ఫేస్‌బుక్‌ ప్రేమ విషాదాంతం | Veterinary Student Suspicious Death In Chennai | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ ప్రేమ విషాదాంతం

Jul 23 2019 8:14 AM | Updated on Jul 23 2019 9:49 AM

Veterinary Student Suspicious Death In Chennai - Sakshi

ఇందుమతి మృతదేహం, సతీష్‌

ఇందుమతి ఇంట్లో తెలియకుండా సతీష్‌ను రిజిష్టర్‌ వివాహం చేసుకుని ..

సాక్షి, చెన్నై : ఒరత్తనాడులో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై, ప్రేమించి వివాహం చేసుకున్న ప్రభుత్వ వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. భార్య శవం పక్కనే మద్యం మత్తులో ఉన భర్తని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోడ్‌ జిల్లా బాలవాడి గ్రామానికి చెందిన సుబ్రమణియన్‌ కుమార్తె ఇందుమతి(20). ఆమె  ప్రభుత్వ వెటర్నరీ వైద్య కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుంది. ఈమెకు పేస్‌బుక్‌ ద్వారా శివగంగై జిల్లా పుదుకోటైకు చెందిన ఎలక్ట్రీషియన్‌ సతీష్‌ పరిచయమైనాడు. ఈ క్రమంలో గత సంవత్సరం ఇందుమతి ఇంట్లో తెలియకుండా సతీష్‌ను రిజిష్టర్‌ వివాహం చేసుకుని ఒరత్తనాడులో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. సోమవారం ఇందుమతి ఉంటున్న ఇంటి తలుపులు తెరచుకోకపోవడంతో సందేహించిన ఇరుగుపొరుగు వారు అక్కిడికి వెళ్లి చూడగా ఇందుమతి ఫ్యాన్‌కు శవంగా వేలాడుతుంది. ఆమెకు సమీపంలో సతీష్‌ మద్యం మత్తులో పడి ఉన్నాడు. ఒరత్తనాడు పోలీసులు అక్కడికి చేరుకుని ఇందుమతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తంజై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఇందుమతి భర్త సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement