సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్‌డౌన్ అనంతరం ఢిల్లీ, కర్నాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. ఈ విధంగా మొత్తం 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఏయే రాష్ట్రాల్లో తెలుసుకోండి.
కేరళ: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్
ఢిల్లీ: 10వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. పొడగించే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంది.
ఉత్తరప్రదేశ్: ఈనెల 10 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.
హిమాచల్‌ప్రదేశ్: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్.
తమిళనాడు: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్
కర్ణాటక: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్
రాజస్థాన్: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్
మహారాష్ట్ర: ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.
బిహార్: మే 4 నుంచి 15 వరకు లాక్‌డౌన్
చండీగఢ్: వారం రోజుల లాక్ డౌన్
గోవా: మే 9 నుంచి 23 వరకు..
హరియాణా: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు.
మణిపూర్: మే 7 వరకు లాక్డౌన్
చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’
చదవండి: వ్యాక్సిన్ కొరత తీవ్రం.. పిల్లలకు కూడా వేయించాలి
Comments
Please login to add a commentAdd a comment