Indias exports
-
ఐదో నెలా ఎగుమతులు అప్..!
• జనవరిలో వృద్ధి 4.32%; 22 బిలియన్ డాలర్లు • దిగుమతుల విలువ 32 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా ఐదవనెలా వృద్ధిని నమోదుచేసుకున్నాయి. 2016 జనవరితో పోల్చిచూస్తే... 2017 జనవరిలో ఎగుమతులు 4 శాతం పైగా వృద్ధిని నమోదుచేసుకున్నాయి. విలువ 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతులు ఇదే నెలలో 11 శాతం పెరిగి 32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు – దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2016 జనవరిలో వాణిజ్యలోటు 7.66 బిలియన్ డాలర్లు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ జనవరిలో ఎగుమతుల పెరుగుదలలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ముడి ఇనుములది కీలకపాత్ర. ముడి ఇనుము ఎగుమతులు 10 శాతం పెరిగి 184 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఈ రేటు 29 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఇంజనీరింగ్ ఉత్పత్తుల విషయంలో ఎగుమతులు 12 శాతం వృద్ధితో 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ⇔ జనవరిలో ఎగుమతుల వృద్ధి డిసెంబర్ వృద్ధి రేటుకన్నా (5.72%) తక్కువ. ⇔ కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఎగుమతులు కేవలం 1 శాతం పెరిగి, విలువలో 221 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 108 బిలియన్ డాలర్ల నుంచి 86 బిలియన్ డాలర్లకు తగ్గింది. పసిడి వెలవెల...: మరోవైపు పసిడి దిగుమతులు జనవరిలో భారీగా 30 శాతం పడిపోయాయి. విలువలో కేవలం 2.04 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో జనవరిలో డిమాండ్ తగ్గడం పసిడి దిగుమతులపై ప్రధానంగా ప్రభావం చూపింది. డిసెంబర్లో సేవల ఎగుమతులు ఇలా... ఇదిలావుండగా, 2016 డిసెంబర్లో సేవల విభాగం నుంచి ఎగుమతులు 3 శాతం పెరిగాయి. విలువలో 14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2016 నవంబర్‌లో ఈ విభాగం నుంచి వృద్ధి రేటు 2 శాతం. -
ఎగుమతులు... రెండో నెలా పెరిగాయ్
• అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి; 23.5 బిలియన్ డాలర్లు • వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా రెండవ నెలలోనూ సానుకూల ఫలితాన్ని అందించారుు. వార్షికంగా చూస్తే... అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి నమోదరుు్యంది. విలువ 23.51 బిలియన్ డాలర్లు. ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం మొత్తం గణాంకాల మెరుగుకు కారణమరుు్యంది. ఇవే రంగాల దన్నుతో సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి 4.62 శాతం (22.9 బిలియన్ డాలర్లు)గా నమోదరుున సంగతి తెలిసిందే. మంగళవారం అక్టోబర్ నెలకు సంబంధించి అధికారిక లెక్కలు విడుదలయ్యారుు. వార్షికంగా వివిధ రంగాల తీరు... ⇔ ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి 13.86 శాతం నమోదరుు్యంది. ⇔ రత్నాలు, ఆభరణాల విభాగంలో ఎగుమతుల వృద్ధి 21.84 శాతం. ⇔ పెట్రోలియం విషయంలో ఇది 7.24 శాతంగా ఉంది. ⇔ రసాయనాల ఎగుమతుల వృద్ధి 6.65 శాతం. ⇔ దిగుమతులు 8.11 శాతం వృద్ధి... ఇక అక్టోబర్‌లో దేశం దిగుమతులను చూస్తే... 8.11 శాతం వృద్ధి నమోదరుు్యంది. విలువ రూపంలో ఇది 33.67 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతి-దిగుమతి విలువ మధ్య వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లుగా నమోదరుు్యంది. చమురు దిగుమతులు అక్టోబర్‌లో 3.98% పెరిగి 7.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యారుు. చమురుయేతర దిగుమతుల విలువ 9.28 శాతం ఎగసి 26.53 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడు నెలల్లో...: కాగా ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) గత ఏడాది ఇదే కాలంతో చూస్తే... ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా -0.17 శాతం క్షీణించారుు. విలువ 155 బిలియన్ డాలర్లుగా నమోదరుు్యంది. దిగుమతులు కూడా -11 శాతం పడిపోయారుు. వీటి విలువ 208 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 53.16 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశ ఎగుమతుల ధోరణి ఇదీ... 2014 డిసెంబర్ నుంచి 2016 మే వరకూ వరుసగా 18 నెలలు భారత్ ఎగుమతులు క్షీణిస్తూ వచ్చారుు. బలహీన గ్లోబల్ డిమాండ్, చమురు దిగుమతుల పతనం దీనికి కారణం. అరుుతే ఈ ఏడాది జూన్ నెలలో వృద్ధి కనబడినా... మరుసటి రెండు నెలలూ జూలై-ఆగస్టుల్లో ఎగుమతులు మళ్లీ క్షీణతలో పడ్డారుు. తిరిగి గడచిన రెండు నెలలో వృద్ధిలోకి మారారుు. -
ఎగుమతులు 17వ ‘సారీ’..!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు యథాపూర్వం తమ క్షీణ బాటలో కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా 7 శాతం క్షీణించాయి. 20.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది 17వ నెల. గ్లోబల్ డిమాండ్ మందగమనం, పెట్రోలియం, ఇంజనీరింగ్ ప్రొడక్టుల ఎగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణం. ♦ దిగుమతులు 23% పడిపోయి.. 25.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ♦ దీనితో ఎగుమతులు-దిగుమతులకు మధ్య వ్యత్యాసం(వాణిజ్యలోటు) 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2015 ఇదే నెలలోఇది 11 బి. డాలర్లు. ♦ ఏప్రిల్‌లో చమురు దిగుమతులు 24 శాతం క్షీణించి 5.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు కూడా 23 శాతం పడి 19.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ♦ ఎగుమతుల్లో ప్రధాన భాగమైన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 28 శాతం పడిపోయి 2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 19 శాతం పడిపోయి 5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటితోపాటు కార్పెట్, తోలు, బియ్యం, జీడిపప్పు ఎగుమతులు క్షీణించాయి. అయితే తేయాకు, కాఫీ, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా రంగాల ఎగుమతుల్లో వృద్ధి నమోదయ్యింది. ♦ ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఎగుమతులే కాకుండా... ప్రపంచంలోని పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థల ఎగుమతులు క్షీణబాటన పయనిస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో అమెరికా (3.87 శాతం), యూరోపియన్ యూనియన్ (0.04 శాతం), చైనా (25.34 శాతం), జపాన్ (1.10 శాతం) ఎగుమతులు క్షీణించాయి. ♦ గత ఆర్థిక సంవత్సరం వార్షికంగా భారత ఎగుమతులు 16 శాతం క్షీణించి 261 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు 60 శాతం డౌన్: కాగా వార్షిక ప్రాతిపదికన పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో 60 శాతం పడిపోయాయి. 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే... 3.13 బిలియన్ డాలర్ల నుంచి 1.23 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఇది కరెంట్ అకౌంట్ కట్టడికి దోహదపడే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఎగుమతులు... మళ్లీ నిరాశే!
⇒ ఏప్రిల్‌లో 14 శాతం క్షీణతతో 22 బిలియన్ డాలర్లగా నమోదు ⇒ వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో నిరాశపర్చాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2015 ఏప్రిల్‌లో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14% క్షీణించాయి. 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి. 2014 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 26 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన చూస్తే- ఎగుమతులు క్షీణ దశలో ఉండడం ఇది వరుసగా 5వ నెల. దిగుమతులూ తగ్గాయ్.. ⇒ ఇక ఇదే నెలలో దిగుమతులు కూడా 7 శాతం పైగా క్షీణించాయి. ఈ విలువ 36 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు దిగింది. వాణిజ్యలోటు ఇదీ...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2014 ఏప్రిల్ ఈ పరిమాణం 10 బిలియన్ డాలర్లు కాగా 2015 మార్చిలో 12 బిలియన్ డాలర్లు. మరిన్ని అంశాలు... ⇒ అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం. ⇒ పెట్రోలియం ప్రొడక్టులు, రత్నాలు-ఆభరణాలు వంటి ప్రధాన ఎగుమతి విభాగాలు ప్రతికూల ఫలితాలు నమోదుచేసుకున్నాయి. ⇒ చమురు దిగుమతులు 43 శాతం తగ్గి, 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ⇒ చమురుయేతర దిగుమతులు 13 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు చేరాయి. ⇒ గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో దేశం 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించలేకపోయింది. 2013-14 కన్నా (314 బిలియన్ డాలర్లు) తక్కువగా 310.5 బిలియన్ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి. పసిడి మెరుపు... కాగా ఏప్రిల్‌లో ఒక్క బంగారం దిగుమతుల విలువ చూస్తే 78 శాతం పెరిగి 3.13 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం విలువ తగ్గడం, నియంత్రణల సడలింపు వంటి అంశాలు దీనికి కారణం. 2014 ఏప్రిల్‌లో 10 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు 2015 ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు చేరడానికి బంగారం దిగుమతులు పెరగడమూ ఒక కారణం. -
ఎగుమతులు పడ్డాయ్!
* జనవరిలో 11 శాతం క్షీణత * దిగుమతులదీ ఇదీ పరిస్థితి * వాణిజ్యలోటు 8.32 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2015 జనవరిలో నిరుత్సాహం కలిగించాయి. 2014 ఇదే నెలతో పోల్చితే విలువలో అసలు వృద్ధి లేకపోగా 11.19 శాతం తగ్గిపోయాయి (క్షీణత). 2015 జనవరిలో ఎగుమతుల విలువ 23.88 బిలియన్ డాలర్లు. 2014 ఇదే నెలలో ఈ పరిమాణం 26.89 బిలియన్ డాలర్లు. ఇంత తక్కువ స్థాయికి ఎగుమతుల రేటు పడిపోవడం రెండున్నర సంవత్సరాల కాలంలో (2012 జూలైలో 14.8 శాతం) ఇదే తొలిసారి. ఇక దిగుమతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 11.39 శాతం క్షీణించి 32.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల పడిపోవడం వరుసగా ఇది రెండవనెల. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 8.32 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు గడచిన తొమ్మిది నెలల్లో మొదటిసారి ఇంత తక్కువ స్థాయిని నమోదుచేసుకుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విలువ తగ్గడం దీనికి (తక్కువ స్థాయి వాణిజ్యలోటు) ప్రధాన కారణం. చమురు దిగుమతుల బిల్లు 37.46 శాతం పడిపోయి కేవలం 8.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిరాశలో కీలక రంగాలు కాటన్ యార్న్ (- 9.15 శాతం), రసాయనాలు(-10.52), ఫార్మా(-0.16 శాతం), రత్నాలు, ఆభరణాల (-3.73 శాతం) రంగాల నుంచి ఎగుమతులు భారీగా లేకపోవడం మొత్తం ఈ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపింది. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు కూడా నిరాశగానే ఉన్నాయి. అమెరికా మార్కెట్ మెరుగుపడినప్పటికీ, యూరోపియన్ యూనియన్, జపాన్‌లో మందగమన పరిస్థితులు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. బంగారం దిగుమతులు ఇలా...: కాగా 2015 జనవరిలో బంగారం దిగుమతులు 8.13 శాతం పెరిగి 1.55 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-జనవరి మధ్య...: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య ఎగుమతులు 2.44 శాతం వృద్ధితో 265.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 2.17 శాతం పెరుగుదలతో 383.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 118.37 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 340 బిలియన్ డాలర్ల ఎగుమతులను కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రోత్సాహకాలు అవసరం: ఎఫ్ఐఈఓ ఎగుమతుల రంగం పునరుత్తేజానికి తగిన విధాన చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టాలని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ దిశలో విదేశీ వాణిజ్య విధానాన్ని త్వరలో ఆవిష్కరించాలని సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరేలా కనబడ్డం లేదని అన్నారు.