Indian states
-
ధూమ్.. ధామ్ దసరా : ఇక్కడ సందడే వేరు! (ఫొటోలు)
-
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్?, కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలు!
ఇటీవల మన దేశ ఆర్థిక వ్యవస్థ మొదటి సారిగా 4 ట్రిలియన్ డాలర్ల మైలు రాయిని చేరిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఎక్స్’ వేదికగా పలువురు ప్రముఖులు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో ఫోర్బ్స్ ఇండియా భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. దేశ రాజధాని. ఇవన్నీ కలిపి భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని దేశంగా నిలబెడుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత (2023లో) జీడీపీ 3.75 ట్రిలియన్ డాలర్లుగా ఉందని తేలింది. జీడీపీని బట్టే దేశాభివృద్ది ఎలా ఉందనే విషయాన్ని గుర్తించవచ్చు. ఇంతకీ జీడీపీ అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. ‘జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిద’ని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలాబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో.. దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని అర్ధం. తలసరి జీడీజీ విషయానికొస్తే ఇది దేశంలోని ప్రతి వ్యక్తికి సగటు ఆర్థిక ఉత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి (GDP)ని సూచించే కొలత. ఇది ఒక దేశ మొత్తం జీడీపీని దాని జనాభాతో గుణించడం ద్వారా అంచనా వేయొచ్చు.ఈ రెండు పారామీటర్స్‌ని ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రాంత జనాభా ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా కేంద్ర సంస్థ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) జీడీపీ డేటాను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్ ద్వారా మన దేశంలోని అత్యంత ధనిక,పేద రాష్ట్రాలను గుర్తింవచ్చు. -
అమిత్ షాతో భేటీలో పాల్గొన్న సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత
సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన ఈ సదస్సుకు వామపక్ష తీవ్రవాద ప్రభావితం ఉన్న 10 రాష్ట్రాలు హాజరయ్యాయి. తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన వారు హాజరయ్యారు. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. -
రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణతో దేశమంతా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రస్థాయిలో ఉండడంతో రాష్ట్రాలు కంటి మీద కునుకు లేకుండా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. దీనిపై జాతీయ మీడియాలో కూడా తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు తమకు తాము లాక్డౌన్ ప్రకటించుకున్నాయి. ఇంచుమించు 18 రాష్ట్రాలు లాక్డౌన్, ఇక మిగతా రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్, వారాంతపు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టాయి. తాజాగా తెలంగాణ, నాగాలాండ్ లాక్డౌన్ ప్రకటించడంతో దాదాపు దేశమంతా తాళం పడింది. కరోనా కట్టడికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయం చేయాలని గగ్గోలు పెడుతున్నాయి. అయినా కూడా కేంద్రంలో స్పందన లేదని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని పలువురు ఉదహరిస్తున్నారు. అయితే ప్రధాని మాత్రం జాతినుద్దేశించి ఓ ప్రసంగం చేసి గమ్మున ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 20వ తేదీన జాతినుద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగంలో కరోనా కట్టడిపై ఏదైనా ప్రకటన చేస్తారని దేశ ప్రజానీకం ఆశించగా.. ఎలాంటి ప్రకటన చేయకుండా కొన్ని సలహాలు ఇచ్చి ముగించారు. వాటితో పాటు ‘కరోనా కట్టడి చర్యలు రాష్ట్రాలే తీసుకోవాలి’ అని ఒక మాట అనేసి చేతులు దులిపేసుకున్నారని సర్వత్రా వినిపించిన మాట. అప్పటి నుంచి అదే మాదిరి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలతో పాటు మేధావులు, జాతీయ మీడియా కూడా విమర్శిస్తోంది. అయినా కూడా కేంద్రంలో ఎలాంటి మార్పు రాలేదని మనం చూస్తూనే ఉన్నామని విశ్లేషకులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ మొదలై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం సరైన చర్య తీసుకోలేదని అంతర్జాతీయంగా కూడా విమర్శలు వస్తున్నాయి. అరకొర వైద్య సేవలు, ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ వంటి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిరాశ ఫలితాలు ఎదురవడం వంటి అంశాల నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్ వైపు కేంద్రం మొగ్గు చూపలేదని అందరికీ తెలిసిన రహాస్యమే. రాష్ట్రాల ఇష్టం అని ఒక మాట చెప్పేసి ప్రధాని నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రధాని మౌనం దేశానికి శాపంగా మారిందని.. నోరు విప్పి ప్రజలకు కొంత భరోసా కలిగించే చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, ప్రజలు ఏదో ఒకటి వస్తుందని కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాయి. లాక్డౌన్ లేకపోయినా ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని.. వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్రాలకు కేంద్రం సహకారించాలని సర్వత్రా వస్తున్న విజ్ఞప్తి. గతేడాది కన్నా దారుణంగా ప్రస్తుతం కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కానీ ప్రధాని మాత్రం సీఎంలతో ఫోన్లలో మాట్లాడడం మినహా ఏమీ చేయడం లేదని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది. మరొకసారి ముఖ్యమంత్రులతో సమావేశమై.. ఆక్సిజన్, వ్యాక్సిన్లపై చొరవ తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని మోదీ వైఖరిలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక భరోసా కల్పించే మాట కేంద్రం నుంచి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా -
ఇప్పటివరకూ లాక్డౌన్ విధించిన రాష్ట్రాలు ఇవే!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో ఇప్పటికే 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తుండగా తెలంగాణ తాజాగా చేరిపోయింది. పది రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్డౌన్ అనంతరం ఢిల్లీ, కర్నాటక విధించగా తమిళనాడు కూడా విధించింది. ఈ విధంగా మొత్తం 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్న రాష్ట్రాలు.. తెలంగాణ: మే 12 నుంచి 22వ తేదీ వరకు కేరళ: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ ఢిల్లీ: 10వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగింది. లాక్డౌన్ పొడిగించారు. మధ్యప్రదేశ్: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ్: ఈనెల 10 వరకు లాక్డౌన్ అమలు. ప్రస్తుతం కఠిన నిబంధనలతో కర్ఫ్యూ (పాక్షిక లాక్డౌన్). హిమాచల్‌ప్రదేశ్: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్డౌన్. తమిళనాడు: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్డౌన్ కర్ణాటక: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ రాజస్థాన్: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్డౌన్ మహారాష్ట్ర: ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు. బిహార్: మే 4 నుంచి 15 వరకు లాక్డౌన్ చండీగఢ్: వారం రోజుల లాక్ డౌన్. గోవా: మే 9 నుంచి 23 వరకు.. హరియాణా: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు. ప్రస్తుతం తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ కొనసాగుతోంది. మణిపూర్: మే 7 వరకు లాక్డౌన్ విధించారు. అనంతరం తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ కొనసాగుతోంది. నాగాలాండ్: మే 14 నుంచి 24వ తేదీ వరకు. ఆంధ్రప్రదేశ్‌లో పాక్షిక లాక్డౌన్ కొనసాగుతోంది. పేరుకు కర్ఫ్యూ అని ప్రకటించినా కూడా మధ్యాహ్నం నుంచి సర్వం బంద్ కావడంతో ఏపీలోని లాక్డౌన్ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్, వారాంతపు లాక్డౌన్, తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ వంటివి అమల్లో ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో భారతదేశమంతా ప్రస్తుతం లాక్డౌన్లో ఉన్నట్టే కనిపిస్తోంది. చదవండి: తుపాకీకి భయపడి బిల్డింగ్ దూకిన చిన్నారులు భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ -
కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్డౌన్ అనంతరం ఢిల్లీ, కర్నాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. ఈ విధంగా మొత్తం 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉంది. ఏయే రాష్ట్రాల్లో తెలుసుకోండి. కేరళ: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ ఢిల్లీ: 10వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతోంది. పొడగించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ్: ఈనెల 10 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. హిమాచల్‌ప్రదేశ్: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్డౌన్. తమిళనాడు: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్డౌన్ కర్ణాటక: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ రాజస్థాన్: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్డౌన్ మహారాష్ట్ర: ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు. బిహార్: మే 4 నుంచి 15 వరకు లాక్డౌన్ చండీగఢ్: వారం రోజుల లాక్ డౌన్ గోవా: మే 9 నుంచి 23 వరకు.. హరియాణా: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు. మణిపూర్: మే 7 వరకు లాక్డౌన్ చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ చదవండి: వ్యాక్సిన్ కొరత తీవ్రం.. పిల్లలకు కూడా వేయించాలి -
ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతుండడంతో ఇప్పటిదాక తీసుకున్న కట్టడి చర్యలు ఫలించడం లేదు. మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రజారోగ్యం దృష్ట్యా రాష్ట్రాలు విధిలేక సంపూర్ణ లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. నేటి రాత్రి నుంచి గోవాలో లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ కూడా లాక్డౌన్ ప్రకటించింది. ఇప్పటివరకు రాత్రి పూట కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్డౌన్ అమల్లో ఉండగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించగా త్వరలోనే గుజరాత్, కేరళ లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటివరకు పాక్షిక లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా లాక్డౌన్ విధించే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వాలు యోచన చేస్తున్నాయి. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో వారాంతపు లాక్డౌన్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ విధిస్తుందనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వాలు అటువైపు అడుగులు వేయడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా మూడు, నాలుగు రోజుల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర: ఈ నెల 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి లాక్డౌన్ అమలు. మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ ముగియనుంది. అయితే కేసుల పెరుగుదలతో మళ్లీ పొడగించే అవకాశం ఉంది. ఢిల్లీ: ఏప్రిల్ 19వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు. మరో విడత పొడగింపు. మే 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. కర్నాటక: ఏప్రిల్ 27వ తేదీ నుంచి 14 రోజుల లాక్డౌన్ అమలు. మే 10వ తేదీ వరకు అమల్లో ఉండే అవకాశం ఉంది. గోవా: ఏప్రిల్ 29వ తేదీ 7 గంటల నుంచి మే 3 వరకు సంపూర్ణ లాక్డౌన్. ఉత్తరప్రదేశ్: ఇన్ని రోజులు వారాంతపు లాక్డౌన్ ఉండగా ఇప్పుడు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఈ రాష్ట్రాలు కాకుండా చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. త్వరలోనే ఆ రాష్ట్రాలు కూడా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించేలా పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి గత్యంతరం లేక ప్రజారోగ్యం దృష్ట్యా లాక్డౌన్ వైపు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు -
కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా టీకా అందించగా ప్రస్తుతం 18-45 ఏళ్ల వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. అయితే వారికి మాత్రం ఉచితమని చెప్పలేదు. దీంతో ఆ వయసు వారు బయట కొనుక్కుని వేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా తాము ఉచితంగా టీకా అందిస్తామని దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. 18-45 ఏళ్ల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ఏకంగా 23 రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తెలంగాణతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు వయసుతో నిమిత్తం లేకుండా ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించాయి. ఇప్పటివరకు 19.19 కోట్ల వ్యాక్సిన్‌ను 45 ఏళ్లు పైబడిన వారికి వినియోగించారు. మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినే దానికి విరుగుడుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ వేయించాలని సంకల్పించాయి. ప్రజలకు ఉచితంగా టీకా వేసేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 23 రాష్ట్రాలు ఉచితంగా టీకా అందిస్తామని ముందుకు వచ్చాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం వయసు నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించింది. ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అసోం, గోవా, ఒడిశా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్. చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ చదవండి: ఎన్నికల సంఘం బీజేపీ గూటి చిలక -
భారత రాష్ట్రాలపై అమెరికా వెబ్‌పోర్టల్
వాషింగ్టన్: భారత్‌లోని ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి విధి, విధానాలపై అవగాహన కల్పించేందుకు అమెరికా అత్యున్నత స్థాయి మేధోవర్గం ఓ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) ఆధ్వర్యంలో ‘ఎంగేజింగ్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్‌ను ఇంధన సహాయ మంత్రి గ్రిఫిన్ థాంప్సన్, భారత్–అమెరికా విధాన అధ్యయన కేంద్రం సీనియర్ సలహాదారుడు రిచర్డ్ రొసౌ ఆవిష్కరించారు.