Indo pak relations
-
భారత్-పాక్‌లు కలిస్తే నా కల నెరవేరినట్టే: కెవిన్ పీటర్సన్
న్యూఢిల్లీ : ఇటీవల కోవిడ్ బారిన పడ్డ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమం కోరుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. భారత్- పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగపడితే తన కల నేరవేరినట్టేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రజలందరూ ఒకరికొకరు అండగా ఉండటం చాలా ముఖ్యమని, అది ఈ ఏడాది ప్రతి ఒక్కరికి తెలుసొచ్చిందని ఆయన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, పాక్ ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్(చైనా వ్యాక్సిన్) వేయించుకున్న తరువాత వైరస్‌బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. This tweet by @narendramodi to @ImranKhanPTI made me smile! It would be a dream come true, to see India & Pak reunited and engaging both on & off the field! We all need each other & this year has shown us that! Let’s all hope a healthy friendship is on its way! 🙏🏽 https://t.co/jECZLQCDlI — Kevin Pietersen🦏 (@KP24) March 24, 2021 భారత్, పాక్‌ల మధ్య ఈ ఏడాది ఆఖర్లో ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా పీటర్సన్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకంది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి ఎనిమిదేళ్లవుతుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2012-13లో భారత్ వేదికగా తలపడ్డాయి. ఈ సిరీస్‌లో 2 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాక్‌లో పర్యటించింది. ఇవి మినహా ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడ్డాయి. భారత్, పాక్‌లు చివరిసారిగా 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగల తేడాతో(డక్‌వర్త్) పాక్‌పై ఘనవిజయం సాధించింది. చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్ పోరు..? చదవండి: ప్రసిద్ద్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా -
ట్రంప్ వల్ల భారత్-పాక్ సంబంధాలకు చేటు?
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయడం వల్ల భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందట. ఈ విషయాన్ని అమెరికన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. విదేశీ నేతలకు ఫోన్లు చేసేముందు కొన్ని దశాబ్దాలుగా ఉన్న దౌత్య సంప్రదాయాలను చెడగొట్టేలా ఉండకూడదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. పాక్ ప్రధానికి ఫోన్ చేయడం, ఆ దేశ సమస్యల పరిష్కారానికి కావల్సిన ఏ పాత్రనైనా తాను పోషిస్తానని చెప్పడం వల్ల భారత్ - పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పింది. చైనాతో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతినేలా తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్ వెన్‌తో ట్రంప్ మాట్లాడటంతో చైనా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1979 తర్వాత.. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి లేదా అధ్యక్షుడు తైవాన్ నాయకులతో మాట్లాడటం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్భుతమైన మనుషులతో కూడిన అద్భుతమైన దేశానికి తాను తప్పకుండా వస్తానని నవాజ్ షరీఫ్‌తో ట్రంప్ అన్నట్లు కథనాలు వచ్చాయి. పాకిస్థానీలు ప్రపంచంలోనే తెలివైన ప్రజల్లో ఒకరని కూడా ట్రంప్ అన్నట్లు తెలిసింది. అసలే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడుతున్న భారత దేశానికి ట్రంప్ చర్యలు పుండు మీద కారం చల్లినట్లుంటాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. -
నటుణ్ని కాకుంటే ప్రధానమంత్రి అయ్యుండేవాడిని
లాహోర్: 'రైల్వే గోడౌన్ లో పనిచేసిన మా నాన్న సిమెంట్ దొంగతనం కేసులో జైలు పాలయ్యాడు. ఉద్యోగంలో నుంచి తీసేయడంతో రైల్వే క్వార్టర్స్ ఖాళీచేయాల్సివచ్చింది. అమ్మా, అన్నయ్య, నేను రోడ్డున పడ్డాం. అప్పుడు నాకు ఆరేళ్లు. కుటుంబపోషణ కోసం అన్నయ్య స్టేషన్ లోనే కూలీగా మారాడు. నేనేమో అంగట్లో టీ అమ్మేవాణ్ని' అంటూ పొరుగుదేశస్తులతో తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు లిజెండరీ యాక్టర్ ఓంపురి. లాహోర్ లోని అలహమ్రా ఆర్ట్ సెంటర్ లో ప్రారంభమైన అంతర్జాతయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన భారత్- పాక్ సంబంధాలపై మనసులోని మాటలు బయటపెట్టారు. ఇరుదేశాల మధ్య ప్రతిబంధకాలనే తాళాలు వేసున్నప్పటికీ, వాటిని తెరవగలిగే తాళం చెవులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల వద్ద ఉన్నాయని, ఇద్దరు ప్రధానుల నిర్ణయాలే ఇరు ప్రాంతల ప్రజల ఐక్యతకు బాటలువేస్తాయని, పాకిస్థాన్ కు రావటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని ఓంపురి అన్నారు. నటుడు కాకుంటే ఏమయ్యేవారు? అనే మీడియా ప్రశ్నకు..'చిన్నప్పుడు చాయ్ అమ్మాను కదా, మెల్లగా టీ దుకాణం పెట్టుకుని ఇప్పటికి ప్రధానమంత్రి అయ్యుండేవాడిని' అని చమత్కరించారు.