Indian Science Congress Conference
-
సైన్స్ కాంగ్రెస్‌లో టైమ్ క్యాప్సూ్యల్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో శుక్రవారం ఒక చారిత్రక ఘట్టం నమోదు అయింది. ప్రస్తుతం మనుషులు రోజూ వాడుతున్న పరికరాలను టైమ్ క్యాప్సూ్యల్(కాలనాళిక)లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు. నోబెల్ అవార్డు గ్రహీతలు డంకన్ హాల్డెన్, అవ్ రామ్ హెర్‡్ష కోవ్, థామస్ సుడాఫ్ ఒక మీట నొక్కగానేప్రత్యేకంగా తయారైన ఉక్కు అల్మారా భూమికి పది అడుగుల లోతైన గుంతలోకి వెళ్లింది. ఎల్పీయూలోని యునిపోలిస్ ఆడిటోరియంలో నిక్షిప్తమైన క్యాప్సూ్యల్‌ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్ టాప్, డ్రోన్, వీఆర్ గ్లాస్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లతో పాటు భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి గుర్తుగా మంగళ్యాన్, తేజస్ యుద్ధ విమానం, బ్రహ్మోస్ క్షిపణి నమూనాలను అందులో దాచినట్లు ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. మెచ్చినట్లుగా ముత్యాల తయారీ! ముత్యపు చిప్పలోకి ప్రత్యేక పద్ధతిలో ముత్యపు కేంద్రకాన్ని చొప్పించడం ద్వారా మనకు నచ్చిన ఆకారంలో ముత్యాలను తయారు చేసుకోవచ్చునని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జెన్నా తెలిపారు. వినాయకుడి విగ్రహం మొదలుకొని వేర్వేరు ఆకారాల్లో వీటిని తయారు చేయవచ్చని తెలిపారు. పరిజ్ఞానం 15 ఏళ్లుగా ఉన్నా మానవవనరుల కొరత కారణంగా ప్రాచుర్యం పొందలేదన్నారు. -
జై జవాన్, జై కిసాన్.. జై అనుసంధాన్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/గురుదాస్‌పూర్: దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశోధన–అభివృద్ధి రంగంలో ఏ దేశపు శక్తిసామర్థ్యాలైనా అక్కడి జాతీయ పరిశోధనాశాలలు, ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి సంస్థలపై ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని, వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. చికున్ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులతో పాటు పౌష్టికాహారలోపంపై టెక్నాలజీ ఆధారిత, చవ ౖMðన పరిష్కారాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమయిందని అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో ప్రారంభమైన ‘106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ జై కిసాన్’ అని నినాదం ఇచ్చారనీ, దానికి మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను జోడించారనీ.. తాజాగా తాను దీనికి జై అనుసంధాన్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లలోనే ఎక్కువ స్టార్టప్‌లు.. ప్రస్తుతం దేశంలోని విద్యార్థుల్లో 95 శాతం మంది రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరుతున్నారని ప్రధాని తెలిపారు. ‘‘ఈ విద్యా సంస్థలో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక మండలిని కోరుతున్నా. దీనివల్ల వేర్వేరు మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు విధానపరమైన ఉమ్మడి నిర్ణయాలను అమలు చేయడం వీలవుతుంది. ఇది ఇన్నొవేషన్, స్టార్టప్‌లకు ఎంతో అవసరం. గత 40 ఏళ్ల కంటే కేవలం గత నాలుగేళ్లలోనే టెక్నాలజీ రంగంలో ఎక్కువ స్టార్టప్‌లను స్థాపించాం. నేటి నినాదం ఏంటంటే ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ ఈ నినాదానికి జై అనుసంధాన్ అనే పదాన్ని నేను జోడించాను’’ అని వెల్లడించారు. దేశంలోని జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, రాష్ట్ర స్థాయి వర్సిటీలు, కళాశాలల్లో వీటిని పెంపొందించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. మళ్లీ ఆ అవకాశం వచ్చింది.. ‘భారత్‌లో ప్రాచీన జ్ఞానం అంతా పరిశోధన ద్వారా లభించిందే. గణితం, సైన్స్, కళలు, సంస్కృతి విషయంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అదే స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఇండియాకు మరోసారి లభించింది. ఇందుకోసం దేశంలో కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ఏకమై మన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. బిగ్ డేటా అనాలసిస్, కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ముఖ్యంగా చిన్న కమతాలు ఉన్న రైతులకు సాయంచేసేందుకు వినియోగించాలి. ప్రజల జీవితాలను మరింత సుఖమయం చేసేలా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగాలి’ అని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ అంతా కనెక్టెట్ టెక్నాలజీలదే అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని పరిశోధన–అభివృద్ధి రంగం వాణిజ్యపరంగా ముందుకు వెళ్లాలనీ, అప్పుడే సరికొత్త పారిశ్రామిక ఉత్పత్తులతో భారత్‌కు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. దేశీయ సాంకేతికత అభివృద్ధి అవసరం: సతీశ్ భారత రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్ అవసరాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీశ్ రెడ్డి తెలిపారు. తర్వాతితరం రక్షణ వ్యవస్థలకు సంబంధించి పదార్థాలు, స్మార్ట్ వస్త్రాలు, తయారీ రంగం, త్రీడీ ప్రింటింగ్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కొత్త సాంకేతికతలను దేశీయంగా, చవకగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ భద్రత రంగంలో ఇజ్రాయెల్ అగ్రగామిగా నిలవడానికి అక్కడి యువతే కారణమన్నారు. వారికి సీఎం పదవులిస్తోంది పంజాబ్‌లో రుణమాఫీపై పెద్దపెద్ద మాట లు చెప్పిన కాంగ్రెస్ అధికారం దక్కాక మాత్రం రైతులను మోసగించిందని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) పేరుతో ప్రజలను ఏళ్ల పాటు మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారన్నా రు. అంతేకాకుండా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నవారికి పార్టీ ముఖ్యమంత్రి పదవులను కూడా అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘కేవలం ఒకే కుటుంబం ఆదేశాలతో అల్లర్లలో పాలుపంచుకున్న వ్యక్తుల కేసు ఫైళ్లను మరుగున పడేశారు. కానీ వీటిని వెలికితీసిన ఎన్డీయే ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. దాని ఫలితాలు ఇప్పుడు మీముందు ఉన్నాయి’ అని తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తార్‌పూర్ వరకూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించాలని కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కర్ణాటకలో రైతులు రుణాలు చెల్లించకపోవడంతో పోలీసులు అరెస్ట్‌చేయడానికి వస్తున్నారనీ, దీంతో రైతులు ఇళ్ల నుంచి పారిపోతున్నారన్నారు. -
వేదాలు గొప్పవని హాకింగే చెప్పారు
ఇంఫాల్: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం(ఉ=ఝఛి2) కంటే మెరుగైన సిద్ధాంతం వేదాల్లో ఉన్నట్లు కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కన్నుమూసిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. ‘ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం కంటే మెరుగైన సిద్ధాంతం మన వేదాల్లో ఉండొచ్చని హాకింగ్ గతంలో పత్రికాముఖంగా తెలిపారు’ అని చెప్పారు. సమావేశం అనంతరం ఈ వాదనలకు ఆధారమేంటని విలేకరులు ప్రశ్నించగా.. వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత మీదేనన్నారు. ‘హిందూ మతంలోని ఆచార, సంప్రదాయాల్లో సైన్స్ మెండుగా ఉంది. ఆధునిక భారత్‌లో ప్రతీ ఆవిష్కరణ మన పూర్వీకులు సాధించిన వాటికి కొనసాగింపే’ అని సమావేశం అనంతరం హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు 2015లో ముంబైలో జరిగిన 102వ సైన్స్ కాంగ్రెస్‌లోనూ భారత్‌లో 7,000 ఏళ్ల క్రితం విమానాలు ఉండేవనీ, వాటిద్వారా ప్రజలు వేర్వేరు దేశాలకు, గ్రహాలకు వెళ్లేవారని వేదాల్లో ఉన్నట్లు ఓ పత్రాన్ని దాఖలుచేయడం వివాదానికి దారితీసింది. -
చేతులెత్తేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్ ప్రతిష్టాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తిగా చేతులెత్తేసింది. జనవరి మూడు నుంచి ఏడు వరకు ఓయూ వేదికగా నిర్వహించ తలపెట్టిన ఈ సదస్సును భద్రతా కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకోవడంతో ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ఏడు యూనివర్సిటీలు పోటీ పడగా, మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ అవకాశం దక్కింది. ఇంఫాల్ వేదికగా వచ్చే ఏడాది మార్చి 18 నుంచి 22 వరకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రకటించింది. కాగా, సైన్స్ కాంగ్రెస్ కోసం పేర్లు నమోదు చేసుకున్న ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ఫీజును రిఫండ్ చేయనున్నట్లు ఉస్మానియా వర్సిటీ ప్రకటించింది. ఓయూకు ఎంతో నష్టం.. సైన్స్ కాంగ్రెస్ ఉస్మానియా నుంచి మణిపూర్ వర్సిటీకి తరలిపోవడం వల్ల ఓయూకు భారీ నష్టం వాటిల్లనుంది. అంతర్జాతీయంగా వర్సిటీ ప్రతిష్ట దిగజారడమే కాక వివిధ విభాగాలకు వచ్చే పరిశోధన ప్రాజెక్టులు రాకుండా పోయే అవకాశం ఉంది. అంతేకాదు ఇక్కడ పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వివిధ దేశాల్లోని కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు, విదేశీ వర్సిటీల్లో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుతూ కొనసాగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. 2009 నుంచి 2014 వరకు వరుస ఆందోళనలతో వర్సిటీ అట్టుడికిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత వర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఓయూ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత ఏప్రిల్‌లో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంది. ఆ తర్వాత ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఒకటి రెండు ఘటనలు మినహా యూనివర్సిటీలో పెద్ద ఉద్రిక్త పరిస్థితులేమీ నెలకొనలేదు. స్వర్ణోత్సవాల స్ఫూర్తితో సైన్స్ కాంగ్రెస్‌ను కూడా విజయవంతం చేయాలని వర్సిటీ యంత్రాంగం భావించింది. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత.. గత ఆరు నెలల నుంచి 40 మందితో కూడిన బృందం సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. 20 ఏళ్ల తర్వాత ఓయూ వేదికగా నిర్వహిస్తున్న సదస్సు కావడంతో ఇక్కడ చదువుకుని దేశవిదేశాల్లో స్థిరపడిన అనేక మంది శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు పంపడం సహా విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం విమాన టికెట్లు బుక్ చేసింది. అతిథుల వసతి కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో 500 గదులు, రవాణా కోసం 700 క్యాబ్‌లు, 15,000 బ్యాగులు బుక్ చేసింది. ఆ మేరకు ఆయా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు కూడా చెల్లించింది. ఇప్పటికే పీజీ విద్యార్థులకు నెల రోజుల సెలవులు ప్రకటించింది. తీరా ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత శాంతి భద్రతల సమస్యను తెరపైకి తెచ్చి.. ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంటూ సదస్సును వాయిదా వేసింది. సదస్సు నుంచి తప్పుకునేందుకు వర్సిటీ చూపిన ఈ శాంతిభద్రతల అంశం వర్సిటీకి మాయని మచ్చగా మిగలడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకంగా మారే ప్రమాదం లేకపోలేదు. కాగా, వీసీ చేతగానితనం వల్లే సైన్స్ కాంగ్రెస్ మణిపూర్‌కు తరలిపోయిందని, వీసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల బంద్‌కు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరవధిక బంద్‌కు పిలిపునిచ్చినట్లు ప్రకటించింది. వీసీ వైఫల్యం వల్లే.. ప్రశాంతంగా ఉన్న వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు వీసీ ప్రకటించడం దారుణం. వర్సిటీ ప్రతిష్టను దేశవిదేశాల్లో ఇనమడింపజేయాల్సిన వీసీ ఇస్కాకు తప్పుడు నివేదిక ఇచ్చి దాని ప్రతిష్టను మరింత దిగజార్చారు. వర్సిటీ స్వయం ప్రతిపత్తిని సీఎంకు తాకట్టు పెట్టి, ఆయనకు తొత్తుగా మారానే. వీసీ వైఫల్యం వల్ల విద్యార్థులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. – ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, అధ్యక్షుడు, ఔటా దయచేసి నన్ను వదిలేయండి.. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో.. దీనికి కారణాలేమిటో.. నాకంటే.. మీకే ఎక్కువ తెలుసు. ఈ విషయంలో ఇంతకన్నా నేనేం మాట్లడలేను. దయ చేసి..నన్ను వదిలేయండి – ప్రొఫెసర్ రామచంద్రం, వీసీ, ఉస్మానియా వర్సిటీ మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ -
శాస్త్ర విజ్ఞాన ప్రపంచ ముఖచిత్రం..!
సందర్భం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సి) 104వ ప్రతిష్టాత్మక సదస్సును 2017 జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం సువిశాల ఆవరణలో నిర్వహించ నున్నారు. ఈ సమావేశాలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017 జనవరి 3న ప్రారంభించనున్నారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖులు, ఐఎస్‌సీఏ పూర్వ జనరల్ ప్రెసిడెంట్లు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, విధాన రూపకర్తలు, సృజనకారులు, విద్యావేత్తలతో పాటు వేలాది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సమావేశా లకు విచ్చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన శాస్త్ర విజ్ఞాన రంగ ప్రసిద్ధులు ఈ సదస్సులో భాగం పంచుకోబోతు న్నారు. యూఎస్ఏ, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్‌ల నుంచి 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఈ సదస్సుకు హాజరై, వారి అనుభవాలను వెల్లడించనున్నారు. విదే శాలకు చెందిన 200 మంది శాస్త్రజ్ఞుల బృందం, వేరు వేరు జాతీయ ప్రయోగశాలలకు ప్రాతినిధ్యం వహించే 10,000 మంది శాస్త్రవేత్తలు, ఇంకా భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే ఫ్యాకల్టీ మెంబర్లు, పరిశోధక విద్యార్థులు తదితరులు సైతం ఈ సమావేశంలో పాల్గొని శాస్త్రీయ విజ్ఞాన సంబంధ అంశాలపై వారి వారి అభిప్రాయాలను వివరించనున్నారు. ‘దేశాభివృద్ధి కోసం శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం’ అనేది ఈ కార్యక్ర మంలో ప్రధానాంశంగా ఉండబోతున్నది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను 1914లో స్థాపించారు. ఇండి యన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్íసీఏ) భారతీయ శాస్త్ర విజ్ఞాన సముదాయ సంబంధ సంస్థలన్నింటిలోకి ముఖ్యమైన సంస్థ. దేశంలో సైన్స్‌కు ప్రోత్సాహాన్ని అందించడం, సైన్స్‌ను తదు పరి స్థాయికి చేర్చడం, సైన్స్ ఉపయోగాలను పెంచడం అనే లక్ష్యాలతో ఐఎస్íసీఏను నెలకొల్పారు. ఐఎస్‌సీఏ ఒకటో సమా వేశాలు 1914లో జరిగాయి. ఆ సందర్భంలో 150 మంది సభ్యులు 35 ముఖ్య పత్రాలు ఈ సమావేశాలలో సమర్పించడమైంది. నాటి నుంచి నేటి వరకు 10,000 మందికి పైగా సభ్యులతో ఐఎస్‌సీఏ విస్తరించింది. గడిచిన 103 ఏళ్లుగా ఐఎస్‌సీఏ వార్షిక సమావేశాల్లో జరిగే మేధోమథన చర్చాంశాలు, వాటి తాలూకూ సిఫార్సులు భారత ప్రభుత్వ భావి కార్యాచరణకు ఆధారం అవుతున్నాయి. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్స్ పో: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌తో పాటే నిర్వహిం చనున్న ‘‘ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్ పో’’ (పిఒఐ)లో శాస్త్ర విజ్ఞాన ప్రపంచం యొక్క ముఖ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఏళ్ల తరబడి ‘‘ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ ఎక్స్ పో టెక్నా లజీ ఆధారితంగా వెలుగు లోకి వచ్చిన కొత్త కొత్త ఉత్ప త్తుల/భావనల వెల్లడులు వంటి వాటికి చక్కని అవ కాశంగా పరిణమిస్తోంది. హాల్ ఆఫ్ ప్రైడ్ : శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం ఈ రెండు రంగాలలో గొప్ప ఘనత లను సాధించడం ద్వారా దేశ ప్రగతి సంక్షేమాలలో తమ వంతు విశేష కృషిని అందించిన ప్రసిద్ధుల జీవితాల్లోని పలు మజిలీలను కళ్లకు కట్టేందుకు అంకితం చేసిన ఒక మండపమే ‘‘హాల్ ఆఫ్ ప్రైడ్’’. దేశంలోనే ప్రముఖ కళాకారులు ఈ మండపానికి రూపు రేఖలు దిద్దుతారు. దీనిని ఈ సమావేశాలన్నింటిలో బహుళ జనా దరణకు నోచుకొన్న విభాగాలలో ముఖ్యమైందని చెప్పవచ్చు. విజ్ఞాన జ్యోతి : శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దానిని యువతీ యువకులు ఒక కెరియర్‌గా స్వీకరించేలా ప్రోత్స హించేందుకు చేపట్టిన కొత్త కార్యక్రమమే ‘విజ్ఞాన జ్యోతి’. ఇది రేపటి తరం శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్లను తీర్చిదిద్దుతుంది. ఒలిం పిక్ కాగడా తరహాలో ‘విజ్ఞాన జ్యోతి’ భావనను తెరమీదకు తెచ్చారు.‘‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ ఎక్స్ పో ఏర్పాటైన స్థలంలో ఈ ‘విజ్ఞాన జ్యోతి’ వెలుగులీనుతూ సైన్స్ కోసం పాటుపడతామని ప్రతిన పూనేందుకు లక్షలాది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. జెనిసిస్–15వ గోష్టి : 2017, జనవరి 4వ తేదీన నిర్వహించే ఒక రోజు కార్యక్రమమే జెనిసిస్. శాస్త్ర విజ్ఞానానికి, పరిశ్రమల రంగానికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడం ఈ కార్యక్రమం ధ్యేయం. చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ : బాల బాలికల దృష్టిని శాస్త్ర విజ్ఞానం వైపు ఆకర్షించేందుకు వారిలో శాస్త్ర విజ్ఞాన సంబంధ ప్రయోగాలు మొదలుపెట్టాలనే భావాలను రంగరించడం కోసం చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నారు. ఇది 3 రోజుల పాటు సాగు తుంది. బడి పిల్లలు కొత్తగా కనిపెట్టిన అంశాలను ప్రదర్శించేం దుకు వారిని అనుమతిస్తారు. ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ : ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేరు వేరు విద్యా సంస్థలకు చెందిన మహిళా శాస్త్రవేత్తలు ఐఎస్సీఏలో పాల్గొనేటట్లు వారికి ఒక ప్రేరణను అందించడానికి ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మహిళా శాస్త్రవేత్తలు ఉప న్యాసాలు ఇవ్వనున్నారు. పేర్లు నమోదు చేసుకొనే మహిళా శాస్త్ర వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దేశ శాస్త్ర, సాంకేతిక రంగ విజయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు విశిష్ట విద్యావేత్తలను, పత్రికా రచయితలను, చలన చిత్ర దర్శకులను, శాస్త్రవేత్తలను, కమ్యూనికేటర్లు వంటి వారిని ఆహ్వానించడమైంది. (జనవరి 3 నుంచి 7 వరకు తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా) (వ్యాసకర్త : డాక్టర్ పీజే సుధాకర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హైదరాబాద్ )