infiltrate
-
ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ
శ్రీనగర్: జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు. ‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్ కఠినమైన నిఘాలో ఉంది. ...అఖ్నూర్లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు. మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
కాంగ్రెస్ వల్లే చొరబాట్లు
గోహ్పూర్/ఆలో: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగానే అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు అక్రమ చొరబాట్లతో ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దేశం సాధించిన విజయాలు, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. శనివారం ఆయన అస్సాంలోని గోహ్పూర్, అరుణాచల్‌లోని ఆలో సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అసోం ఏవిధంగా నిర్లక్ష్యానికి గురైందీ పెద్దవారిని అడిగి తెలుసుకోవాలని ప్రధాని యువతను కోరారు. ‘దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్‌కు అసోం ప్రజలు మద్దతిస్తారా? దేశం అభివృద్ధిని కాంక్షించని ఆ పార్టీ అస్సాం అభివృద్ధిని పట్టించుకుంటుందా?’ అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తూనే ఉంది. కానీ, ఈ చౌకీదార్(మోదీ) చొరబాట్లు, ఉగ్రవాదం, అవినీతిపై పోరాటం సాగిస్తున్నాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి మద్దతివ్వండి’ అని ప్రధాని ప్రజలను కోరారు. అనంతరం ఆయన అరుణాచల్‌లోని ఆలోలో మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉంటూ సరిహద్దులను కాపాడుతున్న ఇక్కడి ప్రజల వల్లనే అరుణాచల్ దేశానికి రక్షణ కవచంగా మారిందన్నారు. ‘దేశం గణనీయమైన విజయాలు సాధించినప్పుడు, మీరు సంతోషపడరా? దేశ విజయాలను చూసి ప్రతి ఒక్కరూ గర్వపడటం సహజం. కానీ కొందరు మాత్రం, దేశం సాధించిన ప్రగతి, విజయాలకు బాధపడతారు. ఉగ్రవాదులను వారి ఇళ్లలోనే హతమార్చినప్పుడు ప్రతిపక్షాలు ఎలా వ్యవహరించాయో మీరు చూశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయాలను కూడా వారు చులకన చేశారు. అలాంటి ప్రతిపక్ష పార్టీలను వచ్చే ఎన్నికల్లో మీరే శిక్షించాలి’ అని ప్రజలను కోరారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ..దేశ ప్రజల ప్రయోజనాలతో చెలగాటమాడుకుందని విమర్శించారు. దాదాపు 55 ఏళ్ల కాంగ్రెస్ రాచరిక పాలనలో రాష్ట్రాభివృద్ధి సుదూర స్వప్నంగా మిగిలిపోయిందని ఆరోపించారు. ‘మీ వల్లనే ఈశాన్య భారతాన మొదటగా అరుణాచల్‌లోనే కమలం వికసించింది. రాష్ట్రంలోని 50వేల కుటుంబాలకు విద్యుత్, 40 వేల కుటుంబాలకు వంట గ్యాస్ సౌకర్యం కల్పించడంతోపాటు ఒక లక్ష కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 7 దశాబ్దాల తర్వాత మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రైలు సౌకర్యం కల్పించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఈశాన్య ప్రాంతానికి గణనీయంగా నిధులు వెచ్చించాం’ అని వివరించారు. -
300మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రణాళిక!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ దుశ్చర్యలకు ఇదొక సజీవ సాక్ష్యంగా నిలిచే అంశం. ఓ పక్క భారత్‌తో శాంతియుత చర్చలు అని పేర్కొంటూనే దేశాన్ని అస్థిర పరచాలన్న వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూనే ఉంది. ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాద స్థావరాలకు బాసటగా నిలుస్తోంది. మొత్తం 300 మందిని కరడుగట్టిన ఉగ్రవాదులుగా తీర్చిదిద్ది భారత్‌లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్ధం చేసింది. ఇప్పుడు వారంతా భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల గుండా చొరబడే సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రాథమిక వర్గాల సమాచారం. పాక్‌లోని లష్కరే ఈ తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన17 ఉగ్రవాద స్థావరాల్లో 300 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే అంశాన్ని భారత్ పాక్‌తో చర్చించాలని భావించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా భారత్ సిద్ధం చేసి పాక్‌ను నిలదీసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఇంతలోనే ఇరు దేశాలమధ్య చర్చలు ఆగిపోయిన విషయం తెలిసిందే.