ఒమెన్‌లో భారత స్కూళ్లకు ఆన్లైన్ దరఖాస్తులు
మస్కట్: వచ్చే 2014-2015 విద్యా సంవత్సరానికిగానూ మస్కట్‌లోని ఒమెన్‌లో భారత విద్యాలయాలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్టు అక్కడి మీడియా గురువారం వెల్లడించింది. ఈ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను డబ్య్లూడబ్య్లూడబ్య్లూ. ఇండియన్ స్కూల్స్ ఒమెన్. కామ్ ( www.indianschoolsoman.com) లో పొందవచ్చునని పేర్కొంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు వీలుగా సంబందిత దరఖాస్తు ఫారమ్‌లు జనవరి 1 నుంచి పొందవచ్చునని అక్కడి టైమ్స్ ఆఫ్ ఒమెన్ నివేదించింది. ఈ విద్యాసంవత్సరానికి ఒమెన్‌లో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ (బీఒడీ) భారతీయ విద్యాలయ శాఖ అధ్వర్యంలో 19 భారతీయ విద్యా సంస్థలు ఉండగా, అందులో చదువుకునే విద్యార్ధులు 37వేల మంది వరకు ఉన్నారు.
రిపోర్ట్ ప్రకారం.. కేంద్రీకరించిన అడ్మిషన్ విభాగ వ్యవస్థ (సీఏయస్) ఆధ్వర్యంలో ఆరు రాజధాని ఏరియా విద్యాసంస్థలను సమర్ధవంతముగా నడుస్తున్నాయి. ఈ అడ్మిషన్ విభాగ వ్యవస్థను 2011లో స్థాపించారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం పోటీపడే విద్యార్ధుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి విద్యాసంస్థల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఆ దేశ పాఠశాలలో ప్రధానంగా భారతీయ సంస్కృతికి తగట్టుగా విద్యను అభ్యసించేలా స్థాపించారు. ఈ విద్యా సంస్థలను రాజకీయేతరంగా నడుపుతున్నారు.