Pay Revision Commission
-
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 12వ పీఆర్సీ Pay Revision Commission (PRC) ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్సింగ్ ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. గత కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఈ కమిషన్ నివేదికను రూపొందించనుంది. ఏడాది.. అంతకు లోపే నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: మన టమాటలకు టైమొచ్చింది -
ఉద్యోగుల కోసం సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం
-
జగన్ పీఆర్సీ నిర్ణయంతో ఉద్యోగుల పాలాభిషేకం
-
మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం జగన్ మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో ఈ విషయమై ప్రకటన వస్తుందని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా ఆయన నోట్ చేసుకున్నారని తెలిపారు. అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని, మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని పదే పదే తెలిపారన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారని తెలిపారు. రాష్ట్ర విభజన, కోవిడ్ కష్టాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవని సీఎం చెప్పారని, తెలంగాణకు హైదారాబాద్ నుంచి ఆదాయం ఉన్నందున ఆ రాష్ట్రంతో పోల్చుకోవద్దని సూచించారని తెలిపారు. మొత్తంగా సీఎం జగన్‌తో సమావేశం సానుకూలంగా, ప్రశాంతంగా మంచి వాతావరణంలో సాగిందని చెప్పారు. సీఎం జగన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పని చేస్తామని తెలియజేశామన్నారు. సీఎం మంచి పీఆర్సీ ప్రకటిస్తారు.. ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి సీఎం జగన్ మంచి పీఆర్సీ ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వస్తుంది. కొన్ని సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్‌కు తగ్గకుండా చూడాలని, కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎంను కోరాయి. హైదరాబాద్ నుంచి రాజధానికి వచ్చిన ఉద్యోగులకు సీసీఎ, హెచ్ఆర్ఏ కొనసాగించాలని కోరారు. – ఎన్.చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) సీఎం మంచి చేస్తారనే నమ్మకం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. 34 శాతం ఫిట్మెంట్ అడిగాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఫిట్మెంట్ అడిగాం. సీఎం జగన్ మంచి చేస్తారనే నమ్మకం ఉంది. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన ఉంటుంది. నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటూ ఉంటారని సమావేశంలో సీఎం జగన్ స్వయంగా చెప్పారు. అంత మాట చెప్పిన సీఎం.. ఉద్యోగులకు ఎందుకు మంచి చేయకుండా ఉంటారు? ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథం చూపే విషయంలో తనకన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారని కూడా సీఎం తెలిపారు. ఇదే సమయంలో కొన్ని వాస్తవాలను బేరీజు వేసుకోవాలనీ సీఎం చెప్పారు. మొత్తానికి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం పీఆర్సీ సమస్య రెండు, మూడు రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ నెల 9వ తేదీ లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆ రోజున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఉద్యోగులకు ఇస్తోన్న ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్మెంట్ ఉంటుంది. అశుతోష్ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని సీఎం జగన్‌ను కోరాం. అధికారుల కమిటీ నివేదిక కరెక్టు కాదని సీఎంకు తెలియజేశాం. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షనర్లకు సంబంధించిన అంశాల్లో తేడాలు ఉన్నాయని వివరించాం. నాలుగు అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిపాం. పది పీఆర్సీల్లో ఎక్కడా ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గిన దాఖలాలు లేవని వివరించాం. హెచ్ఆర్ఏపై చేసిన సిఫార్సులు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపాం. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల గురించి వివరించాం. ఏడెనిమిది ఏళ్లుగా హెల్త్ కార్డులు నిర్వీర్యమయ్యాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాం. ఉద్యోగుల డిమాండ్లకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి మరో భేటీ ఉండకపోవచ్చు పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సీఎం కోరారు. ఉద్యోగ సంఘాలు కూడా తగ్గాలని, ఆర్థిక శాఖ అధికారులు కూడా కొంతమేర గణాంకాలను పెంచాలని సీఎం సూచించారు. పీఆర్సీపై మరో సమావేశం ఉంటుందని మేము భావించడం లేదు. ఇంత సేపు ఉద్యోగ సంఘాలతో సీఎం మాట్లాడిన పరిస్థితి గతంలో లేదు. సంఘాలుగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా.. అందరం వారి వారి సమస్యల్ని సీఎం జగన్‌కు తెలియజేశాం. – కేఆర్ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత -
Andhra Pradesh: సుదీర్ఘ చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం బుధవారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సచివాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఏడు గంటలకుపైగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ సహా ప్రతి అంశంపైనా బుగ్గన రాజేంద్రనాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించి తమ ఆలోచనలు చెప్పారు. కార్యదర్శుల కమిటీ నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని, 11వ పీఆర్సీని యథాతథంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కేంద్ర వేతన సంఘంతో తమకు సంబంధం లేదంటూ ఫిట్‌మెంట్‌పై తమ డిమాండ్లు తెలిపాయి. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఫిట్‌మెంట్‌పై ఇప్పుడు చేస్తున్న డిమాండ్ కాకుండా అందరు కలిసి ఒక అంకె చెప్పాలని కోరారు. దానిపై నాయకులు ఇప్పటికిప్పుడు చెప్పలేమని తెలిపారు. దీంతో ఫిట్‌మెంట్‌పై మళ్లీ చర్చిద్దామని చెప్పిన సజ్జల మిగిలిన అంశాలపై వివరంగా చర్చించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జల హమీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆందోళనలు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ నేతలతో విడిగా మాట్లాడి ఆందోళనలు విరమించుకోవాలని సజ్జల, ఆర్థిక మంత్రి కోరారు. సమస్యల పరిష్కారంపై రూట్ మ్యాప్ ఇస్తే ఆందోళనలు విరమిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. కాగా, నేడు మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఫిట్మెంట్ విషయంలో స్పష్టత రాలేదన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదిక కాకుండా అధికారుల కమిటీ కొత్తగా సిఫార్సులు చేయడం సంప్రదాయం కాదన్నారు. అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కనీసంగా 34 శాతం ఫిట్మెంట్ æఇవ్వాలని అడిగామని, మెడికల్ రీయింబర్సుమెంటు రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఫిట్మెంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ 20 అంశాలపై అన్ని సంఘాలు ఒకే తాటిపై నిలబడ్డాయన్నారు. నిబద్ధతతో ఉన్నాం: సజ్జల ఉద్యోగుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ మీద తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కసరత్తు చేస్తున్నామని సజ్జల చెప్పారు. -
వేతన సవరణ ఏడాది తర్వాతే..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను ఏడాది తర్వాత పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నా వాటిని అధిగమించి అయినా ఏడాది త ర్వాత కొత్త వేతనాలను ఖరారు చేస్తామని వెల్లడించినట్లు సమాచారం. గతేడాది ఆర్టీసీ ఉద్యోగులకు 16 శాతం ఐఆర్ ప్రకటించారు. వేత న సవరణ గడువు పూర్తై ఏడాదిన్నర గడిచినా అది అమలు కాలేదు. ఇటీవల సమ్మె డిమాండ్లలో అదీ ఓ ప్రధాన అంశమే. అయితే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ప్రభుత్వం కూడా సాయం చే యలేదని ముఖ్యమంత్రి గతంలో పదేపదే పేర్కొనడంతో వేతన సవరణపై ఉద్యోగులు ఆశలు వదులుకున్నారు. కానీ ఆదివారం సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రే ఈ అంశాన్ని ప్రస్తావించి ఏడాది తర్వాత వేతన సవరణ ఉంటుందని ప్రకటించటంతో వారిలో ఉత్సాహం పెరిగింది. మళ్లీ సమావేశమై ఫలితాలను విశ్లేషిద్దాం తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అ మలు చేస్తే ఆర్టీసీ దశ మారుతుందని ప్రకటించిన ముఖ్యమంత్రి... ఆ ఫలితాల విశ్లేషణకు 4 నెలల తర్వాత మళ్లీ ఇదే తరహా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారో వారినే మళ్లీ పిలిచి ఫలి తాలను తెలుసుకొని కలసి భోజనం చేస్తానని వెల్లడించారు. ఆదివారం సమావేశంలో 27 మంది కార్మికులతో సీఎం ప్రత్యేక టేబుల్‌పై భోజనం చే శారు. ఇందులో రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్, ఎండీ సునీల్‌శర్మ కూడా ఉన్నారు. వెరసి సీఎంతో కలసి 30 మంది విడిగా మాట్లాడుతూ భోజనం చేశారు. ఈ సందర్భంగా చాలా విషయాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్.. అనంతర సమావేశంలో వాటిని ఉటంకిస్తూ ప్రసంగించారు. జేఏసీలో భాగంగా ఉన్నా ఆమెకు చాన్స్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నేతృత్వం వహించిన ప్రధా న ప్రతినిధుల్లో సూపర్వైజర్స్ అసోసియేషన్‌కు చెందిన సుధ కూడా కీలకంగా వ్యవహరించారు. అశ్వత్థామరెడ్డి జేఏసీ కన్వీనర్‌గా ఉండగా మిగతా 3 సంఘాల నుంచి ముగ్గురు కో–కన్వీనర్లుగా ఉ న్నారు. వారిలో సుధ కూడా ఒకరు. అయితే సమ్మె కు కారణమైన జేఏసీ నేతలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం వారిని పక్కన పెట్టేశారు. ఆర్టీసీలో వారి జోక్యం లేకుండా చేసే దిశగా సూచనలిచ్చా రు. కానీ సుధ విషయంలో మాత్రం మరో రకం గా వ్యవహరించారు. ఆత్మీయ సమ్మేళనంలో మా ట్లాడాల్సిన అంశాలపై కసరత్తు చేసేందుకు శనివా రం ఉన్నతాధికారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆయన సుధను కూడా ఆహ్వా నించారు. ఆర్టీసీలో సమస్యలు, మహిళా ఉద్యోగు ల ఇబ్బందులపై ఆమెతో మాట్లాడారు. ఆత్మీయ సమావేశంలో కూడా ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టి కేసీఆర్ ప్రసంగించడం విశేషం. -
22న పీఆర్సీ నివేదిక!
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన త్వరలో రానుంది. రిటైర్డు ఐఏఎస్ సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) దీనికి సంబంధించి మరో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. 10 నుంచి 12 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ కమిషన్‌ను ఆదేశించారు. నిర్దేశించిన గడువుకు చివరి రోజు 22న వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని రాష్ట్ర సచివాలయ ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ నివేదిక అందిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాల నేతలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఉద్యోగులు ఆశిస్తున్న ఫిట్మెంట్ శాతంతో పాటు వారికి సంబం ధించిన ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల తొలి వారంలో సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు ఫలించిన తర్వాత గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేస్తారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. 10వ పీఆర్సీ అమలు కాలపరిమితి 2018 జూన్ 30తో ముగిసిపోగా, జూలై 1 నుంచి ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. నూతన సంవత్సరం కానుకగా 2020 జనవరి 1 నుంచి వేతన సవరణ చెల్లింపుల ప్రయోజనాల (మానిటరీ బెనిఫిట్స్)ను ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని సైతం జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిట్‌మెంట్‌పై అందరి దృష్టి... సీఆర్ బిస్వాల్ చైర్మన్‌గా, ఉమామహేశ్వర్ రావు, మహమ్మద్ అలీ రఫత్ సభ్యులుగా 2018 మే 18న పీఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వేతన సవరణతో పాటు సర్వీసు రూల్స్ సరళీకరణ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని పీఆర్సీ కమిషన్‌ను అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల సూచి ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపును ఖరారు చేయడమే ఫిట్మెంట్. వేతన సవరణ నివేదికలో ప్రధాన అంశమైన ఫిట్మెంట్ శాతంపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 63 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రదీప్‌కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని గత పీఆర్సీ కమిషన్ 29 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా, సీఎం కేసీఆర్ అనూహ్యంగా 43 శాతానికి పెంచారు. సంప్రదాయం కొనసాగిస్తారా..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను బేరీజు వేసుకుని బిస్వాల్ కమిషన్ ఫిట్మెంట్ శాతాన్ని సిఫార్సు చేయనుందని చర్చ జరుగుతుండటంతో ఉద్యోగవర్గాల్లో కొంత ఆందోళన నెలకొంది. పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసిన ఫిట్మెంట్ శాతాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం కొంత వరకు పెంచి అమలు చేసే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. పీఆర్సీ కమిషన్ ఎంత శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసినా, సీఎంతో చర్చల సందర్భంగా మెరుగైన ఫిట్మెంట్ కోసం ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఏపీలో ఇప్పటికే ఉద్యోగలకు 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో అంత కంటే ఎక్కువే ఫిట్‌మెంట్‌ను ప్రకటించవచ్చని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. -
త్వరలో వేతన సవరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 10–12 రోజుల్లో నివేదిక సమర్పిం చాలని వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత సీఎం స్వయంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి ఫిట్మెంట్ శాతంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల తొలి వారంలో ఈ సమా వేశం జరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరితే అప్పటికప్పుడు ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. 10వ పీఆర్సీ అమలు కాలపరిమితి 2018 జూన్ 31తో ముగియగా జూలై 1 నుంచి ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. సీఆర్ బిస్వాల్ చైర్మన్‌గా, ఉమామహేశ్వర్ రావు, మహమ్మద్ అలీ రఫత్ సభ్యులుగా 2018 మేలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేయగా ఏడాదిన్నర గడిచినా ఇంకా నివేదిక సమర్పించలేదు. ఉద్యోగుల వేతన సవరణతోపాటు సర్వీసు నిబంధ నల సరళీకరణ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పిం చాలని పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఆలస్యం కానుందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా ఉద్యో గులకు 2018 జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా వెనక్కి తగ్గారు. నివేదిక రాకుండా మధ్యంతర భృతి ప్రకటిస్తే కమిషన్‌ను అగౌరవ పరచినట్లు అవుతుందనే కారణాన్ని ఇందుకు చూపారు. మధ్యంతర భృతి ప్రకటన ఉండదని, నేరుగా వేతన సవరణ అమలు చేస్తామని ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యంపట్ల ఉద్యోగ సంఘాలు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం గత 37 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
మధ్యంతర భృతి ఊసేది!?
సాక్షి, అమరావతి బ్యూరో: పదో పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) గడువు ముగిసి నాలుగు నెలలు దాటింది.. 11వ పీఆర్సీ, ఐఆర్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టమైన వైఖరిని ప్రకటించడంలేదు. కొత్త పీఆర్సీ వేస్తారని, తమ జీతాలు పెరుగుతాయని ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రభుత్వం రెండు నెలల క్రితం అశుతోష్ మిశ్రా అధ్యక్షతన కంటితుడుపు చర్యగా కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి ఏడాది కాలపరిమితి విధించి చేతులు దులుపుకుంది. ఈ కమిటీ ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కమిటీ నివేదిక వచ్చేలోగా పెరిగిన ధరలతో ఉద్యోగులు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల ఐక్యతకు చిచ్చు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించి వారి ఐక్యతను దెబ్బతీసింది. ఉపాధ్యాయులలో పండిట్ అప్‌గ్రెడేషన్‌తో ఎస్జీటీలకు, పండిట్లకు మధ్య చిచ్చు పెట్టింది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ వివాదంలో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుండటంతో ఐఆర్‌ను అడిగేవారు లేకుండాపోయారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు.. ఎన్జీఓలు సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టారు. ఇదే అదునుగా తీసుకుని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలాగే దాటేస్తారా? ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం 11వ పీఆర్సీ వెంటనే ఇస్తామంటూ చెప్పి కనీసం ఐఆర్‌ని కూడా ప్రకటించకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. తదుపరి నిర్ణయాన్ని గవర్నర్‌కి అప్పగించి చేతులు దులుపుకుంది. ఇక్కడ కూడా జనవరిలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు ఉండటం, ముందస్తుగా సాధారణ ఎన్నికలు జరగనున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు ఇలా మభ్యపెట్టి అలస్యం చేయడంవల్ల ఇప్పటికే రెండు పీఆర్సీలు వెనకబడి ఉన్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రభావం పదవీ విరమణ తర్వాత ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. డిసెంబర్లోనే నిర్ణయం ప్రకటించాలి పండిట్ అప్‌గ్రెడేషన్, పీఆర్సీ అంశాలను వేర్వేరుగా చూడాలి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు పీఆర్సీలను ప్రకటించే ఎన్నికలకు వెళ్లాయి. జిల్లాల పర్యటనంటూ కమిటీ కాలయాపన చేస్తోంది తప్ప ఉద్యోగుల అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. డిసెంబరులోగా ఐఆర్‌పై సహేతుక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతాం. – ఎన్. రఘురామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (257) రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం పీఆర్సీ గడువు ముగిసి నాలుగు నెలలు పూర్తయినా కమిటీ ఇప్పటివరకు కేవలం ఆరు జిల్లాల్లోనే పర్యటించింది. ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఐఆర్‌ను వెంటనే ప్రకటించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు దిగుతాం. ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. – చేబ్రోలు శరత్చంద్ర, బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
‘సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె’
హైదరాబాద్: వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రకారం వేతన సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని, అడ్హాక్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేయాలని వివిధ గురుకులాల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం, మంత్రులకు ఈ-మెయిల్స్ ద్వారా నిరసనలు తెలుపుతామని, 26న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సంఘాల నాయకులు రవిందర్, వెంకటరెడ్డి, రామలక్ష్మణ్ తెలిపారు. -
43 శాతం ఫిట్మెంట్ సరికాదు
హైకోర్టులో వ్యాజ్యం దాఖలు హైదరాబాద్: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) చేసిన సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ఫోరం ఫర్ బెటర్ లివింగ్ ’ చైర్పర్సన్ డి.పద్మజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రదీప్‌కుమార్ అగర్వాల్ అధ్యక్షతన ప్రభుత్వం పదవ పీఆర్సీ ఏర్పాటు చేసిందని, ఉద్యోగులతో చర్చల తరువాత 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని పిటిషనర్ తెలిపారు. అయితే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉద్యోగులకు ఏకంగా 43 శాతం మేర ఫిట్మెంట్ ప్రకటించిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు ఆగకుండా ప్రభుత్వం అత్యుత్సాహంతో ఆగమేఘాలపై 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిందని పద్మజ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే నగదురహిత వైద్య సదపాయం, ఎల్టీసీ, ఇళ్ల స్థలాలు, బీమా, నామమాత్రపు వడ్డీకి రుణాలు ఇలా అనేక ప్రయోజనాలు వారికి లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా సామాన్య ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల నుంచి చెల్లిస్తున్నదేనని వివరించారు. ఉద్యోగుల సమస్యలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇదే సమయంలో సామాన్య ప్రజల కష్టాలను, నష్టాలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయం, విద్యుత్, విద్య తదితరాలను పట్టించుకోకుండా ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకివ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. -
పీఆర్సీ.. ఉద్యోగులకు ప్రభుత్వ కానుక!
-
పీఆర్సీపై కేసీఆర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలు
-
పీఆర్సీ కోసం మున్సిపల్ ఉద్యోగుల నిరసన
వేతన సవరణ అమలు చేయాలంటూ అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు నిరసన తెలిపారు. అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు విధులు బహిష్కరించి, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పీఆర్సీ అమలు వెంటనే చేయాలంటూ పురపాలక సంఘం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఏప్రిల్ వరకూ.. పీఆర్సీ లేనట్టే!
-
పీఆర్సీ లేనట్టే!
* ఈ బడ్జెట్లో కష్టమే.. జాప్యం అనివార్యం * అందుకే కమిటీ వేశారంటూ ఉద్యోగుల్లో ఆందోళన * ఇప్పటికీ చర్చలు ప్రారంభించని హైపవర్ కమిటీ * ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు దాదాపు రూ. 200 కోట్లు * ఈ ఆర్థిక సంవత్సరంలో భారాన్ని భరించడం కష్టం * ఇక ఏప్రిల్‌లోనే పీఆర్సీ వస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ * కుటుంబానికి ముగ్గురినే లెక్కగట్టడంపై అభ్యంతరాలు * ఏడాదిన్నర కిందటి ధరలతో ఖర్చులు పోల్చారని ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘జనవరి మూడో వారంలో పీఆర్సీపై ప్రకటన వస్తుంది. జనవరి నుంచే అమలు చేస్తాం. ఉద్యోగులు సంతృప్తి చెందేలా ప్రయోజనాలు కల్పిస్తాం.’ - గత నెల 30న సీఎం కేసీఆర్ ప్రకటన మరోవైపు.. ఈ నెల 12న పీఆర్సీపై హైపవర్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ కన్వీనర్‌గా ఇది ఏర్పాటైంది. పీఆర్సీ కమిషనర్ అగర్వాల్ ఇచ్చిన నివేదికలోని సిఫారసులను పరిశీలించడంతోపాటు ఉద్యోగ సంఘాలతోనూ ఈ కమిటీ చర్చలు జరుపుతుందని ప్రభుత్వం ప్రకటిం చింది. ఇంకోవైపు.. పీఆర్సీ అమలులో ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు రూ. 180 కోట్ల నుంచి రూ. 200 కోట్లు కావాలి. ఈ లెక్కన పీఆర్సీ చైర్మన్ చేసిన 29 శాతం ఫిట్‌మెంట్‌కే రూ. 3,500 కోట్లకుపైగా నిధులు అవసరం. ఈ మొత్తాన్ని ప్రస్తుత బడ్జెట్లో ఇచ్చే పరిస్థితి లేనేలేదు. వచ్చే బడ్జెట్లోకేటాయించి అమలు చేస్తేనే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. ఇక 37శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సి వస్తే రూ. 6,660 కోట్ల నుంచి రూ. 7,400 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అదే ఉద్యోగులు కోరుతున్నట్లు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ. 7,700 కోట్ల నుంచి రూ. 8,600 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని, అంత భారం ఇప్పుడు భరించడం కష్టమన్నది ఆర్థిక శాఖ వర్గాల వాదన. ఇవీ రాష్ట్రంలో పీఆర్సీ అమలు విషయంలో వివిధ పరిణామాలు. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే పీఆర్సీని ఇప్పట్లో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఆర్థిక శాఖ కోణంలో చూస్తే పీఆర్సీ అమలు ఆలస్యమయ్యేలా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కొత్త బడ్జెట్లో నిధులను కేటాయించి, వచ్చే ఏప్రిల్‌లోనే అమల్లోకి తెచ్చే అవకాశముందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం చెప్పినట్లు ఈ నెలలోనే పీఆర్సీ అమల్లోకి వస్తుందని భావించినప్పటికీ అది ఆచరణకు నోచుకునే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆలస్యం తప్పదేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది. మరోవైపు హైపవర్ కమిటీ కూడా ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించలేదు. వచ్చే వారంలో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. అదీ అన్ని సంఘాలతో ఒకేసారి చర్చిస్తుందా లేక ఒక్కో సంఘంతో వేర్వేరుగా భేటీ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. పీఆర్సీ సిఫారసులపై శాఖలవారీగా ఉద్యోగుల్లో అనేక ఆందోళనలు, సమస్యలు ఉన్నాయి. వేతన స్థిరీకరణలో అన్యాయం జరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాఖలవారీగానే సమావేశాలు నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతో పీఆర్సీ అమలులో ఆలస్యం తప్పకపోవచ్చన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. కమిటీ తేల్చేది చిన్న లోపాలనే! సాధారణంగా పీఆర్సీలో లోపాలపై, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై పునఃపరిశీలనకు అనామలీస్ కమిటీని వేయడం ఆనవాయితీ. హైపవర్ కమిటీలో ప్రధాన సమస్యలను తేల్చేదేమీ ఉండదన్నది సంఘాల భావన. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికే ఈ కమిటీ పరిమితమయ్యే అవకాశముంది. పైగా ఫిట్మెంట్, నగదు రూపంలో పీఆర్సీ అమలు తేదీల ఖరారు వంటి ప్రధానాంశాలపై ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా మరింత జాప్యం జరుగుతుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. కనీస మూల వేతనం పెంపు, ఫిట్మెంట్ నిర్ణయం, నగదు రూపంలో వర్తింపు వంటి ప్రధాన అంశాలు సీఎం స్థాయిలోనే తేల్చాల్సి ఉంది. ఈ లెక్కన చిన్న చిన్న లోపాలపై హైపవర్ కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చల తర్వాత సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో మరోసారి సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని, ఇందుకు చాలా సమయం పట్టవచ్చని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇరకాటంలో సంఘాల నేతలు.. మూడో వారంలో పీఆర్సీ అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇరకాటంలో పడ్డాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోన్న ఆందోళన ఉద్యోగ నేతల్లో వ్యక్తమవుతోంది. ఫిట్మెంట్, నగదు రూపంలో పీఆర్సీ అమలు తేదీ తదితర అంశాలపై ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయినా, అటు ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయినా తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పీఆర్సీ అమలుకు సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబమంటే నలుగురు! పదో వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) సిఫారసుల్లో భాగంగా కుటుంబానికి ముగ్గురు సభ్యులనే(మూడు యూనిట్లుగానే) పరిగణనలోకి తీసుకోవడాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుటుంబమంటే ముగ్గురేనన్న నిర్వచనంతో వేతన స్థిరీకరణ చేయడం అశాస్త్రీయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగానే కనీస మూల వేతనాన్ని నిర్ధారించడం సరికాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తగిన మార్పులు చేయించుకోవాలని ఉద్యోగవర్గాలు పట్టుదలగా ఉన్నాయి. పైగా 2013 జూలై 1కి ముందున ్న నిత్యాసవరాల ధరలనే పరిగణనలోకి తీసుకోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగినందున పీఆర్సీ నివేదికలో సిఫారసు చేసిన రూ. 13 వేల కనీస మూల వేతనాన్ని రూ. 15 వేలకు పెంచాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. తద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా లబ్ధి కలుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలోని జనాభా, కుటుంబాల సంఖ్య సరాసరి ఆధారంగా కుటుంబ నిర్వచనం ఉంటుంది. అయితే కుటుంబమంటే మూడు యూనిట్లేనని ఇంట ర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్(ఐఎల్సీ) తీర్మానించింది. ఈ మేరకే లెక్కలేసి పీఆర్సీ కమిషన్ నివేదిక అందించింది. అయితే జాతీయ కుటుంబ సర్వే ప్రకారం నలుగురిని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉంటు న్నా.. కనీసం నాలుగు యూనిట్లను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని నిర్ధారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇద్దరు పిల్లల కయ్యే ఖర్చు ఒక పెద్ద వ్యక్తికంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఫీజుల రూపం లో భారీగా చెల్లించాల్సి వస్తున్నా పీఆర్సీ పట్టించుకోలేదని, కనీస మూల వేతనం రూ. 15 వేలు చేయాలని కోరుతున్నారు. కాగా, ఫిట్మెంట్తోపాటు నగదు రూపంలో వర్తింపు తేదీ విషయంలో ఉద్యోగుల్లో భారీ ఆశలు ఉన్నాయి. కానీ 37 శాతానికి మించి ఫిట్మెంట్ కష్టమేనని ప్రభుత్వవర్గాలు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఏ విషయంలోనూ వెనక్కి తగ్గవద్దంటూ సంఘాల నేతలకు ఉద్యోగులు గట్టిగా సూచిస్తున్నారు. ఇదేం లెక్క? ఒక్కో కుటుంబానికి నెలకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు తదితరాల కోసం రూ. 838 ఖర్చవుతుందని, నెలకు ఒక్కో కుటుంబానికి 42.75 కేజీల బియ్యం అవసరమని పదో పీఆర్సీ లెక్కలేసింది. కిలో బియ్యం ధరను రూ. 34.99గా పరిగణించింది. ఇక దుప్పట్ల మొదలు దుస్తుల వరకు అన్ని అవసరాలకు ఏటా రూ. 17 వేలు సరిపోతాయని పేర్కొంది. అలాగే ఒక్కో కుటుంబానికి నెలకు 18 లీటర్ల పాలతోనే సరిపెట్టింది. ఐఎల్సీ గణాంకాల ప్రకారమే పౌష్టికాహారం అందాలంటే నెలకు 75 లీటర్ల పాలు వినియోగించాలని, ఇలాంటి వాటిని పీఆర్సీ పట్టించుకోలేదని, వాస్తవిక అంచనాలతో లెక్కలుగట్టి కనీస వేతనాన్ని పెంచాలని ఉద్యోగవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
69 శాతం ఫిట్మెంట్ కావాలని డిమాండ్
-
బెనిఫిట్ ఎంత?
పీఆర్సీ అమలుపై తెలంగాణ ఉద్యోగుల్లో భారీ ఆశలు 69 శాతం ఫిట్మెంట్ కావాలని డిమాండ్ కనీసం 49 శాతమిచ్చినా నాలుగు ఇంక్రిమెంట్లకు అవకాశం 2014 జనవరి నుంచి నగదు రూపంలో వర్తింపజేయాలి కనీస వేతనం 15 వేలు, గ్రాట్యుటీ 15 లక్షలకు పెంచాలి సచివాలయంలో ఉద్యోగ సంఘాల భేటీలో చర్చ 17న హైపవర్ కమిటీతో సమావేశానికి సమాయత్తం చింతకింది గణేశ్: పదో పీఆర్సీ అమలులో భాగంగా ఫిట్మెంట్ బెనిఫిట్‌ను భారీగా సాధించుకునే దిశగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంతో చర్చల సందర్భంగా 49 శాతమైనా సాధించుకోవాలన్న యోచనలో ఉన్నాయి. అది కూడా సాధ్యంకాని పక్షంలో 43 శాతానికంటే తగ్గేది లేదని ఉద్యోగులు భీష్మించుకున్నారు. తద్వారా సర్వీసులో ఉన్న ఒక్కో ఉద్యోగికి అదనంగా మూడు ఇంక్రిమెంట్లు వస్తాయి. పదో పీఆర్సీ కమిషనర్ అగర్వాల్ మాత్రం 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేశారు. దాని ప్రకారమే కొత్త వేతనాలను నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తే 34 శాతం వరకైనా ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. 35 శాతం ఫిట్మెంట్ ఇస్తే మాత్రం ఒక ఇంక్రిమెంట్ లభిస్తుంది. అదే 37 నుంచి 42 శాతం వరకు ఇస్తే మరొక ఇంక్రిమెంట్(రెండోది) లభిస్తుంది. 43 శాతమైతే మూడు... అదే 49 శాతం అయితే నాలుగు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అయితే ప్రభుత్వం ఈ స్థాయిలో ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ర్ట ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 37 శాతంలోపే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. 9వ పీఆర్సీలో అప్పటి ప్రభుత్వం 39 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చింది. దీంతో ఈసారి తక్కువలో తక్కువ 43 శాతమైనా ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. కాగా, పీఆర్సీని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారన్నది కూడా కీలకమేకానుంది. 2013 జూలై 1 నుంచే పీఆర్సీని నగదు రూపంలో వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. మరీ కాదంటే చివరకు 2014 జనవరి 1 నుైంచె నా అమలుకు ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ఫిట్‌మెంట్‌పై తగ్గేది లేదు.. ఈ నెల 17న హైపవర్ కమిటీతో పీఆర్సీ అంశంపై చర్చించడానికి వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 69 శాతం ఫిట్మెంట్ కోసమే పట్టుపట్టాలని ఉద్యోగ నేతలు భావిస్తున్నారు. ఉద్యోగులకు కడుపునిండా పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పీఆర్సీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, టీజీవో కార్యదర్శి సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు నరేందర్‌రావు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎస్టీయూ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు రాజిరెడ్డి, భుజంగరావు, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఫిట్‌మెంట్‌ను భారీగా సాధించుకోవాల్సిందేనని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక కుటుంబానికి ముగ్గురినే పరిగణనలోకి తీసుకుని కనీస వేతనం రూ. 13 వేలుగా నిర్ధరించారని, నలుగురు సభ్యులను పరిగణనలోకి తీసుకొని రూ. 15 వేలు చేయాలని సర్కారును కోరనున్నారు. గ్రాట్యుటీని 15 లక్షలకు పెంచాలని కూడా డిమాండ్ చేయనున్నారు. వెయిటేజీ ఇంక్రిమెంట్లను ప్రతి ఐదేళ్లు, పదేళ్లు, 15 ఏళ్లకు ఒకటి చొప్పున ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ పెంచాలని కూడా డిమాండ్ చేయనున్నారు. -
వీటీపీఎస్ ఎదుట కార్మికుల ఆందోళనలు
విభజన నేపథ్యంలో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని వీటీపీఎస్ కార్మికులు ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఎదుట ఆ సంస్థ కార్మికలు ఆందోళన చేపట్టారు. విభజన నేపథ్యంలో పీఆర్సీపై వీటీపీఎస్ కార్మికుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. దాంతో కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. దాంతో వీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. -
22-25 శాతం మధ్యంతర భృతి!
* నేడు సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి భేటీ * 30% అయినా ఇవ్వాలని కోరుతున్న ఉద్యోగ సంఘాలు * గతంలో 22% ఐఆర్ ఇచ్చిన వైఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులను, ఉద్యోగ సంఘాల నేతలను శనివారం అందుబాటులో ఉండాల్సిందిగా కోరింది. పదవ వేతన సవరణ కమిషన్ నివేదిక వచ్చే ఏడాది గానీ ప్రభుత్వానికి అందే అవకాశం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు గత కొంత కాలంగా మధ్యంతర భృతి (ఐఆర్)ని మంజూరు చేయాల్సిందిగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ఉదయం ఆర్థిక శాఖ మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమై కసరత్తు చేయనున్నారు. సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోకూడా సమావేశం ఉంటుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిపోయినందున మధ్యంతర భృతిని 40 నుంచి 50 శాతం వరకు ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఆర్థిక శాఖ అధికారులు 17 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీ సమయంలో 20 నుంచి 25 శాతం వరకు మధ్యంతర భృతి మంజూరుపై చర్చలు జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003లో ఉద్యోగులకు 8.5 శాతమే ఐఆర్ మంజూరు చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 16 శాతం వరకు ఇచ్చారు. అలాగే ఆయన తొమ్మిదవ వేతన సవరణ కమిషన్‌ను నియమించారు. కమిషన్ నివేదిక రాకముందే ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఐఆర్‌ను ఏకంగా 22 శాతం మేర మంజూరు చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం 30 శాతం మేర అయినా మంజూరు చేయాలనేది ఉద్యోగ సంఘాల వాదనగా ఉంది. అంతిమంగా 22 నుంచి 25 శాతం మధ్యలో ముఖ్యమంత్రి ఐఆర్ మంజూరు చేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గడువు ఈ ఏడాది జూన్ నెలాఖరుతో ముగిసింది. పదో కమిషన్ సవరణ వేతనాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నందున అప్పటి నుంచే మధ్యంతర భృతిని మంజూరు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. -
పీఆర్సీ కోసం బడ్జెట్లో రూ. 6,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15)లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,500 కోట్లు కేటాయించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ముహూర్తం నిర్ణయించారు. ఉద్యోగ సంఘాలతో శనివారం మధ్యంతర భృతిపై చర్చించడానికి సీఎం సమయం కేటాయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు 15 నుంచి 17 శాతం వరకు ఐఆర్ మంజూరుకు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుత వేతనాలపై 15 శాతం మేర ఐఆర్ ఇస్తే రూ. 2,500 కోట్లు.. అదే 17 శాతం ఐఆర్ మంజూరు చేస్తే రూ. 2,800 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చల సమయంలో 20 శాతం నుంచి 22 శాతం లేదా 25 శాతం వరకు ఐఆర్ మంజూరుకు అంగీకారానికి రావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 20 శాతం మేర ఐఆర్ మంజూరు చేస్తే రూ. 3,200 కోట్లు.. 22 శాతం మేర మంజూరు చేస్తే రూ. 3,600 కోట్లు.. 25 శాతం మేర మంజూరు చేస్తే రూ. 4 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ మంజూరునకు సంబంధించిన అంశాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ చూస్తున్నారు. విభజన తర్వాత ఖజానాలో నిల్వ ఉన్న నిధులను ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంపిణీ చేయాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో పాటు పీఆర్సీ నివేదిక కూడా జాప్యం అవుతుండటంతో ఉద్యోగుల డిమాండ్ మేరకు ఐఆర్ మంజూరు చేయాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. -
పీఆర్సీతో సంఘాల చర్చలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) చర్చలను గురువారం ముగించింది. ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలు, డిమాండ్ల మీద రెండు నెలలకుపైగా ఒక్కో సంఘంతో పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ వేర్వేరుగా చర్చలు జరిపారు. వేతన సవరణ సిఫార్సుల నిర్ధారణలో ఉద్యోగ సంఘాలతో చర్చలది ముఖ్యపాత్ర. చర్చల ప్రక్రియ ముగింపుతో పీఆర్సీ పనిలో ముఖ్యమైన ఘట్టం పూర్తయింది. ఇక నివేదిక రూపకల్పన మీద పీఆర్సీ కసరత్తు ప్రారంభించనుంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో.. నివేదికను త్వరగా తెప్పించుకొని కొత్త పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. డిసెంబర్ రెండో వారానికి నివేదిక తయారు చేయడం వీలవుతుందని, ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటే త్వరలోనే ప్రభుత్వానికి అందే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. నివేదిక సమర్పించడానికి మార్చి రెండోవారం వరకు పీఆర్సీకి గడువు ఉంది. త్వరలో ఐఆర్..?: పీఆర్సీ అమలు కంటే ముందు మధ్యంతర భృతి(ఐఆర్) కోసం పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రచ్చబండ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. 50 శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 25-35 శాతం మధ్య నిర్ణయమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. సంతృప్తికర స్థాయిలో ఐఆర్ ప్రకటిస్తే, పీఆర్సీ అమల్లో మెరుగైన ఫిట్మెంట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. 75% ఫిట్మెంట్తో చెల్లించాలి: సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు 75 శాతం ఫిట్మెంట్తో వేతనాలు చెల్లించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 63 శాతం డీఏ చెల్లించాలని పీఆర్సీని కోరారు. సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు గురువారం పీఆర్సీ చైర్మన్‌ను కలిసి తమ ప్రతిపాదనలపై వివర ణ ఇచ్చారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ. 16 వేలుగా నిర్ధారించాలని పీఆర్సీని కోరినట్టు సమాఖ్య నేతలు మురళీకృష్ణ, నరేందర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో 5 రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పొడిగించాలని, నగర ఉద్యోగులకు సిటీ అలవెన్స్‌ను రూ. 6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ రూ. 25 లక్షల గృహ రుణాలు అందజేయాలన్నారు. వచ్చేనెల 15వ తేదీలోగా పీఆర్సీని అమల్లోకి తేవాలని, 45శాతం మధ్యంతర భృతి చెల్లించాలని విన్నవించారు. కనీస పెన్షన్ రూ. 15 వేలు చెల్లించాలి: పెన్షనర్ల సంఘం సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 15 వేలు చెల్లించాలని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ పీఆర్సీకి నివేదించింది. కనీస వేతనంతో సమానంగా పెన్షన్ చెల్లించాలని కోరింది. ఉద్యోగి రిటైర్డ్ అయితే రూ. 15 లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని అసోషియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్ రెడ్డి గురువారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్‌ను కలిసి విన్నవించారు.