Indian users
-
5జీ నెట్వర్క్ అదుర్స్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు
న్యూఢిల్లీ: మొబైల్ చందాదార్ల విషయంలో 5జీ టెక్నాలజీ చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం మొబైల్ చందాదార్లలో ఇది 39 శాతం వాటా అని టెలికం గేర్ మేకర్ ఎరిక్సన్ వెల్లడించింది. ‘స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల సంఖ్య ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 81 కోట్లుగా ఉంటుంది. ఆరేళ్లలో ఇది 120 కోట్లకు ఎగుస్తుందని అంచనా. 4జీ యూజర్లు 79 కోట్ల నుంచి 71 కోట్లకు వచ్చి చేరుతుంది. 4జీ చందాదార్ల వాటా ప్రస్తుతం ఉన్న 68 నుంచి 55 శాతానికి పడిపోతుంది. అంతర్జాతీయంగా మొత్తం చందాదార్లలో 5జీ యూజర్ల సంఖ్య సుమారు 50 శాతానికి చేరుతుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 62 శాతం వాటా వీరిదే. చైనా, ఉత్తర అమెరికా నుంచి అంచనాలను మించి డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2011 నుంచి మొబైల్ డేటా ట్రాఫిక్ 300 రెట్లు అధికమైంది. 2021 చివరినాటికి 200 కోట్లకుపైగా ప్రజలకు 5జీ నెట్వర్క్ చేరువ అవుతుంది. మొత్తం మొబైల్ నెట్వర్క్ డేటా ట్రాఫిక్ 2027 చివరికి 370 ఎక్సాబైట్స్ నమోదు కానుంది’ అని ఎరిక్సన్ తెలిపింది. చదవండి: భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..! -
ఫేస్బుక్ డాటా లీక్.. రంగంలోకి కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. డాటా లీక్‌పై సమాచారం ఇవ్వాలని, ఏప్రిల్ 7లోగా పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌ను కోరింది. కేంబ్రిడ్జ్ అనాలిటికా సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి ఎన్నికలతోపాటు ఇతర ప్రయోజనాలకు వాడుకున్నట్టు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నుంచి ఈ మేరకు సంజాయిషీ కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ లేఖ రాసింది. ఎన్నికలను ప్రభావితం చేసేలా ఫేస్బుక్ సమాచారాన్ని తస్కరించి.. అవకతవకలకు పాల్పడ్డట్టూ కేంబ్రిడ్జ్ అనాలిటికా (సీఏ) ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సంస్థకు కూడా కేంద్రం ఈ నెల 23న నోటీసులు పంపింది. ఫేస్బుక్ నుంచి సమాచార ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కోరింది. భారతీయ ఓటర్లు, భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం విషయంలో సీఏ ఏమైనా ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడిందా? ఫేస్బుక్ లేదా దాని అనుబంధ సంస్థలు ఫేస్బుక్ సమాచారాన్ని ఉపయోగించుకొని గతంలో భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయా? అన్నది తెలుపాలని కోరింది. ఫేస్బుక్ సమాచార ఉల్లంఘనలపై మరింత వివరాలు తెలుసుకోవాల్సిన అవసరముందని, అందుకే తాము ఫేస్‌బుక్‌కు ఈ మేరకు లేఖలు పంపామని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. -
లైకోస్, అపోలో ఇంటర్నేషనల్‌ల ఈ-కామర్స్ వెంచర్
హైదరాబాద్: ఇంటర్నెట్ బ్రాండ్ లైకోస్, అపోలో ఇంటర్నేషనల్ సంస్థలు ఈ-కామర్స్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అపోలో లైకోస్ నెట్కామర్స్ పేరుతో ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటవుతోంది. భారత వినియోగదారులు లక్ష్యంగా కస్టమ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పాటు చేయడానికి గ్లోబల్ బ్రాండ్స్‌కు ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్ ఈ వెంచర్ అంది స్తుంది. భారత వినియోగదారులకు వినూత్నమైన డిజిటల్ షాపింగ్ అనుభూతిని ఈ జాయిం ట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తెస్తామని అపోలో వైస్-చైర్మన్, ఎండీ రాజా కన్వర్ చెప్పారు. అంతర్జాతీయ దిగ్గజం బ్రాండ్లు భారత్‌లోకి ప్రవేశించడానికి వినూత్నమైన సర్వీసులందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లైకోస్ చైర్మన్, సీఈఓ సురేశ్ రెడ్డి చెప్పారు.