on an indefinite hunger strike
-
డిమాండ్లు పరిష్కరించాల్సిందే!
► ఢిల్లీలో తమిళ రైతులు ► ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం ► 25వ రోజుగా ఆందోళన కొనసాగింపు టీనగర్: తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఢిల్లీలో తమిళ రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆందోళనలో భాగంగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు, జాతీయ బ్యాంకులలో రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలి, తదితర డిమాండ్లతో గత నెల 14 నుంచి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి ఈ ఆందోళన 25వ రోజుకు చేరింది. జాతీయ దక్షిణాది నదుల అనుసంధాన రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గత 14వ తేదీ నుంచి ఆందోళన జరుపుతున్నారు. ఇలావుండగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనకు మద్దతుగా ధర్నాలు జరుపుతున్నారు. 25వ రోజుగా శుక్రవారం ధర్నా చేపట్టారు. అయ్యాకన్ను, ప్రధాన కార్యదర్శి పళనివేలు, కార్యదర్శి మురుగన్ సహా 25 మంది శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనిగురించి అయ్యాకన్ను మాట్లాడుతూ రైతుల డిమాండ్లపై రాష్ట్రపతిని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు అధికారులతో సంబంధంలేని ప్రకటనలు విడుదల చేస్టున్నట్లు తెలిపారు. 25 మంది ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించామని, తమ కోర్కెలు నెరవేరేంత వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ రక్తాన్ని పీల్చుతోందని, అందుచేత తమ అరచేతులను గాయపరచుకుని రక్తాన్ని చిందిస్తూ ఆందోళన జరుపుతున్నట్లు తెలిపారు. దీంతో తమ ప్రాణాలు కోల్పోయినా ఫర్యాలేదని, తమ కోర్కెలను నెరవేర్చాల్సిందేనని అన్నారు. 25 రోజులుగా పోరాటం సాగిస్తున్నామని, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణసామి తమను కలిసి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు తెలిపారని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిసామి తమను వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తమను కలిసేందుకు నిరాకరిస్తున్నారని, దీంతో ఆందోళనను మరింత ఉధ్ధృతం చేశామన్నారు. -
సీమాంధ్రప్రదేశ్‌కు పేరేది?
నూతనంగా ఏర్పడే సీమాంధ్రప్రదేశ్‌కు బుద్ధప్రదేశ్‌గా పేరు పెట్టమని కోరటం విచిత్రంగా ఉంది. దీంట్లో కూడా మతం దాని చుట్టూ వివాదాలు చొరబడటం బాధాకరం. బ్రిటిష్ పరిపాలనా కాలం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచమని ఆంధ్రులు కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో దీక్షలు ఉద్యమాలు జరిపిన ఫలితంగా అమర జీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష గావించి ప్రాణ త్యాగం అర్పించిన పిదప రాష్ట్రం ఏర్పడింది. దాదాపు 6 దశాబ్దాల తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజనానంతరం మరోసారి నూతనంగా ఏర్ప డిన రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు రాష్ట్రం అని పేరు పెట్ట మని న్యాయంగా ఆంధ్ర ప్రజలు కోరాలి. అంతేగాని రాష్ట్రంలో 50 వేల మంది బౌద్ధుల జనాభా కూడా లేని బౌద్ధమ తం పేరు పెట్టమని కొంత మంది మేధావులు, వ్యక్తులు కోరడం చిత్రవిచిత్రంగా ఉన్నది. మైనారిటీలు, దళితులు, క్రైస్తవులు, ముస్లింలు అధికంగా గల ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 50 వేల మంది జనాభా కూడా లేని బౌద్ధమత ప్రతీక అయిన గౌతమ బుద్ధుని పేరు పెట్టమనటం సమంజసం కాదు. ఇప్పటికైనా ఇలాంటి వాదనలుమాని సకల వర్గాల ప్రజలు కలసి అమర జీవి పొట్టిశ్రీరాములు పేరును కొత్త రాష్ట్రానికి పెడితే ఆయన ఆత్మశాంతించే అవకాశం ఉంటుంది. - వై.సత్యనారాయణ చీరాల, ప్రకాశం జిల్లా -
ఆమరణ నిరాహార దీక్షకూ వెనుకాడం
ప్రభుత్వానికి జూనియర్ వైద్యుల హెచ్చరిక కేసీఆర్ స్ఫూర్తితోనే సమ్మె చేస్తున్నామని వ్యాఖ్య జీవో 107ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించకపోతే కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా వెనుకాడబోమని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో ‘నీవే మాకు స్ఫూర్తి’ అంటూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన తెలిపారు. గాంధీ ఆస్పత్రిలోనూ విధులు బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 107ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, సుల్తాన్ బజార్, పేట్లబురుజు, ఈఎన్టీ, సరోజినీదేవీ కంటి ఆస్పత్రులకు చెందిన సుమారు 1,700 మంది జూనియర్ వైద్యులు గత 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. జూడాలంతా సమ్మెలోకి వెళ్లడంతో ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జూడాల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, స్వప్నిక, రాఘవేంధ్ర , అనిల్, రామ్‌చందర్, రమేశ్‌లు మాట్లాడుతూ తమ విజ్ఞప్తులకు ప్రభుత్వం స్పందించక పోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. జూడాలు ధర్నాకు దిగితే అండగా ఉంటానని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఆయన స్ఫూర్తితోనే సమ్మె కొనసాగిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేయకుంటే తమకు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని, ఇది ఎంసీఐ నిబంధనలకు విరుద్ధమన్నారు. వైద్యశాఖ మంత్రి చర్చల పేరుతో తమను సచివాలయానికి పిలిచి అవమానించడమే కాకుండా సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.