indhumathi
-
‘సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటాం’
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తిరుపతి నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తారకరామ స్టేడియంలో జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేశారు. ఈ కార్యక్రమంలో ‘జగనన్న విద్యాదీవెన పథకం’ ద్వారా లబ్ధిపొందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇందుమతి మాట్లాడింది. ఇవాళ తను ఇంజనీరింగ్ చదువుతున్నానంటే జగనన్నే కారణమని తెలపింది. సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటామని పేర్కొంది. తన తండ్రి సామన్య రైతు అని, తననుఇంజనీరింగ్ చదివించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. అదే సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సులభంగా చదువును పూర్తి చేసుకున్నానని పేర్కొంది. అలాగే హాస్టల్ వసతి కోసం ప్రతి సంవత్సరం రూ. 20 వేలు వస్తున్నాయని చెప్పింది. చదవండి: చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదు: మంత్రి ఆర్కే రోజా ‘నాతో పాటు నా కుటుంబాన్ని కూడా జగనన్న ప్రభుత్వం సాయపడుతుంది. చెల్లెకి అమ్మఒడి పథకం ద్వారా 15 వేలు, తండ్రికి రైతు భరోసా ద్వారా 13,500.. నానమ్మకు ఆసరా ఫించన్ వస్తుంది. ఇలా ఎన్నో కుటుంబాలను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఙతలు. జగనన్న విద్యాదీవెన ద్వారా చదువుకొని కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో మూడు ఉద్యోగాలు సాధించానని జగనన్న చెల్లిగా గర్వంగా చెబుతున్నాను. ఇలా జగనన్న ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ప్రసంగించింది. అనంతరం సీఎం జగన్ సదరు విద్యార్ధిని ఆశీర్వదించారు. -
ఫేస్బుక్ ప్రేమ విషాదాంతం
సాక్షి, చెన్నై : ఒరత్తనాడులో ఫేస్బుక్ ద్వారా పరిచయమై, ప్రేమించి వివాహం చేసుకున్న ప్రభుత్వ వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. భార్య శవం పక్కనే మద్యం మత్తులో ఉన భర్తని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోడ్ జిల్లా బాలవాడి గ్రామానికి చెందిన సుబ్రమణియన్ కుమార్తె ఇందుమతి(20). ఆమె ప్రభుత్వ వెటర్నరీ వైద్య కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుంది. ఈమెకు పేస్బుక్ ద్వారా శివగంగై జిల్లా పుదుకోటైకు చెందిన ఎలక్ట్రీషియన్ సతీష్ పరిచయమైనాడు. ఈ క్రమంలో గత సంవత్సరం ఇందుమతి ఇంట్లో తెలియకుండా సతీష్‌ను రిజిష్టర్ వివాహం చేసుకుని ఒరత్తనాడులో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. సోమవారం ఇందుమతి ఉంటున్న ఇంటి తలుపులు తెరచుకోకపోవడంతో సందేహించిన ఇరుగుపొరుగు వారు అక్కిడికి వెళ్లి చూడగా ఇందుమతి ఫ్యాన్‌కు శవంగా వేలాడుతుంది. ఆమెకు సమీపంలో సతీష్ మద్యం మత్తులో పడి ఉన్నాడు. ఒరత్తనాడు పోలీసులు అక్కడికి చేరుకుని ఇందుమతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తంజై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుమతి భర్త సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
ఏలూరు : ఇందుమతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట ఇందుమతి మృతదేహంతో వారు ఆందోళనకు దిగారు. ఇందుమతి మరణానికి కారకులైన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. అంతలో రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి... ఇందుమతి తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఇందుమతి బంధువులు, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఆమెను అడ్డుకున్నారు. ప్రభుత్వపరంగా మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణలో ఉందని... పోలీసులు తమ పని తాము చేసుకుని పోతారంటూ నన్నపనేని చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఇందుమతి తల్లిదండ్రులను పరామర్శించకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఇందుమతి కుటుంబానికి మంత్రి పీతల పరామర్శ
ఏలూరు : ప్రమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఇందుమతి కుటుంబాన్ని మంత్రి పీతల సుజాత ఆదివారం పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులను మంత్రి పీతల సుజాత పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల మీ కుటుంబాన్ని అదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ఇందుమతి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పీతల సుజాత హామీ ఇచ్చారు. చట్టపరంగా నిందితులపై అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఇందుమతి అనే యువతికి ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నారు. ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో ఆమెపై మరింత ఒత్తిడి తీసుకువచ్చాడు. దాంతో ఇందుమతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు సదరు యువకుడిని మందలించారు. ఇందుమతితో చదువు మాన్పించారు. దీంతో ఆగ్రహించన సదరు ప్రేమికుడు .. శనివారం ఇందుమతిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుమతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే.