Indian medical sector
-
భారత వైద్య రంగంలో శరవేగంగా ఏఐ.. రోగాన్ని ఇట్టే తేల్చేస్తుందోయ్!
భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) దూకుడు పెరుగుతోంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్‌కేర్ పరిశ్రమ 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది. 2019–20 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. – సాక్షి, అమరావతి ఔషధ పరిశోధనల్లో వేగం టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. చికిత్సల్లో కచ్చితత్వం భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటోంది. సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. భవిష్యత్‌లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాత వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగనిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు30 నుంచి 40 శాతం సమయం ఆదా రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతో పాటు, రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్‌బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేíÙస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30–40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు. ఇక రోగుల రికార్డులు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, రక్తపరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఏఐని వినియోగిస్తున్నాయి. సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. -
బతుకే ఓ పోరాటమైన కారుణ్య మూర్తి!
తొమ్మిదేళ్ల బాల వధువు భయంతో ఒళ్ళు ముడుచుకుని ఆ తొలిరాత్రి పానుపు మీద ఓ మూల నక్కి ఉంటే, నలభై అయిదేళ్ల డిప్యూటీ మేజిస్ట్రేట్ వరుడిగా, మూడవ వివాహం చేసుకున్న భర్తగా అదే పాన్పుపై ఆమెకు ఎదురు గానే అంగడి బొమ్మతో కులుకుతున్నాడు. అది 1875. ఆ బాల వధువు తర్వాతి కాలంలో హైమావతీ సేన్ (1866–1930)గా పేరుగాంచిన తొలి తరం వైద్యురాలు. అంతేకాక సుమారు ఐదు వందల మంది అనాథ బాలికలు, పెళ్ళి కాని తల్లులకు జీవనదీపం వెలిగించిన కారుణ్యమూర్తి. ఈ రెండు దశల మధ్య హైమావతి పోరాడి సాగిన దారి... పురుష ప్రపంచానికి ఘోరమైన తల వంపు, భారతీయ మహిళా చరిత్రలో ఓ చీకటి మలుపు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అంతర్భాగమైన, ఆనాటి బెంగాల్ రెసిడెన్సీలో ఖుల్నా జిల్లా గ్రామీణ ప్రాంతంలో 1866లో హైమా వతి జన్మించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో ఇష్టపడే కుమార్తెను తండ్రి హైమావతిని ఇద్దరు పిల్లల తండ్రికి మూడో భార్యగా కట్టబెట్టాల్సి వచ్చింది. పదేళ్లు వస్తే కానీ వధువును కాపురానికి పంపకూడదని 1860లో చట్టం చేసినా ఈ తాగు బోతు పెళ్ళికొడుకు డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ కనుక అక్కడ ఆ చట్టం పనిచేయాల్సిన అవసరం లేకపోయింది. భార్యకు శృంగారంలో శిక్షణ ఇవ్వాలని మరో స్త్రీని తెచ్చుకుని ఆమె కళ్ళెదుటే ఘన కార్యాలు చేసేవాడు. కొన్ని నెలలకే ఈ పెద్దమనిషి అనారోగ్యం పాలై, న్యుమోనియాతో కన్నుమూశాడు. పదేళ్లకే హైమావతి వితంతువైపోయింది. అత్తగారి తరఫున ఆదుకునేవారు లేక పోవడం, తల్లితండ్రులు కూడా కొద్ది రోజులకే మరణించడంతో ఆమె దిక్కులేనిదయ్యింది.అటు తిరిగి, ఇటు తిరిగి కాశీలోని హిందూ వితంతు శరణాలయంలో తేలారు. కొందరు బ్రహ్మ సమాజపు వ్యక్తులు పరిచయం కావడంతో, హైమావతి జీవితం కొంత మలుపు తిరిగింది. వారి సాయంతో కొంత చదువు నేర్చుకుని, ఓ సంఘ సంస్కర్త నడిపే పాఠశాలలో పనిచేయడం ప్రారంభించింది.కొంత కాలానికి కలకత్తా తిరిగివచ్చింది. కొందరి మిత్రుల ప్రోద్బలంతో హైమావతి 25వ ఏట అంటే 1890లో కుంజబిహారి సేన్‌తో వివాహం జరిగింది. అతను పైకి బ్రహ్మసమాజపు వ్యక్తి లాగా, ఆధ్యాత్మిక చింతనా పరుడిగా కనబడినా, పెళ్లయిన తర్వాత అతని బాధ్యతా రాహిత్యం, ఆవేశం, అసమర్థత, అవకాశవాదం విశృంఖలంగా బయల్ప డ్డాయి. కళ్ళు తెరిచే లోపు ఇద్దరు పిల్లలకు తల్లయింది హైమావతి. అప్పట్లో వైద్యానికి సంబంధించి మహిళలకు ఉపాధి అవకాశాలు కనబడటంతోపాటు 1885లో డఫ్రిన్ ఫండ్ రావడంతో డాక్టర్స్, నర్సులు, మిడ్ వైవ్స్గా శిక్షణ పొందడానికి కొంత ఆర్థికపరమైన చేయూత అందుబాటులో ఉంది. దాంతో 1891లో హైమావతి ఇప్పుడు ‘నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’గా పేరుగాంచిన అప్పటి కలకత్తా కామ్బెల్ మెడికల్ స్కూల్లో ‘వెర్నాక్యులర్ లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ’ (పీఎల్ఎంఎస్) చదవాలని నిర్ణయించు కుంది. హైమావతికి బంగారు పతకం రావడం పట్ల వ్యతిరేకత మొదలై; క్లాసులు బహిష్కరించడం, కళాశాల చుట్టూ గుమి గూడటం, ఆడపిల్లలు ప్రయాణం చేసే బగ్గీల మీద రాళ్లు విస రడం వంటి పనులతో పాటు పురుష విద్యార్థులు ఇన్సె్పక్టర్ జనరల్‌కు, లెఫ్టినెంట్ గవర్నర్‌కు అభియోగాలు చేశారు. చివరకు బంగారు పతకాన్ని తిరస్కరింప చేసి, రజతాన్ని అంగీకరింప చేశారు. 1893లో పీఎల్ఎంఎస్ కోర్సు పూర్తయినా, ఎక్కడ నివాసం ఉండాలన్న విషయానికి సంబంధించి ఉద్యోగానికే భర్త అవరోధం కలిగించాడు. ఈ పరిస్థితుల్లో హుగ్లీ లేడీ డఫ్రిన్ హాస్పి టల్లో ఉద్యోగం లభించింది. ఆసుపత్రిలో ఆమెపై పురుష అధికారి శిక్షణ పేరుతో పీడిస్తూ, లైంగిక పరంగా వేధిస్తూ ఉండే వాడు. భర్త పీడింపులు, సాధింపులు ఉండనే ఉన్నాయి. ఈ రెండో మొగుడితో కాపురం 13 ఏళ్లకే ముగిసింది. అతడు చక్కెర వ్యాధితో మరణించాడు. అతడి ద్వారా హైమావతికి మొత్తం ఐదు మంది మగపిల్లలు కలిగారు. హైమావతి జీవితం నిత్యసంకటంగా మారినా, ఆమె మొత్తం జీవిత కాలంలో అన్ని మతాలకూ చెందిన ఒకరోజు మాత్రమే వయసున్న పిల్లలతో సహా 485 మందిని చేరదీయడం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది. తొలి దశలో చేరదీసినా తన కుమారులకు వయసు పెరిగే కొద్దీ ఈడొస్తున్న ఆడపిల్లలను ఇంకో చోటకు పంపేవారు. 1920 నుంచి 1933 ఆగస్టు 5న కన్నుమూసే దాకా తన జీవితానుభవాలను ఒక గీతలు వేసిన నోట్ బుక్ లో రాసి పెట్టారు. అది దాదాపు 8 దశాబ్దాల తర్వాత బయటపడి ప్రచురణకు నోచుకుని సంచలనం కలిగించడమే గాక, తొలి రోజుల భారతీయ వైద్యరంగ పరిస్థితికి దర్పణమయ్యింది.డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారిమొబైల్: 94407 32392 -
9–12 నెలల తర్వాతే బూస్టర్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ రెండోడోసు తీసుకున్న తర్వాత ఎన్నాళ్లకు బూస్టర్ డోసు (మూడో డోసు... ప్రధాని మాటల్లో ప్రికాషన్ డోసు) ఇవ్వాలనే దానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ముమ్మరంగా సమాలోచనలు చేస్తున్నారు. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాతే బూస్టర్ డోసు ఉండొచ్చని విశ్వసనీయ అధికారవర్గాలు ఆదివారం తెలిపాయి. ‘కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు ఎంతెంతకాలం తర్వాత బూస్టర్ డోసును ఇవ్వాలనే విషయంలో సాంకేతికాంశాల మదింపు జరుగుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు’ అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 15–18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకాలు ఇస్తామని, జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్యరంగంలోని వారికి ‘ప్రీకాషన్ డోసు (ముందు జాగ్రత్త చర్యగా)’ను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికీ డాక్టర్ల సలహా మేరకు ప్రికాషన్ డోసు ఇస్తామని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ‘రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య వ్యవధి 9 నుంచి 12 నెలలు ఉండొచ్చు. ఇమ్యూనైజేషన్ విభాగం, ఇమ్యూనైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) ఇదే తరహాలో సమాలోచనలు సాగిస్తున్నాయి’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. టీనేజర్లకు ప్రస్తుతానికి కోవాగ్జినే జనవరి 3 నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైనపుడు కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు ఆదివారం వెల్లడించాయి. దేశంలో 15–18 ఏళ్ల ఏజ్ గ్రూపులో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మంది టీనేజర్లు ఉండొచ్చని పేర్కొన్నాయి. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు... ఈ మూడు కేటగిరీల వారికి మాత్రం గతంలో రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకున్నారో ‘బూస్టర్ డోస్’గా అదే టీకా ఇస్తారని తెలిపాయి. -
‘గుండె’లదిరే వేగం
బెంగళూరు నుంచి చెన్నైకి గుండె తరలింపు సాక్షి, చెన్నై/బెంగళూరు: భారత వైద్య రంగంలో ఓ అరుదైన ఘటన బుధవారం ఆవిష్కృతమైంది. చెన్నైలోని అడయార్ ఫోర్టిస్ ఆస్పత్రిలో కొన ప్రాణంతో ఓ గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలంటే వెంటనే గుండె మార్పిడి చేయాలి. ఇందుకోసం బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ(32) నుంచి సేకరించిన గుండెను తీసుకుని వైద్య బృందం మధ్యాహ్నం 3.30 గంటలకు వేగంగా విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో 4.25 గంటలకు(మొత్తం 55నిమిషాలు) చెన్నై విమానాశ్రయానికి రాగా, అక్కడి నుంచి ఫోర్టిస్ ఆస్పత్రికి 4.37 గంటలకు చేరుకుంది. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స ప్రారంభించారు. అందరి ప్రయత్నాలు, ప్రార్థనలు ఫలించి చివరికి 40 ఏళ్ల రోగి ప్రాణం నిలబడింది. గుండె మార్పిడి చికిత్స విజయవంతం అయినట్లు ఫోర్టిస్ ఆసత్ప్రి ఫ్యాకల్టీ డెరైక్టర్ హరీష్మణియన్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో ‘వేగం’ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. గుండె ను దాత నుంచి సేకరించిన తర్వాత 6 గంటల్లోపే తిరిగి అమర్చాలి. రసాయనాల సాయంతో ఆరు గంటలు మాత్రమే అది నిల్వ ఉంటుంది. ఈ నేపథ్యంలో దాత నుంచి గుండెను సేకరించడం దగ్గర నుంచి రోగికి అమర్చే వరకు సుదీర్ఘమైన ప్రక్రియ ను నిర్ణీత సమయంలోనే అందరి సహకారంతో పూర్తి చేయగలిగారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య గుండెను అత్యంత వేగంగా తరలించడంలో ట్రాఫిక్ పోలీసుల సంపూర్ణ సహకారం, ప్రజల తోడ్పాటు కూడా మరువలేనిది. అత్యంత ప్రముఖుల(వీవీఐపీ)కు మాత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేసి మార్గాన్ని సుగమం చేసే పోలీసులు... ఇక్కడ మాత్రం ఓ సామాన్యుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు తమవంతు పూర్తి సహకారం అందించారు. బెంగళూరులో బీజీఎస్ ఆస్పత్రి నుంచి స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న దూరం 42 కిలోమీటర్లు. సాధారణంగా అయితే ఈ దూరాన్ని అధిగమించడానికి గంటన్నర పడుతుంది. కానీ, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఎక్కడివక్కడ నిలిపివేయడంతో... కేవలం 40 నిమిషాల్లోనే వైద్య బృందం విమానాశ్రయానికి చేరుకోగలిగింది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైద్య బృందం చెన్నై విమానాశ్రయంలో దిగింది. బెంగళూరు పోలీసుల వలే చెన్నై నగర ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాలను పూర్తిగా నియంత్రించి దారిని క్లియర్ చేయడంతో... విమానాశ్రయం నుంచి అడయార్ ఫోర్టిస్ ఆస్పత్రి వరకు 14 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లోనే అంబులెన్స్ అధిగమించగలిగింది. సాధారణంగా అయితే, ఇందుకు 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీనికితోడు వైద్యుల కృషి వెరసి శస్త్రచికిత్స విజయవంతం అయింది. గతంలో ఒకే నగరంలోని రెండు వేర్వేరు ఆస్పత్రుల మధ్య గుండెను తరలించిన సందర్భా లు ఉన్నాయి. కానీ, రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య గుండెను తరలించడమనేది చాలా అరుదు. ‘‘ఎనిమిది మంది వైద్య నిపుణులు కాలంతో పరుగులు తీసి నాలుగు గంటల్లోనే రోగికి గుండెను అమర్చారు. ఆపరేషన్ విజయవంతమయింది’’ - హరీష్, ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి డెరైక్టర్, చెన్నై ‘‘గుండె మార్పిడి తర్వాత రోగి 20 ఏళ్ల పాటు ఆరోగ్యంతో జీవించవచ్చు’’. - ఎన్.కె. వెంకటరామన్, వైస్ ప్రెసిడెంట్, బీజీఎస్ ఆస్పత్రి, బెంగళూరు