సాగర్‌కు సైతం ఈ ఏడాది 968 టీఎంసీల మేర వరద రాగా, అది ఇంకా కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుల కింది ఆయకట్టుతో పాటు వీటిపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద కనిష్టంగా 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలోనూ నీరందించే అవకాశం ఏర్పడింది. అప్రమత్తంగా ఉండాలి: కృష్ణా నది పరీవాహకం, దాని ఉప నదుల పరిధిలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. శ్రీశైలానికి భారీ వరద పోటెత్తవచ్చని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జల సంఘం రాష్ట్రాలకు సూచించింది. -
‘పని’ పెంచుడే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉపాధిహామీ పనులు కల్పించేందుకు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో ఆయా గ్రామాల్లో అడిగిన ప్రతి కూలీకి పని చూపించే విధంగా.. పనులను గుర్తించడంతోపాటు వివిధ కారణాలతో మిగిలిపోయిన పనులను వేగవంతం చేసేందుకు పూనుకున్నారు. ఖరీఫ్ సీజన్, వర్షాల కారణంతో జిల్లాలో ఉపాధిహామీ పనులు మూడు నెలల్లో కొంత మందగించాయి. చేయాల్సిన పనులు ఉన్నప్పటికీ కూలీలు కొన్ని ప్రాంతాల్లో ఆసక్తి చూపకపోవడం.. ఇతర పనుల ద్వారా ఉపాధి పొందడం వంటి కారణాలతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు చేరుకోలేదు. దీంతో 2018–19లో జిల్లాలో కూలీలకు 58.12 లక్షల పని దినాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అందుకు అనుగుణంగా అధికారులు జిల్లాలో పనులను గుర్తించారు. జిల్లాలో 2018–19లో 52.71 లక్షల పని దినాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ కూలీల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో పని దినాల సంఖ్యను పెంచాలని ప్రణాళికలు వేసింది. దీంతో జిల్లాలో 73.33 లక్షల పని దినాలను పూర్తి చేయా లని ఆదేశించింది. అయితే జనవరి 2019 వరకు 58.12 లక్షల పని దినాల లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. దీనిని చేరుకునేందుకు అధికారు లు పనులపై ప్రచారం కల్పించారు. జాబ్‌కార్డు ఉండి.. ఉపాధి పనికి అర్హుడైన ప్రతి కూలీ పథకాన్ని వినియోగించుకుని ఉపాధి పనికి వచ్చేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 86.74 శాతం పనులు కూలీలకు కల్పించినట్లైంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సీఆర్డీఏ నిర్ణయించిన లక్ష్యాన్ని అందుకునేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ పనులు సాగుతుండడంతో ఉపాధిహామీ పథకం ద్వారా చేసే వ్యవ సాయ పనులు ఏమైనా ఉంటే వాటిని చేయించేం దుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూలీలు ఉపాధి పనులు కోరితే వెంటనే వారికి పనులు చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూ.93.58కోట్లు ఖర్చు.. 2018–19లో జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు ప్రభుత్వం రూ.93.58కోట్లు ఖర్చు చేసింది. 2,16,713 మంది కూలీలు 50,41,044 పని దినాలను ఉపయోగించుకున్నారు. వీరికి వేతనంగా రూ.61.46కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మెటీరియల్‌కు రూ.22.06కోట్లు, అధికారులు, సిబ్బంది జీతాల కు రూ.10.05కోట్లు ఖర్చు చేసింది. కూలి దొరకని ప్రతి పేదవాడికి పని కల్పించి.. పనికి సరిపడా వేతనం దక్కేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలో ఉపాధిహామీ పథకాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. పనికి దరఖాస్తు చేసుకున్న వారం పదిరోజుల్లో పని చూపించేలా గ్రామీ ణ ప్రాంతాల్లో పనులను సైతం సిబ్బంది గుర్తిస్తున్నారు. దీంతో ఉపాధిహామీ పథకం జిల్లాలో లక్ష్యానికి చేరువలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,351 మంది కూలీలు ఉపాధిహామీ పథకం కింద వంద రోజుల పని పొందారు. సిద్ధమవుతున్న 2019–20 ప్రణాళిక.. 2019–20లో కూలీలకు ఉపాధిహామీ పథకంలో కల్పించే పనుల ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించిన సిబ్బంది.. వాటికయ్యే ఖర్చులకు బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద కూలి అడిగిన ప్రతి ఒక్కరికి పనులు చూపించేందుకు వీలుగా పనులను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం పథకం కింద కూలీలకు ఉపాధి చూపిస్తున్న సిబ్బంది.. వ్యవసాయ పనులు, కాల్వల మరమ్మత్తు వంటి పనులను పథకం కింద కూలీలకు చూపించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. లక్ష్యాన్ని అధిగమిస్తాం.. జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల లక్ష్యాన్ని అధిగమిస్తాం. కూలి అడిగిన ప్రతి వ్యక్తికి ఉపాధి పథకంలో పని చూపించేలా చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 86.74 శాతం పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేసేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. గ్రామీణ ప్రాంత కూలీలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ప్రచారం చేస్తున్నాం. 2019–20 సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాళికలు పూర్తవుతున్నాయి. త్వరలో బడ్జెట్‌పై ప్రణాళిక కూడా సిద్ధమవుతుంది. – ఇందుమతి, డీఆర్డీఓ -
భూముల ధరలకు రెక్కలు
కర్నూలు (టౌన్): పట్టణ ప్రాంతాల్లో భూములు కోనుగోలు చేయాలంటే ఇక మరింత భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. 5 శాతం మార్కెట్ ధరలను పెంచడంతో జిల్లాలోని పట్టణ ప్రజలపై రూ. 60 కోట్లు ప్రజలపై భారం పడనుంది. నివాస ప్రాంతా ల్లో 5 శాతం, వాణిజ్య ప్రాంతాల్లో 10 శాతం వరకు మార్కెట్ ధరలు పెరగనున్నాయి. జిల్లాలోని కర్నూలు నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, గుడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఈ ధరలు అమలులోకి రానున్నాయి. జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి రెండేళ్లుకోసారి భూముల ధరలను పెంచడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కట్టడాల విలువలు కూడ పెరగనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కట్టడాలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. చదరపు అడుగుకు రూ. 90, పూరిళ్లకు సంబంధించి చదరపు అడుగుకు రూ.160, మట్టి మిద్దెలకు రూ.340, మొదటి, రెండు అంతస్తులకు రూ.1030, మూడవ ఆంతస్తుకు రూ.1110 చొప్పున ప్రభుత్వం విలువలను నిర్ణయించింది. ఈ లెక్కన రూ. 60 కోట్లు ఆదనంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండగా.. ఆ మేరకు ప్రజలకు భారం పడనుంది. జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు రూ.340 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత మేర నిర్ణయించారంటే... జొహరాపురంలో చదరపు గజం రూ. 3,500 ఉంటే పెరిగిన ధరలతో రూ. 3, 800, అలాగే మామిదాలపాడులో రూ. 4 వేలు ఉంటే అదికాస్తా రూ.4, 300 ప్రకారం భూముల ధరలు పెరగనున్నాయి. పాతబస్తీ, పప్పుల బజార్, జమ్మిచెట్టు ప్రాంతాల్లో చదరపు గజం రూ. 7 వేలు ఉంటే రూ. 7, 400 ప్రకారం పెరగనుంది. గుత్తి పెట్రోలు బంకు వద్ద నివాస ప్రాంతాల్లో రూ. 15 వేలుగా నిర్ణయించారు. భూముల ధరలు సవరించడానికి జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, నగరపాలక కమిషనర్, జెడ్పీ సీఈఓ, స్థానిక సబ్ రిజిష్టర్లతో కూడిన కమిటీ ధరలపై నిర్ణయం తీసుకుంటుంది. -
చిగురిస్తున్న ఆశలు
– క్రమంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం – శ్రీశైలం నుంచి 73,840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో – ఆయకట్టు రైతుల్లో ఆనందం నాగార్జునసాగర్ నాలుగు రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి విడుదలవుతున్న నీటితో సాగర్ జలాశయం క్రమంగా పెరుగుతోంది. 512 అడుగులున్న జలాశయ నీటిమట్టం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రస్తుతం 522.20(153.3180టీఎంసీలు)అడుగులకు చేరుకుంది. రెండవ పంటకైనా నీరు వస్తుందని ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు,వంకలు,ఉపనదులు పొంగిపొర్లుతుండటంతో కృష్ణానదిలోకి నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఎగువ జలాశలయాలైన ఆల్మట్టి,నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి. శ్రీశైలం జలాశయం 881.80(197.9120టీఎంసీలు)అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు(215టీఎంసీలు). ఎగువ నుంచి 1,20,300క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు వస్తుండటంతో విద్యుదుత్పాదన రెండు యూనిట్ల ద్వారా 73,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం 1,90వేల మేరకు వరద నీరు రాగా మంగళవారానికి వరద తగ్గుముఖం పట్టింది.ఉదయం 1,40వేల క్యూసెక్కులు రాగా సాయంత్రానికి 1.30వేల వచ్చింది. రాత్రి సమయానికి అది ఇంకా తగ్గింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం ఎగువ నుంచి వరద వస్తేనే సాగర్ జలాశయంలోకి వరద తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. సాగర్‌కు శ్రీశైలమే ఆధారం నాగార్జునసాగర్ జలాశయం వరద నీటి కోసం శ్రీశైలం జలాశయం మీదనే ఆధారపడాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి,పులిచింతల ప్రాజెక్టుకు ఉన్నన్నీ ఉపనదులు సాగర్ జలాశయానికి లేవు. స్థానికంగా కురిసిన వర్షాలకు సాగర్‌లోకి ఏ మాత్రం నీరు చేరే అవకాశాలు లేవు. కేవలం డిండి వాగు,ఉప్పాగు,మైనంపల్లివాగులు మినహాయిస్తే సాగర్ జలాశయంలోకి నీరు భారీ స్థాయిలో వచ్చే ఉపనదులు లేవు.సాగర్ ప్రాజెక్టు దిగువన ఆంధ్రావైపు నుంచి వచ్చే, చంద్రవంక వాగు,తెలంగాణ వైపు నుంచి వచ్చి కలిసే అహాల్యవాగు,మూసినీరు ఇలా చాలా ఉపనదుల నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నీరు చేరుతుంది.