వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ప్రకారం వేతన సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని, అడ్‌హాక్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ....
హైదరాబాద్: వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ప్రకారం వేతన సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని, అడ్‌హాక్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేయాలని వివిధ గురుకులాల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.
శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం, మంత్రులకు ఈ-మెయిల్స్ ద్వారా నిరసనలు తెలుపుతామని, 26న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సంఘాల నాయకులు రవిందర్, వెంకటరెడ్డి, రామలక్ష్మణ్ తెలిపారు.