Indian IT company
-
భారతీయ ఐటీ కంపెనీ సంచలనం.. ఓనర్లుగా ఉద్యోగులు!
నెలకోసారి జీతమిచ్చే కంపెనీలే కానీ ఆదాయంలో వాటా ఇచ్చే సంస్థల గురించి అరుదుగా వింటుంటాం. అలాంటిదే ఈ భారతీయ ఐటీ కంపెనీ. తమ ఉద్యోగులకు కంపెనీలో ఏకంగా 33 శాతం వాటాను ఇచ్చేస్తోంది. అంతేకాదు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల విలువైన కార్లు అందించింది. కంపెనీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులనైతే ‘కో ఫౌండర్లు’గా ప్రకటించేసింది. 33 శాతం ఉద్యోగులకే.. ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకున్న ఈ ఐటీ కంపెనీ పేరు ‘ఐడియాస్2ఐటీ’ (Ideas2IT) భారత్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ టెక్ సంస్థ తమ 100 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.832 కోట్లు) కంపెనీ యాజమాన్యంలో 33 శాతాన్ని ఉద్యోగులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 5 శాతాన్ని 2009లో కంపెనీ పెట్టినప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్న 40 ఉద్యోగులకు, మిగిలినదాన్ని మిగతా 700 మంది సిబ్బందికి పంచనున్నట్లు పేర్కొంది. 150 మందికి కార్లు కంపెనీలో వాటాతో పాటు తమ వద్ద ఐదేళ్లకు పైగా సేవలందించిన 50 మంది ఉద్యోగులకు 50 కార్లను కంపెనీ వ్యవస్థాపకులు మురళీ వివేకానందన్, భవాని రామన్ అందజేశారు. ఉద్యోగులు రూ. 8-15 లక్షల ధర రేంజ్లో మారుతీ సుజుకి లైనప్ నుంచి తమకు నచ్చిన వాహనాలను ఎంచుకోవడానికి కంపెనీ అవకాశం కల్పించింది. అంతేకాదు.. ఉద్యోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా వీటిని వారి సొంత పేర్లతో రిజిస్టర్ చేసి మరీ ఇచ్చింది. కాగా ఇదివరకే 2022లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇలాగే 100 కార్లను అందించింది. Ideas2IT, #tech firm valued at $100mn, announces transfer of 1/3rd of company ownership to its most-trusted employees They've just given away 50cars(₹8-15lakh range) to those that have served 5+yrs..In 2022, 100 staff got cars(regd in own name)#chennai #india #business… pic.twitter.com/yYXA7Isddm — Sidharth.M.P (@sdhrthmp) January 2, 2024 సామాన్య యువతకు అవకాశం 2009లో ప్రారంభించి 100 మిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగామని, దీని ఫలాలను తమ ఉద్యోగులతో పంచుకోవాలకోవాలనుకుంటున్నట్లు ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు మురళీ వివేకానందన్ వెల్లడించినట్లుగా వార్తాసంస్థ వియాన్ పేర్కొంది. ఎంప్లాయీ ఓనర్షిప్ ప్రోగ్రామ్ చొరవలో భాగంగా కంపెనీ దీన్ని చేపట్టింది. ఈ కంపెనీకి భారత్‌తోపాటు యూఎస్, మెక్సికో దేశాల్లో మొత్తం 750 మంది ఉద్యోగులు ఉన్నారు. మరో విశేషం ఏటంటే ఈ కంపెనీ ఉద్యోగుల కోసం ఐఐటీల వెంట పడదు. చిన్న చిన్న పట్టణాలకు చెందిన సామాన్య యువతనే నియమించుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ విలువను నాలుగు సంవత్సరాల వ్యవధిలో మూడు రెట్లు పెంచే వ్యూహంతో ఉన్న చెప్పిన మురళీ వివేకానందన్ కంపెనీ ప్రారంభించడదానికి ముందు సన్, ఒరాకిల్, గూగుల్ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం యూఎస్ ఉంటున్న ఆయన భారత్‌లోని చెన్నై, మెక్సికో మధ్య తిరుగుతూ ఉంటారు. -
ఐటీ రంగంలో తగ్గనున్న నియామకాలు
ముంబై: భారత ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి మరింత తగ్గి, మధ్య స్థాయి సింగిల్ డిజిట్‌కు (4–6) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున నియామకాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో కంపెనీలు సమీప కాలంలో కొత్త నియామకాలను తక్కువకు పరిమితం చేసుకోవచ్చని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో (2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు) నికర నియామకాలు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఇక్రా తన నివేదికలో ప్రస్తావించింది. ఐటీ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ మార్చిలో విడుదల చేసిన నివేదికను పరిశీలించినప్పుడు 2022–23లో వృద్ధి 8.4 శాతానికి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 2021–22లో ఇది 15 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్డర్ బుక్, డీల్స్ బలంగానే ఉనప్పటికీ 2023–24లో ఆదాయం వృద్ధి 4–6 శాతం మించకపోవచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోని కంపెనీల పట్ల స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. రుణాలకు సంబంధించి ఇవి మెరుగైన స్థితిలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక సమస్యలు ఉండడంతో గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి ధోరణి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా తెలిపింది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 90 శాతం యూఎస్, యూరప్ నుంచే వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, ఇన్సూరెన్స్ విభాగం నుంచే మూడింట ఒకటో వంతు ఆదాయం ఐటీ కంపెనీలకు వస్తుంటుంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గొచ్చని.. కస్టమర్లు నిర్ణయాలను జాప్యం చేయవచ్చని ఇక్రా తెలిపింది. మార్జిన్లు స్థిరం.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లు 1.90 శాతం తగ్గి 22.9 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా తెలిపింది. ఆదాయంలో వృద్ధి నిదానించినా, నిర్వహణ మార్జిన్లు ఇదే స్థాయిలో కొనసాగొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలోని టాప్–5 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 83,906 మందిని నియమించుకున్నట్టు ప్రస్తావించింది. స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగినంత కాలం నియామకాలు తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. -
ఐటీ కంపెనీలకు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంక్షోభ ప్రభావం భారత ఐటీ కంపెనీలనూ తాకుతోంది. ప్రత్యక్షంగా భారత ఐటీ కంపెనీలపై పడే ప్రభావం కంటే పరోక్ష ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఐరోపా ప్రాంతంలోని క్లయింట్లు ఐటీపై చేసే వ్యయాలను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొని ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ కంపెనీలు కొన్ని రష్యా నుంచి తప్పుకోవడం లేదా అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. యుద్ధం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావం కూడా కొత్త కాంట్రాక్టుల చార్జీల్లో జాప్యానికి దారితీస్తుందన్నది అంచనా. ఈ పరిస్థితులతో సాఫ్ట్వేర్ ఎగుమతిదారులు సమీప కాలంలో స్తబ్దత చూడొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 227 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ ఎగుమతుల్లో రష్యా వాటా 1–2 శాతం మేర ఉంటుంది. ‘‘రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణతో భారత ఐటీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందని మా అభిప్రాయం. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో కాంట్రాక్టులకు సంబంధించి నిర్ణయాల్లో జాప్యానికి.. మొత్తం కాంట్రాక్టుల విలువ నిదానించడానికి దారితీస్తుంది’’అని దోలత్ క్యాపిటల్ పేర్కొంది. ఐటీపై తగ్గనున్న వ్యయాలు అంతర్జాతీయంగా ఐటీ సేవల వృద్ధి అంచనాలను 2022 సంవత్సరానికి 10 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్టు కన్సల్టెన్సీ సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ఇటీవలే ప్రకటించింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, భౌగోళిక రాజకీయ సమస్యలతో ఐటీ సేవలపై చేసే ఖర్చు తగ్గుతుందన్నది ఈ సంస్థ అంచనా. మొత్తం కాంట్రాక్టుల విలువ తగ్గొచ్చని పేర్కొంది. నిజానికి కరోనా వచ్చిన తర్వాత నుంచి ఐటీ రంగం కొత్త దశను చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ డిజిటైజేషన్ ఊపందుకుంది. దీంతో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఆర్డర్లను సంపాదించాయి. 2021లో అంతర్జాతీయంగా 33 బిలియన్ డాలర్ల ఐటీ సేవల ఆర్డర్లలో భారత ఐటీ సంస్థలు 31 శాతం అందుకున్నాయని.. ఈ వాటా ఇంకా పెరగొచ్చని ఐటీ పరిశోధనా సంస్థ ఐఎస్జీ అంచనా. మొదటిసారి వచ్చే ఆర్డర్లపై ప్రభావం ఉండకపోవచ్చని దోలత్ క్యాపిటల్ అంటోంది. అదే సమయంలో ఆదాయం, వ్యయాలపై ఉన్న ప్రభావాన్ని విస్మరించడానికి లేదని, ఐటీ సేవలకు సంబంధించి మరీ ఎక్కువ ఆశావహ అంచనాలు సరికాదని పేర్కొంది. భారత ఐటీ రంగం కరోనా ముందు నాటితో పోలిస్తే వేగంగా రెట్టింపై 227 బిలియన్ డాలర్లకు (రూ.17 లక్షల కోట్లు) చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యాతో వ్యాపారం నిర్వహించడం దాదాపు అధిక శాతం అంతర్జాతీయ కంపెనీలకు అసాధ్యమనే చెప్పుకోవాలి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన ఎగుమతి దేశమైన రష్యాతో చమురు సరఫరా తెంపుకోవడం కూడా ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు మరింత పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు డిజిటల్, టెక్నాలజీపై చేసే వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చన్నది దోలత్ విశ్లేషణగా ఉంది. -
ఆ ముప్పు చెప్పిన తొలి టెక్ దిగ్గజం విప్రో
బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరమైన నిబంధనలతో భారత్ ఐటీ కంపెనీలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ట్రంప్ దెబ్బను తట్టుకోలేక ఓ వైపు నుంచి హెచ్-1బీ వీసాల్లో భారీగా కోత పెడుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ చర్యలు తమ ఐటీ కంపెనీలను ఏ మేరకు దెబ్బతీయనున్నాయో అధికారికంగా ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రం ట్రంప్ చర్యలను ఎండగడుతూనే ఉన్నాయి. తొలిసారి దేశీయంగా మూడో టెక్ దిగ్గజంగా పేరున్న విప్రో అధికారికంగా ట్రంప్ ముప్పును బహిరంగంగా వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ తమకు తీవ్ర ముప్పుగా ఉన్నారని, ఇన్ని ఏళ్లలో తొలిసారి అమెరికా అధ్యక్షుడి వల్ల తమకు నష్టం వాటిల్లనున్నట్టు విప్రో అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వార్షిక ఫైలింగ్ లో పేర్కొంది. భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు, ఉగ్రవాదుల దాడులతో తమ వ్యాపారాలు, రెవెన్యూలు, లాభాలకు భారీగా దెబ్బతీయనున్నాయని తెలిపింది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ఎన్నిక తమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. అదేవిధంగా అమెరికాతో పాటు యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాలు కూడా ఇమ్మిగ్రేషన్ చట్టాల విషయంలో ట్రంప్ బాటలో నడుస్తున్నాయి. ట్రంప్ ను అనుసరిస్తూ ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చాయి. ఇవి కూడా తమకు ముప్పుగా ఉన్నాయని విప్రో తెలిపింది. ఈ నిబంధనలు తమపై ఎలా ప్రభావం చూపనున్నాయో పూసగుచ్చినట్టు కంపెనీ వివరించింది. ట్రంప్ అనుసరిస్తున్న రక్షణవాద చర్యలు దేశీయ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినీ నుంచి ఐటీ కంపెనీలు స్థానికంగా రిక్రూట్ మెంట్లను పెంచి, వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని చెబుతూనే ఉన్నాయి. తొలి క్వార్టర్ ముగిసే లోపల, తమ కంపెనీలో 50 శాతానికి పైగా ఉద్యోగులు స్థానికులై ఉంటారని విప్రో పేర్కొంది. ఇటు ఇన్ఫోసిస్ కంపెనీ సైతం వచ్చే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లను రిక్రూట్ మెంట్ చేసుకోనున్నట్టు ప్రకటించింది. -
భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాక్!
-
భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాక్!
- ప్రతినిధుల సభలో వీసా సంస్కరణ చట్టం బిల్లు - ఆమోదం పొందితే హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు కోత వాషింగ్టన్ : భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాక్ ఇవ్వబోతోంది. భారత ఐటీ కంపెనీల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిరోధించడానికి ఉద్దేశించిన హెచ్-1బీ, ఎల్-1 వీసా సంస్కరణ చట్టం బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. డెమొక్రాటిక్ సభ్యుడు బిల్ పాస్క్రెల్, రిపబ్లికన్ డానా రోహ్రా బాచర్ దీన్ని ప్రతిపాదించారు. ఇది ఆమోదం పొందితే హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు భారీగా కోత పడనుంది. బిల్లు ప్రకారం.. ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 మంది కంటే ఎక్కువగాని, మొత్తం ఉద్యోగుల్లో 50 శాతంకంటే ఎక్కువగా కానీ ెహ చ్-1బీ,ఎల్-1 వీసా ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించకూడదు. అమెరికాలోని పలు కంపెనీల్లో విదేశీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువని, తద్వారా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ అమెరికన్లను దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌కు చెందిన పెద్ద ఐటీ కంపెనీలన్నీ హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ బిల్లు హెచ్-1బీ, ఎల్-1 వీసాల జారీలో అవినీతిని తొలగించడానికి, అమెరికన్ ఉద్యోగులకు, వీసాదారులకు రక్షణ కల్పించడానికేనని కాంగ్రెస్ సభ్యులు వాదిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘింస్తే భారీ జరిమానాలు వేయడానికి ఉద్దేశించినదని చెబుతున్నారు. బిల్లుకు అమెరికా అధ్యక్షుడి ఆమోద ముద్ర పడాలంటే అంతకు ముందు సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంది. అయితే గతంలో 2010లో పాస్క్రెల్, రోహ్రా బాచర్ ఇదే తరహా బిల్లును ప్రవేశపెట్టినా అది కాంగ్రెస్ ఆమోదం పొందలేదు. -
ఐటీ-ఫార్మాకు అమెరికా గండం
దేశీ ఐటీ, ఫార్మా కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ అమెరికాయే. అక్కడి నుంచి వచ్చే ఆదాయం ఏ స్థాయిలో ఉందో... ఇపుడు అమెరికా విధిస్తున్న పరిమితులూ అదే రీతిన పెరిగిపోతున్నాయి. నాణ్యతా ప్రమాణాల పేరుతో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ వరస నోటీసులిస్తూ ఫార్మా సంస్థలను బెంబేలెత్తిస్తుండగా... వీసా ఫీజుల పెంపుతో ఐటీ కంపెనీలు ఇక్కట్లు పడుతున్నాయి. వీసా ఫీజుల పెంపుతో ఐటీపై 400 మిలియన్ డాలర్ల భారం * నోటీసులు, తనిఖీలతో తగ్గుతున్న * ఫార్మా రంగం ఎగుమతులు * ఇది మన కంపెనీలను టార్గెట్ చేయటమేనంటున్న పరిశ్రమ నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఐటీ కంపెనీలు విదేశాలకు అందిస్తున్న సర్వీసుల ద్వారా ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జిస్తున్నాయి. దీన్లో సింహభాగం.. అంటే 60% పైబడి అమెరికా మార్కెట్ నుంచే వ స్తోంది. దీంతో హెచ్1బీ తదితర వీసాలకు భారత ఐటీ కంపెనీల నుంచి భారీగా డిమాండ్ ఉంటోంది. ఇలా విదేశీ ఐటీ కంపెనీలకు కీలకమైన హెచ్1బీ, ఎల్1 వీసాల ఫీజులను అమెరికా ఏకంగా రెట్టింపు చేసేసింది. హెచ్1బీ ఫీజు 4,000 డాలర్లు, ఎల్1 ఫీజు 4,500 డాలర్ల మేర అదనంగా పెంచింది. కొత్త ఫీజులు 2025 సెప్టెంబర్ 30 దాకా అమల్లో ఉంటాయి. దీన్ని అన్ని దేశాల కంపెనీలకు వర్తింపచేస్తున్నప్పటికీ.. ప్రధానంగా అమెరికాపైనే ఆధారపడిన భారత ఐటీ కంపెనీలకిది శరాఘాతంగా మారింది. ఎందుకంటే హెచ్1బీ వీసాలను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నది మన ఐటీ కంపెనీలే. గణాంకాల ప్రకారం 2012లో భారత ఐటీ సంస్థలు అత్యధికంగా 80,630 వీసాలు పొందగా, చైనా కంపెనీలు 11,000కు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో వీసా ఫీజు రెట్టింపుతో భారత ఐటీ పరిశ్రమపై ఏటా 400 మిలియన్ డాలర్ల దాకా భారం పడవచ్చని అంచనా. అమెరికన్ కంపెనీలు వ్యయాలు తగ్గించుకునేందుకు భారత ఐటీ సంస్థల సేవలు గణనీయంగా తోడ్పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇలాంటి పరి మితులు విధించిన పక్షంలో అమెరికాకే ప్రతికూలం అవుతుం దని ఇటీవలే నాస్కామ్ చైర్మన్‌గా ఎంపికైన సీపీ గుర్నానీ చెప్పారు. వీసాలపై పరిమితులు, ఫీజు పెంపు అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) దృష్టికి కూడా భారత్ తీసుకెళ్లిందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్, ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీ మోహన్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి తెలిపారు. ఫార్మాకు నియంత్రణలు.. మెరుగైన జనరిక్స్ ఔషధాలను చౌకగా అందిస్తున్న భారత ఫార్మా కంపెనీల ఆదాయాల్లో దాదాపు 40 శాతం పైచిలుకు అమెరికా మార్కెట్ నుంచే వస్తోంది. అలాగే, అమెరికాలోని జనరిక్స్ అమ్మకాల్లో సుమారు 40 శాతం వాటా భారత ఫార్మా కంపెనీలదే. ఈ మధ్యే అధిక మార్జిన్లుండే ఇంజెక్టబుల్స్ విభాగంలో పట్టు దక్కించుకునేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 2014లో 3.76 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే, ఐటీ కంపెనీల తరహాలోనే భారత ఔషధ సంస్థలూ టార్గెట్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఔషధాల సరఫరాలో చైనా కూడా ముందువరుసలోనే ఉన్నప్పటికీ.. 2014-15లో చూస్తే అక్కడి కంపెనీల్లో అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు 132 మాత్రమే జరగ్గా, భారతీయ కంపెనీలు మాత్రం 203 తనిఖీల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చైనాలో ఇద్దరే ఇన్స్పెక్టర్స్ ఉంటే భారత్‌లో ముగ్గురు పూర్తి స్థాయి ఇన్‌స్పెక్టర్లున్నారు. వారికి అదనంగా అడపాదడపా మరింత మంది వస్తుంటారు కూడా. ఔషధాల ఉత్పత్తి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వార్నింగ్ లెటర్లు, ఇంపోర్ట్ అలర్టులతో ఎఫ్‌డీఏ కొన్నాళ్లుగా భారత ఫార్మా సంస్థలను బెంబేలెత్తిస్తోంది. 2008-15 మధ్య కాలంలో ఎఫ్‌డీఏ... భారత ఫార్మా కంపెనీలకు దాదాపు 50 వార్నింగ్ లెటర్లు పంపింది. తర్వాత వీటిలో దాదాపు నలభై శాతం నోటీసులు... ఇంపోర్ట్ అలర్టులుగా మారాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, క్యాడిలా హెల్త్‌కేర్, ఐపీసీఏ లాబోరేటరీస్, లుపిన్ మొదలైన దిగ్గజాలు గతేడాది లెటర్లు అందుకున్న వాటిలో ఉన్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ చర్యలతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి ఇటీవలే బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రెండంకెల స్థాయిలో ఉండే ఎగుమతులు ప్రస్తుతం 9.7 శాతానికే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఔషధ మార్కెట్ అయిన అమెరికాకు ఎగుమతులు దెబ్బతినడం వెనుక పలు కారణాలున్నాయని, పేరొందిన భారతీయ కంపెనీలపై ఎఫ్‌డీఏ నియంత్రణపరమైన చర్యలు కూడా కారణమని సతీష్ రెడ్డి చెప్పారు. -
ఏప్రిల్ నుంచి వీసా ఫీజుల మోత
ఫైలుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్: అమెరికాలోని భారత ఐటీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని భారీగా వడ్డించిన వీసా ఫీజులు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఇప్పటికే ఆమోదించగా... ఈ ఫైలుపై అధ్యక్షుడు ఒబామా శుక్రవారం సంతకం చేశారు. దీంతో హెచ్1బీ వీసాకోసం సుమారు రూ. 2.7 లక్షలు, ఎల్1 వీసా కోసం రూ. 3.2 లక్షలు చెల్లించాల్సి రానుంది. పెంచుకుంటూ పోతున్న అమెరికా..: అమెరికాలోని ఐటీ సంస్థల్లో పనిచేసేందుకు వచ్చే విదేశీ నిపుణుల కోసం హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. అసలు హెచ్1బీ దరఖాస్తు ఫీజు సుమారు రూ. 20 వేలు (325 డాలర్లు). 2005లో ‘ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఫీజు’ పేరుతో రూ. 33,000 (500 డాలర్లు) వడ్డించారు. ఆ తర్వాత ‘ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఫీజు’ పేరిట 25 మందికంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలకు హెచ్1బీ వీసాపై సుమారు రూ. లక్ష (1,500 డాలర్లు) ఫీజు విధించారు. తాజాగా ప్రత్యేక ఫీజును సుమారు రూ. 3 లక్షలకు పెంచింది. ఇక వీటన్నింటికీ తోడు హెచ్1బీ వీసాల దరఖాస్తులను 15 రోజుల్లోపే పరిశీలించేందుకు రూ. 80 వేలు (1,225 డాలర్లు) వసూలు చేస్తుంది. వీటన్నింటికి తోడు వీసా దరఖాస్తులను ఫైలింగ్ చేసేందుకూ రూ. 60 వేల నుంచి రూ. లక్ష దాకా చెల్లించాల్సిందే. అంటే మొత్తంగా భారత కంపెనీలు ఒక్కో హెచ్1బీ వీసా కోసం రూ. 6 లక్షలు కట్టాలి.