india Australia match
-
కుర్రాళ్లకు భలే చాన్స్
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో క్రికెట్ సందడి నెలకొంది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా గురు వారం రాత్రి 7 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ–20 మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్న ఇరు జట్లు స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ విక్రయించారు. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత క్రికెట్ అభిమానులు చాలా డీలా పడ్డారు. ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కీలక పో రు ముగిసిన తర్వాత జరుగుతున్న టీ–20 మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో యువ క్రికెటర్లకు ఈ సిరీస్ గొప్ప సువర్ణావకాశం. ఐపీఎల్, ఇటీవల ఐర్లాండ్ టూర్లో విజృంభించిన కుర్రాళ్లు.. విశాఖ వేదికగా సత్తా చాటి జాతీయ జట్టులో బెర్త్ పదిలం చేసుకోవచ్చు. జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టి శుభారంభం అందించాలని కోరుకుంటున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ సాధించి ఊపు మీదు న్న ఆస్ట్రేలియా నాలుగు రోజుల వ్యవధిలోనే విశాఖ వేదికగా టీ20 సిరీస్‌కి సిద్ధమైంది. భారత్ తరఫున ప్రధాన ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆస్ట్రేలియా తరఫున కొందరు ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరారు. ఫైనల్లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికే విశాఖకు చేరుకుని నెట్స్‌లో శ్రమించారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ ఆరంగేట్రం చేసే కుర్రాళ్లు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగనుండగా.. ఆసియా కప్, ఐర్లాండ్ టీ–20 సిరీస్ మినహా పూర్తిస్థాయిలో మేజర్ టోర్నీలు ఆడిన అనుభవం లేని యువ భారత్ జట్టు వారితో ఢీ కొట్టనుంది. భారత్‌కు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్‌కు, కోచ్‌గా వి.వి.ఎస్ లక్ష్మణ్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్ కుర్రాళ్లు శుభారంభం చేసి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. పరిస్థితికి తగ్గట్టుగా రాణిస్తే విజయమే విశాఖ స్పోర్ట్స్: పరిస్థితులకు తగ్గట్టుగా రాణిస్తే విజయం సాధ్యమేనని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. టీ–20 సిరీస్లోశుభారంభం చేసేందుకు ఎలాంటి ప్రణాళిక చేశారనే విషయాలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో చాలా డిస్పాయింట్ అయ్యామని, అయితే టోర్నీ మొత్తం చాలా కష్టపడ్డామన్నారు. ఫైనల్‌కు చేరడంలో ప్రతీ ఆటగాడు సమష్టిగా జట్టుకు తోడ్పడినట్లు చెప్పారు. విశాఖలో పిచ్‌ను పరిశీలించానని, చాలా మంచి పిచ్ అన్నారు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించడం సవాలేనని, దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటానన్నారు. నూతనోత్తేజంతో ముందుకు సాగుతామన్నారు. -
భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్.. వైజాగ్‌లో కట్టుదట్టమైన బందోబస్తు!
విశాఖపట్నం: భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 23న వైఎస్సార్ స్టేడియంలో జరిగే టీ–20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు రెండు వేల మందితో పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి క్రీడాకారులు బయలుదేరే ప్రాంతాల్లోనే కాకుండా.. వారు బస చేసే హోటళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వెళ్లే అన్ని గేట్ల వద్ద ఏసీపీ స్థాయి అధికారులను నియమించారు. స్టేడియం వద్ద మూడంచెల భద్రతతో పలు సెక్టార్లుగా విభజించారు. స్టేడియం లోపల, బయట, చుట్టూ ఉన్న బహుళ అంతస్తులపైనా పూర్తి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా ఎక్కడా ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీసుల సూచనలివీ.. ► అనేక ప్రత్యేకతలతో టికెట్ డిజైన్ చేశారు. లెవల్–1లో టికెట్‌ను హాఫ్ ఇంచ్ చింపితే ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. టికెట్‌ను సమాంతరంగా పెట్టి చూస్తే గోల్డ్ కలర్ సెక్యూరిటీ థ్రెడ్ కనిపిస్తుంది. టికెట్‌పై బార్కోడ్ స్కాన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. అలా ఉంటేనే ఒరిజినల్ టికెట్‌గా పరిగణిస్తారు. ► కొంతమంది కలర్ జిరాక్స్ తీసిన టికెట్లను అమ్మి మోసగిస్తారు. అటువంటి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కలర్ జిరాక్స్ టికెట్లను కొని మోసపోవద్దు. ► బయట నుంచి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లను అనుమతించరు. స్టేడియంలోనే ఇవి అందుబాటులో ఉంటాయి. ► స్టేడియం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రేక్షకులు ఎవరైనా ఎటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా.. పరిధి దాటి ఆటగాళ్లతో సెల్ఫీలు తీసుకున్నా.. ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవు. ► సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ప్రేక్షకులను సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. ట్రాఫిక్, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు టీ–20 మ్యాచ్ సందర్భంగా స్టేడియానికి 28 వేల మంది వచ్చే అవకాశముంది. వేల సంఖ్యలో వాహనాలపై వారు వచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగా పోలీసులు ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ► మ్యాచ్‌తో సంబంధం లేని వాహనచోదకులు క్రికెట్ స్టేడియం వైపు నుంచి కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలి. ► శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి నగరంలోకి వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు మారికవలస వద్ద ఎడమ వైపునకు తిరిగి.. జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరుకోవాలి. కుడి వైపున బీచ్ రోడ్డులో ప్రయాణించి రుషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ► శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి కార్ షెడ్ నుంచి మిథిలాపురి కాలనీ మీదుగా.. ఎంవీవీ సిటీ వెనుకగా వెళ్లాలి. అక్కడి నుంచి లా కాలేజీ రోడ్డు మీదుగా ఎన్‌హెచ్ 16కు చేరుకుని నగరానికి చేరుకోవాలి. లా కాలేజీ రోడ్డు నుంచి పనోరమ హిల్స్, రుషికొండ మీదుగా కూడా నగరంలోకి వెళ్లవచ్చు. ► నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు, హనుమంతవాక నుంచి ఎడమ వైపు తిరిగి.. ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్లి అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్లాలి. ► నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు హనుమంతవాక జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి.. అడివివరం మీదుగా ఆనందపురం వెళ్లొచ్చు. లేదా హనుమంతవాక జంక్షన్ లేదా విశాఖ వ్యాలీ జంక్షన్ లేదా ఎండాడ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డుకు చేరుకుని.. తిమ్మాపురం వద్ద ఎడమ వైపు తిరిగి మారికవలస వద్ద ఎన్‌హెచ్ 16కు చేరుకోవచ్చు. భారీ వాహనదారులకు సూచనలు ►23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఎటువంటి భారీ వాహనాలు స్టేడియం వైపు అనుమతించరు. ► అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. ►శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాలి. ► నగరం నుంచి బయలుదేరి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే భారీ వాహనాలు అన్నీ అనకాపల్లి వైపుగా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ప్రయాణించాలి. ► శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలన్నీ ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి మీదుగా నగరంలోకి చేరుకోవాలి. మ్యాచ్ వీక్షించడానికి వచ్చే వాహనచోదకులకు సూచనలు నగరం నుంచి స్టేడియానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ వాహనచోదకులు ఎన్‌హెచ్16లో స్టేడి యం వరకు ప్రయాణించి.. ఏ గ్రౌండ్, బీ గ్రౌండ్, వి కన్వెన్షన్ గ్రౌండ్లలో వారి వారి పాస్‌ల ప్రకారం చేరుకోవాలి. విశాఖ వైపు నుంచి స్టేడియానికి వచ్చే టికెట్ ఉన్న వారు ఎన్‌హెచ్16లో ప్రయాణించి.. స్టేడియం సమీపంలోని ఓల్డేజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలే జీ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. అక్కడే ఆన్లైన్ టికెట్లను ఒరిజినల్ టికెట్లుగా మార్చుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుంచి వచ్చే వారు కార్‌షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాలి. లేదా కార్ షెడ్ జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి మిథిలాపురి కాలనీ మీదుగా వచ్చి, ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్లలో పార్కింగ్ చేసుకోవాలి. నగరం నుంచి లేదా భీమిలి వైపు నుంచి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియానికి వచ్చే వారు.. ఐటీ సెజ్ మీదుగా మీదుగా వచ్చి ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డులో వాహనాలు నిలపాలి. నగరం నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఎన్‌హెచ్–16లో రాకుండా బీచ్‌రోడ్డులో వచ్చి ఐటీ సెజ్ మీదుగా లా కాలేజీ రోడ్డులో పార్కింగ్ చేసుకోవాలి. శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు మారికవలస, తిమ్మాపురం, ఐటీ సెజ్ మీదుగా లా కాలేజీ రోడ్డుకు చేరుకుని వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. -
భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, ఉచితంగా మ్యాచ్ టికెట్లు!
మరికొద్ది సేపట్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ హర్ష్ గోయెంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ పోస్ట్‌పై ఓ వర్గానికి చెందిన క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్‌లో ఏముందంటే? వరల్డ్ కప్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు లక్షల ఖర్చు చేసి మరీ మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నిర్వాహకులు ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంటారు. వారికి ఉచితంగా పాస్‌లు అందజేస్తుంటారు. దీనిపై ఆర్పీజీ ఛైర్మన్ హర్ష్ గోయెంక్ తనదైన స్టైల్లో స్పందించారు. How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 వ్యాపార వేత్తలైనా తన స్నేహితులెవరూ మ్యాచ్ టికెట్లు కొనలేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉచిత పాస్‌లు పొందారని తెలిపారు. పైగా ధనవంతులే డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఓ వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు నేరుగా ఇంతకీ మీరు టికెట్లను కొనుగులో చేశారా? లేదంటా పాస్ తీసుకున్నారా? అని ప్రశ్నిస్తుండగా.. అందుకు తాను రెండూ తీసుకోలేదని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్‌పై కామెంట్లు వైరల్‌గా మారాయి. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 మ్యాచ్ టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే? ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు ఒక్కటి రూ. 1.87 లక్షల వరకు పెరిగాయి . క్రికెట్ వరల్డ్ కప్ టిక్కెట్ రీ-సెల్లింగ్ సైట్‌లోని వయాగోగో (viagogo.com) ధరల ప్రకారం, టైర్ 4లో టిక్కెట్ ధర రూ. 1,87,407 కాగా పక్కనే ఉన్న టైర్ టిక్కెట్ ధర రూ.1,57,421. సైట్లో అతి తక్కువ ధర టిక్కెట్ ధర రూ. 32,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. -
నిఘా నీడలో చేపాక్కం!
సాక్షి, చైన్నె : ప్రపంచకప్ పోటీల్లో భాగంగా చైన్నె చేపాక్కం స్టేడియం వేదికగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్‌లో తడపడనున్నాయి. ఇందుకోసం చేపాక్కంలో సర్వం సిద్ధం చేశారు. ఆ పరిసరాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాలు.. తమిళనాట క్రికెట్ అభిమానం మరీ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. చైన్నె చేపాక్కంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగితే చాలు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో చైన్నె చేపాక్కం స్టేడియం ఐదు మ్యాచ్‌లకు వేదికగా మారనుంది. ఇందులో భారత్ జట్టు ఓ మ్యాచ్ మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ఆదివారం డే అండ్ నైట్ పోటీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి. సుమారు 40 మంది వరకు వీక్షించేందుకు ఈ స్టేడియంలో వీలుంది. తరలి వచ్చే అభిమానుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. అలాగే చేపాక్కం పరిసరాల్లో ట్రాఫిక్ మార్పులు జరిగాయి. అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు అదనంగా ఎంఆర్టీఎస్ రైలు సేవలు నడుపనున్నారు. మెట్రో రైలు సేవలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం మరమ్మతుల కారణంగా తాంబరం – బీచ్ మధ్య ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు ఆగుతుండటంతో ఆ పరిసరాల నుంచి వచ్చే అభిమానులను బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే స్టేడియం పరిసరాలు వివిధ వర్ణాల పెయింటింగ్స్‌తో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు స్టేడియంలోకి వెళ్లేందుకు వీలుగా ఆయా మార్గాల నుంచే బారికేడ్లను ప్రవేశ మార్గం వరకు ఏర్పాటు చేశారు. నిఘా కట్టుదిట్టం.. ఈ స్టేడియంలో ఆదివారం భారత్, ఆసీస్ మ్యాచ్‌తో పాటు 13వ తేదీన న్యూజిలాండ్ – బంగ్లాదేశ్, 18న న్యూజిలాండ్ – ఆఫ్గానిస్తాన్, 23న పాకిస్తాన్ – ఆప్గానిస్తాన్, 27న పాకిస్తాన్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య చైన్నె వేదికగా మ్యాచ్‌లు జరనున్నాయి. దీంతో మ్యాచ్‌లు జరిగే రోజుల్లో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మార్పుల ప్రకటన వెలువడింది. అలాగే స్టేడియం పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. 2 వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. ఈ పరిసరాలలోని నిఘా నేత్రాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే పోర్టబుల్ వాకింగ్ కెమెరాలను రంగంలోకి దించారు. ఈ కెమెరాలు మనుషుల తరహాలో నడుచుకుంటూ వెళ్లి వీడియో చిత్రీకరిస్తున్నాయి. స్టేడియానికి వచ్చే మహిళా అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకభద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన పక్షంలో కటకటాల్లోకి నెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినా, వర్షం బెంగ అభిమానులను వెంటాడుతోంది. గత రెండు మూడు రోజులుగా చైన్నెలో మధ్యాహ్నం, సాయంత్రం వేళవ్వో అక్కడక్కడ వర్షం పడుతోంది. శనివారం సాయంత్రం కూడా వర్షం కురవడంతో ఆదివారం వర్షం మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. -
వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో కప్ ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా
-
వన్డే మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు
దొండపర్తి : భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్‌కు 27 వేల మంది క్రికెట్ అభిమానులు రానున్నారు. వీరితో సాధారణ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. ●మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు 27 వేల మంది రానున్నారు. వేల సంఖ్యలో వచ్చే వాహనాలతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. దీంతో సాధారణ వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలి. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి విశాఖకు వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు మారికవలస వద్ద ఎడమ వైపు తిరిగి జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరుకోవాలి. అక్కడి నుంచి కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డులో ప్రయాణించి రుషికొండ, సాగర్‌నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలి. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి కార్ షెడ్ వద్ద నుంచి మిథిలాపురి కాలనీలో ప్రవేశించాలి. అలా ఎంవీవీ సిటీ వెనుకగా వెళ్లి లా కాలేజీ రోడ్డు మీదుగా ఎన్‌హెచ్ 16 చేరుకుని నగరంలోకి వెళ్లాలి. లా కాలేజీ రోడ్డు నుంచి, పనోరమ హిల్స్ మీదుగా రుషికొండ వైపు వెళ్లి అక్కడి నుంచి నగరంలోకి వెళ్లవచ్చు. ●నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, కమర్షియల్ వాహనాలు హనుమంతవాక నుంచి ఎడమ వైపు తిరిగి, ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్లి, అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్లాలి. ●నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి హనుమంతవాక జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరగాలి. అడవివరం మీదుగా ఆనందపురం వెళ్లవచ్చు. అలాగే విశాఖ వాలీ, ఎండాడ జంక్షన్ నుంచి కుడి వైపు తిరిగి, బీచ్‌రోడ్డుకు చేరుకుని తిమ్మాపురం వద్ద ఎడమ వైపు తిరిగి మారికవలస వద్ద ఎన్‌హెచ్ 16కు చేరుకోవాలి. భారీ వాహనాలకు సూచనలు ●19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎటువంటి భారీ వాహనాలు మధురవాడ స్టేడియం వైపు అనుమతించరు. ●అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు, నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. ●శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా, ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాలి. ●అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే భారీ వాహనాలన్నీ అనకాపల్లి వైపు నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ప్రయాణించాలి. ●శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖకు వచ్చే భారీ వాహనాలన్నీ ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి మీదుగా నగరానికి చేరుకోవాలి. మ్యాచ్‌కు వచ్చే వాహనచోదకులకు సూచనలు ●నగరం వైపు నుంచి స్టేడియానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ వాహనచోదకులు ఎన్‌హెచ్ 16లో స్టేడియం వరకు ప్రయాణించి, ఏ, బీ గ్రౌండ్లు, వీ కన్వెన్షన్‌కు పాసుల ప్రకారం చేరుకోవాలి. ●విశాఖ నుంచి స్టేడియానికి వచ్చే టికెట్ ఉన్న వారు ఎన్‌హెచ్ 16లో ప్రయాణించి స్టేడియం వద్ద గల ఓల్డేజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఆన్లైన్ టికెట్లను ఒరిజినల్ టికెట్లుగా మార్చుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాలి. లేదా కారుషెడ్ జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి మిథిలాపురి కాలనీ మీదుగా వచ్చి.. ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. ●నగరం నుంచి లేదా భీమిలి వైపు నుంచి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియానికి వచ్చే వారు ఐటీ సెజ్ మీదుగా ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డుకు చేరుకుని అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ●నగరం నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఎన్‌హెచ్ 16లో రాకుండా, బీచ్‌రోడ్డులో వచ్చి ఐటీ సెజ్ మీదుగా లా కాలేజీ రోడ్డులో పార్కింగ్ చేయాలి. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు, మారికవలస, తిమ్మాపురం, ఐటీ సెజ్ మీదుగా వచ్చి లా కాలేజీ రోడ్డుకు చేరుకుని పార్కింగ్ చేయాలి. ●పూర్తి భద్రతతో ఎటువంటి అపశ్రుతులూ జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ●ప్రేక్షకులు నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్రమే స్టేడియంలోకి ప్రవేశించాలి. -
మ్యాచ్ చూస్తుంటే కుక్క అరిచిందని...
టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య సెమీస్ బెర్తు కోసం జరిగిన పోరాటం ప్రేక్షకులకు ఎంత టెన్షన్ తెప్పించిందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన చిన్న గొడవ ఓ యువకుడి హత్యకు కారణమైంది. కొంతమంది యువకులు కలిసి జేసీ నగర్ బస్తీలో ఓ పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా జాన్ కెనడీ అనే వ్యక్తి తన కుక్కను తీసుకుని అక్కడకు వచ్చాడు. మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతూ అందరూ టెన్షన్లో ఉండగా కుక్క మొరగడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ముందు నుంచి మ్యాచ్ చూస్తున్నవాళ్లు జాన్‌ను అక్కడి నుంచి కుక్కను తీసుకుని వెళ్లిపొమ్మని కోరారు. అయితే కెనడీ అందుకు నిరాకరించడంతో వాళ్లు అక్కడినుంచి అతడిని తోసేశారు. కాసేపటి తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి వచ్చి అక్కడున్న కుర్రాళ్లపై దాడి చేశాడు. వారిలో ఉన్న అవినాష్ (20) అనే యువకుడిని పగిలిన బీరు బాటిల్‌తో పొడిచాడు. దాంతో తీవ్రంగా గాయపడిన అవినాష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. హత్యా నేరంపై పోలీసులు కెనడీని అరెస్టు చేశారు. -
గెలవాలి....నిలవాలి
► నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ► గెలిచిన జట్టు సెమీఫైనల్‌కి ► ఓడితే కథ ముగిసినట్లే ► టి20 ప్రపంచకప్ టోర్నీ సరిగ్గా సంవత్సరం క్రితం... మార్చి 26న సిడ్నీ మైదానంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తయింది. ఇప్పుడు ఏడాది వ్యవధిలో మరో ప్రపంచకప్ పోరు వచ్చింది. సెమీస్ కాకపోయినా, ఇప్పుడు కూడా నాకౌట్ పోరే. క్వార్టర్ ఫైనల్‌లాంటి ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు కథ ముగిసిపోతుంది. ఫార్మాట్ వేరు కావచ్చు కానీ వైరంలో మాత్రం తేడా ఉండదు. ఇక నాటి పరాజయానికి పదునైన జవాబు ఇవ్వడం మన వంతు. మన సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేసి ఇంటికి పంపడం, దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టడం ఆదివారం భారత్ ముందున్న లక్ష్యం. మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి;- టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జైత్రయాత్ర ఆస్ట్రేలియాలోనే మొదలైంది. అక్కడి నుంచి 14 మ్యాచ్‌లలో 12 విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు వరల్డ్‌కప్ రేస్‌లో కీలక దశలో అదే ఆసీస్‌తో పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఇక్కడి ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఎలాంటి గణాంకాలు, రన్రేట్లతో పని లేకుండా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది చావోరేవోలాంటి పరిస్థితి. ఉత్కంఠభరితంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ ఒక పరుగుతో గట్టెక్కగా, ఇదే మైదానంలో శుక్రవారం పాక్‌ను చిత్తు చేసి ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఉదాసీనత లేకుండా...: బంగ్లాదేశ్‌తో ఓటమి అంచుల్లోకి వెళ్లినా చివరకు భారత్ మ్యాచ్ కాపాడుకోగలిగింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి వస్తే ఒత్తిడిలో చిత్తవడానికి ఎదురుగా ఉన్న జట్టు బంగ్లాదేశ్ కాదు. చిన్నపాటి అవకాశం ఇచ్చినా ఆస్ట్రేలియన్లు మ్యాచ్ లాక్కోగలరు. కాబట్టి అన్ని రంగాల్లో జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంది. చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచినా నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఓపెనర్లు ఒక్కసారి కూడా శుభారంభం ఇవ్వలేకపోయారు. ఈ టోర్నీకి ముందు స్టార్ హోదాతో బరిలోకి దిగిన రోహిత్‌తో పాటు ధావన్ ఒక్కసారి కూడా ఆకట్టుకోలేదు. పైగా వీరిద్దరూ నిర్లక్ష్యమైన రీతిలో వరుసగా ఒకే తరహాలో అవుట్ కావడం ఆసీస్ గుర్తిస్తే కష్టం. కోహ్లి విఫలమైతే చాలు... ఇక కష్టం అన్నట్లుగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కనిపించింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పాటు లోయర్ ఆర్డర్ వరకు కూడా అంతా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలింగ్‌లో పేసర్లకంటే అశ్విన్, జడేజాల రాణింపుపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సాధారణ సెషన్ తర్వాత బుమ్రాకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. గాల్లో లేచే బంతిని క్యాచ్ ఎలా అందుకోవాలో ప్రతీది విడమర్చి చెప్పడంతో పాటు చాలా సేపు సాధన చేయించాడు. అందరూ ఫామ్‌లోనే! తొలి మ్యాచ్‌లో కివీస్‌తో ఓడి ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై తడబడుతూ గెలిచిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చింది. జట్టులో అందరూ రాణించడంతో గత మ్యాచ్‌లో ఆ జట్టు పాక్‌పై ఘన విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంచే అంశం. వార్నర్ మినహా గత మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా చెలరేగారు. అయితే వార్నర్ ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడే. అతనితో పాటు ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్‌లకు ఇక్కడి పిచ్‌లపై మంచి అనుభవం ఉంది. ఈ టోర్నీతో రిటైర్ కానున్న వాట్సన్ తన జట్టును టోర్నీలో మరింత ముందుకు తీసుకెళ్లాని పట్టుదలగా ఉన్నాడు. పాక్‌తో బ్యాటింగ్ చూస్తే వాట్సన్ ఎంత ప్రమాదకారినో అర్థమవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌తో పోలిస్తే భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈసారి కూడా అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఈ టోర్నీలో ప్రభావం చూపిస్తున్న లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా తొలిసారి భారత్‌పై ఆడబోతున్నాడు. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), ఫించ్, ఖాజా, వార్నర్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్, నెవిల్, కూల్టర్ నీల్, జంపా, హాజల్‌వుడ్. పిచ్, వాతావరణం టోర్నీలో ఇక్కడి రెండు వేర్వేరు పిచ్‌లపై జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పరుగుల వరద పారింది. ఇప్పుడు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్ కనిపిస్తోంది. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగే అవకాశాలు తక్కువ. 8 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 గెలిచి 4 ఓడింది. వరల్డ్‌కప్‌లలో 4 మ్యాచ్‌లలో చెరో 2 గెలిచారు.