శాస్త్ర విజ్ఞాన ప్రపంచ ముఖచిత్రం..!
సందర్భం
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి) 104వ ప్రతిష్టాత్మక సదస్సును 2017 జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం సువిశాల ఆవరణలో నిర్వహించ నున్నారు. ఈ సమావేశాలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017 జనవరి 3న ప్రారంభించనున్నారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖులు, ఐఎస్‌సీఏ పూర్వ జనరల్ ప్రెసిడెంట్‌లు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, విధాన రూపకర్తలు, సృజనకారులు, విద్యావేత్తలతో పాటు వేలాది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సమావేశా లకు విచ్చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన శాస్త్ర విజ్ఞాన రంగ ప్రసిద్ధులు ఈ సదస్సులో భాగం పంచుకోబోతు న్నారు. యూఎస్‌ఏ, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్‌ల నుంచి 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఈ సదస్సుకు హాజరై, వారి అనుభవాలను వెల్లడించనున్నారు. విదే శాలకు చెందిన 200 మంది శాస్త్రజ్ఞుల బృందం, వేరు వేరు జాతీయ ప్రయోగశాలలకు ప్రాతినిధ్యం వహించే 10,000 మంది శాస్త్రవేత్తలు, ఇంకా భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే ఫ్యాకల్టీ మెంబర్లు, పరిశోధక విద్యార్థులు తదితరులు సైతం ఈ సమావేశంలో పాల్గొని శాస్త్రీయ విజ్ఞాన సంబంధ అంశాలపై వారి వారి అభిప్రాయాలను వివరించనున్నారు. ‘దేశాభివృద్ధి కోసం శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం’ అనేది ఈ కార్యక్ర మంలో ప్రధానాంశంగా ఉండబోతున్నది.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను 1914లో స్థాపించారు. ఇండి యన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్íసీఏ) భారతీయ శాస్త్ర విజ్ఞాన సముదాయ సంబంధ సంస్థలన్నింటిలోకి ముఖ్యమైన సంస్థ. దేశంలో సైన్స్‌కు ప్రోత్సాహాన్ని అందించడం, సైన్స్‌ను తదు పరి స్థాయికి చేర్చడం, సైన్స్ ఉపయోగాలను పెంచడం అనే లక్ష్యాలతో ఐఎస్íసీఏను నెలకొల్పారు. ఐఎస్‌సీఏ ఒకటో సమా వేశాలు 1914లో జరిగాయి. ఆ సందర్భంలో 150 మంది సభ్యులు 35 ముఖ్య పత్రాలు ఈ సమావేశాలలో సమర్పించడమైంది. నాటి నుంచి నేటి వరకు 10,000 మందికి పైగా సభ్యులతో ఐఎస్‌సీఏ విస్తరించింది. గడిచిన 103 ఏళ్లుగా ఐఎస్‌సీఏ వార్షిక సమావేశాల్లో జరిగే మేధోమథన చర్చాంశాలు, వాటి తాలూకూ సిఫార్సులు భారత ప్రభుత్వ భావి కార్యాచరణకు ఆధారం అవుతున్నాయి.
104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్స్ పో: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌తో పాటే నిర్వహిం చనున్న ‘‘ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్ పో’’ (పిఒఐ)లో శాస్త్ర విజ్ఞాన ప్రపంచం యొక్క ముఖ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఏళ్ల తరబడి ‘‘ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ ఎక్స్ పో టెక్నా లజీ ఆధారితంగా వెలుగు లోకి వచ్చిన కొత్త కొత్త ఉత్ప త్తుల/భావనల వెల్లడులు వంటి వాటికి చక్కని అవ కాశంగా పరిణమిస్తోంది.
హాల్ ఆఫ్ ప్రైడ్ : శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం ఈ రెండు రంగాలలో గొప్ప ఘనత లను సాధించడం ద్వారా దేశ ప్రగతి సంక్షేమాలలో తమ వంతు విశేష కృషిని అందించిన ప్రసిద్ధుల జీవితాల్లోని పలు మజిలీలను కళ్లకు కట్టేందుకు అంకితం చేసిన ఒక మండపమే ‘‘హాల్ ఆఫ్ ప్రైడ్’’. దేశంలోనే ప్రముఖ కళాకారులు ఈ మండపానికి రూపు రేఖలు దిద్దుతారు. దీనిని ఈ సమావేశాలన్నింటిలో బహుళ జనా దరణకు నోచుకొన్న విభాగాలలో ముఖ్యమైందని చెప్పవచ్చు.
విజ్ఞాన జ్యోతి : శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దానిని యువతీ యువకులు ఒక కెరియర్‌గా స్వీకరించేలా ప్రోత్స హించేందుకు చేపట్టిన కొత్త కార్యక్రమమే ‘విజ్ఞాన జ్యోతి’. ఇది రేపటి తరం శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్లను తీర్చిదిద్దుతుంది. ఒలిం పిక్ కాగడా తరహాలో ‘విజ్ఞాన జ్యోతి’ భావనను తెరమీదకు తెచ్చారు.‘‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ ఎక్స్ పో ఏర్పాటైన స్థలంలో ఈ ‘విజ్ఞాన జ్యోతి’ వెలుగులీనుతూ సైన్స్ కోసం పాటుపడతామని ప్రతిన పూనేందుకు లక్షలాది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
జెనిసిస్–15వ గోష్టి : 2017, జనవరి 4వ తేదీన నిర్వహించే ఒక రోజు కార్యక్రమమే జెనిసిస్. శాస్త్ర విజ్ఞానానికి, పరిశ్రమల రంగానికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడం ఈ కార్యక్రమం ధ్యేయం.
చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ : బాల బాలికల దృష్టిని శాస్త్ర విజ్ఞానం వైపు ఆకర్షించేందుకు వారిలో శాస్త్ర విజ్ఞాన సంబంధ ప్రయోగాలు మొదలుపెట్టాలనే భావాలను రంగరించడం కోసం చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నారు. ఇది 3 రోజుల పాటు సాగు తుంది. బడి పిల్లలు కొత్తగా కనిపెట్టిన అంశాలను ప్రదర్శించేం దుకు వారిని అనుమతిస్తారు.
ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ : ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేరు వేరు విద్యా సంస్థలకు చెందిన మహిళా శాస్త్రవేత్తలు ఐఎస్‌సీఏలో పాల్గొనేటట్లు వారికి ఒక ప్రేరణను అందించడానికి ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మహిళా శాస్త్రవేత్తలు ఉప న్యాసాలు ఇవ్వనున్నారు. పేర్లు నమోదు చేసుకొనే మహిళా శాస్త్ర వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
దేశ శాస్త్ర, సాంకేతిక రంగ విజయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు విశిష్ట విద్యావేత్తలను, పత్రికా రచయితలను, చలన చిత్ర దర్శకులను, శాస్త్రవేత్తలను, కమ్యూనికేటర్లు వంటి వారిని ఆహ్వానించడమైంది.
(జనవరి 3 నుంచి 7 వరకు తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో
104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా)
(వ్యాసకర్త : డాక్టర్ పీజే సుధాకర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్
ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో, హైదరాబాద్ )