India TV
-
తాజా సంచలన సర్వే.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే తేల్చిచెప్పింది. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ.. బీఆర్ఎస్కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎం 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. -
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని మరోసారి తేలింది. రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్ పేర్కొంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్ ఫిగర్ కాగా, బీజేపీ స్వతహాగా 238 చోట్ల, ఎన్డీయే కూటమి 285 సీట్లలో గెలుపొందుతుందని తెలిపింది. 2014లో 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 సీట్లను కోల్పోయి 238 స్థానాలను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. గతంలో 80 స్థానాలకే పరిమితమైన యూపీయే ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునేందుకు అవకాశాలున్నట్లు సర్వే తెలిపింది. అప్పుడు 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారీ మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమేనంది. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్ఎస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సుమారు 130 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 16 స్థానాలు, అఖిలేశ్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న ఎస్పీ 18 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ రాష్ట్రంలో 2014లో 80 స్థానాలకు గాను 71 చోట్ల గెలుపొందిన బీజేపీ ఈసారి 40 చోట్ల మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. తెలంగాణలో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1 చోట గెలుస్తాయని పేర్కొంది. మార్చి 1–7 మధ్య దేశవ్యాప్తంగా 193 లోక్‌సభ స్థానాల్లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 20 వేల మంది పురుషులు, 18 వేల మంది మహిళల నుంచి సమాచారం సేకరించారు. రాష్ట్రాల వారీగా అంచనాలు.. యూపీ(80): బీజేపీ 40, ఎస్పీ 18, బీఎస్పీ 16, కాంగ్రెస్ 4, ఆర్ఎల్డీ 1, అప్నా దళ్ 1 పశ్చిమబెంగాల్(42): టీఎంసీ 30, బీజేపీ 12 రాజస్తాన్(25): బీజేపీ 20, కాంగ్రెస్ 5 మధ్యప్రదేశ్(29): బీజేపీ 23, కాంగ్రెస్ 6 గుజరాత్(26): బీజేపీ 26: ఢిల్లీ(7): బీజేపీ 7 మహారాష్ట్ర(48): బీజేపీ 22, శివసేన 10, కాంగ్రెస్ 9, ఎన్సీపీ 7 బిహార్(40): బీజేపీ 15, జేడీయూ 12, ఆర్జేడీ 8, ఎల్జేపీ 3, కాంగ్రెస్ 2 తమిళనాడు(39): డీఎంకే 16, ఏడీఎంకే 12, కాంగ్రెస్ 5, పీఎంకే 2, బీజేపీ 1 కర్ణాటక(28): బీజేపీ 13, కాంగ్రెస్ 13, జేడీఎస్ 2 కేరళ(20): యూడీఎఫ్ 12, ఎల్డీఎఫ్ 7, బీజేపీ 1 -
అధికారానికి 15 స్థానాల దూరంలో బీజేపీ కూటమి!
న్యూఢిల్లీ: మరో నాలుగు నెలల్లో లోక్‌సభ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో తలమునకలవుతుంటే మరోవైపు ఢిల్లీ కోటలో పాగా వేసేదెవరనే అంశంపై చర్చోపచర్చలు, సర్వేలు, అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ఇండియా టీవీ–సీఎన్ఎక్స్లు కలిసి గత నెల 15 నుంచి 25 వరకు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించాయి. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. దేశంలో మొత్తం 543 నియోజకవర్గాలుండగా, ప్రతీ నియోజకవర్గంలోనూ వంద మంది అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే చేశారు. ఉన్నపళంగా ఎన్నికలు వస్తే కేంద్రంలో ఏ కూటమికీ సాధారణ ఆధిక్యం రాదని సర్వేలో తేలింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సాధారణ ఆధిక్యం (272 సీట్లు) కన్నా 15 సీట్లు తక్కువగా వస్తాయనీ, ఇరు కూటముల్లోనూ లేని ‘ఇతర’ పార్టీల మద్దతే కేంద్రంలో సర్కారు ఏర్పాటుకు కీలకమని ఈ సర్వే చెబుతోంది. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు, నవంబర్‌లో కూడా ఈ సంస్థలు సర్వే నిర్వహించగా, ఎన్డీఏకు 281, యూపీఏకు 124, ఇతరులకు 138 సీట్లు వస్తాయని వెల్లడైంది. ఆ అంచనాతో పోలిస్తే తాజా సర్వేలో ఎన్డీఏ 24 సీట్లు కోల్పోగా, యూపీఏకు 22 సీట్లు ఎక్కువగా రావడం గమనార్హం. ఎన్డీయేకు 257 సీట్లు.. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే కనీసం 272 సీట్లు గెలవాలి. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 282 సీట్లు గెలిచింది. అయితే ఈసారి పరిస్థితి వేరుగా ఉండనుందనీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలన్నింటికీ కలిపి 257 సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే అంటోంది. అంటే సాధారణ ఆధిక్యానికి 15 సీట్ల దూరంలో ఎన్డీయే ఆగిపోనుంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు (ఎస్పీ, బీఎస్పీలను కలపకుండా) 146 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే పేర్కొంది. ‘ఇతరుల’ హవా.. ఇరు కూటముల్లో లేని పార్టీలు, స్వతంత్రులు కలిసి మొత్తంగా 140 సీట్లు గెలుస్తారనీ, ప్రభుత్వ ఏర్పాటుకు వీరే కీలకం కానున్నారని అంచనా వేసింది. ఈ ‘ఇతర’ పార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజు జనతాదళ్, వైఎస్సార్సీపీ, లెఫ్ట్ ఫ్రంట్, పీడీపీ, ఏఐయూడీఎఫ్, ఎంఐఎం, ఐఎన్ఎల్డీ, ఆప్, జేవీఎం, ఏఎంఎంకే తదితరాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నాయని సర్వే తేల్చింది. తెలంగాణలో టీఆర్ఎస్కు 16, ఏపీలో వైఎస్సా ర్సీపీకి 19 సీట్లు వస్తాయని అంచనావేసింది. పార్టీల వారీగా సీట్లు ఇవీ.. ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమిలో బీజేపీకి మొత్తంగా 223 సీట్లు రానున్నాయి. మిత్రపక్షాలైన శివసేన 8 స్థానాల్లో, జేడీయూ 11, శిరోమణీ అకాళీదళ్ 5, ఎల్జేపీ 3 స్థానాలు గెలవనున్నాయి. ఎన్డీయేలో మిగిలిన పార్టీలకు తలో సీటు రావొచ్చని అంచనా వేసింది. యూపీఏ విషయానికి వస్తే కాంగ్రెస్ 85 స్థానాల్లో విజయం సాధించనుంది. 2014 ఎన్నికల కంటే ఇది రెట్టింపు. ఆ కూటమిలోని డీఎంకే 21, ఆర్జేడీ 10, ఎన్సీపీ 9, జేఎంఎ, జేడీఎస్‌లు చెరో 4 సీట్లు, టీడీపీ సహా కూటమిలోని మిగతా పార్టీలకు 13 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. యూపీలో బీజేపీకి 40 మాత్రమే ఢిల్లీ గద్దెకు దారిచూపే ఉత్తరప్రదేశ్ (యూపీ)లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 71 నియోజకవర్గాల్లో గెలవగా, ఎన్డీయే భాగస్వామి అయిన అప్నాదళ్ రెండు చోట్ల గెలిచింది. మొత్తంగా 80లో 73 సీట్లు ఎన్డీయేకే వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీకి యూపీలో 40 సీట్లు మాత్రమే వస్తాయనీ, ఎస్పీకి 20, బీఎస్పీకి 15, కాంగ్రెస్‌కు 2 స్థానాల్లో విజయం దక్కుతుందని సర్వే అంటోంది. బిహార్‌లోని మొత్తం 40 సీట్లలో బీజేపీకి 13, మిత్రపక్షం జేడీయూకు 11, ఆర్జేడీకి 10, కాంగ్రెస్‌కు 2 సీట్లు వస్తాయంది. మహారాష్ట్రలో బీజేపీకి 22, శివసేనకు 8, కాంగ్రెస్‌కు 9, ఎన్సీపీకి 9 స్థానాలు దక్కుతాయనీ, ఇక దక్షిణ భారతంలో అత్యధిక ఎంపీ నియోజకవర్గాలు కలిగిన తమిళనాడులో డీఎంకేకు 21, అన్నాడీఎంకేకు 10, కాంగ్రెస్‌కు 3 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. -
మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే..!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు సృష్టించనుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రానుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే శివరాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ సీఎం కానున్నారు. ఈ నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటీవీ–సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒక ఒపీనియన్‌పోల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఈసారి 128 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కాస్త పుంజుకుని 85 స్థానాల్లో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. అలాగే, బీఎస్పీ 8 సీట్లలో, ఇతరులు 9 సీట్లలో గెలుస్తారని పేర్కొంది. మాల్వానిమాఢ్ ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, అక్కడ 45 సీట్లు గెలుచుకున్నా.. 2013 కన్నా అది 16 స్థానాలు తక్కువేనని వెల్లడించింది. కాంగ్రెస్ అక్కడ గతంలోకన్నా 14 సీట్లు పెంచుకుని 24 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. మళ్లీ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగే కావాలని 41% కోరుకోగా, జ్యోతిరాదిత్య సింధియాను 22% మంది, కమల్‌నాథ్‌ను 18% మంది సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక శాతం మాత్రమే సీఎంగా దిగ్విజయ్‌సింగ్‌కు ఓటేయడం గమనార్హం. ముఖ్యమంత్రిగా శివరాజ్ పనితీరుకు 30 శాతం చాలా బాగుందని, 11% బావుందని, 16% పర్లేదని, 22% బాగా లేదని తీర్పిచ్చారు. నిరుద్యోగం, రైతు సంక్షోభం, మహిళల భద్రత.. మొదలైనవి ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ ఒపీనియన్ పోల్‌లో మొత్తం 10 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. -
కన్నడనాట హంగే!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మూడ్రోజుల ముందు వెలువడిన ఇండియా టీవీ సర్వే కూడా హంగ్ తప్పదనే సంకేతాలిచ్చింది. 223 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో కాంగ్రెస్ 96 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నప్పటికీ మేజిక్ ఫిగర్‌ను చేరుకోవటం కష్టమేనని పేర్కొంది. అటు బీజేపీ 85 స్థానాలతో రెండో స్థానంలో నిలవనుండగా..జేడీఎస్ 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. అయితే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు ఈ పోల్ నిర్వహించినట్లు తెలిపిన ఇండియా టీవీ.. ప్రధాని ప్రచారంతో కన్నడ రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందని పేర్కొంది. సర్వే ఫలితాల ప్రకారం.. బాంబే కర్ణాటకలో బీజేపీ 23, కాంగ్రెస్ 21, జేడీఎస్ 4 స్థానాలు గెలుచుకోనుండగా.. కోస్తా కర్ణాటకలో బీజేపీ 9, కాంగ్రెస్ 10, జేడీఎస్ 2 చోట్ల గెలవనున్నాయి. గ్రేటర్ బెంగళూరులో బీజేపీ 13, కాంగ్రెస్ 18, జేడీఎస్ 1 స్థానంలో, మధ్య కర్ణాటకలో బీజేపీ 20, కాంగ్రెస్ 13, జేడీఎస్ 2 చోట్ల విజయం సాధించనున్నాయి. హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ 15 సీట్లు, కాంగ్రెస్ 14, జేడీఎస్ 2 చోట్ల గెలవనుండగా.. మైసూరు ప్రాంతంలో జేడీఎస్ 24, కాంగ్రెస్21 చోట్ల గెలవనుండగా.. బీజేపీకి 8 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వే వెల్లడించనుంది. -
యూపీలో బీజేపీ వర్సెస్ ఎస్పీ.. పోటాపోటీ!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ అక్కడి అధికార పార్టీ సమాజ్ వాది పార్టీల మధ్యనే ఉంటుందని తాజా ఎన్నికల సర్వేలో తెలిసింది. ఆ రెండు పార్టీలకు దాదాపు సమానమైన అసెంబ్లీ సీట్లు వచ్చి.. అధికారం నీకా నాకా అనే పరిస్థితి ఉంటుందని ఆ సర్వేలో తేలింది. ఇక మరో ప్రముఖ పార్టీ బహుజన్ సమాజ్ వాది మాత్రం మూడోస్థానానికి పరిమితం అవుతుందని సర్వే తెలిపింది. మరోపక్క, ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీకి కేవలం స్వతంత్ర్య ఇతర అభ్యర్థులకు దక్కేటన్ని సీట్లు మాత్రమే అరకొరగా వస్తాయని ఆ సర్వే చెప్పింది. ఇండియా టీవీ-సీఓటర్ ఈ సర్వేను నిర్వహించింది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20, 642మందిని సంప్రదించి ప్రశ్నించి ఈ అంచనాను నమోదుచేసింది. ఈ సర్వే తెలిపిన ప్రకారం ఆయా పార్టీలకు దక్కే సీట్లను ఒకసారి పరిశీలిస్తే.. బీజేపీకి 134 నుంచి 150 మధ్య సీట్లు రానుండగా సమాజ్ వాది పార్టీ 133 నుంచి 149 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక బహుజన్ సమాజ్ వాది పార్టీ మాత్రం 95 స్థానాల నుంచి 111 మధ్య గెలుచుకొని మూడో స్థానానికి పరిమితం అవుతుందట. ఎన్నికలు ప్రారంభమయ్యేందుకు ఏడాది సమయం ఉందనగానే ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే ప్రచార హడావిడి మొదలుపెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 నుంచి 13 సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని సర్వే పేర్కొంది. మొత్తానికి బీజేపీ, ఎస్పీ పార్టీలు అధికారం చేజిక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటికీ కొద్ది దూరంలోనే ఆగిపోతాయని సర్వే వెల్లడించింది. అంతకుముందు, ఏబీపీ న్యూస్- లోక్‌నీతి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. తాము సమాజ్‌వాదీకే ఓటేస్తామని 30 శాతం ఓటర్లు చెప్పినట్లు తెలిపిన విషయం తెలిసిందే. రెండు చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకున్న బీజేపీకి 27 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారని కూడా ఆ సర్వే తెలిపింది. దళిత ఉద్యమాలను ఎంత రెచ్చగొట్టినా, బీఎస్పీ మాత్రం 26శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కానుందని, కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 5 శాతం ఓట్లు రావడం ఎక్కువని ఆ సర్వే పేర్కొంది. -
సొంత అజెండాతోనే ఇంటర్వ్యూలు: మోదీ
న్యూఢిల్లీ: ఇంటర్వ్యూలలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలడిగే తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు విమర్శలు గుప్పించారు. మీడియా ప్రతినిధి ముందే తన మనసులో ఒక అజెండాతో సిద్ధమవుతారని, తను ప్రశ్నించే వ్యక్తినుంచి, తాను ఆశిస్తున్న సమాధానం రాబట్టేందుకే ప్రయత్నిస్తారని, ఇది తమకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమని ప్రధాని వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో మీడియా ప్రతినిధి తనకు కావాల్సిన జవాబు ఏమిటో ముందే నిర్ణయించుకుని ఉంటారని, తనకు కావాల్సిన సమాధానం వచ్చేవరకూ తాను ఇంటర్వ్యూచేసే వ్యక్తిని వదిలి పెట్టబోరని అన్నారు. ‘ఇండియా టీవీ’ టీవీ ఛానల్ ద్వారా ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ సమర్పణలో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమం 21సంవత్సరాలుగా ప్రసారమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ‘ఆప్ కీ అదాలత్’ వంటి కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయన్నారు. -
అతడిది తిరుగులేని న్యాయ స్థానం!
ఇంటర్వ్యూ చేయడం ఓ కళ. ఆ కళలో ఆరితేరినవారు రజత్శర్మ. ‘ఆప్కీ అదాలత్’ పేరుతో ఇండియా టీవీలో రజత్శర్మ నిర్వహించే ఇంటర్వ్యూలు సంచలనాలు సృష్టించాయి. ఇరవయ్యేళ్లుగా ఈ షోని నడిపిస్తున్నారు రజత్. దాదాపు ఎనిమిది వందల మంది గొప్ప గొప్ప పర్సనాలిటీస్‌ని తన న్యాయస్థానంలో నిలబెట్టారు. రజత్ వ్యక్తిత్వం గురించి చెప్పమంటే నిజాయతీపరుడు అంటారు ఎవరైనా. ఆయన పనితనం గురించి చెప్పమంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు. నిజమే, ఆ పట్టు వదలని గుణమే పేదరికంలో పుట్టి పెరిగిన రజత్ని ఈ స్థాయికి చేర్చింది. చిన్నప్పుడు టీవీ చూడ్డానికి పక్కింటికి వెళ్తే, వాళ్లు తలుపు వేసేశారట. బాధపడి ఏడుస్తున్న రజత్తో ఆయన తండ్రి... ‘‘ఈరోజు వాళ్లు నిన్ను టీవీ చూడనివ్వలేదని ఏడవొద్దు. ఏదో ఒకరోజు వాళ్లు నిన్ను టీవీలో చూసేటంత గొప్పవాడిగా ఎదుగు’’ అన్నారట. ఆ మాటే తననింతవాణ్ని చేసిందంటారు రజత్! హుందాయైన స్ఫురద్రూపం, తొణకని స్వరం, సూటిగా మనసులోకి దూసుకెళ్లి లోపలి రహస్యాల్ని బయటకు లాగేంత తీక్షణంగా ఉండే చూపులతో ఉంటారు రజత్. ఆయన ఎప్పుడు ఏ ప్రశ్న అడుగుతారోనని ఇంటర్వ్యూ ఇచ్చే సెలెబ్రిటీ గుండెలు అదురుతూ ఉంటాయి. ఏ ప్రశ్న అడగడానికీ వెరవరు. ఎందుకంటే... ప్రజల మనసుల్లో సందేహాలనే ప్రశ్నలుగా చేసి అడుగుతారా యన. తనకు కావలసిన సమాధానం వచ్చేవరకూ తృప్తి పడరు. చెప్పకుండా అవతలి వ్యక్తిని తప్పించుకోనివ్వరు. అందుకే ఆయన న్యాయస్థానంలో నిలబడిన ప్రతివ్యక్తీ తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించి తీరతాడు. రహస్యాలను సైతం బట్టబయలు చేస్తాడు. అందుకే మరి... రజత్శర్మలా ఎవరూ ఇంటర్వ్యూ చేయలేరని భారతీయ మీడియాలో చెప్పుకుంటారు. అది నిజమేనని ‘ఆప్కీ అదాలత్’ చూసినవాళ్లంతా ఒప్పుకుని తీరతారు! -
పుట్టి మునగొచ్చు!
=‘సీ ఓటర్’ అంచనాలతో కాంగ్రెస్ నేతల్లో గుబులు =రాష్ర్టంలో అప్పుడే వ్యతిరేక పవనాలు = లోక్‌సభ ఎన్నికలపై పెట్టుకున్న ఆశలు గల్లంతు = కనీసం సగం స్థానాల్లోనూ గెలవలేని దుస్థితి = ఫలితాలపై యూపీఏ-2 కుంభకోణాల ప్రభావం = అదుపు తప్పిన ధరలపై ఓటరు మరింత ఆగ్రహం = అప్పను చేర్చుకుంటే... బీజేపీ గెలుపు ఖాయం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మొన్ననే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చి ఏడాదయ్యాక... అంటే వచ్చే మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున పెద్దగా ప్రజా వ్యతిరేకత ఉండబోదని అంచనా వేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటకపై పార్టీ పటిష్టమైన అంచనాలతో ఉంది. అయితే ‘సీ ఓటర్’ సహకారంతో ‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టీవీ’లు నిర్వహించిన ఎన్నికల సర్వేలో అధికార కాంగ్రెస్ మొత్తం 28 స్థానాలో సగం గెలుచుకోవడమూ గగనమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడే కనుక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 12, జేడీఎస్‌కు మూడు స్థానాలు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకులతో భేటీ అయినప్పుడు 25 స్థానాలను గెలుచుకుని తీరాలని దిశా నిర్దేశం చేశారు. బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వేరు పడడం, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ బలహీనంగా కనిపించండ లాంటి పరిణామాలతో ఉపాధ్యక్షుడు నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా పూర్తి చేస్తామని రాష్ర్ట నాయకులు ధీమా కనబరుస్తూ వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుండడంతో ప్రస్తుతం గుబులు చెందుతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అన్నట్లు ఏ అవినీతి నినాదంతో కాంగ్రెస్ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిందో, అదే నినాదం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పుట్టి ముంచేట్లు ఉందని పార్టీ నాయకులు కలత చెందుతున్నారు. బీజేపీ నాయకుల అవినీతిని పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో సొమ్ము చేసుకున్న కాంగ్రెస్‌కు అదే ప్రస్తావన తిరుగు బాణమై వచ్చి గుచ్చుకునేట్లుంది. కేంద్రంలోని యూపీఏ-2 కుంభకోణాలకు పర్యాయ పదంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు, అదుపు లేని పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు యూపీఏ సర్కారుపై ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల గడువు ఉన్నందున యూపీఏ సర్కారు మరింతగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటుందనే విశ్లేషణలున్నాయి. అదే కనుక జరిగితే ప్రస్తుతం అంచనా వేస్తున్న స్థానాలు లభించడం కూడా దుర్లభమే. అప్పను చేర్చుకుంటేనే బీజేపీ గెలుపు.. హాసన, మండ్య, బెంగళూరు గ్రామీణ స్థానాలు జేడీఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. లింగాయత్‌లు ప్రాబల్యం కలిగిన ఉత్తర కర్ణాటకతో పాటు సంఘ్ పరివార్‌కు గట్టి పునాదులున్న కోస్తా తీరంలోని స్థానాల్లో విజయం సాధించడానికి బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బేషరతుగా పార్టీలో చేరాలన్న కమలనాథుల షరతును యడ్యూరప్ప సమ్మతించడం లేదు. పార్టీలో తనకు గౌరవప్రదమైన పదవిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక దశలో ఈ డిమాండ్‌ను కూడా పక్కన పెట్టి బీజేపీలో కేజేపీని విలీనం చేయడానికి ఆయన సిద్ధమైనా అనుయాయులు వారించారు. ‘వారికి మన అవసరం ఉందే తప్ప వారి అవసరం మనకు లేదు’ అని ఆయనను నిలువరించారు. ఏదో విధంగా యడ్యూరప్పను తమ దారికి తెచ్చుకోకపోతే బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందడం చాలా కష్టమవుతుంది. మొన్న శాసన సభ ఎన్నికల్లో పది శాతం ఓట్లను తెచ్చుకున్న కేజేపీని తక్కువగా అంచనా వేస్తే బీజేపీకే నష్టమనే రాజకీయ వాదనలున్నాయి. విలీనం లేదు : యడ్డి బీజేపీలో కేజేపీని విలీనం చేసే ప్రసక్తే లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. హుబ్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. పొత్తుపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని, ఒక వేళ పొత్తు కుదరక పోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదని కుండ బద్ధలు కొట్టారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది తన ఆశయమని, ఈ క్రమంలో ఎన్డీఏకు దగ్గర కావడానికి ప్రయత్నించానని తెలిపారు. ఇంతకు మించి ఎటువంటి బలహీనతలు, పదవీ కాంక్ష, అధికార వాంఛ తనకు లేదని స్పష్టం చేశారు.