అసంఘటిత కార్మికులందరికీఈఎస్‌ఐ సేవలు
- ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులు
- కేంద్రమంత్రి దత్తాత్రేయ వెల్లడి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ పథకం వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇప్పటికే అసంఘటిత రంగంలోని 2 కోట్ల మంది కార్మికులు ఈఎస్ఐ సేవలు పొందుతున్నారని, తాజా నిర్ణయం వల్ల వాటి సంఖ్య 40 కోట్లకు చేరు కుంటుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో శనివారం ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఎసిక్(ఇఎస్ఐసీ) ఆఫీసర్స్ ఫెడరేషన్ సిల్వర్ జూబ్లీ సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు.
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్స్ సేవలు మాత్రమే అందుతున్నాయని, త్వరలో వాటిని 6 నుంచి 10 పడకల ఆస్పత్రులుగా మారుస్తామన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్లో ఎస్ఎస్వో నుంచి ఏడీ, డీడీ, జారుుంట్ డెరైక్టర్ల వరకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఎసిక్ ఆఫీసర్స్ అంకితభావంతో పనిచేయాలని దత్తాత్రేయ సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 2019 నాటికి ఈఎస్ఐ సేవలు మరింత విసృ్తతం కానున్నాయని వివరించారు. రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నారుుని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐ కార్డుదారులు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని, కార్మికులందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలని అన్నారు. సదస్సులో మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, ఆలిండియా ఈఎస్ఐసీ ఆఫీసర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ప్రణయ్సిన్హా, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.