indiramma amrutha hastam scheme
-
అమ్మహస్తం ... అస్తవ్యస్తం
మార్కాపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన అమ్మ హస్తం పథకం పశ్చిమ ప్రకాశంలో అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను అస్తవ్యస్తం తెల్లరేషన్ కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. 185 లకే అరకిలో పంచదార, ఆయిల్ ప్యాకెట్, కంది పప్పు కిలో, గోధుమలు కిలో, గోధుమపిండి కిలో, 250 గ్రాముల కారంపొడి, అరకిలో చింతపండు, 100గ్రా పసుపు, కిలో అయోడైజ్డ్ ఉప్పు ప్యాకెట్‌ను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ 17న దీన్ని ప్రారంభించారు. పథకం ఆచరణలో విఫలం కావడంతో లబ్ధిదారులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో పథకం అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 9,10,385 రేషన్‌కార్డులుండగా, ఇందులో ఫొటో లేని రేషన్‌కార్డులు 20,970 ఉన్నాయి. 6,151 రేషన్‌కార్డులు పౌరసరఫరాల జాబితా నుంచి గల్లంతయ్యాయి. మొత్తం మీద 8,83,264 మంది కార్డుదారులకు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 751, మార్కాపురం డివిజన్లో 432 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి ద్వారా అమ్మహస్తం వస్తువులతో పాటు కిరోసిన్, బియ్యం అందజేస్తారు. ఫిబ్రవరి 22వ తేదీ నాటికి సైతం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లోని మండలాల్లో కారంపొడి, పసుపు, చింతపండు, అయోడైజ్డ్ఉప్పు, గోధుమలు, గోధుమపిండి పంపిణీ కాలేదు. పౌరసరఫరాల శాఖాధికారులు డీలర్ల వద్ద నుంచి అమ్మహస్తం పథకంలోని అన్ని వస్తువులకు డీడీలు కట్టించుకుని సరఫరా చేయకపోవడంతో అటు డీలర్లు, సకాలంలో వసూలు కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పౌరసరఫరాల శాఖ నివేదికల ప్రకారం మార్కాపురం పట్టణంలో 15,108 రేషన్ కార్డుదారులకు, రూరల్ పరిధిలో 11,614 కార్డుదారులకు, పెద్దారవీడులో 11,866, కంభంలో 10,728, గిద్దలూరులో 19,586, యర్రగొండపాలెంలో 16,899, బేస్తవారిపేటలో 13,011, కొండపిలో 11,998, కందుకూరు పట్టణంలో 11,837, అద్దంకిలో 24,094, పర్చూరులో 14,593, చీమకుర్తిలో 21,478, మద్దిపాడులో 13,967, సంతనూతలపాడులో 18,187 మంది రేషన్‌కార్డుదారులకు రేషన్ పంపిణీ చే యాల్సి ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో లబ్ధిదారులు తక్కువ ధరకు వస్తాయని ఎదురు చూసి చౌకధరల దుకాణాలకు వెళ్లి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సకాలంలో రేషన్‌షాపులకు వస్తువులను సరఫరా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. -
సమస్యలపై సమరం
నినాదాలతో హోరెత్తించిన అంగన్వాడీ మహిళలు కలెక్టరేట్ వద్ద ఆందోళన కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: బాలవాడీ సెంటర్లను ఐకేపీ నుంచి అంగన్వాడీ సెంటర్లకు అప్పజెప్పాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు కలెక్టరేట్ మొదటి గేటు ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వందలాది అంగన్వాడీ మహిళలు సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.షేభా, మహి మాట్లాడారు. రకరకాల పనుల ఒత్తిళ్లు, మెమోలు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులు పెంచాలని, సీని యారిటీ ప్రకారంగా సూపర్వైజర్స్ పోస్టు ల్లో నియమించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 12,500కు పెంచాలని, పెండింగ్ వేతనాలతోపాటు టీఏ, డీఏ బిల్లు లు చెల్లించాలన్నారు. ఇందిరమ్మ అమృత హస్తం బిల్లులు, వీఓఏల నుంచి కాకుండా నేరుగా అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాలని, షరతులు లేకుండా అద్దెలు చెల్లించాలని, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, స్టౌలు అందించాలని కోరారు. చివరికి ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ గేటు వద్దకు వచ్చి అంగన్వాడీలను సమాధాన పరిచారు. ఫిబ్రవరి 15వ తేదీలోపు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ మహిళలు శాంతించారు. కార్యక్రమంలో నిర్మల, అరుణమ్మ, వెంకటలక్ష్మి, కోమల, సీతామహాలక్ష్మి, హేమలత, కాంతమ్మ, వరలక్ష్మి, రేణుక, విజయభారతి, నాగేశ్వరమ్మ, సీఐటీయూ జిల్లా నాయకులు జి.నాగేశ్వరరావు, గౌస్, భాస్కరరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అమృత హస్తం..అధ్వాన హస్తం
వరంగల్, న్యూస్‌లైన్ గూడూరు, మరిపెడ, ఏటూరునాగారం, ములుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,078 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది జనవరిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో మొత్తం 13,257 మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. అమృత హస్తం ప్రకారం మహిళను గర్భవతిగా గుర్తించినప్పటి నుంచి ప్రసవమైన ఆరు నెలల వరకు అంగన్వాడీ సెంటర్లలో ప్రతి రోజూ ఉదయం 200 మిల్లీలీటర్ల పాలు, వంద గ్రాము ల కంది పప్పు, ఒక గుడ్డు, మధ్యాహ్నం పూట పప్పులు, కూరగాయలతో కూడిన భోజనం అందిస్తారు. అంగన్వాడీ కార్యకర్తలు నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంటచెరుకు తె చ్చి వంటచేసి పెట్టాలి. ఆ బిల్లును ఐసీడీఎస్‌కు పెట్టుకుంటారు. అరుుతే డబ్బులు ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులకు నేరుగా రాకుండా గ్రామైక్య సంఘాలకు వస్తా రుు. వారు ఆ డబ్బులను అంగన్వాడీ కేంద్రాలకు పంచుతారు. ఇదంతా సక్రమంగా జరిగితే బాగానే ఉంటుంది. కానీ అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు, గ్రామైక్య సంఘాలకు మధ్య విభేదాలు తలెత్తుతున్నారుు. వంట చేసి పెట్టేది తామైతే... బిల్లులిచ్చే బాధ్యత వీఓలకివ్వడంపై అంగన్వాడీ కేం ద్రాల నిర్వాహకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా సరుకులు ఇవ్వడం లేదంటూ..తాము తీసుకువచ్చిన సరుకులకు బిల్లులివ్వడం లేదని వాపోతున్నారు. గుడ్లు రాక... ఏటూరునాగారం మండలంలోని మానసపల్లి అంగన్వాడీ కేంద్రంలో బియ్యం, కోడిగుడ్లు సరఫరా కాలేదు. పప్పు, నూనె, సరఫరా చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. భాగ్యలక్ష్మి వీఓ సంఘం సభ్యులు తమకు సక్రమంగా కూరగాయలు ఇవ్వడం లేదని, సొంత ఖర్చులు పెట్టి ఆకు కూరలు వండి పెడుతున్నామని వెల్లడించారు. జనవరి 2013 నుంచి మే నెల వరకు కోడిగుడ్లు సరఫరా అయ్యాయని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సరఫరా జరగలేదని. అక్టోబర్ నెలలో ఏవో చిన్న గుడ్లను ఇచ్చి... నవంబర్ నుంచి మళ్లీ ఇప్పటి వరకు సరఫరా చేయలేదని అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీకుమారి వెల్లడించారు. ఒక నెల ఇచ్చి మరో నెల ఇవ్వకపోవడంతో బాలింతలు, గర్భిణులు, ప్రీస్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘వరంగల్ నుంచి వచ్చే పాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. వాహనాలు మొరారుుంచడంతో రోజూ పాలు సరఫరా చేయడం లేదు. వారంలో నాలుగు రోజులు బండి రిపేరు అంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కానీ పట్టించుకోవడం లేదు ఇలాగైతే ఎలా నెగ్గుకురాగలగుతాం’’... అని లక్ష్మీకుమారి ప్రశ్నించారు. బిల్లులే ఇత్తలేరు గూడూరు ప్రాజెక్టు పరిధిలోని మండల కేంద్రంలో కూరగాయల బిల్లులు ఇవ్వక ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎస్సీ కాలనీ సెంటర్లో 15 మంది గ ర్భిణులు, 15 మంది బాలింతలు ఉన్నారు. భోజనానికి బియ్యం, పప్పు, నూనె సరఫరా చేస్తున్నా... పాలు, గుడ్లు మరో కాంట్రాక్టర్ ద్వారా వస్తాయి. వీటిలో పాలు సరఫరా చేస్తున్నా... గుడ్లు మాత్రం నెల రోజులుగా సరఫరా కావడం లేదు. ‘తప్పనికుండా భోజనం వండి పెట్టాలంటున్నారే తప్ప వంట చెరుకు, కూరగాయలు, పోపు సామాను ఇవ్వడం లేదు. వాటన్నింటినీ మేమే సొంత ఖర్చుతో కొని వండి పెడుతున్నాం.. 10 నెలలుగా పోపు సామాను, కూరగాయల బిల్లు ఇవ్వడం లేదు. అడిగితే వీఓ అకౌంట్లో వస్తాయని చెపుతున్నారు. దీంతో ఉన్న వాటితో వండి పెడుతున్నాను.’’ అని ఎస్సీ కాలనీ అంగన్వాడీ కార్యకర్త రామక్క చెప్పారు. దొడ్డు బియ్యం తినలేకపోతున్నాం అంగన్వాడీ కేంద్రం ద్వారా దొడ్డు బియ్యం అన్నం వండి పెడుతున్నారు. పాలు పోస్తున్నారు. గుడ్డు ఇవ్వక నెల రోజులయింది. కాంట్రాక్టర్ తేలేదని తెలుస్తుంది. అమృత భోజనానికి సగం సరుకులు ఇచ్చి అంగన్వాడీ కార్యకర్తలను, ఆయాలను ఇబ్బంది పెట్టినట్లుగా ఉంది. సరుకుల రవాణా సక్రమంగా చేయాలి. దొడ్డు బియ్యం అన్నం తినలేక పోతున్నాం. పాలు, గుడ్డు ఇస్తే తిని, అన్నం ఇంట్లో వాళ్లకు పెడుతున్నాం. - సరిత, గర్భిణి, కలకత్తాతండా, మరిపెడ మండలం ఏడాది నుంచి బిల్లు లేదు కూరగాయల బిల్లులకు సంబంధించి బిల్లులు వీఓ సంఘాలు ఇస్తాయని చెప్పారు. ప్రతి నెలా ఈ బిల్లులను వీఓ అకౌంట్ కాకతీయ గ్రామీణ బ్యాంక్‌లో కాకుండా వేరే అకౌంట్లో వేస్తున్నారు. ఈ బిల్లులు సంవత్సరం నుంచి వత్తలేవు. దీంతో వీఓ సంఘాలు అంగన్వాడీలను బిల్లు విషయమై ఇబ్బందులు పెడుతున్నారు. గుడ్ల విషయంలో మే వరకు బాగానే ఉన్నా అప్పటి నుంచి గుడ్ల పంపకం జరగలేదు. గత నెల క్రితం 15 రోజులకు సంబంధించి గుడ్లు ఇచ్చారు. ప్రస్తుతం గుడ్లు రాక పది రోజులు కావస్తుంది. జూన్ నుంచి పోపు సామాన్లు రావడం లేదు. ప్రతి నెలా జీతం డబ్బులు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. - సోల వీరలక్ష్మి, అంగన్వాడీ సెంటర్ 1, ములుగు కార్యకర్త బిల్లులు రాక ఇబ్బందులు మహిళా సంఘం నుంచి కేంద్రానికి వంట సరకులు సరఫరాచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పథకం ప్రారంభం అయి సంవత్సరం గడుస్తున్నా ఒడిదొడుకుల మధ్యే నడుస్తున్నాయి. నూనె సరఫరాకాక పదిహేను రోజులు గడిచింది. పెట్టుబడి పెట్టిన సమయానికి బిల్లులు రావడంలేదు. వచ్చినా అవి వీఓల అకౌంట్లో డబ్బులు జమ కావడం ఇబ్బందే. - గంధసిరి పద్మ, అంగన్వాడీ కార్యకర్త, మరిపెడ