The indefinite strike
-
అధ్యాపకుల ఉద్యమబాట
3 నుంచి సమ్మెకు దిగనున్న ఒప్పంద అధ్యాపకులు క్రమబద్ధీకరణ, పదో పీఆర్సీ అమలే ప్రధాన డిమాండ్లు భవిష్యత్తుపై భరోసా కల్పించాలని కోరుతూ ఒప్పంద అధ్యాపకులు ఉద్యమ బాటపట్టనున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, లేకుంటే కనీసం పదో వేతన సిఫా రసులు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈనెల 3నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలుండడంతో కాంట్రాక్టు టీచర్ల ఆందోళన ప్రభావం పది ఫలితాలపై పడనుంది. పుత్తూరు: రెగ్యులర్ అధ్యాపకులకు తోడు ఒప్పంద అధ్యాపక వ్యవస్థను 2000లో నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లాలో ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో సుమారు 474 మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు తమ సేవలను గుర్తించి ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తుందని ఇన్నేళ్లు ఆశించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఇటీవల కనిపించిన ప్రభుత్వ పెద్దల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ముగ్గురు నిపుణుల కమిటీ ఆధారంగా ఒప్పంద అధ్యాపకుల నియామకాలు జరిగారుు. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు క్రమబద్ధీకరణకు అడ్డంకి కాదని వారు వాదిస్తున్నారు. క్రమబద్ధీకరణ ఆలస్యమయ్యే పక్షంలో 10వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసి జీతాలైనా పెంచి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పోటీ పరీక్షలకు వయస్సు దాటిపోరుుందని, ఉన్న ఈ ఉద్యోగాలు కూడా తీసేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడాతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబరు 2వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే 3వ తేది నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ పరిణామం ఉన్నతవిద్యపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలుండగా, వీరంత ఒక్కసారిగా సమ్మెలోకి వెళితే ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై పడనుంది. -
వీఆర్ఏల సమ్మెకు 50రోజులు!
కేవలం 2 డిమాండ్లకే స్పందించని ప్రభుత్వం సీఎం, మంత్రులకు వినతులు అందించినా పట్టించుకోలేదు సమ్మె విరమించబోమంటున్న సంఘ ప్రతినిధులు బి.కొత్తకోట: కేవలం రెండు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆదివారం నాటికి 50 రోజులు గడిచాయి. విధులకు హజరుకాకుండా, వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు తమగోడు చెప్పుకొని వినతులు అందించినా పట్టించుకోలేదు. దీంతో డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని సంఘ ప్రతినిధులు స్పష్టంచేస్తున్నారు. సమ్మె కారణంగా తహశీల్దార్ కార్యాలయాల్లో పనులు ఆగిపోతున్నాయి. 2012-14 మధ్య కాలంలో ఏపీపీఎస్సీ నేరుగా గ్రామ రెవెన్యూ సహయకులను నియమించేందుకు రెండు దశల్లో పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని వీఆర్ఏలుగా నియమించారు. ఇందులో ప్రస్తుత ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన 4,728 మంది వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. వీరు నియమితులైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ సమ్మెలోకి వెళ్లలేదు. ప్రస్తుతం వీరంతా ప్రధానంగా రెండు డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో చివరిస్థానంలో ఉన్నారు. వీరికి అమలవుతున్న పేస్కేలునే తమకు వర్తింపచేయాలన్నది ప్రధాన డిమాండ్. వీఆర్ఏలకు ప్రమోషన్ల శాతం 30 నుంచి 70శాతానికి పెంచాలన్నాది మరో డిమాండ్. ఈ రెండు డిమాండ్లను సాధించుకునేందుకు వీఆర్ఏలు నవంబర్ 2న సమ్మె బాట పట్టారు. అప్పటినుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీరి సమ్మెకు ఆదివారానికి 50రోజులు ముగిశాయి. వాళ్లది వెట్టిచాకిరీ ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన వీఆర్ఏలు వెట్టిచాకిరి చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ విధులు, బూత్ లెవల్ అధికారులుగా, పట్టాదారు ఆధార్ ఆన్లైన్ సీడింగ్, ఎన్నికల ఆధార్ సీడింగ్, కొత్త రేషన్‌కార్డుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం, మీఇంటికి మీభూమి కార్యక్రమంలో అర్జీలను ఆన్లైన్ చేయడం, రీసెటిల్మెంట్ రిజిష్టర్ డేటా ఎంట్రీ, సర్కారు భూముల డేటా ఎంట్రీ, పట్టాదారు పాసుపుస్తకాల ఆన్లైన్, ప్రజలనుంచి అందే ఫిర్యాదుల కోసం ఏర్పాటైన మీకోసం వెబ్సైట్లో ఫిర్యాదుల నమోదు, రాత్రివేళ వాచ్మెన్లుగా తదితర పనులు చేస్తున్నారు. ఈ పనులేకాక వీరు ఎక్కువ విద్యార్హత కలిగి ఉండటంతో రికార్డు పనులకోసమూ వినియోగించుకొంటున్నారు. . న్యాయం చేయాలి మేం కేవలం రెండు సమస్యలపైనే సమ్మె చేస్తున్నాం. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు మా గోడుపై ఏఒక్కరూ స్పందించలేదు. మాతో అన్ని పనులూ చేయించుకోంటూ పట్టించుకోకపోవడం అన్యాయం. ఇలా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందో అర్థంకావడం లేదు. -జి.నరేంద్రబాబు వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
నేటి నుంచి రవాణాబంద్
జిల్లా వ్యాప్తంగా సమ్మెలో 1.72 లక్షల లారీలు మూతపడనున్న పెట్రోలు బంక్‌లు మద్దతుగా నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు విజయవాడ వ్యాట్, టోల్ ఫీజులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ట్రాన్స్‌పోర్టు నిరవధిక బంద్ జిల్లాలో గురువారం నుంచి జరగనుంది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి జిల్లాలోని ట్రాన్స్పోర్టర్లు సమాయత్తమవుతున్నారు. లారీ ఓనర్లు, ట్రక్కుల యజమానులు, పెట్రోలు డీలర్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 1.72 లక్షల లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోనున్నాయి. 220 పెట్రోలు బంక్‌లు మూతపడనున్నాయి. ఆయిల్ ట్యాంకర్లను కూడా నిలిపివేస్తారు. డీజిల్, పెట్రోల్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన లీటరుపై అదనంగా పెంచిన రూ.4 వ్యాట్‌ను రద్దు చేయాలని, టోల్ ట్యాక్స్‌లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్పోర్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రంలో రూ.4 వ్యాట్ వల్ల లారీల యజమానులు సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. వ్యాట్ వల్ల ఇటు లారీ ఓనర్లు, పెట్రోలు డీలర్లు, ప్రజలపై కూడా భారం పడుతోంది. ఆయిల్ ట్యాంకర్ల కిరాయిలపై కూడా కేంద్రప్రభుత్వం వ్యాట్ వసూలు చేయడాన్ని ట్రాన్స్పోర్టర్లు వ్యతిరేకిస్తున్నారు. పెట్రోలు బంకుల వద్ద కోలాహలం నిరవధిక సమ్మె కారణంగా బుధవారం సాయంత్రం నుంచి పెట్రోలు బంకుల్లో రద్దీపెరిగింది. వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులో కొన్ని బంకుల వద్ద కార్లు క్యూ కట్టాయి. వాహనదారులు బంకులకు వెళ్లి ట్యాంకులను ఫుల్ చేయించుకుంటున్నారు. జిల్లాలో 220 పెట్రోలు బంకులు ఉన్నాయి. రోజుకు 11 లక్షల లీటర్ల పెట్రోలు, 20 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లాలో మొత్తం ఆరున్నర లక్షల వాహనాలు ఉన్నాయి. వాహనదారులు సమ్మె ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందోననే ఆందోళనతో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, తిరువూరు తదితర ప్రాంతాల్లోని పెట్రోలు బంకులు వాహనాలతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో బంకుల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు పూర్తి సంఘీబావం ప్రకటిస్తున్నట్లు ఏటీఏ అధ్యక్షుడు బాబ్జి తెలిపారు. ఆటోనగర్‌లోని ఏటీఏ కార్యాలయంలో బుధవారం అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమ్మె జయప్రదం చేయాలి ట్రాన్స్‌పోర్టు సమ్మెను జయప్రదం చేయాలి. ఎనిమిది నెలలుగా వ్యాట్ భారం తగ్గించాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీనివల్ల ప్రజలపై కూడా భారం పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం వస్తోంది. వెంటనే ప్రభుత్వం వ్యాట్ ఎత్తివేయాలి. -పెట్రోలు, డీజిల్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
‘సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె’
హైదరాబాద్: వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రకారం వేతన సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని, అడ్హాక్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేయాలని వివిధ గురుకులాల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం, మంత్రులకు ఈ-మెయిల్స్ ద్వారా నిరసనలు తెలుపుతామని, 26న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సంఘాల నాయకులు రవిందర్, వెంకటరెడ్డి, రామలక్ష్మణ్ తెలిపారు.